ఘనంగా తిరువూరు ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవం

తిరువూరు వాహిని ఇంజినీరింగ్ కాలేజీ 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నూజివీడు డిఎస్పీ బి.శ్రీనివాసులు ప్రత్యేక అతిధిగా విచ్చేశారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఏపీ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి డా. సుధీర్ ప్రేమ్ కుమార్ ప్రసంగిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో దేన్నైనా సాధించవచ్చునని అన్నారు. విలువలతో కూడిన విద్య ఉన్నత స్థానాలకు చేరుస్తుందని ఆ దిశగా విద్యార్థులు అడుగులు వేయాలని సూచించారు. మేధస్సుకు పేద, ధనిక భేదం లేదని చదువుతో పాటు నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని ఆయన కోరారు విద్యతో పాటు నైతిక విలువలపై బోధనలు జరగాల్సిన అవసరం ఉందని సుధీర్ ప్రేమ్ కుమార్ స్పష్టం చేశారు. డిఎస్పీ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు సోదరభావంతో మెలగాలని సూచించారు. సమాజంలో స్మార్ట్ ఫోన్ ల ప్రభావం ఎక్కువగా ఉందని సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా వుండాలన్నారు. సామాజిక మాధ్యమాలపై గాకుండా చదువుపై దృష్టి సారించి కన్నవారికి, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ప్రిన్సిపాల్ రంగా. నాగేంద్ర బాబు అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవము ఆద్యంతం సందడిగా సాగింది ప్రసంగం మధ్యలో వక్తలు ఛలోక్తులు విసురుతూ విద్యార్థులకు నవ్వులు తెప్పించారు. ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసులు, విద్యాశాఖ కార్యదర్శి సుధీర్ ప్రేమ్ కుమార్ ను కళాశాల యాజమాన్యం సత్కరించారు. భోజన విరామం అనంతరం విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. సాంప్రదాయ వస్త్రాలతో విద్యార్థినులు వార్షికోత్సవ సభకు నిండుదనం తెచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, కరెస్పాండంట్ పోట్రు నాగేశ్వరరావు, డైరెక్టర్లు జంగాల మురళి, నాళ్ళ మురళి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tiruvuru Sree Vahini 12th Anniversary-Tiruvuru News-Tiruvuru Engineering College-DSP B Sreenivasulu-ఘనంగా తిరువూరు ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవం-TiruvuruNews
Tiruvuru Sree Vahini 12th Anniversary-Tiruvuru News-Tiruvuru Engineering College-DSP B Sreenivasulu-ఘనంగా తిరువూరు ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవం-Tiruvuru News

తిరువూరు ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ సదస్సు

తిరువూరులోని శ్రీవాహిని ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్,శాస్త్ర సాంకేతిక, నిర్వహణ రంగాలపై ఆధునికత’ అంశంపై అంతర్జాతీయ సదస్సు కార్యక్రమం శనివారం జరిగింది..ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇస్రో శాస్త్రవేత్త బి.నాగేశ్వరరావు స్టూడెంట్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.నాగేంద్రబాబు,సెక్రెటరీ సుబ్రహ్మణ్యం, మెరైన్ చీఫ్ ఇంజనీరింగ్ చైతన్య (సింగపూర్),వైస్ ప్రిన్సిపాల్ ఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
tiruvuru news tvrnews tiruvuru kaburlu tiruvu news tiruvuru kaburlu news -తిరువూరు ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ సదస్సు - international science meet in tiruvuru sreevahini engineering college

పడగ విప్పిన ర్యాగింగ్ భూతం–తిరువూరు కబుర్లు-07/25

మన పొరుగునే ఉన్న సత్తుపల్లి ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ పడగ విప్పింది. సత్తుపల్లి మదర్ తెరిసా ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో జూనియర్లను చిత్రహింసలు పెడుతున్న విద్యార్థుల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

1. శ్రీనిధిలో డీఎడ్ వీడ్కోలు వేడుక
తిరువూరు శ్రీనిధి డీ ఎడ్ కళాశాలలో సీనియర్లకు వీడ్కోలు పలుకుతూ జూనియర్లు ఆద్వర్యంలో బుదవారం నిర్వహించిన వీడ్కోలు వేడుక సందడిగా జరిగింది. వక్తల ప్రసంగాల అనంతరం చాత్రోపాద్యాయుల ఆద్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాశాల చైర్మన్ పోట్రు నాగేశ్వరరావు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
2. MRPS నాయకుల రీలే నిరాహార దీక్ష
ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగం విరుద్దమంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలుకు నిరసనగా ఎమ్మర్పీఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. స్థానిక తహసిల్దారు కార్యాలయం ఆవరణలో నియోజకవర్గ కమిటీ ఆద్వర్యంలో బుధవారం రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. నియోజాకవర్గ ఇంచార్జి వీరయ్య, నాయకులూ గోపాల్, మల్లేష్ సుధాకర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
3. వేతనాల పెంపునాకు వినతి
ఒప్పంద విధానంలో పనిచేస్తున్న తమకు వేతనాలు పెంచాలని కోరుతూ గిరిజన సంక్షేమ శాఖ గురుకుల ఉపాద్యాయులు బుధవారం విస్సన్నపేట వచ్చిన ఎమ్మెల్సీ సభ్యుడు లక్ష్మణరావుకు వినతి పత్రం అందజేశారు,. ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పని చేస్తున్న తమకు చాలీచాలని వేతనాలు చెల్లించడం దారుణమన్నారు. తమకు ఎనిమిది గంటల పని విధానం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన లక్ష్మణరావు మాట్లాడుతూ కనీస వేతన చట్టం కోసం తాము శాసన మండలిలో పోరాడుతున్నామని దీన్ని అమలు చేయడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని వారికి హామీ ఇచ్చారు.
4. 108 ఉద్యోగుల ఆందోళన
విస్సన్నపేటలో 108 వాహనాల ఉద్యోగులు ఆందోళన చేశారు. విస్సన్నపేట, రెడ్డిగూడెం, చాట్రాయి, తిరువూరు తదితర మండలాలకు చెందిన పలువురు 108 ఉద్యోగులు విస్సన్నపేట చేరుకొని, ఇక్కడి తమ కార్యాలయం నుంచి ప్రదర్శన నిర్వహించారు. సీపీఐ, సీపీఎం జనసేన పార్టీల నేతలు వీరికి మద్దతు తెలిపి ప్రదర్శనలో పాల్గొన్నారు. స్థానిక వైఎస్సార్ కూడలిలో వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, వినతిపత్రాన్ని అందజేశారు. 108 ఉద్యోగుల సంఘం నాయకుడు సమర్పణరావు అద్యక్షతన జరిగిన సభలో సిఐటీయూ జిల్లా నాయకుడు సి హెచ్. శ్రీనివాసరావు మాట్లాడారు.
5.వెదజల్లే పద్దతిలో వరిసాగు ఉత్తమం
నరుమడులు సిద్దం చేయని రైతులు విత్తనాలను నేరుగా వెదజల్లే వరిసాగు చేయడం వల్ల నెల రోజుల సమయం కలిసి వస్తుందని ఏవో రాజ్యలక్ష్మి తెలిపారు. పొలం పిలుస్తోంది కార్యక్రమమలో భాగంగా తిరువూరు మండలం రోలుపడిలో మంగలావరం క్షెత్ర స్థాయిలో పర్యటించి వరినారు మడులను పరిశీలించారు. వర్షాలు సమృద్దిగా పడకపోవడం వల్ల వరి నరులో ఎదుగుదల లోపించిందని తద్వారా వరినాట్ల ప్రక్రీయ మరింత ఆలస్యం కానుందని తెలిపారు.
6. నూతన కార్యవర్గం ఎన్నిక
పాస్టార్ల సమస్య పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ సంఘ మండల అద్యక్ష కార్యదర్శులు తెలిపారు. ఎ.కొండూరు మండలం కోడూరులో బుధవారం ఎ.కొండురూ మండల యునైటెడ్ ఫాస్తార్స్ ఫెలోషిప్ సంఘ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. అద్యక్ష ఉపాధ్యక్షులుగా ఎం. యోహాన్, వీ. బర్నబాస్ కార్యదర్శిగా లూకా, కోశాధికారిగా శ్యాం ప్రసాద్తో పాటు మరికొందరు కమితే సభ్యులుగా ఎన్నుకున్నారు.
7.జాషువా నేటి తరానికి ఆదర్శం
మహాకవి గుర్రం జాషువా గొప్పదనం నేటి తరాలకు ఆదర్శామనివిశ్రంత తెలుగు అద్యాపకులు ముంగా జయరాజు అన్నారు. విస్సన్నపేట శ్రీశ్రీ పాటశాలలో గురువారం జాషువా వర్ధంతి సంధరభంగా నివాళులు అర్పించారు. తిరువూరు మండలం మునుకుళ్ళలోని జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలలో జాషువా వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
8. 27న ఉచిత వైద్య శిభిరం
తిరువూరులోని అమరావతి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఈనెల 27న ఉచిత వైద్య శిభిరం నిర్వహిస్తున్నట్లు చైర్మన్ కోనేరు వెంకటకృష్ణన్ తెలిపారు. ఉదయం తొమ్మిది నుంచి మద్యాహ్నం రెండు గంటల వరకు కిడ్నీ, మూత్రకోశం, క్యాన్సర్, గుండెకు సంబందించిన వైద్య పరీక్షలు ఉదయం ఏడూ నుంచి మద్యాహ్నం పన్న్నేడు గంటల వరకు మధుమేహం పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు.
9.అయ్యంకికి నివాళులు
తిరువూరు గ్రేడ్ 1శాఖ గ్రంధాలయంలో అయ్యంకి వెంకట రమణయ్య జయంతి వేడుకలు బుధవరం నిర్వహించారు. గ్రంధాలయదికారి బీరం వెంకట రమణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాటకులతో కలిసి అయ్యంకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
10.ట్రిపుల్ ఐటీకి విద్యార్ధుల ఎంపిక
గంపలగూడెం మండలం ఆదర్శ, జడ్పీ ఉన్నత పాటశాలలో పదో తరగతి అభ్యసించిన నలుగురు బాలికలు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ఎంపికయ్యారు. పదో తరగతి పరీక్షల్లో బాలికలు పది జీపీఏ సాదించారు. ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు విడుదలైన జబోతాలో వారంతా ఎంపికైనట్లు పాటశాల ప్రిన్సిపల్స్ తెలిపారు. తిరువూరు, ఎ.కొండూరు, విస్సన్నపేట మండలాల పరిధిలోని ఉన్నత పాటశాలలకు చెందిన విద్యార్ధులు కూడా ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్లు ఆయా పాటశాలల ప్రిన్సిపల్స్ తెలిపారు.
11.విద్యార్ధుల శ్రమదానం
తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్. విభాగం ఆద్వర్యంలో బుధవారం విద్యార్ధులు శ్రమదానం చేశారు. కళాశాల ఆవరణలో పిచ్చి మొక్కలు తుప్పలు తొలగించి శుభ్రం చేశారు. చెత్తాచెదారం ఎరివేసి దూరంగా తరలించారు. అనంతరం వనం-మనం కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపాల్ డా. ఉమారాణి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
12.రాత పుస్తకాలూ అందజేత
తిరువూరు పరిధిలోని వంద మంది విద్యార్ధులకు పద్మశాలి కమిటీ నిర్వాహకులు రూ. ఇరవై వేల విలువైన రాత పుస్తకాలును వితరనగా అందజేశారు. స్థానిక రాజుపేట ఇడీయాస్ సేవా సంస్థ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో తహసిల్దారు స్వర్గం నరసింహారావు వీటిని విద్యార్ధులకు పంపిణీ చేశారు.
13.తుది దశకు ఇంటర్వ్యులు
తిరువూరు పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహిస్తున్న వార్డు వాలంటీర్ అభ్యర్ధుల ఇంటర్వ్యులు తుదిదశకు చేరుకున్నాయి. ఈనెల పదకొండు నుంచి ప్రారంభించగా గురువారంతో ముగియనున్నాయి. ఇప్పటి వరకు ఇంటర్వ్యుకు హాజరుకాని వారికి ఈనెల 26 చివరి అవకాశంగా కల్పించారు. స్థానిక కార్యాలయంలో బుధవారం జరిగిన ఇంతర్వ్యులకు ఉన్నత విద్యావంతులుతో పాటు ప్రేవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం హాజరయ్యారు.
14పేదలకు ఇల్లు స్థలాల మజూరుకు వినతి
గంపలగూడెం మండలంలోని అర్హత ఉన్న నిరుపేదలకు ఇల్లు, స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ సీపీఐ నాయకుల ఆద్వర్యంలో బుధవారం తహసిల్దారు డీ. పద్మజాకు వినతిపత్రం అందజేశారు. నివేశన స్థాలాలు మంజూరు చేసి ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కోరారు. అర్హత ఉన్న పేదలు అద్దె గృహాలలో మగ్గుతున్నారని తెలిపారు. .
15.మండల పరిషత్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వెల్లడి
గంపలగూడెం మండల,జిల్లా పరిషత్ సాధారణ ఎన్నికలకు సంబందించిన పోలింగ్ కేంద్రాలను బుదవారం వెల్లడించినట్లు ఎంపీ డీవో పిచ్చిరెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద నోటీస్ బోర్డులో కూడా కేంద్రాల వివరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీల పరిధిలో ఎంపీటీసి, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలకు సంబందించి 62పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినత్ల్ తెలిపారు.
16.బీసీ కమిషన్ ఏర్పాటు పై కృతగ్ణతలు
రాష్ట్రంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు నామినేటెడ్ పదవులు పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనర్తెలకు రిజర్వేషన్లు కల్పిస్తూ వాటిలో మహిళలకు యాభై శాతం ప్రాధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రి జగన్ ని అభినందిస్తూ కృతగ్ణతలు తెలుపుతున్నట్లు వైకాపాకు చెందిన మండల విశ్వబ్రహణ సంఘం నాయకులూ ఆడెపు కోటేశ్వరరావు, బుధవారం తెలిపారు.
17. భూ పోరాట యోధుడిగా గుర్తింపు
పేదలకు 300 ఎకరాల ప్రభుత్వ బంజరు భూముల పంపిణీ చేయండంలో కీలక పాత్ర పోషించిన దివంగత నృసింహాద్రీ శ్రీనివాసరావు భూపోరాట యోధుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు తూము క్రిష్నయ్య కొనియాడారు. మండలంలోని పెద్దవారంలో సీపీఐ మండల కమిటీ ఆద్వర్యంలో బుధవరం సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచి శ్రీనివాసరావు వర్ధంతి సభ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులూ సి హెచ్. వెంకటేశ్వరావు, నృసింహాద్రి, వనమాలి, పగిడిమిల్లి రవి, చిలుకూరి పెరుమాళ్ళు తదితరులు పాల్గొన్నారు.
పడగ విప్పిన ర్యాగింగ్ భూతం–తిరువూరు కబుర్లు-07/25 - ragging in satthupalli sattupalli sattupally sathupally sathupalli mother teresa engineering college - tiruvuru news - tiruvuru kaburlu - tvrnews - krishna district tvrnews

మన కలల సౌధం కూలిందన్నా!

Tiruvuru Junior College Dismantled Destroyed And Shattered-Tiruvuru News Tiruvuru Kaburlu Tiruvuru Krishna District News
గత 50 సంవత్సరాల నుండి లక్షలాది మంది విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకున్న కలల సౌధం తిరువూరులో కాలగర్భంలో కలిసిపోయింది. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలో 1969వ సంవత్సరంలో అప్పటి వరకు ఉన్న హైస్కూళ్లను ప్రభుత్వ జూనియర్ కళాశాలగా అభివృద్ధి చేశారు. జూనియర్ కళాశాలగా మారక ముందు కూడా వేలాది మంది విద్యార్థులు ఇక్కడి హైస్కూల్లోని ఈ భవనాల్లో విద్యనభ్యసించారు. 1969లో అప్పటి వరకు ప్రధానోపాధ్యాయులుగా ఉన్న గాడేపల్లి దక్షిణామూర్తిశాస్త్రి (జీ.డీ.ఎం.శాస్త్రి) హయాంలో జూనియర్ కళాశాల ఏర్పడింది. మొదటి ప్రిన్సిపాల్‌గా సివీ.నరసావదానులు నియమితులయ్యారు. అనంతరం సీవీ పూర్ణచంద్రరావు, కే.ధర్మారావు, వెంకట్ రెడ్డి, ఆనందమూర్తి, బోటని నరసింహారావు తదితరులు ఈ కళాశాల ప్రిన్సిపాళ్లుగా పని చేసి తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మంచి గుర్తింపు తెచ్చారు. ప్రస్తుతం కనుమరుగైన ఈ భవనాల్లో తమ బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకుందాం – అందరం కలిసి కళాశాల ఏర్పడి 50ఏళ్లు అయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకోవాలనేది చాలా మంది పూర్వ విద్యార్థుల కోరిక. ఈ కళాశాల తొలి విద్యార్థి సంఘం అధ్యక్షుడు కవుటూరి వినయకుమార్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రముఖ న్యాయవాదిగా రాణిస్తున్నారు. ఇక్కడే విద్యనభ్యసించిన పసుపులేటి వెంకటేశ్వరరావు ఇటీవలే ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమీషనరుగా పదవీవిరమణ చేశారు. ఇక్కడే చదువుకున్న బుద్ధారపు వెంకటేశ్వరరావు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్(క్యాట్) చైర్మన్‌గా ఇటీవల వరకు పనిచేశారు. ఇటువంటి ప్రముఖులు ఇంకా ఎందఱో ఉన్నారు. వీరంతా తిరువూరు హైస్కూల్, జూనియర్ కళాశాల పూర్వ విద్యార్ధుల సమ్మేళనాన్ని నిర్వహించాలని ఆసక్తిగా ఉన్నారు. త్వరలోనే హైదరాబాద్‌లో ఒక తొలి సమావేశాన్ని నిర్వహించి తిరువూరులో పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి శ్రీకారం చుట్టాలని అలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి మీ అభిప్రాయలను కూడా పంచుకోండి. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్. ఈమెయిల్:kilarumuddukrishna@yahoo.com, ఫోన్ నంబరు-9440231118. ఈ క్రింది పేపర్ కట్టింగ్ కూడా తిలకించండి.

సందడిగా సెయింట్ ఆన్స్‌లో పూర్వ విద్యార్థుల సమావేశం-చిత్రాలు

tvrnews tiruuru saint anns school
తిరువూరు సెయింట్ ఆన్స్ పాఠశాలలో 2004 ఆ తర్వాత బ్యాచ్‌ల విద్యార్థుల సమావేశం శనివారం నాడు పాఠశాల ఆధ్వర్యంలో సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో 200మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. కసుకుర్తి నళిని తదితర ఉపాధ్యాయులను ఈ సందర్భంగా విద్యార్థులు సన్మానించారు. వేల్పుల భరత్ సమన్వయంలో సాగిన ఈ కార్యక్రమంలో పాథశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ కుసుమ, మాజీ ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జోస్‌లిన్, ఉపాధ్యాయులు జైన్, అల్తాఫ్ హుస్సెన్, విద్యార్థులు కోట సంకీర్తి తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.

శ్రీవాహినీ అధ్యాపకుల వనభోజనాలు-చిత్రాలు

tvrnews.com tiruvuru sreevahini picnic 2017 tiruvuru news tiruvuru kaburlu tiruvuru krishna district
తిరువూరు శ్రీవాహిని కళాశాల అధ్యాపకులు ఎ.కొండూరులోని నాగసింధు స్పిన్నింగ్ మిల్స్ వారి మామిడితోటలో వనభోజన కార్యక్రమాన్ని జరుపుకున్నారు. కార్యక్రమంలో శ్రీవాహిని ప్రతినిధులు, అధ్యాపకులు సకుటుంబంగా పాల్గొని సందడి చేశారు. ఆ చిత్రాలు మీకోసం…
విస్సన్నపేట వికాస్ నుండి పదోతరగతి విద్యార్థి మాయం

కృష్ణా జిల్లా విస్సన్నపేట వికాస్ హాస్టల్లో పదోతరగతి చదువుతున్న బాలుడు అదృశ్యం. పదోతరగతి చదువుతున్న లక్ష్మీనారాయణ అనే యువకుడు ఎవరికీ తెలియకుండా వెళ్లిపోయినట్లుగా తెలిసింది. ఈ విషయం జరిగి మూడు రోజులైనా ఎవరికి తెలియకుండా గోప్యంగా వికాస్ విద్యాసంస్థ ఉంచడంతో ఇంకా అనేకమైన అనుమానాలు వెలువడుతున్నాయి. ఇక పూర్తి విషయం తెలియాల్సి ఉంది.
vissannapeta vikas 10th class student tvrnews tiruvuru news krishna district

తిరువూరు శ్రీవాహినిలో దుమ్మురేపిన ఎంబీఏ ఫ్రెషర్స్ పార్టీ

tiruvuru sreevahini freshers party tiruvuru news tvrnews.com tiruvuru krishna district egineering colleges andhra pradesh engineering college freshers party
తిరువూరు శ్రీవాహిని ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం నాడు ఎంబీఏ ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకల్లో జూనియర్, సీనియర్ విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థినులు సాంప్రదాయ దుస్తుల్లో హాజరయి వేడుకలకు ఆకర్షణ తీసుకొచ్చారు. విద్యార్థుల డ్యాన్సులు అలరించాయి.