చిట్టేల ఆకతాయి వేధింపులు. తరగతి గది సాక్షిగా విస్సన్నపేట అమ్మాయి ఆత్మహత్య.

మొన్న మత్తు పదార్థాల జోగులాటలో తిరువూరు విద్యార్థులు కత్తులతో దాడులకు పాల్పడిన సంఘటనను మరువకముందే మరో విషాదానికి కృష్ణా జిల్లా తిరువూరు సాక్షీభూతంగా నిలిచింది. తిరువూరు మండలం చిట్టేల గ్రామానికి చెందిన అలవాల వెంకటేశ్వరరావు తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం సీఈసీ చదువుతున్నాడు. ఇదే కళాశాలలో విస్సన్నపేట మండలం నర్మదానగర్‌కు చెందిన కంచు వెంకటకుమారి(16) ఇంటర్ మొదటి సంవత్సరం సీఈసీ చదువుతోంది. తనను వెంకటేశ్వరరావు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, దసరా అనంతరం ఆ వేధింపులు హద్దులు మీరాయని వెంకటకుమారి తనకు బంధువు వరుస అయిన కళాశాల అధ్యపకుడు శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన వెంకటేశ్వరరావును పిలిచి మందలించారు. ఇదిలా ఉండగా శుక్రవారం యథావిథిగా తరగతికి హాజరయిన వెంకటకుమారి అకస్మాత్తుగా తరగతిలో పాఠాలు బోధిస్తోన్న ఉపాధ్యాయుడు వద్దకు వెళ్లి తాను ఇంటి నుండి వచ్చేటప్పుడు పురుగుల మందు తాగివచ్చానని చెప్పి కిందపడి స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలోకి చేరుకుంది. హుటాహుటిన ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే సరికే మరణించిందని వైద్యులు ధృవీకరించారు. వెంకటకుమారి సోదరుడు శివ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కృష్ణా జిల్లా కలెక్టర్ బీ.లక్ష్మీకాంతం నూజివీడు ఆర్‌డీవో రంగయ్య ఆధ్వర్యంలో మేజిస్టేరియల్ విచారణకు ఆదేశాలివ్వడంతో ఆయన నూజివీడు డీ.ఎస్.పీ. వై.శ్రీనివాసరావుతో కలిసి తిరువూరులో విచారణ నిర్వహించారు.

*** సినిమాల ప్రభావం. పల్లెటూరి నేపథ్యాలు.
సాధారణంగా పట్నంలోని యువతరం సినిమాలోని ఫ్యాషన్‌ను అనుకరిస్తే…పల్లెటూళ్లకు చెందిన యువతరం ఆయా చలనచిత్రాల నుండి ఫ్యాషన్‌తో పాటు నటీనటుల ప్రవర్తనను సైతం అనుకరిస్తుంటారు. ఈ క్రమంలో ప్రేమకు, ఆకర్షణకు మధ్య తేడా తెలుసుకోలేక, తమకున్న సరిహద్దుల ఉనికిని గ్రహించలేక తొందరపాటులో నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. ఇటువంటి దుర్ఘటనల్లో ఎక్కువగా మృత్యువును ముద్దాడుతున్నది సరస్వతులైతే జైలుకు వెళ్లి అటునుండి జీవితాలను చీకటిలోకి నెట్టేసుకుంటోంది యువకులు. నిర్భయ వంటి చట్టాలు కాగితాల మధ్యన అక్షరాల్లోనే నిస్సిగ్గుగా నిద్రిస్తుంటే – బస్‌స్టాపులు, కళాశాలల వద్ద ఒక మహిళా, ఒక పురుష హోంగార్డులను గస్తీ ఉంచాలనే నిబంధనలకు పోలీసులు వలువలు ఊడదీసి విలువలను తుంగలో తొక్కితే – ఇటువంటి వెంకన్నల చేతిలో ఎందరో వెంకటకుమారీలు బలి కాక తప్పదు. ఎందరో తల్లిదండ్రుల హృదయరోదన ఉసురుకు వీరంతా ఏదో ఒక రోజున మూల్యం చెల్లించుకోక తప్పదు.
tiruvuru vissannapeta student suicide narmadanagar vissannapeta tvrnews.com tvrnews tiruvuru news tiruvuru kaburlu vissannapeta students

తిరువూరులో దమ్మారే దమ్! – మత్తులో చిత్తవుతున్న యువత!

drugs in tiruvuru tiruvuru krishna district tiruvuru news tvrnews tvrnews.com
తిరువూరు పట్టణంలో యువతరం గతంలో ఎన్నడూ లేనివిధంగా చెడువ్యసనాలకు బానిసలవుతున్నట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. తిరువూరు బైపాస్‌రోడ్డు వ్యసనాలకు బానిసలవుతున్న యువకులకు, విద్యార్థులకు అడ్డాగా మారుతోంది. రియల్ఎస్టేట్ వెంచర్లలో, బైపాస్‌రోడ్డుకు ఇరువైపులా ఉన్న కొన్ని నిర్జన ప్రదేశాల్లోనూ పోకిరీలు చట్టవిరుద్ధ కార్యక్రమాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కోకిలంపాడు వెళ్లే రహదారిలోనూ, తండాకి వెళ్లే రహదారిలోనూ ఉన్న రియల్ఎస్టేట్ వెంచర్లలో పనీపాట లేని యువకులు పెద్దసంఖ్యలో జేరి మత్తులో చిత్తవుతున్నారని సమాచారం. గతంలో ఎన్నడూ లేనివిధంగా సిగరెట్లలో గంజాయిని కూర్చుకుని, వాటిని పీలుస్తూ మత్తులోకంలో తేలియాడుతున్నట్లు సమాచారం. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, పోలీసుల నిఘా వైఫల్యం వెరసి యువకులను, విద్యార్థులను స్వేచ్ఛగా వదిలేయడంతో రోజురోజుకూ మత్తు పదార్థాలకు బానిసలవుతున్నట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడురోజుల క్రితం తిరువూరులో జరిగిన ఘర్షణల వెనుక కూడా ఈ మత్తుపదార్థాల ప్రభావం ఉన్నట్లు స్థానిక ఎమ్మెల్యే బహిరంగంగానే ఆరోపించారు. తిరువూరులో గంజాయి వంటి మత్తు పదార్థాలకు పోలీసుల వైఫల్యం మూలంగా యువకులు రోజురోజుకూ బానిసలు అవుతున్నారని ఎమ్మెల్యే రక్షణనిధి బహిరంగంగా ఆరోపించడంతో పరిస్థితి తీవ్రత వెల్లడయింది. యువతరం తీవ్రమైన మత్తు పదార్థాలకు బానిసలవుతున్నట్లు తెలుసుకున్న స్థానిక ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే తిరువూరులో శాంతిభద్రతలు కరువవుతాయని, యువతరం భవిష్యత్తు నాశనం అవుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. మత్తుకు బలి అవుతున్న వారిలో వైద్య, ఇంజినీరింగ్ ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తక్షణమే పోలీసులు స్పందించి తిరువూరు బైపాస్ రోడ్డులోని నిర్జన ప్రదేశాల్లో నిఘా పెట్టాలని, యువకులకు గంజాయి సరఫరా చేస్తున్న రాకెట్‌ను మట్టుబెట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
tvrnews.com tvrnews

తిరువూరులో విద్యార్థుల మధ్య ఘర్షణలు. కత్తులతో పరస్పర దాడులు.

tvrnews.com tiruvuru news tiruvuru photos tiruvuru fights tiruvuru tdp
తిరువూరు పట్టణంలో ఇటీవల శాంతి భద్రతలు కరువవుతున్నాయి. పనీ పాటా లేకుండా రాత్రింబవళ్లు బజారుల వెంట తిరిగే యువకులు, విద్యార్థులు ముఠాలుగా ఏర్పడి మద్యానికి బానిసలై వీధుల్లో వర్గపోరాటాలకు దిగుతున్నారు. ఆదివారం రాత్రి తిరువూరు మసీదు సెంటరులో ఇరువర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణ కత్తులతో దాడులు చేసుకోవడం వరకు వెళ్లింది. రాయపూడి వినయభార్గవ్, బాబీలతో పాటు వారి అనుచరులు నిఖిల్, షేక్ రషీద్‌లు ప్రత్యర్థి వర్గంపై దాడిచేశారు. పోలీసులు ఇరువర్గాల మీద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి బాధితులు స్థానిక పోలీసు స్టేషనులో ఇచ్చిన ఫిర్యాదును ఈ దిగువ ఇస్తున్నాము. గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. తిరువూరులో ఇటీవల పోకిరీల బెడద ఎక్కువైందని తరచుగా వీరు ఘర్షణలకు దిగుతున్నారని, వీరిపై గట్టి నిఘా ఉంచి ఇటువంటి అల్లర్లు పునరావృతం కాకుండా తగుచర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


తిరువూరు శ్రీవాహిని కళాశాలలో ఫ్రెషర్స్ వేడుకలు-చిత్రాలు

tiruvuru news tvrnews tiruvuru sreevahini freshers tiruvuru engineering college krishna district engineering college tiruvuru krishna district photos
తిరువూరులోని శ్రీవాహిని కళాశాలలో శనివారం నాడు ఫ్రెషర్ పార్టీ నిర్వహించారు. మొదటి ఏడాది విద్యార్థులకు సీనియర్లు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీవాహిని అధ్యాపకులు, యాజమాన్యంతో పాటు కళాశాల విద్యార్థులు పెద్దసంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ చిత్రాలు మీకోసం…23న “శ్రీవాహిని” వార్షికోత్సవం

23వ తేదీన తిరువూరులోని శ్రీవాహిని కళాశాల 23వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం ప్రకటించింది. కళాశాలకు ఇది 9వ వార్షికోత్సవం.

నేడు తిరువూరులో TNILIVE-కిలారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సదస్సు

నేడు తిరువూరులో TNILIVE.COM, కిలారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సదస్సు
TNILIVE.COM, కిలారు శ్రీమన్నారాయణ, సరోజినిదేవి చారిటబుల్ ట్రస్ట్ (కిలారు ఫౌండేషన్ – తిరువూరు) ఆధ్వర్యంలో
కృష్ణాజిల్లా, తిరువూరులో అమెరికాలో విద్యా, ఉపాధి, వైద్య అవకాశాలపై ప్రత్యెక సదస్సు నిర్వహిస్తున్నారు. దానికి సంబందించిన వివరాలివి.