ఇది బస్‌స్టేషన్ కాదు…చెత్తస్టేషన్!

ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితి ఏ తల్లి బిడ్డరా? వెక్కివెక్కి ఏడుస్తోంది చందంగా తయారైంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల మధ్యలో ఉన్న ఈ రద్దీ బస్‌స్టాండ్ పారిశుద్ధ్య లోపంతో ప్రయాణీకులకు నరకాన్ని చూపెడుతోంది. అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ బస్టాండ్ ప్రాంగణమంతా కనీస నిర్వహణ లేక చెత్తా చెదారం పేరుకొని మురికి కూపంగా మారింది. కనీసం డస్టు బిన్లు కూడా ఏర్పాటు చేయలేని అలసత్వంతో అధికారులు నిద్రపోతున్నారు. చినుకు పడితే చాలు మోకాళ్ళలోతు నీళ్ళు చేరి, బస్ స్టేషన్ కట్టలేరుగా మారుతోంది. ఫ్యాన్లు తిరగవు. దోమల దాడి. మరుగుదొడ్లు మురికికంపు. ఇది తిరువూరు బస్టాండు అధోగతికి తార్కాణం. తమ నరకయాతన అర్థం చేసుకుని ఇప్పటికైన ప్రజాప్రతినిధులు, అధికారులు తిరువూరు బస్టాండ్ దుస్థితిని చెదరగొట్టేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇది బస్‌స్టేషన్ కాదు...చెత్తస్టేషన్! - horrible-situation-in-tiruvuru-bus-station-2021-tiruvuru-telugu-news

తిరువూరులో కొరోనా లాక్‌డౌన్-చిత్రాలు

తిరువూరులో కొరోనా లాక్‌డౌన్ ప్రశాంతంగా సాగుతోంది. నగర పొలిమేరల్లో ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేసి వదిలేశారు. సాయంకాలం స్థానిక ప్రజలు తమ అవసరాల నిమిత్తం వీధుల్లోకి వచ్చారు. స్థానిక వాహినీ కళాశాలలో కొరోనా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు.
తిరువూరులో కొరోనా లాక్‌డౌన్-చిత్రాలు-Tiruvuru Krishna District News-Corona Virus Lock Down In Krishna District Tiruvuru-TVRNews
తిరువూరులో కొరోనా లాక్‌డౌన్-చిత్రాలు-Tiruvuru Krishna District News-Corona Virus Lock Down In Krishna District Tiruvuru-TVRNews
తిరువూరులో కొరోనా లాక్‌డౌన్-చిత్రాలు-Tiruvuru Krishna District News-Corona Virus Lock Down In Krishna District Tiruvuru-TVRNews
తిరువూరులో కొరోనా లాక్‌డౌన్-చిత్రాలు-Tiruvuru Krishna District News-Corona Virus Lock Down In Krishna District Tiruvuru-TVRNews
తిరువూరులో కొరోనా లాక్‌డౌన్-చిత్రాలు-Tiruvuru Krishna District News-Corona Virus Lock Down In Krishna District Tiruvuru-TVRNews
తిరువూరులో కొరోనా లాక్‌డౌన్-చిత్రాలు-Tiruvuru Krishna District News-Corona Virus Lock Down In Krishna District Tiruvuru-TVRNews
తిరువూరులో కొరోనా లాక్‌డౌన్-చిత్రాలు-Tiruvuru Krishna District News-Corona Virus Lock Down In Krishna District Tiruvuru-TVRNews
తిరువూరులో కొరోనా లాక్‌డౌన్-చిత్రాలు-Tiruvuru Krishna District News-Corona Virus Lock Down In Krishna District Tiruvuru-TVRNews
తిరువూరులో కొరోనా లాక్‌డౌన్-చిత్రాలు-Tiruvuru Krishna District News-Corona Virus Lock Down In Krishna District Tiruvuru-TVRNews
తిరువూరులో కొరోనా లాక్‌డౌన్-చిత్రాలు-Tiruvuru Krishna District News-Corona Virus Lock Down In Krishna District Tiruvuru-TVRNews

తిరువూరులో ఆర్టీసి దుస్థితి! కొత్తవి రాకపోగా…ఉన్న సర్వీసులు మూసేస్తున్నారు.

“పిల్లి చేతకానిదైతే…ఎలుక వెక్కిరించిందట”! ఈ సామెత తిరువూరు ఆర్టీసి డిపోకు అక్షరాలా సరిపోతుంది. ఒకప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ఆదాయం గడించిన డిపోగా పేరుపొందిన తిరువూరు ఆర్టీసీ డిపో నేడు దుస్థితిలో సరైన నాయకుడు లేక పట్టించుకునే నాధుడే లేక దిక్కుమొక్కు లేని డిపోగా రోజురోజుకు దిగజారిపోతోంది. ఈ డిపోను నిర్వీర్యం చేయడానికి విజయవాడలో ఉన్న అధికారులు సర్వశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు.

*** పామూరు సర్వీసు ఎందుకు నిలిపివేసినట్లు?
గత 6నెలల నుండి మా ఎమ్మెల్యే రక్షణనిధి దాదాపు పదిసార్లు మన జిల్లాకే చెందిన రవాణా శాఖా మంత్రి పేర్ని నానిని కలిసారు. కలిసిన ప్రతిసారి ఆడంబరంగా ఫేస్‌బుక్కుల్లో ఫోటోలు పెడుతున్నారు. తిరువూరు ఆర్టీసీకి నూతన సర్వీసులు వరదలా వచ్చిపడుతున్నాయని మంత్రి పేర్ని నాని ఇందుకు అంగీకరించారని మన ఎమ్మెల్యే ఆర్భాటంగా ప్రకటనలు ఇస్తున్నారు. కొత్త సర్వీసులు ఇచ్చే మాట దేవుడెరుగు…ఉన్న సర్వీసులు మాత్రం అర్ధాంతరంగా నిలిపివేస్తున్నారు. తిరువూరు ఆర్టీసీ డిపోలో అత్యధికంగా ఆదాయం వచ్చే ఎక్స్ ప్రెస్ సర్వీసులలో ‘పామూరు సర్వీసు’ పేరుపొందింది. తిరువూరులో బయలుదేరి మూడు జిల్లాల గుండా పయానించి ప్రకాశం జిల్లా పామూరుకు వెళ్ళే ఈ అల్ట్రా ఎక్స్ ప్రెస్ సర్వీసు అత్యధికంగా డిపోకు డబ్బులు తెచ్చిపెడుతుంది. ఒక్క ట్రిప్పుకు రూ.25వేలు ఆదాయం తెచ్చిపెడుతుంది. దీనిని అధికారులు సోమవారం నుండి అర్థాంతరంగా నిలిపివేశారు. ఈ సర్వీసు నిలిపివేతపై ఎమ్మెల్యే రక్షణనిధి అధికారులను నిలదీయాలని ఈ సర్వీసును తక్షణమే పునరుద్ధరించాలని ఆర్టీసీ సిబ్బందితో పాటు ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.

*** ఎందుకీ తుగ్లక్ పనులు?
విజయవాడలో ఉన్న ఆర్టీసీ అధికారులు తీసుకుంటున్న చర్యలు తుగ్లక్ ను మరిపిస్తున్నాయి. ఇబ్రహింపట్నం డిపోకు చెందిన ఒక్క బస్సును తిరువూరు మీదుగా ఇబ్రహింపట్నంకు వెళ్లి హైదరాబాద్ బీహెచ్ఎల్ వెళ్ళే విధంగా రెండు రోజుల క్రితం ఒక బస్సు సర్వీసును ఏర్పాటు చేశారు. తిరువూరు ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని సర్వీసు ఇది. తిరువూరు నుండి హైదరాబాద్-బీహెచ్ఎల్ వెళ్ళేవారు ఎవరూ మైలవరం, ఇబ్రహింపట్నం మీదుగా వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు రారు. ఈ సర్వీసును ఎందుకు పెట్టారో ఎవరికీ అంతుపట్టడం లేదు.

*** రవాణా శాఖామంత్రి స్పందించాలి.
కృష్ణాజిల్లాకే చెందిన రవాణాశాఖ మంత్రి పేర్ని నానికి తిరువూరుతో మంచి అనుబంధం ఉంది. ఆయన మంత్రి అయిన అనంతరం ఆయన ప్రాంతం బందరు డిపో నుండి చాలా నూతన సర్వీసులను ప్రారంభించారు. అదే తరహలో వెనుకబడిన ప్రాంతంలో ఉన్న తిరువూరు ఆర్టీసీ బస్ డిపో మీద దృష్టిపెట్టాలి. ఈ ప్రాంతం ప్రయాణీకులు ఎప్పటి నుండో కోరుతున్న శ్రీశైలం, వైజాగ్, బెంగళూరు, ఈసీఐఎల్, కాకినాడ తదితర ప్రాంతాలకు నూతన బస్ సర్వీసులను ఏర్పాటు చేయించాలి. విజయవాడ రూట్ లో నాన్ స్టాప్, సింగిల్ స్టాప్ బస్సులను ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుండో కోరుతున్న హైదరాబాద్ కు కనీసం ఒక్క ఏసీ బస్ నైనా కేటాయించాలి. నిలిచిపోయిన పామూరు బస్ సర్వీసును తక్షణమే పునరుద్ధరించాలి. జగన్ ప్రభుత్వంపై నమ్మకం ఉంచి వరుసగా రెండు సార్లు వైకాపా అభ్యర్ధి రక్షణనిధికి భారీగా ఓట్లు వేసి గెలిపించిన ఈ ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించాలి. దీనావస్థలో ఉన్న తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ కు పూర్వ వైభవం కల్పించాలి. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.

తిరువూరులో ఆర్టీసి దుస్థితి! కొత్తవి రాకపోగా...ఉన్న సర్వీసులు మూసేస్తున్నారు.-The horrible situation of tiruvuru apsrtc depot
తిరువూరులో ఆర్టీసి దుస్థితి! కొత్తవి రాకపోగా...ఉన్న సర్వీసులు మూసేస్తున్నారు.-The horrible situation of tiruvuru apsrtc depot

ఇక తిరువూరు బస్ స్టాండు బాగుపడినట్లేనా?

రాష్ట్ర రవాణా మరియు సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని) ని తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి కలిశారు.ఈ సందర్భంగా తిరువూరు డిపో దూరప్రాంతాలకు నూతన బస్ సర్వీసుల కొరకు ఆవశ్యకతను మంత్రికి వివరించారు. బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం,హైదరాబాద్ కు A/C సర్వీసులు,మచిలీపట్నం, ఖమ్మం అదనపు సర్వీసులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గతంలో తిరువూరు డిపోలో 100 వరకు సర్వీసులు ఉండేవని నేడు అవి 72 సర్వీసులకే పరిమితమయ్యాయని పేర్కొన్నారు.పాఠశాల,కళాశాలల విద్యార్థిని,విద్యార్థులకు కొరకు బడి బస్సులను అదనంగా నడపాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఆర్టీసీ డిపోను గట్టెక్కే విషయమై మంత్రితో చర్చించారు..ఈ విషయమై మంత్రి పేర్ని నాని సానుకూలంగా స్పందిస్తూ త్వరలో దూరప్రాంతాల కొరకు A/C బస్సులను కేటాయిస్తామన్నారు. నూతన బస్ సర్వీసులను ప్రారంభించేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.
tiruvuru news - tiruvuru kaburlu - tvrnews - krishna district news tiruvuru news tiruvuru kaburlu tvr news - tvrnews.com - ఇక తిరువూరు బస్ స్టాండు బాగుపడినట్లేనా? - tiruvuru apsrtc bus stand horrible pathetic situation- tvrnews.com tiruvuru news tiruvuru kaburlu

తిరువూరు ఆర్టీసీ డిపోను సందర్శించిన RM-తిరువూరు కబుర్లు–08/10

* విజయవాడ ఆర్టీసీ రీజియన్ గత 3నెలల్లో 15 కోట్ల రూపాయల నష్టాలు చవిచూసిందని రీజినల్ మేనేజర్ జీ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. తిరువూరు డిపో వార్షిక తనిఖీ నిమిత్తం శనివారం వచ్చిన ఆయన మాట్లాడుతూ ఆటోనగర్, విజయవాడ డిపోలు మాత్రమే లాభాల్లో ఉన్నాయని, పెరిగిన డీజిల్ ధరలు, నిర్వహణ వ్యయం, స్పేర్ పార్ట్శ్ ధరలు పెరగడంతో ఈ నష్టాలు వస్తున్నాయన్నారు. విజయవాడ డిప్యూటీ సి టీ ఏం జాన్ సుకుమార్, తిరువూరు డిపో మేనేజర్ ఫయాజ్ అహ్మద్ పాల్గొన్నారు.
*వివక్ష తగదు
వైకాపా అధికారంలోకి వచ్చాక తెదేపా నాయకులూ, కార్యకర్తలు తీవ్ర వివక్ష ఎదుర్కొంటున్నారని మాజీ సర్పంచి మోరల తిరపతిరావు, తెదేపా గ్రామ అద్యక్షుడు అన్నీ రవికుమార్ ఆరోపించారు. శుక్రవారం వారు స్థానికగా మాట్లాడుతూ స్థానిక పాల ఉత్పత్తిదారుల సహకార సంఘంలో పని చేస్తున్న కృష్ణ తెదేపా కార్యకర్త అని భావించి తొలగించడం సరికాదన్నారు. మండల వ్యాప్తంగా ఆయా గ్రామాలలో పలు శాఖల్లో పని చేస్తున్న చాలా మంది ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కృష్ణను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు బీ.శంకర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
*జూదరుల పట్టివేత ‘
గంపలగూడెం మండలం కనుమూరులో శుక్రవారం సాయంతం నిర్వహించిన దాడుల్లో జూదమాడుతున్న ముగ్గురు బ్యాక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఉమామహేస్వరావు తెలిపారు.
*బస్టాండ్ లో అధికారుల తనిఖీ
తిరువూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో తూనుకలి, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోల్ స్వర్ణ శుక్రవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా మంచినీటి సీసాలు, శీతల పానీయాలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దుకాణం నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బస్టాండు, సినిమా హాళ్ళు ఇతర పదేశాల్లో ఏమ్మర్పీ కంటే అధికంగా విక్రయిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.
*గోవధను కట్టడి చేయాలనీ వినటి
తిరువూరులో యద్చ్చేగా సాగుతున్న గోవధ కట్టడికి చర్యలు తీసుకోవాలని తహసిల్దారు నరసింహారావుకు స్థానిక కార్యాలయంలో భాజపా నేతలు వినతి పత్రం అందజేశారు. రాజుపేట పశువుల సంత సమీపంలో అక్కపాలెం వెళ్ళే రహదారిలో వాగు ఒడ్డున గోవులను వాదిస్తూ మాంసం విక్రయాలు చేస్తున్నారని తహసిల్దారు దృష్టికి తీసుకువచ్చారు.
*సబ్ స్టేషన్ పనులు వేగవంతం చేస్తాం
విస్సన్నపేట మండలం నరసాపురంలో ఐదేళ్ళ క్రితం నిర్మాణం ప్రారంభించిన 133/32కేవీ విద్యుత్తూ సబ్ స్టేషన్ పనులను త్వరతగతిన పూర్తీ చేసి, నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు కృషి చేస్తామని తిరువూరు శాసన సభ్యుడు రక్షణనిధి హామీ ఇచ్చారు. తెల్లదేవరపల్లి పీఎసిఎస్ త్రిసభ్య కమిటీ అద్యక్షుడు అల్లు గజపతి రెడ్డి ఆద్వర్యంలో పలువురు రైతులు ఎమ్మెల్యే రక్షణనిధి కలిసి, సబ్ స్టేషన్ ప్రారభించాలని విజ్ఞప్తి చేశారు.
*పోలీస్, ఎక్సైజు అధికారులకు ఎమ్మెల్యే సూచన
తిరువూరు నియోజకవర్గంలో గొలుసు మద్యం దుకాణాలను సమూలంగా నిర్మూలించడానికి ఎక్సైజు, పోలీసు శాఖ ఆద్వర్యంలో సంయుక్త దాడులు నిర్వహించాలని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి సూచించారు. స్థానిక పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం ఆయన సర్కిల్ పరిదిలోని ఎక్సైజు, పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
*ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు
తిరువూరులో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు సిఐ ప్రసన్నవీరయ్య గౌడ్ తెలిపారు. శుక్రవారం ఆయన పట్టణంలో ఎస్సైలు సుబ్రహ్మణ్యం,అవినాష్ లు కలిసి ట్రాఫిక్ సమస్యను పర్యవేక్షిస్తూ వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్దంగా వాహనాలు నడుపుతున్న చోదకులకు కౌన్సిలింగ్ చేశారు.
*రేషన్ కార్డు పై నాలుగు రకాల సేవలు నిలిపివేత
మీసేవ కేంద్రాల ద్వారా అందిస్తున్న నాలుగు రకాల సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వ్యులు జరీ చేసినట్లు తహసిల్దారు పద్మజ శుక్రవారం తెలిపారు. రేషన్ కార్డులో పేర్లు చేర్చడం, తొలగించడం బదిలీ చేయడం మైగ్రేషన్ వంటి సేవలను ప్రస్తుతం నిలిపివేస్తున్నట్లు చెప్పారు,. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు అందేవరకు రేషన్ కార్డుకు సంబంధించి పైనుదహరించిన నాలుగు రకాల సేవలను నిర్వహించకూడదని మీసేవ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు.
*సదసును సద్వినియోగం చేసుకోండి
గ్రామా సచివాలయ ఉద్యోగులకు సంనద్దులవుతున్న అభ్యర్ధులు స్పరీక్ష సమయంలో పాటించాల్సిన మెలకువలపై స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈనెల 14న మధ్యాహం మూడు గంటలకు నిర్వహిస్తున్న అవగాహనా సదస్సును సద్వినియోగం చేసుకోవాలని జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. హరికృష్ణ సూచించారు. అవగాహనా సదస్సుకు సంబందించిన కరపత్రాలును స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఆవిష్కరించారు.
*వరలక్ష్మికి పూజలు
తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు మండలాల్లో శ్రవణ శుక్రవారం సంధర్హంగా మండలాల పరిధిలోని అమ్మవార్ల ఆలయాలు అన్ని కిటకిటలడాయి. భక్తులు ఆలయాలలోని అమ్మవార్ల విగ్రహాలకు పూజలు నిర్వహించి, కుంకుమ పూజలు చేశారు. పలువురు మహిళలు తమ గృహాలలో వరలక్ష్మి వ్రతాలూ నిర్వహించి లక్ష్మీదేవి అమ్మవారిని భక్తితో కొలిచారు. పిండి వంటలు తాయారు చేసి అమ్మవారికి సమర్పించారు.
*తిరువూరు నాగార్జునలో స్వాగాతోతసవం
తిరువూరు నాగార్జున జూనియర్ కళాశాలలో విద్యార్ధులకు స్వగతం పలుకుతూ సీనియర్లు ఆద్వర్యంలో శుక్రవారం నిర్వహించిన స్వాగాతోత్సవం ఆద్యంతం సందడిగా సాగింది. వక్తల ప్రసంగాల అనంతరం విద్యార్ధుల ఆద్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సినీ ,దేశభక్తి, జానపద గీతాలకు అనుగుణంగా నృత్యాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. విద్యార్ధినులు గీతాలు ఆలపించి అలరించారు.
*రహదారి సమస్య పరిష్కరించాలని వినతి
విస్సన్నపేటలో అద్వానంగా మారిన రహదారి సమస్యను పరిష్కరించాలని పలువురు ఉపాద్యాయులు విశ్రాంత ఉద్యోగులు శుక్రవారం తహసిల్దారు బీ.మురళీకృష్ణ వినతి పత్రం అందజేశారు. స్థానిక ప్రధాన రహదారి నుంచి సిఎస్ఐ టౌన్ చర్చి మీదుగా రెడ్డిగూడెం రోడ్డుకు వెళ్ళే రహదారి అద్వానంగా మారి, రాకపోకలకు సమస్యలు ఎదురవుతున్నయన్నారు.
*పాడి రైతులకు బోనస్ పంపిణి
గంపలగూడెం మండలంలోని పలు గ్రామాల్లో పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకార సంఘాల్లో పాలు విక్రయించిన రైతులకు 2018-19 ఆర్ధిక సంవత్సరంకు సంబందించిన మూడో విడతగా రూ. 6లక్షలు బోనస్ సొమ్ములను శుక్రవారం తిరువూరు పాల శీతల కేంద్రం మేనేజర్ వింజమూరి ఉదయ కిరణ్ పంపిణీ చేశారు. అమ్మిరెడ్డిగూడెంలో 186 మంది రైతులకు రూ. 3,27,334 అనుముల్లనలో 120 మందికి 2,11,981 గొసవీడు శివారు గంగాదేవి పాడు అరవై మంది రైతులకు రూ. 63,500 పంపిణీ చేశారు.
*సాంప్రదాయ వస్త్రధారణలో అలరించిన బాలికలు
గంపలగూడెం మండలం పెదకోమిర శివారు తోటమూలలో విశిష్ట జూనియర్ డిగ్రీ కళాశాలలో శ్రావణ మాసం సందర్భంగా శుక్రవారం ఇంటర్, డిగ్రీ చదివే బాలికలకు సంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహించారు. కళాశాలకు చెందిన బాలికలు సంప్రదాయంగా చీరెలు, ఓణీలు ధరించి సందడి చేశారు. విజేతలకు కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపల్స్ బహుమతులు ప్రధానం చేశారు.
tiruvuru news - tiruvuru kaburlu - tvrnews - krishna district news tiruvuru news tiruvuru kaburlu tvr news - tvrnews.com - తిరువూరు ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆర్ఐ-తిరువూరు కబుర్లు–08/10 - tiruvuru rtc bus stand tiruvuru rtc in deep losses

అసమర్థ నాయకుల్లారా…తిరువూరులో ప్రభుత్వ శాఖలను నిర్వీర్యం చేశారుగా?

“అంగట్లో అన్నీ ఉన్నా…..అల్లుడి నోట్లో శని” సామెతగా తిరువూరు నియోజకవర్గంలో అన్ని వనరులు ఉన్నప్పటికీ ప్రజలకు అవి ఏవీ అందుబాటులోకి రావడం లేదు. సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడంతో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనితీరు స్తంభించింది. కొన్ని ప్రభుత్వ శాఖల్లో పనితీరు మరీ అధ్వాన్నంగా మారింది. కొన్ని శాఖల్లో అధికారులు, ఉద్యోగస్థులే లేకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి.

* తిరువూరు ఆర్ అండ్ బీ కార్యాలయం ఒకప్పుడు రాష్ట్రంలో ఆదర్శంగా ఉండేది. అక్కడ డీఈ పోస్టు ఖాళీ అయ్యి ఏడాదిన్నర గడుస్తునప్పటికి పట్టించుకునే ప్రతినిధే కరువయ్యాడు. ముగ్గురు ఏఈలతో పాటు, మరో పదిమంది ఉద్యోగులు లేకపోవడంతో ఈ కార్యాలయంలో పనులు స్తంభించాయి. కార్యాలయం దాదాపుగా మూతపడింది.

* రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న తిరువూరు ఆర్టీసీ బస్సు డిపో ఒకప్పుడు ఆదాయంలో ఉభయరాష్ట్రాల్లో ముందు ఉండేది. గత మూడు సంవత్సరాల నుండి ఈ డిపోలో పరిస్థితులు దారుణంగా మారాయి. హైదరాబాద్‌కు పగటి సమయాల్లో తిరుగుతున్న ఐదు బస్సులను రద్దు చేసినప్పటికీ పట్టించుకునే వాడే లేడు. తిరువూరు నుండి వివిధ ప్రాంతాలకు ఎక్స్ ప్రెస్ సర్వీసులను పెంచమని, హైదరాబాద్‌కు ఒక ఏసీ బస్సు ఏర్పాటు చేయమని, విజయవాడకు నాన్‌స్టాప్ బస్సులను నడపమని ప్రయాణీకులు మొత్తుకుంటున్నప్పటికి అవన్నీ బధిర శంఖారావాలే అయ్యాయి.

* తిరువూరు పట్టణానికి రాష్ట్రంలోనే ఏ పట్టణానికి లేని విధంగా మంచినీటి వనరులు ఉన్నాయి. తిరువూరు చుట్టూ ఏడు వాగులు, ఏడు చెరువులు ఉన్నాయి. తిరువూరు పట్టణం చుట్టూ ఉన్న సాగర్ మేజర్ కాల్వ జోన్-2 పరిధిలో ఉంది. జోన్-2లో ఏడాదిలో తొమ్మిది నెలల పాటు సాగర్ జలాలు వదులుతున్నారు. అయినప్పటికీ తిరువూరు ప్రజలకు మంచినీటి దరిద్రం వదలడం లేదు. రెండు రోజులకు ఓసారి మొక్కుబడిగా మంచినీరు వదులుతున్నారు. చుట్టూ నీళ్ళు సమృద్ధిగా ఉన్నప్పటికీ…ఎన్నికైన ప్రజాప్రతినిధులకు, అనధికారికంగా పెత్తనం చెలాయిస్తున్న అధికార పార్టీ నాయకులకు చిత్తశుద్ది లేకపోవడంతో తిరువూరు ప్రజలకు వర్షాకాలంలో కూడా మంచినీటి కష్టాలు తప్పడం లేదు.

* తిరువూరు ప్రాంతంలో చెరువులను, పంట కాలువలను మరమ్మత్తులు చేసే విధంగా యాభై ఏళ్ల క్రితమే ఏర్పాటైన ఇరిగేషన్ కార్యాలయం ఎప్పుడూ మూతబడే ఉంటుంది.

* స్థానిక అధికార పార్టీ నాయకుల అసమర్థతకు మరో మచ్చుతునక – తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం. రెండు సంవత్సరాల నుండి ఈ కమిటీకి పూర్తి స్థాయి కార్యదర్శి లేడు. పాలకవర్గం పదవీకాలం ముగిసి సంవత్సరం దాటుతున్నప్పటికి కనీసం నూతన పాలకవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు.

* తిరువూరు మున్సిపాల్టీలో నెలకొన్న అవినీతి రాష్ట్ర స్థాయిలోనే సంచలనం సృష్టించింది. ఇప్పటికే మున్సిపాల్టీ ఏర్పడిన నాలుగేళ్ళలో నలుగురు కమీషనర్లు మారారు. శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ ఏఈలు, కమీషనర్లను లెక్క చేయకుండా అధికార పార్టీ నేతల అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే కొత్తగా వచ్చిన యువ కమీషనర్ చురుగ్గా వ్యవహరించి గాడి తప్పిన పరిపాలనను సరిచేయవలసి ఉన్నది.

* తిరువూరులో ఉన్న పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ కార్యాలయాలు కళ తప్పాయి. తగిన పర్యవేక్షణ లేకపోవడంతో ఇవీ మూతపడే ఉంటున్నాయి.

* ఎన్నో ఏళ్ల పోరాటం తరువాత కోట్ల రూపాయల ఖర్చుతో తిరువూరులో స్టేడియం నిర్మించారు. ఒక్క షటిల్ కోర్టు తప్ప ఈ స్టేడియం దేనికీ పనికిరావడం లేదు. సరైన సిబ్బంది లేరు. సరైన లైట్లు కూడా ఏర్పాటు చేయలేదు. స్టేడియంలో సౌకర్యాల గురించి ఎవరికి వారే యమునకు తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

* విద్యుత్ శాఖ పనితీరు అధ్వానంగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గత నెలరోజుల నుండి రోజుకు ఎనిమిది గంటలపాటు విద్యుత్ కోతలు విధిస్తున్నప్పటికి ఒక్క నాయకుడికి కూడా ఈ విషయం పట్ల స్పందించాలనే ఆలోచన రాకపోవడం తిరువూరు ప్రజల దురదృష్టం.
tvrnews.com
tvrnews.com

tvrnews.com
tvrnews.com tiruvuru kaburlu tiruvuru news stadidum
tvrnews.com tiruvuru kaburlu news
tvrnews.com
tvrnews.com
tvrnews.com tiruvuru kaburlu news
tvrnews.com tiruvuru kaburlu news
ఇప్పటికైనా నాయకులు స్పందించి తిరువూరులో ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగుపరచాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.

తిరువూరు ఆర్టీసీ బస్ డిపోపై ప్రయాణీకుల ఆగ్రహం

తిరువూరు ఆర్టీసీ బస్ డిపోలో నెలకొని ఉన్న అధ్వాన పరిస్టితుల గురించి TVRNEWS.COMలో గురువారం నాడు ఇచ్చిన వార్తకు తిరువూరు ప్రాంత ప్రజల నుండి మంచి స్పందన లభించింది. FACEBOOKలో దీనిని ఇప్పటి వరకు 5వేల మందికి పైగా చదివారు. తమ స్పందనను తెలియజేశారు. WhatsAppలో కూడా కొంతమంది స్పందించారు. తిరువూరు ఆర్టీసీ బస్ డిపో నుండి మరికొన్ని సర్వీసులను నడపాలని, ఇంకొన్ని సౌకర్యాలు కల్పించాలని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రక్షణనిధి, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి స్వామిదాస్‌లను ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని సర్వీసులు గురించి ప్రయాణీకులు కోరుతున్నారు.

* తిరువూరు నుండి నాగాయలంక పునరుద్ధరించాలి.
* గతంలో జిల్లాలోనే అత్యంత దూరం నడిచే పల్లెవెలుగు సర్వీసుగా గుర్తింపు పొందిన తిరువూరు నుండి వయా ఎ.కొండూరు, రేపూడి, తూర్పుమాధవరం మీదుగా మచిలీపట్నం వెళ్ళే పాసింజరు సర్వీసును పునరుద్దరించాలి.
* తిరువూరు నుండి వయా నూజివీడు మీదుగా విజయవాడ గతంలో నిర్వహించిన ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు మంచి ఆదరణ లభించింది. ఈ సర్వీసులను పునరుద్దరించాలి.
* విజయవాడ నుండి రాత్రి ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు ప్రతి అరగంటకు తిరువూరు వచ్చే విధంగా ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడపాలి.
* విజయవాడ నుండి భద్రాచలం వెళ్ళే ఎక్స్‌ప్రెస్ సర్వీసులను మైలవరంలో మాత్రమే ఆగుతున్నాయి. మరికొన్ని నాన్‌స్టాప్‌గా తిరువూరు వస్తున్నాయి. తిరువూరు బస్సులు కూడా ఇదే విధంగా నడపాలి. ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తూ అన్ని గ్రామాల్లో ఆపే పద్దతికి స్వస్తి చెప్పాలి.
* తిరువూరు డిపో నుంచి నడిచే బస్సు సర్వీసులన్నీ అద్వానంగా ఉంటున్నాయి. శుభ్రత పాటించడంలేదు. సూపర్ లగ్జరీల సైతం కంపు కొడుతున్నాయి.
* తక్షణమే ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి తిరువూరు ఆర్టీసీ బస్ డిపో నుండి ప్రయాణీకులు కోరుతున్న సర్వీసులను ప్రారంభించాలని కోరుతున్నారు.

తిరువూరు నేతల చేతగానితనానికి నిదర్శనం ఆర్టీసీ బస్ డిపో

‘పిల్లి చేతకానిదైతే..ఎలుక ఎక్కిరించిందనే’ సామెత తిరువూరు ఆర్టీసీ బస్ డిపోలో స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోనే పురాతనమైన డిపోలలో ఒకటైన తిరువూరు డిపోలో సర్వీసుల నిర్వహణ అధ్వానంగా ఉంది. ఈ డిపో ప్రత్యేకత ఏమిటంటే..బాగా నడుస్తున్న సర్వీసులను రద్దు చేస్తూ ఉంటారు. ప్రయాణీకులు కోరిన సర్వీసులు మాత్రం ఒక్కటి కూడా నడపరు. ఇదంతా స్థానిక ప్రజాప్రతినిధులు చేతగాని తనమేనని ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు. గతంలో హైదరాబాద్ కు పగటి సమయాల్లో నడుపుతున్న ఐదు సర్వీసులను అర్దాంతరంగా రద్దు చేసినప్పటికీ అడిగే నాదుడే లేడు. భద్రాచలం రూట్లో తిరుగుతున్న మూడు ఎక్స్ ప్రెస్ సర్వీసులను రద్దు చేసారు. జిల్లా కేంద్రం అయిన బందరుకు గతంలో ఐదు సర్వీసులు నడిపేవారు. ప్రస్తుతం రెండే సర్వీసులు నడుపుతున్నారు. ఎవరూ నోరు మెదపక పోవడంతో తిరువూరు ఆర్టీసీ డిపోలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక్క తిరువూరు నుండే వివిధ ప్రాంతాలకు 500 ఆటోలు తిరుగుతున్నాయి. పల్లెవెలుగు సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణీకులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. తిరువూరు డిపోలో ఒకప్పుడు అరవై వరకు పల్లెటూళ్ళకు వెళ్ళే సర్వీసులు ఉండేవి. ఇప్పుడు 36 సర్వీసులు మాత్రమే ఉన్నాయి. వీటిలో పది సర్వీసులు ప్రైవేటువి. ఈ డిపో నుండి మొత్తం 14 ఎక్స్ ప్రెస్ సర్వీసులు ఉండగా వాటిలో 9 సర్వీసులు ప్రైవేటువి. మొత్తం 16 సూపర్ లగ్జరీ లు ఉండగా వాటిలో రెండు ప్రైవేట్ ఆద్వర్యంలో నడుపుతున్నారు. ఈ డిపోలో కేవలం రెండే అల్ట్రా డీలక్స్ బస్సులు మాత్రమే నడుపుతున్నారు. ఒక దశలో తిరువూరు ఆర్టీసీ బస్సు డిపోను మూసివేయడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు డిపోల నుండి ప్రతి అరగంటకు ఒక ఎక్స్ ప్రెస్ సర్వీసు తిరువూరు మీదుగా నడుస్తున్నప్పటికీ ఇక్కడ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. విజయవాడకు ట్రాఫిక్ కు తగిన విధంగా సర్వీసులు నడపడంలేదు. తిరువూరు ఆర్టీసీ బస్ డిపో నుండి ఈ దిగువ సర్వీసులు నడపాలని ఇక్కడి ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.
*పగటి సమయాల్లో హైదరాబాద్ రూట్ లో రద్దు చేసిన బస్ సర్వీసులను పునరుద్దరిచాలి.
*రాత్రి సమయాల్లో ఏసీ ఇంద్ర బస్సును హైదరాబాద్ కు నడపాలి.
*విజయవాడకు నాన్ స్టాప్ బస్సులు, సింగిల్ స్టాప్ బస్సులను నడపాలి.
*గతంలో రద్దు చేసిన వైజాగ్, శ్రీశైలం, అన్నవరం, నాగార్జున సాగర్, కాకినాడ తదితర ప్రాంతాలకు బస్సు సర్వీసులను పునరుద్దరించాలి.
*భద్రాచలం, మచిలీపట్నం రూట్లలో ఎక్స్ ప్రెస్ సర్వీసులను పెంచాలి.
*ప్రతి పల్లెటూరుకు పల్లెవేలుగు బస్సులను గంటకు ఒకటి నడపాలి.
*తల్లాడ, తోటమూల, మైలవరం , సత్తుపల్లి తదితర ప్రాంతాలకు ప్రతి నిత్యం సర్వీసులను నడపాలి.
*మధిర రైల్వే స్టేషన్ కు వచ్చే రైళ్ళ రాకపోకల సమయాలకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడపాలి.
*స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయంలో శ్రద్ధ వహించి తిరువూరు ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి బస్ సర్వీసులు ప్రయాణికుల అవసరాల అనుగుణంగా బస్సు సర్వీసులు నడిపెవిధంగా చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.

తిరువూరులో “వీరప్పన్”లు

TVRNEWS.COM
తిరువూరులో కొందరు ప్రజాప్రతినిధులు ప్రకృతి ప్రసాదించిన వనరులను పేదలకు అందుబాటులో లేకుండా దోచుకుతింటున్నారు. అధికార పార్టీ పేరు చెప్పి అడ్డగోలుగా కోట్లు కూడబెడుతున్నారు. జిల్లాలో విజయవాడ తరువాత ఇసుక మాఫియా తిరువూరులోనే భారీగా పడగ విప్పింది. తెలంగాణా సరిహద్దులో ఉండటంతో తిరువూరు నుండి ఇసుకు అక్రమ రవాణా చాలా సులభతరమవుతోంది. తిరువూరు, గంపలగూడెం మండలాల నుండి ప్రతినిత్యం వందలాది ట్రాక్టర్‌లు రాత్రింబవళ్లు సరిహద్దులో ఉన్న తెలంగాణాకు తరలిస్తున్నారు. తెలంగాణా సరిహద్దు గ్రామాల్లో నిల్వ చేసి హైదరాబాద్‌కు లక్షలాది రూపాయాలు అడ్డగోలుగా దోచుకుతింటున్నారు. సామాన్యుడు ఒక బాత్రూం కట్టుకోవాలన్నా, తన భవనానికి మరమ్మత్తు చేసుకోవాలన్నా ఒక ట్రాక్టర్ ఇసుక దొరకడం చాలా కష్టంగా ఉంది. దొరికినా ఒక్కో ట్రాక్టర్‌కు రూ.2000ల వరకు వసూలు చేస్తున్నారు. గానుగపాడు, చింతలపాడు, ముష్టికుంట్ల, వాముకుంట్ల, వినగడప తదితర ప్రాంతాల్లోని కట్టలేరు, పడమటి వాగుల నుండి ఇసుక బహిరంగంగానే రవాణా అవుతున్నప్పటికీ అధికారులు మామూళ్ల మత్తులో మునిగి ఇసుక తరలిస్తున్న ప్రజా ప్రతినిధులకు అండదండలు అందిస్తున్నారు. ఒక్క గానుగపాడు నుండే రోజుకు 50 ట్రాక్టర్లకు పైగా పొరుగునే ఉన్న ఖమ్మం జిల్లాకు తరలివెళ్తోంది. తిరువూరు పట్టణం సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో ఇసుకను నిల్వ చేసి బహిరంగంగానే సరిహద్దుల్లో చెక్‌పోస్టులు దాటించి తరలిస్తున్నారు. పైగా అధికారుల నిఘా సరిగా లేకపోవడంతో ఇసుక అక్రమ రవాణా తిరువూరు, గంపలగూడెం మండలాల్లో అడ్డగోలుగా సాగుతోంది.
TVRNEWS.COM
*** కలెక్టర్ గారు…పట్టుకోండి చూద్దాం!
జిల్లాకు నూతనంగా వచ్చిన కలెక్టర్ బి.లక్ష్మికాంతం జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను ఉక్కు పాదంతో అణచివేస్తామని, అక్రమ రవాణాదారులపై పీడీ యాక్టులు ప్రయోగిస్తామని ప్రకటించారు. ఇసుక రవాణాపై 24 గంటల పాటు నిఘా ఉంచామని తెలిపారు. కలెక్టర్ ప్రకటన ప్రభావం తిరువూరులో ఏ మాత్రం పనిచేయడం లేదు. తిరువూరు ప్రాంతంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను నిరోధించాలని సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలఒటే ఫోన్ నెంబర్లు: 0866-2474700, 2474701, 2474702.
TVRNEWS.COM

తిరువూరుకు రైలు సౌకర్యం–50 ఏళ్లుగా ఊరిస్తున్న కేంద్ర ప్రభుత్వం

మాజీ కేంద్ర మంత్రి డా.కే.ఎల్.రావు తాను విజయవాడ ఎంపీగా, కేంద్రంలో కీలకమైన మంత్రిగా ఉన్న సమయంలో పశ్చిమ కృష్ణా అభివృద్ధికి ముందుచూపుతో భారీ ప్రాజెక్టులను రూపొందించారు. తిరువూరుతో పాటు పశ్చిమ కృష్ణాలో నేడు రైతులు పచ్చగా ఉంటున్నారంటే డా.కెఎల్.రావు చలవే. సాగర్ కాలువలు తవ్వించిన పుణ్యం ఆయనదే. రాబోయే మూడు, నాలుగు తరాల ప్రజల గురించి ఆలోచించి ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఆరోజుల్లోనే కె.ఎల్.రావు మంచి ప్రాజెక్టులు నిర్మించారు. తిరువూరులో ఏడు చెరువులకు నీరు వచ్చే విధంగా రాకట్ సప్లై ఛానల్‌ను, కొకిలంపాడు వద్ద కట్టలేరుపై ప్రాజెక్టును కె.ఎల్.రావు నిర్మింపజేశారు. తిరువూరు నియోజకవర్గ ప్రజలకు కె.ఎల్.రావు దేవుడు వంటి వాడు. ఆయన గురించి మరోసారి సవివరంగా తెలుసుకుందాం….
*** నేడు మూడు తరాలకు సంపాదించుకునే నేతలు
డా.కె.ఎల్.రావు నిరాడంబర జీవితాన్ని నేటి రాజకీయ నేతలు అవగాహన చేసుకోవాలి. అధికారంలోకి రాగానే మూడు తరాలకు సరిపడా పోగుచేసుకుందామనే ఆలోచన నేటి నేతలది. డా.కె.ఎల్.రావు తిరువూరు, మైలవరం నియోజకవర్గ ప్రజలకు రైలు సౌకర్యం కల్పించడానికి 50ఏళ్ల క్రితమే ప్రణాళికలు వేశారు. కొండపల్లి నుండి కొత్తగూడెం వరకు ఈ రెండు నియోజకవర్గాలను కలుపుతూ రైలు మార్గం నిర్మించాలని కె.ఎల్.రావు ఒక ప్రణాళిక రూపొందించి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి అందజేశారు. రైల్వేబోర్డు వద్ద ఈ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక ప్రాజెక్ట్ ఉంది. కొండపల్లి నుండి కొత్తగూడెంకు రైలు మార్గం నిర్మిస్తే దేశంలోని చాలా ప్రాంతాలకు బొగ్గు రవాణా తేలికగా జరుగుతుందని, ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన భద్రాచలంకు భక్తులు రావడం సులభతరం అవుతుందని డా.కె.ఎల్.రావు ప్రకటించారు. రెండవ దశలో కొత్తగూడెం నుండి ఛత్తీస్‌ఘడ్‌లో ఉన్న కిరండల్ బొగ్గు గనుల ప్రాంతానికి ఈ రైలు మార్గాన్ని పొడిగిస్తే దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాల మధ్య దగ్గర రవాణా మార్గం ఏర్పడుతుందని దేశంలో ఉన్న అన్ని కర్మాగారాలకు బొగ్గు రవాణా సులభతరం చేయవచ్చని డా.కె.ఎల్.రావు ప్రతిపాదించారు. వాస్తవానికి దేశంలో ఉన్న మిగిలిన రైలుప్రాజెక్టుల కన్నా కొండపల్లి-కొత్తగూడెం-కిరండల్ రైలు మార్గం నిర్మాణం చాలా ప్రాధాన్యత కలిగినదని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో గుర్తించింది.
*** కేవలం నాయకత్వ లోపమే
డా.కె.ఎల్.రావు అనంతరం ఎంపీలుగా వచ్చిన గోడే మురహరి, చెన్నుపాటి విద్య, వడ్డే శోభనాద్రీశ్వరరావు, పర్వతనేని ఉపేంద్ర, గద్దె రామ్మోహన్, లగడపాటి రాజగోపాల్ తదితరులతో పాటు ప్రస్తుత ఎంపి కేశినేని నాని సైతం ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపలేదు. మార్చి 2016 రైల్వే ఆఖరి బడ్జెట్‌లో ఈ ప్రాజెక్ట్ సర్వేకు బిచ్చం మాదిరి కోటి రూపాయలు మొక్కుబడిగా కేటాయించారు. మొన్న బడ్జెట్‌లో అసలు కేటాయింపులే ఎత్తేశారు.
*** మంత్రి దేవినేని ఉమాకు అవగాహనే లేదు
తాను అపర భగీరథుడినంటూ సొంత జబ్బలు చరుచుకునే మైలవరం శాసనసభ్యుడు, మంత్రి దేవినేని ఉమాకు ఈ రైలు ప్రాజెక్టుపై అవగాహన ఉన్నట్లు కనిపించదు. కనీసం ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన ఎప్పుడూ ప్రస్తావించిన సందర్భం లేదు. మాజీ మంత్రి చనుమోలు వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ కొల్లి పావన వీరరాఘవరావు, మాజీ ఎమ్మెల్యే కోమటి భాస్కరరావు తదితరులు ఈ రైలు ప్రాజెక్ట్ కోసం చాలాసార్లు ముమ్మర ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్న తిరువూరుకు చెందిన సగ్గుర్తి శ్రీనివాసరావుకు ఈ ప్రాజెక్టుపై పూర్తి అవగాహన ఉంది. ఆ పార్టీ తరఫున అడపాదడపా ప్రకటనలు ఇవ్వడం తప్ప ఈ ప్రాజెక్ట్ కోసం గట్టిగా ప్రయత్నించిన దాఖలాలు లేవు. గతం ఎలా ఉన్నప్పటికీ కొండపల్లి-కొత్తగూడెం రైలు మార్గం నిర్మాణం కోసం ఈ ప్రాంత ప్రజలు పార్టీలకు అతీతంగా ఉద్యమబాట పట్టకపోతే మరో రెండు తరాలకు కూడా తిరువూరు, మైలవరం ప్రాంతానికి రైలు కూత వినిపించే అవకాశం కనుచూపు మేర కనిపించడం లేదు.—కిలారు ముద్దుకృష్ణ.
tvrnews.com-TiruvuruNews