తిరువూరు అధ్యాపకుడికి తానా అవార్డు

స్థానిక తిరువూరు శ్రీ వాహిని ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న తేజస్వికి కీబోర్డ్ ప్రదర్శనలో ద్వితీయ స్థానం సంపాదించుకున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, ఇతర 100 తెలుగు సంస్థలు కలిసి నిర్వహించిన ఆన్లైన్ అంతర్జాతీయ తెలుగు కల్చరల్ ఫెస్ట్ 2020 పోటీలలో భాగంగా నాదామృతం – కీబోర్డ్ విభాగంలో ప్రదర్శించగా గత రాత్రి విజేతలను ఆన్లైన్లో ప్రకటించారు. తేజస్వి కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ, సాయంత్రం సమయంలో విద్యార్థులకు కీబోర్డ్ పై ఆన్లైన్ లో శిక్షణ కూడా ఇస్తుంటారు.
తిరువూరు అధ్యాపకుడికి తానా అవార్డు

మన కలల సౌధం కూలిందన్నా!

Tiruvuru Junior College Dismantled Destroyed And Shattered-Tiruvuru News Tiruvuru Kaburlu Tiruvuru Krishna District News
గత 50 సంవత్సరాల నుండి లక్షలాది మంది విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకున్న కలల సౌధం తిరువూరులో కాలగర్భంలో కలిసిపోయింది. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలో 1969వ సంవత్సరంలో అప్పటి వరకు ఉన్న హైస్కూళ్లను ప్రభుత్వ జూనియర్ కళాశాలగా అభివృద్ధి చేశారు. జూనియర్ కళాశాలగా మారక ముందు కూడా వేలాది మంది విద్యార్థులు ఇక్కడి హైస్కూల్లోని ఈ భవనాల్లో విద్యనభ్యసించారు. 1969లో అప్పటి వరకు ప్రధానోపాధ్యాయులుగా ఉన్న గాడేపల్లి దక్షిణామూర్తిశాస్త్రి (జీ.డీ.ఎం.శాస్త్రి) హయాంలో జూనియర్ కళాశాల ఏర్పడింది. మొదటి ప్రిన్సిపాల్‌గా సివీ.నరసావదానులు నియమితులయ్యారు. అనంతరం సీవీ పూర్ణచంద్రరావు, కే.ధర్మారావు, వెంకట్ రెడ్డి, ఆనందమూర్తి, బోటని నరసింహారావు తదితరులు ఈ కళాశాల ప్రిన్సిపాళ్లుగా పని చేసి తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మంచి గుర్తింపు తెచ్చారు. ప్రస్తుతం కనుమరుగైన ఈ భవనాల్లో తమ బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకుందాం – అందరం కలిసి కళాశాల ఏర్పడి 50ఏళ్లు అయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకోవాలనేది చాలా మంది పూర్వ విద్యార్థుల కోరిక. ఈ కళాశాల తొలి విద్యార్థి సంఘం అధ్యక్షుడు కవుటూరి వినయకుమార్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రముఖ న్యాయవాదిగా రాణిస్తున్నారు. ఇక్కడే విద్యనభ్యసించిన పసుపులేటి వెంకటేశ్వరరావు ఇటీవలే ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమీషనరుగా పదవీవిరమణ చేశారు. ఇక్కడే చదువుకున్న బుద్ధారపు వెంకటేశ్వరరావు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్(క్యాట్) చైర్మన్‌గా ఇటీవల వరకు పనిచేశారు. ఇటువంటి ప్రముఖులు ఇంకా ఎందఱో ఉన్నారు. వీరంతా తిరువూరు హైస్కూల్, జూనియర్ కళాశాల పూర్వ విద్యార్ధుల సమ్మేళనాన్ని నిర్వహించాలని ఆసక్తిగా ఉన్నారు. త్వరలోనే హైదరాబాద్‌లో ఒక తొలి సమావేశాన్ని నిర్వహించి తిరువూరులో పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి శ్రీకారం చుట్టాలని అలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి మీ అభిప్రాయలను కూడా పంచుకోండి. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్. ఈమెయిల్:kilarumuddukrishna@yahoo.com, ఫోన్ నంబరు-9440231118. ఈ క్రింది పేపర్ కట్టింగ్ కూడా తిలకించండి.
Tiruvuru Junior College Dismantled Destroyed And Shattered-Tiruvuru News Tiruvuru Kaburlu Tiruvuru Krishna District News
Tiruvuru Junior College Dismantled Destroyed And Shattered-Tiruvuru News Tiruvuru Kaburlu Tiruvuru Krishna District News
Tiruvuru Junior College Dismantled Destroyed And Shattered-Tiruvuru News Tiruvuru Kaburlu Tiruvuru Krishna District News
Tiruvuru Junior College Dismantled Destroyed And Shattered-Tiruvuru News Tiruvuru Kaburlu Tiruvuru Krishna District News
Tiruvuru Junior College Dismantled Destroyed And Shattered-Tiruvuru News Tiruvuru Kaburlu Tiruvuru Krishna District News
Tiruvuru Junior College Dismantled Destroyed And Shattered-Tiruvuru News Tiruvuru Kaburlu Tiruvuru Krishna District News
Tiruvuru Junior College Dismantled Destroyed And Shattered-Tiruvuru News Tiruvuru Kaburlu Tiruvuru Krishna District News
Tiruvuru Junior College Dismantled Destroyed And Shattered-Tiruvuru News Tiruvuru Kaburlu Tiruvuru Krishna District News
Tiruvuru Junior College Dismantled Destroyed And Shattered-Tiruvuru News Tiruvuru Kaburlu Tiruvuru Krishna District News
Tiruvuru Junior College Dismantled Destroyed And Shattered-Tiruvuru News Tiruvuru Kaburlu Tiruvuru Krishna District News
Tiruvuru Junior College Dismantled Destroyed And Shattered-Tiruvuru News Tiruvuru Kaburlu Tiruvuru Krishna District News
Tiruvuru Junior College Dismantled Destroyed And Shattered-Tiruvuru News Tiruvuru Kaburlu Tiruvuru Krishna District News
Tiruvuru Junior College Dismantled Destroyed And Shattered-Tiruvuru News Tiruvuru Kaburlu Tiruvuru Krishna District News
Tiruvuru Junior College Dismantled Destroyed And Shattered-Tiruvuru News Tiruvuru Kaburlu Tiruvuru Krishna District News

PRTU రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా తిరువూరు ఉపాధ్యాయులు కిలారు నగేష్

ఈ రోజు కాకినాడలో జరిగిన PRTU AP రాష్ట్ర కార్యవర్గ సమావేశం మరియు కార్యవర్గ ఎన్నికల్లో తిరువూరు మండలం నుండి ఇద్దరు ఉపాధ్యాయులను ఎన్నుకున్నారు. PRTU AP రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా కిలారు నగేష్, PRTU AP రాష్ట్ర కార్యదర్శిగా వాకా వెంకటేశ్వరరావులు ఎన్నికయినట్లు తిరువూరు PRTU మండల అధ్యక్షా కార్యదర్శులు పీవీఎన్.ప్రసాద్, పీవీరావులు ఓ ప్రకటనలో తెలిపారు.

రాజా(చంటి) నీకు జోహార్లు!


తిరువురు ప్రజలకు సుపరిచితుడు, అందరికీ తలలో నాలుకగా సరదాగా మాట్లాడే స్నేహితుడు, అందరినీ అభిమానంగా పలకరించే ఆత్మీయుడు దాసరి చంద్రశేఖర్ అలియాస్ రాజా అలియాస్ చంటి శుక్రవారం రాత్రి 9గంటలకు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. తిరువూరు పోలీసు స్టేషన్ పరిసరాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రాజా సుపరిచితుడు. ప్రభుత్వాధికారులకు కూడా రాజా ఆత్మీయుడిగా మెలిగేవాడు. మధుమేహంతో బాధపడుతున్న రాజాను బెజవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి కుటుంబసభ్యులు కొంతకాలంగా చికిత్సను అందిస్తున్నారు. శుక్రవారం నాడు అపస్మారక స్థితికి చేరుకున్న అతను ప్రాణాలు విడిచాడు. అతడి మృతి పట్ల తిరువూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం నాడు చంటి అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.


తిరువూరు మున్సిపల్ అధికారులకు కలెక్టర్ వార్నింగ్


తిరువూరులో జిల్లా కలెక్టర్ బీ.లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో సోమవారం నాడు స్థానిక బాలికల పాఠశాలలో నిర్వహించిన “మీకోసం” కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుండి ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎక్కువ మంది తమకు పక్కాగృహాలు, రేషన్ కార్డులు, పాస్ పుస్తకాలు, పింఛన్లు మంజూరు చేయమని వినతిపత్రాలు అందజేశారు. తిరువూరు పట్టణంలో పారిశుద్ధ్యం, డ్రైనేజి వ్యవస్థ, మంచినీటి సరఫరా సరిగా లేదని ప్రజల నుండి పెద్ద ఎత్తున కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. దీనిపైన స్పందించిన కలెక్టర్…వారం రోజుల వ్యవధిలో తిరువూరు మున్సిపాల్టీలో పరిస్థితులు మెరుగుపడకుంటే కమీషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ ఏఈలపై తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గంలో అన్ని సౌకర్యాలను మెరుగుపరుస్తామని, అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తామని తెలిపారు. వినగడప వద్ద ఇటీవల కట్లేరుపై వంతెన వరదలకు కొట్టుకుపోయిన వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మిస్తామని ప్రకటించారు. అభివృద్ధి పథంలో కృష్ణాజిల్లా దేశంలోనే తన సారథ్యంలో ముందంజలో ఉందని కలెక్టర్ ప్రకటించారు. మిగిలిన ఏ జిల్లాలకు అందనంత దూరంలో కృష్ణాజిల్లా అన్ని రంగాలలో ముందడుగులో దూసుకువెళ్తుందని కలెక్టర్ తెలిపారు. తిరువూరు నియోజకవర్గానికి తాను ఇక నుండి తరచుగా వస్తానని పనిచేయని అధికారుల గురించి తనకు ఫిర్యాదులు చేయాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ విజయకృష్ణన్, ఆర్డీవో రంగయ్య, జిల్లాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, స్వామిదాస్ దంపతులు, నాలుగు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రక్షణనిధి కార్యక్రమానికి హాజరై వెంటనే వెళ్లిపోయారు.

Krishna Collector Lakshmikantham in Tiruvuru Meekosam August 2018, Tiruvuru news, TVRNEWS, TVRNEWS.COM, Tiruvuru Kaburlu

తోసా ఆధ్వర్యంలో పుస్తక పంపిణీ కార్యక్రమం

నిమ్మల జగన్మోహనరావు-వీరరాఘవమ్మల కుమారుడు నిమ్మల శ్రీకుమార్ ఆర్థిక సహకారంతో తిరువూరు మండల గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో 1నుండి5వ తరగతి విద్యనభయ్సిస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు 6000 నోటు పుస్తకాలను తిరువూరు పూర్వ విద్యార్థుల సంఘం(తోసా) ఆధ్వర్యంలో అందజేశారు. అక్కపాలెం, మునుకుళ్ల, వావిలాల, వామకుంట్ల, అంజనేయపురం, జి.కొత్తూరు, చౌటపల్లి పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తోసా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు శ్రీకుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోసా ప్రతినిధులు కలకొండ రవికుమార్, కందుల రవికుమార్, వీరంకి చెన్నకేసవరావు, చెప్పల్లి కృష్ణంజనీయులు, కంభం శ్రీనివాసరావు, బెలకొండ నరసింహారావు, నాళ్లా శ్రవణ్, సాయి రాహుల్, నాళ్లా కాశి తదితరులు పాల్గొన్నారు.

అసమర్థ నాయకుల్లారా…తిరువూరులో ప్రభుత్వ శాఖలను నిర్వీర్యం చేశారుగా?

“అంగట్లో అన్నీ ఉన్నా…..అల్లుడి నోట్లో శని” సామెతగా తిరువూరు నియోజకవర్గంలో అన్ని వనరులు ఉన్నప్పటికీ ప్రజలకు అవి ఏవీ అందుబాటులోకి రావడం లేదు. సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడంతో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనితీరు స్తంభించింది. కొన్ని ప్రభుత్వ శాఖల్లో పనితీరు మరీ అధ్వాన్నంగా మారింది. కొన్ని శాఖల్లో అధికారులు, ఉద్యోగస్థులే లేకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి.

* తిరువూరు ఆర్ అండ్ బీ కార్యాలయం ఒకప్పుడు రాష్ట్రంలో ఆదర్శంగా ఉండేది. అక్కడ డీఈ పోస్టు ఖాళీ అయ్యి ఏడాదిన్నర గడుస్తునప్పటికి పట్టించుకునే ప్రతినిధే కరువయ్యాడు. ముగ్గురు ఏఈలతో పాటు, మరో పదిమంది ఉద్యోగులు లేకపోవడంతో ఈ కార్యాలయంలో పనులు స్తంభించాయి. కార్యాలయం దాదాపుగా మూతపడింది.

* రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న తిరువూరు ఆర్టీసీ బస్సు డిపో ఒకప్పుడు ఆదాయంలో ఉభయరాష్ట్రాల్లో ముందు ఉండేది. గత మూడు సంవత్సరాల నుండి ఈ డిపోలో పరిస్థితులు దారుణంగా మారాయి. హైదరాబాద్‌కు పగటి సమయాల్లో తిరుగుతున్న ఐదు బస్సులను రద్దు చేసినప్పటికీ పట్టించుకునే వాడే లేడు. తిరువూరు నుండి వివిధ ప్రాంతాలకు ఎక్స్ ప్రెస్ సర్వీసులను పెంచమని, హైదరాబాద్‌కు ఒక ఏసీ బస్సు ఏర్పాటు చేయమని, విజయవాడకు నాన్‌స్టాప్ బస్సులను నడపమని ప్రయాణీకులు మొత్తుకుంటున్నప్పటికి అవన్నీ బధిర శంఖారావాలే అయ్యాయి.

* తిరువూరు పట్టణానికి రాష్ట్రంలోనే ఏ పట్టణానికి లేని విధంగా మంచినీటి వనరులు ఉన్నాయి. తిరువూరు చుట్టూ ఏడు వాగులు, ఏడు చెరువులు ఉన్నాయి. తిరువూరు పట్టణం చుట్టూ ఉన్న సాగర్ మేజర్ కాల్వ జోన్-2 పరిధిలో ఉంది. జోన్-2లో ఏడాదిలో తొమ్మిది నెలల పాటు సాగర్ జలాలు వదులుతున్నారు. అయినప్పటికీ తిరువూరు ప్రజలకు మంచినీటి దరిద్రం వదలడం లేదు. రెండు రోజులకు ఓసారి మొక్కుబడిగా మంచినీరు వదులుతున్నారు. చుట్టూ నీళ్ళు సమృద్ధిగా ఉన్నప్పటికీ…ఎన్నికైన ప్రజాప్రతినిధులకు, అనధికారికంగా పెత్తనం చెలాయిస్తున్న అధికార పార్టీ నాయకులకు చిత్తశుద్ది లేకపోవడంతో తిరువూరు ప్రజలకు వర్షాకాలంలో కూడా మంచినీటి కష్టాలు తప్పడం లేదు.

* తిరువూరు ప్రాంతంలో చెరువులను, పంట కాలువలను మరమ్మత్తులు చేసే విధంగా యాభై ఏళ్ల క్రితమే ఏర్పాటైన ఇరిగేషన్ కార్యాలయం ఎప్పుడూ మూతబడే ఉంటుంది.

* స్థానిక అధికార పార్టీ నాయకుల అసమర్థతకు మరో మచ్చుతునక – తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం. రెండు సంవత్సరాల నుండి ఈ కమిటీకి పూర్తి స్థాయి కార్యదర్శి లేడు. పాలకవర్గం పదవీకాలం ముగిసి సంవత్సరం దాటుతున్నప్పటికి కనీసం నూతన పాలకవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు.

* తిరువూరు మున్సిపాల్టీలో నెలకొన్న అవినీతి రాష్ట్ర స్థాయిలోనే సంచలనం సృష్టించింది. ఇప్పటికే మున్సిపాల్టీ ఏర్పడిన నాలుగేళ్ళలో నలుగురు కమీషనర్లు మారారు. శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ ఏఈలు, కమీషనర్లను లెక్క చేయకుండా అధికార పార్టీ నేతల అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే కొత్తగా వచ్చిన యువ కమీషనర్ చురుగ్గా వ్యవహరించి గాడి తప్పిన పరిపాలనను సరిచేయవలసి ఉన్నది.

* తిరువూరులో ఉన్న పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ కార్యాలయాలు కళ తప్పాయి. తగిన పర్యవేక్షణ లేకపోవడంతో ఇవీ మూతపడే ఉంటున్నాయి.

* ఎన్నో ఏళ్ల పోరాటం తరువాత కోట్ల రూపాయల ఖర్చుతో తిరువూరులో స్టేడియం నిర్మించారు. ఒక్క షటిల్ కోర్టు తప్ప ఈ స్టేడియం దేనికీ పనికిరావడం లేదు. సరైన సిబ్బంది లేరు. సరైన లైట్లు కూడా ఏర్పాటు చేయలేదు. స్టేడియంలో సౌకర్యాల గురించి ఎవరికి వారే యమునకు తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

* విద్యుత్ శాఖ పనితీరు అధ్వానంగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గత నెలరోజుల నుండి రోజుకు ఎనిమిది గంటలపాటు విద్యుత్ కోతలు విధిస్తున్నప్పటికి ఒక్క నాయకుడికి కూడా ఈ విషయం పట్ల స్పందించాలనే ఆలోచన రాకపోవడం తిరువూరు ప్రజల దురదృష్టం.
tvrnews.com
tvrnews.com

tvrnews.com
tvrnews.com tiruvuru kaburlu tiruvuru news stadidum
tvrnews.com tiruvuru kaburlu news
tvrnews.com
tvrnews.com
tvrnews.com tiruvuru kaburlu news
tvrnews.com tiruvuru kaburlu news
ఇప్పటికైనా నాయకులు స్పందించి తిరువూరులో ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగుపరచాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.

తిరువూరుతో కొత్త డీజీపీ ఠాకూర్‌కు మంచి అనుబంధం

ఏపీ రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన ఆర్.పీ.ఠాకూర్‌కు మంచి పరిపాలనాదక్షుడుగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయన కృష్ణాజిల్లా ఎస్పీగా పని చేసిన కాలంలో జిల్లాపై తనదైన ముద్రవేశారు. జిల్లా అంతటా సుడిగాలి పర్యటనలు చేసేవారు. ప్రజలుకు ఏ కష్టం వచ్చినా ఆయన స్వయంగా ప్రత్యక్షం అయ్యేవారు. ఠాకూర్‌ జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో తిరువూరులో రౌడీలు రాజ్యమేలుతూ ఉండేవారు. వ్యాపారస్థులను బెదిరించడం, దౌర్జన్యంగా డబ్బులు వసూళ్లు చేయడం వంటి చర్యలకు వారు పాల్పడుతుండేవారు. ఆ సమయంలో తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ సంఘ విద్రోహ శక్తులకు నిలయంగా ఉండేది. రెండు మూడు హత్యలు కూడా ఆ సమయంలో జరిగాయి. ఇదే సమయంలో స్థానిక వ్యాపారస్థులు జిల్లా ఎస్పీ ఠాకూర్‌ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఠాకూర్‌ తిరువూరు పోలీస్‌స్టేషన్‌కు తరచుగా వచ్చి స్థానిక రౌడీలకు హెచ్చరికలు చేశారు. అయినప్పటికీ అప్పటి కేబుల్ ఆపరేటర్ దారా లక్ష్మీకాంతారావును స్థానిక బస్టాండ్ సెంటరులో రౌడీలు అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి చంపారు. దీంతో ఆర్.పీ.ఠాకూర్‌ పోలీస్ తడాఖాను రౌడీలకు రుచి చూపించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు తిరువూరులో రౌడీ అనేవాడు ఎవడూ కాలర్ ఎత్తుకు తిరగలేదు. తిరువూరు రౌడీలకు ఆర్.పీ ఠాకూర్‌ సింహంలా కనిపించారు. అనంతరం వ్యాపారస్థులతో పాటు ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఆర్.పీ.ఠాకూర్‌ చేపట్టిన చర్యలను తిరువూరు ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. కొత్త డీజీపీగా ఎన్నికైన ఆర్.పీ.ఠాకూర్‌కు తిరువూరు ప్రజలు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నారు. తిరువూరు ప్రాంతంలో ఇటీవలి కాలంలో పేట్రేగిపోతున్న కోడిపందేలు, పేకాట స్థావరాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, శాంతి భద్రతలను పరిరక్షించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. —కిలారు ముద్దుకృష్ణ, సినీయర్ జర్నలిస్ట్.

ఆటా నుండి ఆహ్వానం

తిరువూరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కిలారు ముద్దుకృష్ణకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) నుండి ఆహ్వానం అందింది. మే 31 నుండి మూడు రోజుల పాటు డల్లాస్ నగరంలో అమెరికన్ తెలుగు కన్వెన్షన్ పేరుతొ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ముద్దుకృష్ణ ను నిర్వాహకులు ఆహ్వానించారు.

అశృనయనాల మధ్య సువారపు అంత్యక్రియలు

అనారోగ్యంతో కన్నుమూసిన సీనియర్ న్యాయవాది, అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అద్యక్షుడు సువారపు రామచంద్రరావు భౌతికకాయానికి సోమవారం సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల అశృనయనాల నడుమ అంత్యక్రియలు జరిగాయి. కేడీసీసీ బ్యాంక్ వీధిలోని ఆయన స్వగృహం నుంచి మునుకుళ్ల రహదారిలోని స్వర్గపూరి వరకు అంతిమయాత్ర కొనసాగింది. అంతకు ముందు ఎక్సైజ్ శాఖా మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్, మార్క్‌ఫెడ్ చైర్మన్ కంచి రామారావు, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి నల్లగట్ల స్వామిదాస్, ఎంపీపీ గద్దె వెంకటేశ్వరరావు, ఏఎంసి మాజీ చైర్మన్ తాళ్ళూరి రామారావు, నాయకులు కొతపల్లి ఆనంద్ స్వరూప్, వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు, అఖిల భారత లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చలసాని అజయ్ కుమార్, సీపీఐ నాయకులు తూము కృష్ణయ్య, పసుపులేటి వెంకయ్య, కొత్తపల్లి సుందరరావు, సి.హెచ్.వెంకటేశ్వరరావు, పలువురు న్యాయవాదులు సువారపు భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాడ సంతాపం తెలిపారు.