ఆటా నుండి ఆహ్వానం

తిరువూరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కిలారు ముద్దుకృష్ణకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) నుండి ఆహ్వానం అందింది. మే 31 నుండి మూడు రోజుల పాటు డల్లాస్ నగరంలో అమెరికన్ తెలుగు కన్వెన్షన్ పేరుతొ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ముద్దుకృష్ణ ను నిర్వాహకులు ఆహ్వానించారు.

విజయవాడ తానా-5కె రన్ గోడపత్రిక విడుదల చేసిన మంత్రి ఉమా

ఆదివారం విజయవాడలో నిర్వహించనున్న తానా-5కె రన్ గోడపత్రికను ఏపీ మంత్రి దేవినేని ఉమా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్ చైర్మన్ శృంగవరపు నిరంజన్, తిరువూరు తెదేపా ఇన్‌ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు.

రేపు తిరువూరు వస్తున్న స్వామిదాసు దంపతులు

డిసెంబరు 5వ తేదీన అమెరికా వెళ్లిన తిరువూరు నియోజకవర్గ తెదేపా సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాస్, సుధారాణి దంపతులు కొద్ది గంటల క్రితమే అమెరికా నుండి బయలుదేరారు. శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఎమిరేట్స్ విమానంలో దుబాయికు బయల్దేరారు. నేటి అర్ధరాత్రికి దుబాయి చేరుకుని అక్కడి నుండి ఆదివారం ఉదయం నాలుగున్నర గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు, అటు నుండి నేరుగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు తిరువూరుకు వస్తారు.

** గత 5వతేదీన డల్లాస్ వెళ్లిన స్వామిదాస్ దంపతులుకు అక్కడి స్థానిక కృష్ణాజిల్లా ప్రవాసులు అభినందన సభ ఏర్పాటు చేశారు. జడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తమ కుమారుడు క్రాంతిభూషణ్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో స్వామిదాస్, సుధారాణిలు పాల్గొన్నారు. తరువాత న్యూజెర్సీ. న్యూయార్క్‌లలో పర్యటించారు. న్యూజెర్సీ రాష్ట్ర మంత్రి చివుకుల ఉపేంద్రతో భేటి అయ్యారు. వాషింగ్టన్ డీసీలో పర్యటన సందర్భంగా తానా అధ్యక్షుడు వేమన సతీష్ ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు స్వామిదాస్ ను సత్కరించారు. ఆక్కడి నుండి లాస్ వేగాస్, లాస్ ఏంజెల్స్, డెత్ వ్యాలీ తదితర ప్రాంతాల్లో విహారయాత్ర గడిపి మూడురోజుల క్రితం శాన్‌ఫ్రాన్సిస్కో చేరుకున్నారు. గొల్లపూడికి చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు కేతినేని కిషోర్‌బాబు శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో పర్యటన ప్రాంతాలను చూపించారు. గత గురువారం నాడు సిలికానాంధ్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమెరికా తొలి తెలుగు విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. శుక్రవారం రాత్రి ఉత్తర అమెరికాలో ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం స్వామిదాస్, సుధారాణిల అభినందన సభ, విందును స్వాగత్ హోటల్‌లో ఏర్పాటు చేశారు. తమ అమెరికా పర్యటన సంతోషకరంగా సాగిందని మంచి అనుభూతులుతో తిరువూరుకు తరలివస్తున్నామని కొద్దిసేపటి క్రితం విమానం ఎక్కే ముందు స్వామిదాస్ దంపతులు TVRNEWS.COMకు తెలిపారు.
tvrnews.com tiruvuru kaburlu tiruvuru swamydas nallagatla america tour 2017 tiruvuru news

తానా అధ్యక్షుడు వేమన సతీష్‌తో స్వామిదాస్ సమావేశం. తెలుగు సంఘం గోడపత్రిక ఆవిష్కరణ.


కృష్ణా జిల్లా తిరువూరు మాజీ శాసనసభ్యుడు, తెదేపా తిరువూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ గురువారం నాడు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అధ్యక్షుడు వేమన సతీష్‌తో వర్జీనియాలోని సితార సమావేశ మందిరంలో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు మన్నే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రవాసులు మాతృభూమి కోసం సేవ చేయాలని స్వామిదాస్ కోరారు. తానా ఆధ్వర్యంలో తిరువూరు మండలం రోలుపడి గ్రామంలో కిలారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తానా సేవలను ఆయన అభినందించారు. తానా అధ్యక్షుడు వేమన సతీష్ మాట్లాడుతూ ఎన్‌టీఆర్ తొలితరం శిష్యుల్లో స్వామిదాస్ అగ్రగణ్యులని, పార్టీకీ నియోజకవర్గానికి ఆయన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. తానా ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం స్వామిదాస్ చేతులమీదుగా జీడబ్ల్యూటీసీఎస్ సంక్రాంతి వేడుకల గోడపత్రికను ఆవిష్కరించారు.

అమెరికాలో గద్దె-నల్లగట్ల దంపతులకు అభినందన

tnilive.com tnilive tni nallagatla gadde anuradha
నూతన రాజధాని అమరావతిలో విద్యా-వైద్యం-ఆరోగ్య రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు అత్యయిక అవసరం అధికంగా ఉందని, దీనికి తోడ్పడేందుకు ప్రవాసులు పెద్దసంఖ్యలో బాధ్యాతాసహితంగా తరలి రావాలని కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ విజ్ఞప్తి చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, అనురాధ, తిరువూరు మాజీ శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాస్, కృష్ణా జడ్పీ మాజీ చైర్‌పర్సన్ నల్లగట్ల సుధారాణిలు ఆదివారం సాయంత్రం ఇర్వింగ్‌లోని హిల్‌టాప్ సమావేశ మందిరంలో డల్లాస్ పరిసర ప్రాంతంలో నివసిస్తున్న కృష్ణా జిల్లా ప్రవాసులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏపీ ప్రభుత్వం రహదారులు, తల్లిబిడ్డల ఎక్స్‌ప్రెస్, తాగునీరు, సాగునీరు, పరిశ్రమల ఏర్పాటు వంటి వాటి విస్తృత పరికల్పనకు విశేష కృషి జరుపుతోందని, విద్యా-ఆరోగ్య రంగాలు గ్రామీణ ప్రాంతాల్లో మరింత ప్రభావితంగా చొచ్చుకుపోవాలంటే ప్రవాసుల చొరవ వలనే అది సాధ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. తను అమెరికా పర్యటనకు బయల్దేరే ముందు రూ.192కోట్లను కృష్ణా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు మంజూరు చేశానని ఆమె తెలిపారు. బాబు వస్తే జాబు వస్తుందనే నినాదానికి అశేష ప్రాచుర్యం కల్పించిన ప్రవాసులు ఆ నినాదాన్ని నిజం చేసేందుకు పెట్టుబడులతో కదిలిరావాలని కోరారు. అనంతరం ప్రసంగించిన కృష్ణా జడ్పీ మాజీ చైర్‌పర్సన్ నల్లగట్ల సుధారాణి…ఏపీలో సామాజిక జీవన నాణ్యత మెరుగ్గా ఉందని, సామాజిక బాధ్యతను విస్మరించకుండా ప్రజలు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. తాను సభ్యురాలిగా ఉన్న కమీషన్ ద్వారా ఎటువంటి ప్రజాపయోగ పనులైనా సరే తన పరిధి అవతల ఉన్నా సరే కచ్చితంగా చేయవల్సిందిగా ముఖ్యమంత్రి సూచిస్తున్నారని, మెరుగైన రాష్ట్రం కోసం ఆయన తపన దీని ద్వారా వెల్లడి అవుతోందని ఆమె పేర్కొన్నారు. ఏపీలో అభివృద్ధిపరంగా పెనుమార్పులు అతి వేగంగా సంభవిస్తున్నాయని, దీన్ని అందరూ హర్షించాలని ఆమె కోరారు. తిరువూరు మాజీ శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా అనగానే స్వాతంత్ర్య సమరోద్యమ నాయకులు, బెజవాడ కనకదుర్గ, సినీ, కళా, సాహితీ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు జ్ఞప్తికి వస్తున్నారని, ఇటువంటి మహోన్నత జిల్లాకు సమీపంలో నూతన రాజధాని నిర్మాణం కావడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ప్రవాసులు జిల్లా అభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ ప్రసంగిస్తూ ఎకరానికి కోటి రూపాయిల ఆదాయం వచ్చే విధంగా ఏపీలో వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. కోర్ కమిటీ సభ్యుడిగా నిరంతరం అతి సమీపంగా రాష్ట్రంలో అమలయ్యే పలు పథకాలు, నిర్మాణాలను తాను సభ్యుడిగా ఉన్న కోర్ కమిటీ అధ్యయనం చేస్తుందని, వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఇటీవల విశాఖలో ఏర్పాటు చేసిన అగ్రిటెక్ సదస్సు ద్వారా ఎకరానికి కోటి రూపాయిల ఆదాయం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా ఆక్వా రంగం కొత్తపుంతలు తొక్కుతోందని, గోదావరి నీరు కలవడం చేత పంటలు సారవంతమైన వనరులను అద్భుతంగా వినియోగించుకుంటున్నాయని తెలిపారు. సభ ప్రారంభానికి పూర్వం గద్దె దంపతులను మొక్కపాటి దినేష్, నల్లగట్ల దంపతులను త్రిపురనేని దినేష్‌లు సభకు పరిచయం చేశారు. స్థానిక ప్రవాసుడు చలసాని కిషోర్ నివాసంలో ఏర్పాటు చేసిన ఎన్‌టీఆర్ విగ్రహానికి గద్దె-నల్లగట్ల దంపతులు ఘననివాళులు అర్పించారు. ఈ ఆత్మీయ సమావేశంలో తాతినేని రాం, కోనేరు శ్రీధర్, చలసాని కిషోర్, కొరడా కృష్ణ, చాగర్లమూడి సుగన్, అడుసుమిల్లి రాజేష్, డా.సూద్నగుంట రాఘవేంద్ర ప్రసాద్, వీరపనేని అనీల్, పోలవరపు శ్రీకాంత్, జెట్టి శ్రీరాం, సీ.ఆర్.రావు, మండువ సురేష్, అనీల్ తన్నీరు, నల్లగట్ల క్రాంతి, వీర్నపు చినసత్యం, ఉప్పలపాటి కృష్ణారెడ్డి, యార్లగడ్డ అప్పారావు, కోగంటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
డల్లాస్‌లో తెదేపా నేత స్వామిదాస్ దంపతులకు సత్కారం

tvrnews.com nallagatla swamydas
కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి, తెదేపా సీనియర్ నేత నల్లగట్ల స్వామిదాస్, ఆయన సతీమణి కృష్ణాజిల్లా జడ్పీ మాజీ చైర్‌పర్సన్ సుధారాణి దంపతులను డల్లాస్‌లోని ప్రవాసులు గురువారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. తొలిసారి అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లో పర్యటిస్తున్న వీరిరువురు స్థానిక కృష్ణా జిల్లా ప్రవాసులతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీతో తనకున్న పలు అనుభవాలను స్వామిదాస్ నెమరవేసుకున్నారు. 1994లో మొట్టమొదటి సారి ఎన్.టి.రామారావు తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గుర్తింపును ఇచ్చారని, అప్పటి నుండి గత 23ఏళ్లుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు తనకు డబ్బులతో ప్రభోలాకు గురిచేసి మభ్యపెట్టాలని చూశారని, కానీ చంద్రబాబు తమపై చూపిన ఆదరణ, అభిమానాలను మరిచిపోకుండా అన్నివేళలా పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు తమ కుటుంబం విశేషమైన కృషి చేసిందని పేర్కొన్నారు. ప్రవాసులకు ఓటు హక్కు బిల్లు ఆమోదముద్ర పడితే తద్వారా కృష్ణా జిల్లాలో తెదేపా మరిన్ని సీట్లను కైవసం చేసుకునే అవకాశం కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు. కార్యక్రమంలో ప్రవాసులు చలసాని కిషోర్, తాతినేని రాం, నవీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆర్కాన్సాలో జరిగే తమ కుమారుడు క్రాంతి స్నాతకోత్సవానికి హాజరయి అటు నుండి ఫిలడెల్ఫియా, న్యూజెర్సీ, బోస్టన్, వాషింగ్టన్ డీసీ, శాన్‌ఫ్రాన్సిస్కో తదితర నగరాల్లో స్వామిదాస్-సుధారాణిలు పర్యటించనున్నారు. ప్రవాసులతో భేటీకి పూర్వం స్వామిదాస్ దంపతులు ఇర్వింగ్‌లోని మహాత్మాగాంధీ స్మారకస్థలిని సందర్శించారు. స్మారకస్థలి కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ వీరికి విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన విశేషాలను వివరించారు.
శ్రీవాహినిలో “ఆటా” విద్యార్ధి చైతన్య సదస్సు


అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా సోమవారం నాడు కృష్ణాజిల్లా తిరువూరు శ్రీవాహిని ఇంజనీరింగ్ కళాశాలలో ‘విద్యార్ధుల చైతన్య సదస్సు’ నిర్వహించారు. న్యూయార్క్ ఫ్యాషన్ ఇనిస్టిట్యుట్ ఆఫ్ టెక్నాలజీ రిజిస్టార్ డా.వంగపాటి రాజశేఖర్ రెడ్డి విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికాలోను, భారత్ లోను ఉన్న ఇంజనీరింగ్ బోధనా విధానాల మధ్య ఉన్న తేడాల గురించి, అమెరికాలో ఉన్నత విద్యావకాశాల గురించి ప్రొఫెసర్ రాజశేఖర్ వివరించారు. ప్రతి విద్యార్ధి తనకంటూ తప్పనిసరిగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని కష్టపడి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగితే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు గతంలో ధనవంతులు పిల్లలే వచ్చేవారని ప్రస్తుతం బాగా చదువుకుంటున్న గ్రామీణ విద్యార్ధులు సైతం ఈ దేశాలకు ఉన్నత చదువులు కోసం ఎక్కువగా వెళ్తున్నారని తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ TNILIVE.COM నిర్వాహకుడు కిలారు ముద్దుకృష్ణ సభకు అధ్యక్షత వహించారు. కళాశాల చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, కార్యదర్శి ఊటుకూరు సుబ్రహ్మణ్యం, కరస్పాండెంట్ పోట్రు నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ డా.రంగా నాగేంద్రబాబు, అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రొఫెసర్ రాజశేఖర్‌ను పాలకవర్గ సభ్యులు సత్కరించారు.అమెరికా వెళ్తున్న స్వామిదాస్ దంపతులు

మాజీ శాసనసభ్యుడు తిరువూరు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ డిసెంబర్ 5 నుండి 30వ తేదీ వరకు భార్య సుధారాణితో కలిసి అమెరికా వెళ్తున్నారు. స్వామిదాస్ దంపతులకు బుధవారం నాడు అమెరికా వీసా మంజూరు అయింది. స్వామిదాస్ కుమారుడు క్రాంతికుమార్ ఎం.ఎస్ పూర్తి అయిన సందర్భంగా పట్టా తీసుకుంటున్నాడు. ఆర్కాన్సా విశ్వవిద్యాలయంలో డిసెంబరు 8వ తేదీన జరిగే పట్టా ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం వాషింగ్టన్, న్యూయార్క్, న్యూజెర్సీ, నయాగరా, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో స్వామిదాస్-సుధారాణిలు పాల్గొంటారు. ఆయా ప్రాంతాల్లో తిరువురుకు చెందిన ప్రవాసులను వీరు కలుసుకుంటారు.
tvrnews.com tvrnews tiruvuru news tiruvuru krishna district 2017 nallagatla swamydas tiruvuru telugu desam tdp america trip tvrnews.com tvrnews is tiruvuru news

నేపాల్‌లో గంపలగూడెం వ్యాపారి మృతి

తీర్థయాత్రకు వెళ్ళిన గంపలగూడెం వ్యాపారి చారుగుండ్ల వెంకటేశ్వరరావు (67) నేపాల్ కు సమీపంలోని ముక్తినాథ్ వద్ద మృతి చెందారు. శుక్రవారం రాత్రి మృతి చెందగా వాతావరణం సహకరించక మృతదేహాన్ని స్వస్థలమైన గంపలగూడెం తీసుకురావడంలో ఆలస్యమైంది. విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సహకారంతో వెంకటేశ్వరరావు మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా గంపలగూడెం తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతునికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుని పెద్ద కుమారుడు ప్రసాద్ మైలవరం మార్కెట్ కమిటి డైరక్టరుగా ఉన్నారు.