తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే కరోనా పరీక్షలు నిర్వహించాలి

తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక నుండి ప్రతినిత్యం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మంగళవారం నాడు 110మంది రక్తనమూనాలు సేకరించి నిర్ధారణ నిమిత్తం బెజవాడ తరలించారు. ఇవి రావడానికి 3-4 రోజుల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. కానీ గత అనుభవాల దృష్ట్యా ఇవి రావడానికి మరింత సమయం పడుతుందని అవగతమవుతుంది. స్థానిక ఎమ్మెల్యే రక్షణనిధి చొరవ తీసుకుని తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే వచ్చిన వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెంటనే వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

బుధవారం నాడు తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో 43మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 16మందికి పాజిటివ్‌గా వచ్చింది. స్థానిక ఆసుపత్రి సిబ్బంది ఇరువురికి కూడా పాజిటివ్‌గా వచ్చినట్లు సమాచారం.
Tiruvuru Krishna District Andhra Pradesh - COVID19 Testing - TVRNEWS - తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే కరోనా పరీక్షలు నిర్వహించాలి

తిరువూరులో కఠిన ఆంక్షలు-నూజివీడు RDO

కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరుగున్నందున నూజివీడు డివిజన్‌లో వారం రోజులపాటు ఆంక్షలు కఠినతరం చేస్తున్నట్లు రెవిన్యూ డివిజినల్ అధికారి బి.హెచ్.భవానిశంకర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ నియంత్రణ టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూజివీడు డివిజన్లో ఇప్పటివరక్కు 887 కరోన పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, సోమవారం ఒక్కరోజే 100కు పైగా కేసులు నమోదు కావడం, నూజివీడు పట్టణంలో ఒక్కరోజే 72 కేసులు ఆందోళన కలిగించే విషయమన్నారు. నూజివీడు డివిజన్లోని నూజివీడు టౌన్, తిరువూరు టౌన్, అగిరిపల్లి, గంపలగూడెం, గన్నవరం, బాపులపాడు, వేలేరు గ్రామాలలో ఈనెల 6వ తేది నుండి 13వ తేది వరకు కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. దుకాణాలను ఉదయం 6గంటల నుండి 10గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని, అనంతరం అత్యవసర సేవలు, హెల్త్ ఎమర్జెన్సీ, పాలు, నిత్యవసరాలుకు అనుమతి ఉంటుందన్నారు. బ్యాంకులు ఉదయం 8గంటల నుండి 10గంటల వరకు ప్రజలకు సేవలు అందిస్తారని ఆయన తెలిపారు. 10గంటల నుండి 12గంటల వరకు వాణిజ్య లావాదేవీలకు అనుమతించడం జరుగుతుందన్నారు. అత్యవసరం పరిస్థితుల్లో మాత్రమే ప్రజారవాణాను అనుమతించడం జరుగుతుందన్నారు. దుకాణాలు, బ్యాంకుల వద్ద ప్రజలు సామజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అనవసరంగా రోడ్లపైకి గుంపులుగా వచ్చేవారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు.
తిరువూరులో కఠిన ఆంక్షలు-నూజివీడు RDO-Tiruvuru Krishna District New COVID19 Measures And Rules - Tiruvuru Krishna District COVID19 Stats

తిరువూరును ముంచెత్తిన వరదలు. భారీగా నష్టం.

తిరువూరు పరిసర ప్రాంతాల్లో సోమవారం రాత్రి దాదాపు నాలుగు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. పల్లపు ప్రాంతాలు జలమయ్యాయి. చాలా ప్రాంతాల్లోకి నీరు ప్రవేశించి పేదప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. తిరువూరులోని భగత్‌సింగ్‌నగర్ కాలనీ, సుందరయ్య కాలనీ తదితర లోతట్టు ప్రాంతాలన్నీ వరదముంపుకు గురయ్యాయి. రోలుపడి శివారు రాజీవ్‌నగర్‌లో ఒక గృహం పూర్తిగా కూలిపోయింది. 12 గృహాల్లోకి నీరు ప్రవేశించడంతో అందులో నివసిస్తున్న వారిని సమీపంలోని పాఠశాలకు తరలించారు. కోకిలంపాడు పరిసర ప్రాంత పంటపొలాలు అన్నీ ముంపునకు గురయ్యాయి. కట్టలేరు, ఎదుళ్ల, పడమటి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తిరువూరు మండలం మల్లేల వద్ద ఒక చేపల లోడు లారీ బోల్తా పడింది. అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. తిరువూరు పట్టణంలో మంచినీరు సరఫరా చేసే మోటార్లు, పైప్‌లైన్లు వరదముంపునకు గురికావడంతో మూడురోజుల పాటు సరఫరా ఉండదని మున్సిపల్ అధికారులు ప్రకటన జారీచేశారు.
తిరువూరును ముంచెత్తిన వరదలు. భారీగా నష్టం.-Heavy Rains In Tiruvuru Krishna District - July 2020

కరోనా పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలు

తిరువూరు: తిరువూరులో కరోనా సోకి మమ్మీడాడీ యజమానుల తల్లి సోమవారం నాడు మృతి చెందగా ఆ సంస్థలో పనిచేస్తున్న యజమానులకు, సిబ్బందికి, పది మంది బయట వ్యక్తులకు శుక్రవారం నాడు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. చౌటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, కరోనా నోడల్ అధికారి డా.గంగాధర కుమార్ ఆధ్వర్యంలో నమూనాలు సేకరించి ప్రయోగశాలకు తరలించారు. ఈ పరీక్షలకు రెడేమేడ్ దుకాణం యజమాని కుటుంబం నుండి 10మంది, దుకాణ సిబ్బంది 38మంది, కరోనా సోకిందని అనుమానం వచ్చిన 10మంది నుండి నమూనాలు సేకరించారు. ఈ పరీక్షా ఫలితాలు ఆదివారం నాడు వస్తాయని భావిస్తున్నారు. శుక్రవారం నాడు తిరువూరులో రెండో వ్యక్తికి కరోనా పాజిటివ్ సోకిందని అధికారులు ప్రకటించడంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రజలు రాకపోకలు సాగించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. శానిటరీ చర్యలను చేపడుతున్నారు. కరోనా కేసులు నమోదు అయిన సాయిబాబా రోడ్డు, రామాలయం వీధుల్లో అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతలకు 200మీటర్ల పరిధిలో బారికేడ్లు పెట్టి ప్రయాణాలను నిషేధించారు. మొత్తమ్మీద నేడు నిర్వహించిన కరోనా పరీక్షా ఫలితాల కోసం తిరువూరు పట్టన ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కరోనా పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలు-tiruvuru corona virus tests statistics and count and results - mummy daddy tiruvuru corona - tvrnews

Breaking: తిరువూరులో మరో కరోనా పాజిటివ్ కేసు

తిరువూరు పట్టణంలో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. స్థానిక సాయిబాబా ఆలయ రోడ్డులో ఓ మహిళకు పాజిటివ్‌గా తేలినట్లు తహశీల్దార్ స్వర్గం నరసింహారావు ఓ ప్రకటనలో తెలిపారు. వస్త్ర దుకాణ సిబ్బంది, ఈ రెండో కేసుకు సంబంధించిన వారందరికీ నేడు పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని ఆయన కోరారు. ఈ రెండు రోజులు ప్రజలు ప్రభుత్వాధికారులకు సహకరించవల్సిందిగా నరసింహరావు విజ్ఞప్తి చేశారు.
second covid19 positive case near saibaba temple in tiruvuru krishna district - tvrnews

తిరువూరులో కరోనా కలకలం

తిరువూరు చీరాల సెంటరు సమీపంలోని రామాలయం వీధిలో ఓ వృద్ధురాలు కరోనా పాజిటివ్‌తో మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ విషయాన్ని మంగళవారం రాత్రి 7గంటల వరకు అధికారులు ధృవీకరించలేదు. కరోనా కలకలం రేగడంతో పట్టణంలోని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు కుటుంబ సభ్యులు ఎవరినీ అధికారులు విచారించలేదు. కుటుంబ సభ్యుల నుండి రక్త నమూనాలు సేకరించలేదు. బుధవారం నాడు వీరి రక్తనమూనాలు సేకరించే అవకాశం ఉంది. పట్టణంలో మంగళవారం నాడు బంద్ పాటించారు. బుధవారం నాడు లాక్‌డౌన్ ప్రకటించే అవకాశం ఉంది. అన్ని దుకాణాలు, ప్రధాన రహదారిని మూసివేశారు. బోసు విగ్రహం నుండి రాజుపేట వరకు పోలీసు ప్రహారాతో రహదారిని మూసివేశారు. తిరువూరులో కరోనా పాజిటివ్ కేసు వచ్చిన దుకాణదారు వద్ద పనిచేసే రోలుపడికి చెందిన ఏడుగురు వ్యక్తులకు వైద్యారోగ్యశాఖ సిబ్వంది హోం క్వారంటైన్లో ఉండాలని నోటీసులు ఇచ్చారు. వారి నుంచి నమూనాలు సేకరిస్తున్నారు.
Krishna District Tiruvuru News TVRNEWS - Corona Virus Positive Case In Tiruvuru-తిరువూరులో కరోనా కలకలం

పాలకులారా…తిరువూరులో దాహం కేకలు మీకు పట్టవా?

తిరువూరులో గత నాలుగు దశాబ్దాల నుండి ప్రజాప్రతినిధులుగా ఉంటున్నవారు పరాయి ప్రాంతం నుండి వచ్చిన వారు కావడంతో ఈ ప్రాంతపు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటున్నాయి. “అంగట్లో అన్నీ ఉన్నా– అల్లుడు నోట్లో శని” అన్నట్లుగా తిరువూరు చుట్టు ప్రక్కల అపారమైన జల వనరులు ఉన్నప్పటికీ తిరువూరు ప్రజలు మాత్రం గుక్కెడు మంచినీటి కోసం విలవిలలాడిపోతున్నారు. తిరువూరు పట్టణానికి నాలుగు వైపుల ఉన్న వాగులు, ఏడు చెరువులు ప్రస్తుత వేసవి సీజన్‌లో సైతం జలాలతో కళకళలాడుతున్నాయి. అయినప్పటికీ తిరువూరు ప్రజలకు బిందెడు మంచినీళ్లు కావాలంటే రెండు, మూడు రోజులు ఆగక తప్పడం లేదు.

*** ముందు చూపు ఉన్న జమీందారులు
తిరువూరు పట్టణానికి, ఆ మాటకొస్తే మండలానికే ఘనమైన కీర్తి ఉంది. పలువురు జమీందార్లు ఈ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలించారు. (చరిత్ర గురించి తరువాత తెలుసుకుందాం). ఈ జమీందారులు చాలా ముందుచూపుతో వందల సంవత్సరాల క్రితమే తిరువూరు చుట్టూ 7చెరువులను తవ్వించారు. వేసవికాలంలో ఇబ్బంది లేకుండా 7చోట్ల పెద్ద పెద్ద బావులను కూడా తవ్వించారు ఆ మహానుభావులు. కానీ మన కొద్దిబుద్ధుల పెద్దల ఘనకార్యం పుణ్యమా అని పెద్దబావిని పూడ్చివేసి రైతుబజారు పెట్టారు. జైబావిని పూడ్చివేసి ఆటోస్టాండ్ పెట్టారు. గరల్స్ హైస్కూల్ వెనుక ఉన్న పెదబావిని పూడ్చి కోర్టును నిర్మించారు. మిగిలిన బావులు కూడా వీటి అదృశ్యం మూలంగా బెంగపడి ఏనాడో కనుమరుగయ్యాయి. తిరువూరుకు చుట్టూ కట్టేలేరు, పడమటి వాగులతో కలిపి ఇతర చిన్నవాగులు ఉన్నాయి. సాగర్ ప్రధాన కాలువ మనకు సమీపంలోనే ఉంది. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడంలో తిరువూరును పాలించిన పాలకులకు ముందుచూపు లేకపోవడంతో నేడు తిరువూరు పట్టణానికి మంచినీటి ఎద్దడి విపరీతంగా దాపురించింది. రాష్ట్రంలో ఏ పట్టణానికి చుట్టూ ఇన్ని చెరువులు కానీ, ఇన్ని వాగులు కానీ లేవు. వాస్తవానికి ఈ వనరులను సద్వినియోగం చేసుకుంటే తిరువూరు ప్రజలకు ప్రతిరోజూ ఒక పూట కాదు, రెండు పూటలు కూడా నీరు అందించవచ్చు. మహానుభావుడు, మాజీ కేంద్ర మంత్రి డా.కె.ఎల్.రావు ఏడు చెరువులను కలిపే రాకెట్ సప్లై ఛానల్‌ను, కోకిలంపాడు వద్ద కట్టలేరును ఏనాడో నిర్మించడం తిరువూరు ప్రజలకు వరం వంటిది.

*** కోనేరు ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అయింది
కోనేరు రంగారావు పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తిరువూరుకు ప్రతినిత్యం మంచి నీరు ఇవ్వాలని ప్రయత్నించారు. అయితే కోట్లాది ఖర్చుతో ఆయన చేపట్టిన ప్రాజెక్ట్ నేడు నిస్సారంగా పడి ఉంది. తిరువూరు ప్రక్కనే ఉన్న సాగర్ జలాలను నాడు కోనేరు పెట్టిన ఖర్చులో నాలుగవ వంతు పెట్టి ఉంటే ఈ ఏడు చెరువులకు, వాగులకు నీరు మళ్లించడం సునాయాసంగా ఉండేది. కానీ కోనేరు రంగారావు నాడు అనుభవం లేని అధికారుల మాటే విన్నారు. 25 కి.మీ. దూరంలో ఉన్న తెల్లదేవరపల్లి వద్దకు సాగర్ జలాలను పంపించి అక్కడ ఒక రిజర్వాయిర్‌ను తవ్వి తిరువూరుకు మంచినీరు అందించాలనేది కోనేరు కోరిక. సీనియర్ జర్నలిస్టుగా నేను, అనుభవం ఉన్న పలువురు అప్పట్లో కోనేరుతో ఈ పథకం ప్రయోజనం లేనిదని చెప్పినప్పటికీ ఆయన వినేవారు కాదు. ఎట్టకేలకు ఈ పథకం అనుకున్నట్లుగానే పూర్తి అయింది. తెల్లదేవరపల్లి నుండి తిరువూరు వరకు వేసిన పైపులు భుగర్భంలోనే ఉండిపోయాయి. అక్కడక్కడ వేసిన ట్యాంక్‌లు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. తిరువూరు ప్రజలకు ఎప్పటిలానే మంచి నీటి కష్టాలు మంచి స్నేహితుడిలా అంటిపెట్టుకుని ఉన్నాయి.

*** తిరువూరుకు కృష్ణా జలాలంట
ఇది ఒక అత్యద్భుతమైన తుగ్లక్ ఆలోచన. రూ.100 కోట్లు పెట్టి తిరువూరుకు కృష్ణా జలాలను తీసుకురావడం శుద్ధ దండగ. రూ.10 కోట్లు ఖర్చు పెడితే అవే కృష్ణా జలాలను తిరువూరుకు ఇవ్వవచ్చు. మన పక్కన ఉండే సాగర్ కాలువల ద్వారా కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయి. మన చుట్టూ ఉన్న వాగుల్లో నీరంతా కృష్ణా నదిలోకే వెళ్తోంది. మైలవరం, నూజివీడు వంటి ప్రాంతాలకు కృష్ణా జలాలు అవసరం. ఆ ప్రాంతంలో మనకు ఉన్నన్ని వాగులు కానీ, చెరువులు కానీ లేవు. ఆ రెండు ప్రాంతాలకు కృష్ణా జలాలు వస్తున్నాయి. తిరువూరుకు కూడా 70కి.మీ. ఎగువకు కృష్ణాజలాలు ఇస్తామనటం తప్పక తుగ్లక్ ఆలోచనే.

*** ప్రతి రోజు మంచి నీరు అందాలంటే…?
పాలకులు ఎవరికీ వారే సొంత వ్యాపారాలు, కాంట్రాక్టులు గురించి ఆలోచిస్తున్నారు తప్ప తిరువూరు ప్రజలకు ప్రతినిత్యం మంచినీరు అందించే విషయంపై దృష్టి పెట్టడం లేదు. సాగర్ ప్రధాన కాలువ 79వ కి.మీ సమీపంలో తిరువూరులో ఏడు చెరువులకు నీరు వచ్చే రాకట్ సప్లై ఛానల్ ప్రారంభమవుతుంది. అది సాగర్ జోన్–2 ప్రాంతంలో ఉంది. సాగర్ జోన్–2కు ఆగష్టు నెల నుండి ఏప్రిల్ ఆఖరి వరకు సాగర్ జలాలు విడుదల అవుతున్నాయి. ఈ జలాలతో ఏడు చెరువులలో కనీసం మూడు చెరువులనైనా రిజర్వాయరుగా మార్చుకోవచ్చు. సాగర్ కాలువ పక్కనే ఉన్న మర్లకుంట సమీపంలోని జంగంవారికుంటను సాగర్ జలాలతో తేలికగా నింపవచ్చు. జంగంవారికుంటను రిజర్వాయరుగా మార్చితే తిరువూరులో సగం ప్రాంతానికి రెండుపూటల నీరు పుష్కలంగా ఇవ్వవచ్చు. ఇది కాకుండా కట్టలేరు మీద లంకాసాగర్ అలుగు నుండి అక్కడక్కడ తిరువూరు సమీపంలో చిన్నచిన్న చెక్‌డ్యాంలు నిర్మిస్తే తిరువూరు బోర్లలో నీటినిల్వలు సమృద్ధిగా ఉంటాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలలో ప్రతినిత్యం మంచినీరు వదులుతామని ఆర్భాటంగా ప్రకటించింది. తిరువూరు మున్సిపాల్టీ గత పాలకవర్గం, అధికారులు కాంట్రాక్టులు చేసుకోవడం, బిల్లులు చెల్లించడం, పన్నుల వసూళ్లల్లో చూపుతున్న శ్రద్ధ మంచినీరు అందించే విషయంపై చూపలేదు లేదు కదా అలసత్వాన్ని అధికంగా ప్రదర్శిస్తున్నారు.

*** ఒక్కసారి లంకాసాగర్ ప్రాజెక్టును చూసి సిగ్గుతెచ్చుకోండి
తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్న సమయంలో మన పొరుగునే ఉన్న లంకాసాగర్ ప్రాజెక్టులో ఒక మంచినీటి ప్రాజెక్టును ఏర్పాటు చేయించారు. ఆ ప్రాజెక్ట్ ద్వారా గత 10ఏళ్ల నుండి 20 గ్రామాలకు ప్రతిరోజూ నీరు అందిస్తున్నారు. సాగర్ జలాలను అక్రమంగా ఒక పిల్ల కాలువను త్రవ్వి ఈ ప్రాజెక్టుకు మళ్లిస్తున్నారు. కట్టలేరు మీదే ఈ ప్రాజెక్ట్ ఉంది. అంతకన్నా ఎక్కువ వనరులు తిరువూరులో ఉన్నాయి. ప్రజాప్రతినిధుల్లారా…మీరు కళ్ళు తెరిస్తే కొద్ది నెలల్లోనే తిరువూరుకు ప్రతిరోజు మంచినీరు ఇవ్వవచ్చు. మీకు చేత కాకపొతే ప్రజల నుండి లేదా తలపండిన రైతుల నుండి సలహాలు తీసుకోండి. దీనిపై ఒక సమావేశాన్ని నిర్వహించండి. లేకపోతే తిరువూరు ప్రజలు మిమ్మల్ని క్షమించరు. కుండపోత వర్షానికి బోర్లించిన బొచ్చె అడ్డుపెట్టినట్లు…ఉన్న వనరులు సద్వినియోగం చేసుకోకపోతే ఈ సారి పట్టణ ప్రజలు మీ వంక చూడను కూడా చూడరు.

*** ప్రతిరోజు మంచినీరు ఇచ్చేవారికే మన ఓట్లు
రానున్న నగర పంచాయతీ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల తరఫున కౌన్సిలర్ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇంటింటికీ కూరగాయలు, చేపలు, మామిడికాయలు, నిత్యావసరాలు పంచుతూ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ₹10వేలతో ఖర్చుతో కూరగాయలు పంచి వచ్చే అయిదేళ్లల్లో ₹10కోట్లు వెనకేసుకోవాలనేది ఒక్కొక్కడి ఆలోచన. తిరువూరు ప్రజలంతా సమైఖ్యంగా ఉండి తిరువూరుకు ప్రతిరోజు మంచినీరు అందించే వారికే మా ఓట్లు వేస్తామంటూ ఓట్లు అడగడానికి వచ్చే వారిని దానికోసం ప్రయత్నిస్తామని ప్రమాణం చేయమనండి. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు రోజూ మనకు మంచినీరు ఇస్తానంటే వాళ్లకే ఓట్లు వేద్దాం. ప్రస్తుత వేసవిలో మంచినీటి కష్టాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. రోజు విడిచి రోజు కూడా కొన్నిసార్లు నీళ్లు వదలడం లేదు. ఈ వదిలిన సమయంలో గృహాల్లో పంపులు ఉన్నవారు మోటార్లు వేసి లాగేస్తున్నారు. బజారుల్లో పంపులు ద్వారా చుక్కనీరు రాక ప్రజలు అల్లడుతున్నారు. నగరపంచాయతీ అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప ఈ వేసంగిలో తిరువూరు ప్రజల దాహం తీర్చడంపై శ్రద్ధ చూపడం లేదు. ప్రతినిత్యం పన్నులు కట్టమని మైకుల్లో ఊదరగొడుతున్న మున్సిపల్ అధికారులు ప్రతిరోజు ప్రతి ఇంటికీ ఒక బిందెడు మంచినీరు ఇవ్వడంపైనే దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఎమ్మెల్యే రక్షణనిధి ఈ విషయంలో శ్రద్ధ చూపాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. — కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.

ప్రస్తుతం కట్టలేరులో నిండుగా ఉన్న జలాలు.
పాలకులారా...తిరువూరులో దాహం కేకలు మీకు పట్టవా?-Tiruvuru Water Problems In Summer - TVRNEWS

దుర్భరంగా పంపుసెట్టు షెడ్డు
పాలకులారా...తిరువూరులో దాహం కేకలు మీకు పట్టవా?-Tiruvuru Water Problems In Summer - TVRNEWS

తిరువూరులో భయం భయం. లాక్‌డౌన్‌కు అలవాటుపడని జనం.

తిరువూరు వద్ద ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఒక్క వాహనం కూడా కనిపించలేదు. ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య పెరగడంతో, కృష్ణా జిల్లా తిరువూరులో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దిల్లీలో జరిగిన జమాతే సమావేశాలకు తిరువూరు నుండి ఎవరైనా హాజరయ్యారా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తిరువూరులో అసంపూర్తిగా జరుగుతోంది. కొందరు పనీ పాటా లేని యువకులు ఒక్కొక్క మోటార్ సైకిల్ మీద ముగ్గురు ఎక్కి ఊరంతా చక్కర్లు కొడుతున్నారు. పోలీసులు బుధవారం నుండి పటిష్ఠవంతంగా లాక్ డౌన్ ను అమలుపరచడంపై దృష్టిపెట్టాలి. ఉదయం పది గంటల తరువాత రోడ్డుపైకి అనవసరంగా వచ్చిన వాహనాలపై దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. మంగళవారం జరిగిన లాక్ డౌన్ చిత్రాలను దిగువ చూడవచ్చు.
తిరువూరులో భయం భయం. లాక్‌డౌన్‌కు అలవాటుపడని జనం-Tiruvuru Krishna District Lock Down CoronaVirus 2020 COVID19 - TVRNEWS

తిరువూరు వద్ద ట్రాఫిక్ వదిలేసిన అధికారులు

తిరువూరు వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాలను వదిలివేసిన అధికారులు. దాదాపు 15 గంటల పాటు బుధవారం సాయంత్రం నుండి తెలంగాణా నుండి వచ్చిన వందలాది వాహనాలను వాటిలో ప్రయాణిస్తున్న వారిని గురువారం సాయంత్రం విముక్తి లభించింది. తిరువూరు అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద గత రాత్రి నుండి వేచి ఉన్న వీటిని ప్రభుత్వ సూచనల మేరకు వదిలిపెట్టారు. గత రాత్రి నుండి నిద్ర, మంచినీరు, ఆహారం లభించక హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గురువారం నాడు పట్టణ ప్రముఖులు కొందరు మంచినీరు, ఆహారాన్ని అందించి ఆదుకున్నారు. తీవ్ర తర్జనభర్జనల అనంతరం ఉత్కంఠ పరిస్థితుల నడుమ అధికారులు ట్రాఫిక్‌ను వదిలేశారు.
Tiruvuru Andhra Telangana Border Traffic - Tiruvuru News - TVRNEWS- Tiruvuru Corona Virus COVID19 News-తిరువూరు వద్ద ట్రాఫిక్ వదిలేసిన అధికారులు

తిరువూరులో కొరోనా లాక్‌డౌన్-చిత్రాలు

తిరువూరులో కొరోనా లాక్‌డౌన్ ప్రశాంతంగా సాగుతోంది. నగర పొలిమేరల్లో ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేసి వదిలేశారు. సాయంకాలం స్థానిక ప్రజలు తమ అవసరాల నిమిత్తం వీధుల్లోకి వచ్చారు. స్థానిక వాహినీ కళాశాలలో కొరోనా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు.
తిరువూరులో కొరోనా లాక్‌డౌన్-చిత్రాలు-Tiruvuru Krishna District News-Corona Virus Lock Down In Krishna District Tiruvuru-TVRNews