తిరువూరు వాహిని ఇంజినీరింగ్ కాలేజీ 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నూజివీడు డిఎస్పీ బి.శ్రీనివాసులు ప్రత్యేక అతిధిగా విచ్చేశారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఏపీ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి డా. సుధీర్ ప్రేమ్ కుమార్ ప్రసంగిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో దేన్నైనా సాధించవచ్చునని అన్నారు. విలువలతో కూడిన విద్య ఉన్నత స్థానాలకు చేరుస్తుందని ఆ దిశగా విద్యార్థులు అడుగులు వేయాలని సూచించారు. మేధస్సుకు పేద, ధనిక భేదం లేదని చదువుతో పాటు నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని ఆయన కోరారు విద్యతో పాటు నైతిక విలువలపై బోధనలు జరగాల్సిన అవసరం ఉందని సుధీర్ ప్రేమ్ కుమార్ స్పష్టం చేశారు. డిఎస్పీ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు సోదరభావంతో మెలగాలని సూచించారు. సమాజంలో స్మార్ట్ ఫోన్ ల ప్రభావం ఎక్కువగా ఉందని సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా వుండాలన్నారు. సామాజిక మాధ్యమాలపై గాకుండా చదువుపై దృష్టి సారించి కన్నవారికి, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ప్రిన్సిపాల్ రంగా. నాగేంద్ర బాబు అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవము ఆద్యంతం సందడిగా సాగింది ప్రసంగం మధ్యలో వక్తలు ఛలోక్తులు విసురుతూ విద్యార్థులకు నవ్వులు తెప్పించారు. ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసులు, విద్యాశాఖ కార్యదర్శి సుధీర్ ప్రేమ్ కుమార్ ను కళాశాల యాజమాన్యం సత్కరించారు. భోజన విరామం అనంతరం విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. సాంప్రదాయ వస్త్రాలతో విద్యార్థినులు వార్షికోత్సవ సభకు నిండుదనం తెచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, కరెస్పాండంట్ పోట్రు నాగేశ్వరరావు, డైరెక్టర్లు జంగాల మురళి, నాళ్ళ మురళి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Category: సభలు, సమావేశాలు
సభలు, సమావేశాలు
జనవరి 12న తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవాలు
1969లో స్థాపించిన తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవాలు తొలుత ఈ ఏడాది డిసెంబరు 29న జరపాలని స్వర్ణోత్సవ నిర్వాహక కమిటీ నిర్ణయించింది. ఆదివారం నాడు జరిగిన పూర్వవిద్యార్థుల సమావేశంలో నిర్ణయం గతంలో అనుకున్న విధంగా డిసెంబర్ 29వ తేదీన కాకుండా జనవరి 12వ తేదీన అందరికీ అనుకూలంగా ఉండే విధంగా తేదీని వాయిదా వేసినట్లు కమిటీ ప్రకటించింది.
డిసెంబరు 29న తిరువూరు జూనియర్ కళాశాల స్వర్ణోత్సవాలు
తిరువూరు జూనియర్ కళాశాల ఏర్పడి 50సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా వచ్చే 29వ తేదీన గోల్దేన్ జూబ్లీ వేడుకలు కళాశాల ఆవరణలో నిర్వహించాలని పూర్వ్ విద్యార్థులు నిర్ణయించారు. కళాశాల పూర్వ విద్యార్థి కంచి కిషోర్ నివాసంలో మంగళవారం రాత్రి పూర్వ విద్యార్థులు సమావేశమై 29వ తేదీన స్వర్ణోత్సవ వేడుకలు భారీస్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా గత 50ఏళ్ల నుండి ఈ కళాశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులను సమీకరించాలని నిర్ణయించారు. ఉదయం 9గంటల నుండి రాత్రి 9గంటల వరకు కళాశాల ఆవరణలో ఈ వేడుకలు నిర్వహిస్తారు. వేడుకల నిర్వహణకు ఆరుగురితో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కంచి కిషోర్, కలకొండ రవికుమార్, తాళ్లూరి రామారావు, కంచర్ల ముత్యప్రసాద్, గజ్జల సీతారామయ్య, ఉయ్యూరు అనసూయలతో ప్రాథమికంగా ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. వచ్చే ఆదివారం 8వ తేదీన ఉదయం 10గంటలకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తిరిగి సమావేశం కావాలని ఈ సమావేశంలో ఉత్సవాలను నిర్వహించడానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పలువురు పురప్రముఖులు, పూర్వ విద్యార్థులు ఈ సమావేశానికి హాజరయి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.
చంద్రబాబు రాకతో తిరువూరు దేశంలో విజయోత్సాహం
ఎన్నికలకు కేవలం మూడు రోజుల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాజీ ప్రధాని దేవెగౌడతో కలిసి సోమవారం సాయంత్రం కృష్ణాజిల్లా తిరువూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. గత మూడు పర్యయాల నుండి తిరువూరులో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలవుతూ వస్తోంది. ఈ ఎన్నికల్లో కూడా తెదేపా తరపున పోటీ చేస్తున్న కే.ఎస్. జవహర్ విజయం సాధించడం కష్టమని అన్ని సర్వేలు తెలిపాయి. ఈ తరుణంలో ముఖ్యామంత్రి చంద్రబాబు సభకు అనుకున్నదాని కన్నా ఎక్కువ సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో తెలుగుదేశం పార్టీలో విజయోత్సాహం వెల్లివిరుస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తిరువూరు ప్రజల ఉత్సాహం చూస్తూ ఉంటె ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తోందని 35 సంవత్సరాల నుండి తాను తిరువూరు వస్తున్నప్పటికీ ఇంత ఆదరణ ప్రజల్లో ఎక్కడ కనిపించలేదని పేర్కొన్నారు.
*** తిరువూరుకు వరాల జల్లు
ఈ సందర్భంగా చంద్రబాబు తిరువూరు నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు. మరో ఏడాదిలో చింతలపూడి ఎత్తిపోతల పధకాన్ని పూర్తీ చేసి గోదావరి జలాలు తిరువూరుకు అందిస్తానని ప్రకటించారు. నియోజకవర్గంలో ఫ్లోరైడ్ బారి నుండి ప్రజలను కాపాడి వరకు రక్షిత మంచినీరు ఇస్తానని, అవసరమైన చోట్ల పొలాలకు సాగు నీరు అందిచడానికి స్థానికంగా ఉన్న వాగులపై ఎత్తిపోతల పధకాలు ఏర్పాటు చేస్తామని, సాగర్ జలాలకు సక్రమంగా అందేతట్లు చూస్తానని ప్రకటించారు. తిరువూరులో ప్రభుత్వ పాలిటెక్నిక్ ఏర్పాటు చేస్తామని, ముస్లీములు, క్రైస్తవులు, విశ్వబ్రాహ్మణులకు ప్రత్యెక సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు.
*** దేవగౌడకు పాదాభివందనం
మఖ్యమంత్రి మధ్యాహ్నం ఒంటి గంటకు తిరువూరు వస్తారని ప్రకటించినప్పటికి నాలుగున్నర గంటలకు మాజీ ప్రధాని దేవెగౌడతో ఆయన తిరువూరుకు వచ్చారు. స్థానిక ఇంజనీరింగ్ కళాశాల నుండి బోసుబొమ్మ వరకు ర్యాలీగా వచ్చిన చంద్రబాబుకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎంపీ అభ్యర్ధి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్ధి కే.ఎస్.జవహర్, మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ మార్క్ ఫెడ్ చైర్మన్ కంచి రామారావు తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. దాదాపు ఒక గంట సేపు తిరువూరులో ఉన్న ముఖ్యమంత్రి ఐదున్నర గంటలకు హెలికాప్టర్ ఎక్కారు. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.
నేడు తిరువూరు వస్తున్న వై.ఎస్.జగన్
వైకాపా అధ్యక్షుడు వై.ఎస్.జగన్ ఆదివారం నాడు తిరువూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి స్థానిక ఇంజినీరింగ్ జగన్ హెలికాప్టర్ దిగటం కోసం హెలిప్యాడ్ ఏర్పాట్లను చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. నియోజకవర్గ నలుమూలల నుండి భారీగా జనసమీకరణ చేసేందుకు వైకాపా వర్గాలు శ్రమిస్తున్నాయి.
రేపు మైలవరం రానున్న పవన్ కళ్యాణ్
జిల్లాలో 5నియోజకవర్గాల ప్రచార పర్యటనలో భాగంగా రేపు(శనివారం) మధ్యాహ్నం 1గంటకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మైలవరం బోసు బొమ్మ వద్ద ప్రచారంలో పాల్గొననున్నారు.ఈ మేరకు ఆ పార్టీ అభ్యర్థి అక్కల రామమోహనరావు(గాంధీ) ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో తెలిపారు.ఈ కార్యక్రమానికి సీపీఐ,సీపీఎం మరియు బీఎస్పీ పార్టీల అభిమానులు,కార్యకర్తలు వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నూజివీడు ప్రచారం అనంతరం మైలవరంలో ప్రచారం ఉంటుందని తదుపరి విజయవాడ వెస్ట్,సెంట్రల్ మరియు ఈస్ట్ నియోజకవర్గాల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ కృష్ణాజిల్లా ప్రెసిడెన్షియల్ కమిటీ సభ్యులు శ్రీకాంత్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన, వామపక్షాలు,బీఎస్పీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
ఆదివారం తిరువూరులో పర్యటించనున్న జగన్
24-03-2019 (ఆదివారం) మధ్యాహ్నం 03.00 గంటలకు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా అధ్యక్షుడు జగన్ తిరువూరులో పర్యటించనున్నారు. తిరువూరు బోస్ బొమ్మ సెంటర్లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో తిరువూరు వైకాపా అభ్యర్థి కొక్కిలిగడ్డ రక్షణనిధి, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌లు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
తిరువూరులో వైకాపా భారీ ర్యాలి
తిరువూరులో వైకాపా ఆద్వర్యంలో ‘నిన్ను నమ్మం బాబు’ అనే కార్యక్రమంలో భాగంగా పట్టణ వీధుల్లో భారీ ర్యాలి నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ పర్యటన అనంతరం వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిది ఆద్వర్యంలో ఈ భారీ ర్యాలి జరిగింది. మంత్రి లోకేష్ పర్యటనలో పట్టణంలో జరిగిన కార్యక్రమాలకు వచ్చిన తెదేపా కార్యకర్తలు ఎంత మంది ఉన్నారు? వైకాపా ర్యాలీకి ఎంత మంది ఆ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు… అనే విషయం పై పట్టణంలో చర్చలు జరుగుతున్నాయి.
తిరువూరులో హుషారుగా లోకేష్ పర్యటన
కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గంలో రాష్ట్ర ఐటి,మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన.పట్టణంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎంపీ కేశినేని నాని ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ తో కలిసి ప్రారంభించారు.
*ప్రతి పేదవాడికి 5రూ లకే పట్టెడన్నం పెట్టాలనే ఉద్దేశంతో నిర్మించిన”అన్న క్యాంటీన్ ప్రారంభించారు.అనంతరం ఎంపీ,ఎమ్మెల్సీ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అల్పాహారం చేశారు.తిరువూరు మండలంలోని ముష్టికుంట్ల గ్రామంలో నిర్మించిన చెత్తతో-సంపద కేంద్రాన్ని ప్రారంభించారు.అనంతరం జన్మభూమి- మాఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు.
*గతంలో పింఛన్ 200 నేడు 5రేట్లు పెంచి 1000 అందజేస్తున్నాం..
*రాష్టంలో 150 కు పైగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం.
*రాష్టానికి కీయా మోటార్ అనేక కంపెనీలను రాష్టానికి తీసుకురావడం జరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం..
*రాష్టానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ మోసం చేసారని ఆరోపించారు.
*రాష్ట్ర రాజధాని కొరకు 1500 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
*పార్లమెంట్ లో ప్రత్యేక హోదా కోసం మన ఎంపీలు పోరాడుతుంటే సస్పెండ్ చేస్తున్నారని విమర్శించారు.
*ఎంపీ లపై కూడా లాఠీ ఛార్జ్ చేస్తున్నారంటే కేంద్రం ఎంత కుట్రపూర్వకంగా వ్యవహరిస్తోంది.
*బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతున్న రాష్టాలపై ఈడి దాడులు చేస్తున్నారని అన్నారు.
*ప్రధాని మోడీ తన గురించి కూడా మాట్లాడారని తాను రాష్టానికి కంపెనీలను తీసుకురావడం ఎల్ఈడి లైట్లు,సీసీ రోడ్లు తేవడం తప్పా అని ప్రశ్నించారు.
*జగన్మోహన్రెడ్డి పై జరిగిన కోడికత్తి కేసును NIA కు అప్పగించడం మాకేం అభ్యంతరం లేదని అన్నారు.
*వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారని కానీ జీతం సమయానికి తీసుకుంటారని విమర్శించారు.
*రాష్టంలోని 25 ఎంపీ స్థానాలను గెలిపించాలని ప్రజలను కోరారు.
*మండలం లోని సూరవరం, ముష్టికుంట్ల రహదారి అభివ్రుద్దికి నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ దంపతులు, కలెక్టర్ లక్ష్మికాంతం తో పాటు పలువురు ఉన్నతాధికారులు, స్థానిక తెలుగుదేశం నాయకులూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తిరువూరు పర్యటనకు నారా లోకేష్
రాష్ట్ర ఐటీ మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తిరువూరు పర్యటన ఖరారైంది. 7వ తేదీ ఉదయం 8గంటలకు తిరువూరు నియోజకవర్గస్థాయి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి 8:30ని||లకు అన్న క్యాంటీన్ ప్రారంభిస్తారు. 9:30గం||లకు ముష్టీకుంట్ల గ్రామసభలో పాల్గొంటారని నియోజకవర్గ ఇన్‌ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ పేర్కొన్నారు.