ఈ రోజు వార్తల్లోని వాడివేడి అంశాలు

• వచ్చే 10వ తేదిన విడుదలవుతున్న “ఓం నమో వేంకటేశాయ” సినిమా విజయవంతం కావాలని ఆ సినిమా దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఆకాక్షించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తో కలిసి నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్ పల్లి లో హల ఇందూరు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
• బ్యాంకు లలో నగదు తీసుకోవటం పై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను ఆర్.బీ.ఐ.మార్చి 13 నుండి ఎత్తివేస్తున్నల్టు ప్రకటించింది.
• ప్రమాణ స్వికారం చేయకుండా పరాభవం పాలైన శశికళ తన పార్టికి చెందిన శాసన సభ్యులను అజ్ఞాత ప్రాంతానికి తరలిస్తున్నట్లు సమాచారం.
• కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో తెలంగాణా టిడిపి నేతలు భేటి అయ్యారు. ఇవాళ్ళ న్యూ డిల్లీలో టిడిపి నేతలు ఎల్. రమణ, రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. కేంద్రం మంజూరు చేసే ఇళ్ళను తెలంగాణా ప్రభుత్వం పేదలకు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి చర్య తీసుకుంటానని వెంకయ్య హామీ ఇచ్చారు.
• ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ను గురువారం వైఎస్సార్సిపి నేతలు కలిశారు. భన్వర్ లాల్ కార్యాలయానికి వెళ్ళిన వైఎస్సార్సిపి ఎమ్మెల్యే ఆర్కే, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేశారు.
• కేవలం రూ.30 వేల కోసం తండ్రిని ఓ తనయుడు హతమార్చాడు. ఈ సంఘటన లింగంపేట మండలం శెట్ పల్లిలో చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన మూడo పోచయ్య, మూడం ఆశయ్య తండ్రి కొడుకులు రుణమాఫీ డబ్బులు వాడుకుంటూ తనకు అన్యాయం చేశాడని ఆశయ్య తమ పొలంలోనే తండ్రి పోచయ్యతో వాగ్వాదానికి దిగాడు. అనoతరం కోపంతో తండ్రి నెత్తిపై కర్రతో బలంగా కొట్టాడు.
• గవర్నర్ విద్యాసాగరరావు ను కలవడానికి ముంబాయి బయలు దేరిన పన్నీర్ సెల్వం.
• జయలలిత మృతి పై తనకు కూడా అనుమానాలు వున్నాయని, దీనిపై ఒక విచారణ కమిషన్ వేస్తామని పన్నీర్ సెల్వం ప్రకటించారు.
• అమరావతి పరిసరాల్లో ఉన్న గ్రామాలను 13 జోన్ లుగా ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు.
• శశికళ కు మద్దతిస్తున్న ఎమ్మెల్యే లు డిల్లి లో రాష్ట్రపతి ని కలవడానికి బయలు దేరుతున్నట్లు సమాచారం.
• విజయవాడ లో మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహించడం తన అదృష్టంగా భావిస్తున్నాని స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ప్రకటించారు.
• టీం ఇండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ తో తనకు ఏవిధమైన సంబంధం లేదని నటి సాగరిక ప్రకటించింది.
• ప్రముఖ టెన్నిస్ క్రిడాకారిణి సానియా మిర్జా కు హైదరాబాద్ నగర పాలక సంస్థ అధికారులు సేవా పన్ను చెల్లించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని నోటిసులు జారిచేశారు.
• ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటైన పదజాలంతో విమర్శలు చేశారు. మోడీ ప్రధానమంత్రి కాదని, గబ్బర్ సింగ్ లాంటి వాడని ఆమె ఆరోపించారు.
• అన్నాడిఎంకే ఐటి కార్యదర్శి రామచంద్రన్ ను ఆ పదవి నుండి శశికళ తప్పించింది.
• ఉత్తరప్రదెశ్ ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీతో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టి బుధవారం నాడు తన ఎన్నికల మానిఫెస్టో ను విడుదల చేసింది.
• భారత స్పిన్ దిగ్గజం రవి చంద్రన్ అశ్విన్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకునేందుకు చేరువలో ఉన్నారు. భారత్ – బంగ్లా మధ్య జరిగే మ్యాచ్ లో రెండు వికెట్లు తీస్తే అత్యంత వేగంగా 250 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టిస్తాడు.
• విజయవాడలో జెండా దిమ్మల ఏర్పాటులో ఏర్పడిన వివాదం తెలుగుదేశం, వైకాపా ల మధ్య రణరంగాన్ని సృష్టించింది. దీంతో పోలీసులు ఇరు పార్టీల నాయకులను అరెస్ట్ చేశారు.
• ఏప్రిల్ లో నిర్వహిస్తున్న ఉస్మానియా యునివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరు కావలసినదిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహ్వానించారు.
• రాజ్యసభలో ప్రధాని మోడీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో కాంగ్రెస్ వాకౌట్ చేసింది.

తిరువూరు ప్రజలారా కోటి రూపాయిల పన్నులు ఎప్పుడు కడతారు?

తిరువూరు పురపాలక సంఘంలో ఇంటి, కుళాయిల పన్నుల వసూళ్లు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు సమీపిస్తున్నా ఇప్పటి వరకు 60 శాతం మాత్రమే పన్నులు వసూలు చేశారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఇంటి పన్ను రూ.1.47 కోట్లతో పాటు 2015-16 బకాయి రూ.55 లక్షలు కలుపుకొని మొత్తం రూ.2.02 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు అధికారులు రూ.95 లక్షలు మాత్రమే వసూలు చేశారు. మరో రూ.1.09 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. కుళాయి పన్ను బకాయితో కలుపుకొని రూ.31 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా రూ.5 లక్షలు మాత్రమే వసూలు చేశారు. ఆర్నెల్లకు ఒకసారి చొప్పున మీసేవ, ఈసేవ, మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల ద్వారా ఇంటి పన్నులను చెల్లించుకునే వెసులుబాటు కల్పించారు. నోటీసులు జారీ చేయటానికే పరిమితం కావడంతో ప్రజల నుంచి స్పందన కొరవడింది. దీంతో మార్చి 31 లోపు 95 శాతం పన్ను వసూళ్లు పూర్తి చేయడమే లక్ష్యంగా ఇటీవల ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వసూళ్లు ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతోంది. ఇంటి, ఆస్తి పన్ను విషయంలో ఏవైనా అభ్యంతరాలున్నా, అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు వీలుగా కార్యాలయంలో పరిష్కార వేదిక ఏర్పాటుచేశారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వీకరించటంతో పాటు ఇంటి పన్నులను చెల్లించుకుంటారు. మార్చి 31 వరకు పరిష్కార వేదిక పనిచేస్తోంది. పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రధానంగా ఇంటి, కుళాయి వంటి పన్నుల ద్వారా ఆదాయం దోహదం చేయనుంది. పాలకవర్గం, అధికారుల నడుమ కొరవడిన సమన్వయలోపంతో ఏటా లక్ష్యాన్ని అధిగమించటానికి ఆపసోపాలు పడుతున్నారు. తిరువూరులో ఏటా మార్చి నెలాఖరులోపు మాత్రమే పన్నులు చెల్లించటానికి ప్రజలు ముందుకు వస్తున్నారని, ఈ ఏడాది కూడా గడువులోపు చెల్లిస్తారని అధికారులు భావిస్తున్నారు.

తిరువూరు మండల ప్రజాప్రతినిధుల వివరాలు

నెమలి ఆలయం చూసొద్దాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక కృష్ణాలయం, పేరెన్నికగన్న పుణ్యక్షేత్రం, నిత్యం భక్తుల రాకతో పులకించే గ్రామం, సందర్శకులతో సందడిగా ఉండే ప్రదేశం, భక్తుల విరాళాలతో దినదినాభివృద్ది చెందుతున్న దేవస్థానం, లక్షలాది మంది భక్తులు ఇలవేల్పుగా కొలిచే కృష్ణాజిల్లా గంపలగూడెం మండలంలోని ‘నెమలి’ గ్రామంలోని వేంచేసి ఉన్న శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయం.
*నెమలి వేణుగోపాలస్వామిని కొలిచే భక్తులు నవ్యాంద్రప్రదేశ్ ,తెలంగాణా రాష్ట్రాలలో లక్షలాది మంది ఉన్నారు. తాము కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా స్వామివారిని ఆరాదించే భక్తజనం నెమలి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఎప్పటి నుంచో అభిలాషిస్తున్నారు. పాలక ప్రభుత్వాలు నెమలి పుణ్యక్షేత్రం స్వామి వారి దర్శనం ‘సర్వైశ్వర దాయకం సర్వరోగ నివారిణి’ అనే భావంతో వస్తున్నా, భక్తులకు ,ఆలయ అధికారులు వసతి కలిపిస్తున్నా, రాకపోకలకు నానా ఇక్కట్లు పడుతున్నారు. భక్తుల భూరి విరాళాలుతో ఆలయ ప్రాంగణంలో ఎన్నో కట్టడాలు నిర్మించారు. పర్యాటకులను ఆకర్షిస్తున్నారు.
**స్వయంభువుగా స్వామివారు ఇలా వెలిశారు
1953 మార్చి 23 న (శ్రీరామనవమి నాడు) వేణుగోపాలస్వామి నెమలిలో స్వయంభుగా వెలిశారు. స్వామివారి విగ్రహం నెమలి గ్రామానికి చెందిన వనమా సీతారామయ్య అనే షావుకారు తన పొలంలోని సారవంతమైన మట్టి కోసం తవ్వుతుండగా మొదటిసారి గడ్డపలుగు ఉపయోగించగా వెంటనే ఖంగుమని శబ్దం వచ్చింది. ఆ వింత ధ్వని అర్ధం కాక కొంచెం పక్కగానే గడ్డపలుగు వేయగా అదే శబ్దం వచ్చింది. ఆ ధ్వని ఆలోచించుతూనే అతడు ఆ రెండు ఘతాముల మధ్య మరల పలుగు ప్రయోగించగా ఆ చోట బ్రహ్మాండమైన మిరుమిట్లుతో ఒక మెరుపు వెలువడింది. ఆ కాంతి తీవ్రతకు అతను మూర్చ పోయాడు అది చూసిన మిగిలిన వారు ఆందోళనతో అతని ముఖం పై చల్లని నీళ్ళు చల్లి కొద్ది సేపు సపర్యలు చేసారు. ఆతను కొంచెం తేరుకొని తనకు ఏమి కనిపించడంలేదని అన్నాడు. అపుడు మిగిలినవారంతా ఆప్రాంతంలో త్రవ్వి చూడగా ఒక విగ్రహం దానిచెంతనే ప్రాచీన శంఖము, పాచిక లభ్యమయినది. ఆరోజు పరమ పవిత్రమైన శ్రీరామనవమి (23-3-1953) ఆవిషయం తెలిసిన షావుకారు నవమి వేడుకల నిర్వహణలో ఉన్న ఆతను ఆ బాధ్యతలు వేరేవారికి అప్పగించి హుటాహుటీన తన అనుచరులతో కలిసి విగ్రహం లభ్యమైన దివ్యస్తలానికి చేరుకున్నాడు. ఆ విగ్రహమును పరిశీలించి శ్రీ వేణుగోపాల స్వామివారి దివ్య మంగళమూర్తి అని గ్రహించారు. కటారు వెంకటేశ్వర్లు ఉపయోగించిన గునపము వలన శ్రీస్వామివారి వేణువుకు కుడి, ఎడమలవైపుల తగిలి చిటికిన వ్రేలు భిన్నమయింది. గ్రామ పెద్దలు పెనుగొలను చెందిన అర్చకుడు నందలి క్రిష్ణమచార్యులుని వెంటనే రప్పించి స్వామివారి విగ్రహం చూపించగా మూడు అడుగుల ఎత్తు, ఉత్తరాభి ముఖముగా వ్యత్యస్థ పదముల నడుము, శిరస్సులు చక్కని ఓంపులతో మురళిని మ్రోగించుచూ, త్రిభంగిమతో దివ్య సుందరమైన చక్రములతో పాదముల కడ ఇరువైపులా విన్ద్యమారాలు వీచు గోపికా స్త్రీలు గోవులతో కూడి అలరారుచు ఉన్న ఆ ఏక శీల విగ్రహమును చూసి శ్రీ వేణుగోపాలస్వామివారి విగ్రహంగా గ్రహించారు. స్వామివారు భూగర్భమునుండి సాక్షాత్కరించిన తీరుకు గ్రామ ప్రజలు భక్తీ పారవశ్యంతో ఆశ్చర్యపోయారు. ఈసందర్భంగా భక్తులు స్వామివారిని ప్రతిస్థదలచి ఉరేగించ బయలుదేరగా స్వామివారు భక్తునికి ఆవహించి “నేను దర్శనమిచ్చిన చోటనే తనను ప్రతిష్టించాలని ఆదేశించారు” . స్వామి ఆదేశమును వెంటనే అమలుచేయదలచాగా ఉత్తరాభి ముఖమున వెలసిన స్వామివారిని తూర్పు ముఖముగా ఉంచడంతో ఆకస్మికంగా గాలివానతో కూడిన పెను తుఫాను విరుచుకుపడింది. వేసిన పందిళ్ళు చిన్నభిన్నమయ్యాయి. పొరపాటును గ్రహించిన వారు స్వామివారిని యధావిధిగా ఉత్తరాభి ముఖముచేయగా కొద్ది క్షణములలొనే తుఫాను శాంతించింది. వెంటనే గ్రామ పురోహితులతో పూజలు నిర్వహించారు.
** 1957 ఫిబ్రవరి 6న శాస్రోక్తంగా నల్లనయ్య విగ్రహాన్ని వేదపండితుల ఆద్వర్యంలో ప్రతిష్టించారు. అప్పటి నుంచి స్వామివారి ఆలయం దినదిన ప్రవర్ధమానం చెందుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చే ఇష్టదైవంగా వేణుగోపాలస్వామి నిలిసారు. నెమలి వేణుగోపాలస్వామి ఆలయానికి భక్తులు సమర్పించే కానుకలు వేలంపాటలు ద్వారా ఏటా రూ.కోటి వరకు ఆదాయం లభిస్తుంది. ఆ మొత్తం దేవస్థానం నిర్వహణకే సరిపోతుంది. ఉత్సవాలు, వేడుకలు ప్రసాదాలు సిబ్బంది జీతభత్యాలు తదితర వ్యయాలు ఆలయానికి వచ్చే ఆదాయం ద్వారా ఖర్చు చేస్తున్నారు. నెమలి పుణ్యక్షేత్రం పర్యటక కేంద్రంగా రూపాంతరం చేసేందుకు రవాణా వసతి ప్రదాన అడ్డంకిగా మారింది. వేలల్లో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. తెలంగాణా సరిహద్దున ఉన్న నెమలికి ఆ రాష్ట్రంలోనే భక్తులు అధికం. ప్యాకేజి టూర్ కు జిల్లాలో ఇతర దేవాలయల నుంచి నెమలి గ్రామం దూరంగా వుండడం కూడా సమస్యగా ఉంది. పుణ్యక్షేత్రాల సందర్శనకు రెండేళ్ళ క్రితం ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా దూరప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తరించారు. ఇదే తరహాలో జిల్లాలో విజయవాడ కనకదుర్గ, వేదాద్రిలోని నరసింహ స్వామి, పెనుగంచిప్రోలులోని శ్రీతిరుపతమ్మ ఆలయాల మీదుగా నెమలికి వచ్చేందుకు రవాణా సౌకర్యం ఉంటే ఉపయుక్తంగా ఉంటుంది. నెమలి వేణుగోపాలస్వామి ఆలయానికి ప్రముఖుల సందర్శన కొదవలేదు. రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిదులు అధికారులు ప్రముఖులు తరచూ స్వామివారి సేవకు వస్తుంటారు.
**కన్నుల పండువగా స్వామివారి తిరుకళ్యాణం.
ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆరు రోజులపాటు నిర్వహించే స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ప్రతి నెలా పూర్ణిమ నాడు మాస కళ్యాణం, గోశాలలో నిత్యం గోపూజలు జరుగుతూ ఉంటాయి. ఆలయంలో ప్రతి ఆది, సోమ, శుక్రవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వైఖాసన ఆగమనం పద్దతిలో స్వామివారు పూజలందుకునే ఈ ఆలయంలో భక్తుల అన్నప్రాసనలు, వాహన పూజలు, వివాహాలు తదితర శుభకార్యాలు స్వామివారి సన్నిధిలో అధికంగా నిర్వహిస్తారు. శ్రీ కృష్ణాష్టమి, భీష్మ ఏకాదశి, ముక్కోటి, ధనుర్మాసోత్సవం, ఉగాది, శ్రీరామనవమి విశేషంగా నిర్వహిస్తారు.
**నెమలి పుణ్యక్షేత్రానికి ఇలా చేరుకోవాలి..
నెమలి పుణ్యక్షేత్రానికి తెలంగాణా రాష్ట్రంలోని మధిర నుంచి నెమలి గ్రామానికి చేరుకోవాలి. ఇతర ప్రదేశాల నుంచి వచ్చేవారు రైలు లేదా బస్సు మర్గాన మధిర చేరుకొని అక్కడినుంచి నెమలి పోవు బస్సు ఎక్కాలి. సాధారణ రోజుల్లో కుడా తిరువూరు, మధిర డిపోల నుంచి నుంచి నెమలికి బస్సులు తిరుగుతాయి. స్వామివారి తిరుకళ్యాణం రోజున మధిర, తిరువూరు డిపోల నుంచి బస్సులు ఉచితంగా తిరుగుతాయి.

110 ఏళ్ల కృష్ణాజిల్లా చరిత్ర ఇది

చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకస్తానం సంపాదించుకున్న కృష్ణా జిల్లా కు 110 ఏళ్ళు. రాజకీయ, ఆర్దిక, సాంఘిక చైతన్యం కలిగిన ప్రాంతంగా వినుతికెక్కిన కృష్ణ జిల్లా గత చరిత్రను పరిశీలిస్తే…. రాజమండ్రి, మచిలీపట్టణం, గుంటూరు జిల్లాలను కలిపి 1859 లో కృష్ణా, గుంటూరు జిల్లాలను ఏర్పాటు చేశారు. మచిలీపట్టణం కృష్ణాజిల్లా కు ప్రధాన కేంద్రంగా మారింది. 1904 లో కృష్ణాజిల్లా నుండి గుంటూరు జిల్లా ను వేరుచేశారు. 1925 లో కృష్ణాజిల్లా నుండి పశ్చిమ గోదావరి జిల్లాను వేరుచేశారు. జిల్లాలో కృష్ణా నది ప్రవహించడం కారణంగా “కృష్ణాజిల్లా “గా నామకరణం చేశారు. జిల్లా విస్తీర్ణం 8,727 చ.కి.మీ. సముద్రం తీరం 88 కి.మీ. ఉత్తరాన ఖమ్మం జిల్లా, దక్షిణాన బంగాళాఖాతం, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమ గోదావరి జిల్లా, పడమర గుంటూరు, నల్గొండ జిల్లాలు ఎల్లలుగా ఉన్నాయి. జిల్లాలో 40 శాతం విస్తరించిన చిన్న, చిన్న పర్వతాలతోను, తూర్పూ కనుమల పార్శ భాగంతోను నిండి ఉంది. జిల్లాలోని విజయవాడ ప్రాంతం విస్తరించి ఉన్న కొండపల్లి పర్వత శ్రేణి 576 మీటర్ల ఎత్తున ఉంది. జిల్లాలో ఉత్తర భాగాన జమ్మన నాయుదుర్గం, విజయవాడలో మొగల్రాజపురం పర్వతం, కనకదుర్గ దేవాలయం ఉన్న ఇంద్ర కిలాద్రి పర్వతం, గాంధీ పర్వతం వంటివి ఉన్నాయి. జిల్లాలో రెండు లోక్ సభ నియోజక వర్గాలు, పూర్తిగాను, మరో రెండు పాక్షికంగాను ఉన్నాయి. 16 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాకు ముఖ్య పట్టణం మచిలీపట్టణం అయితే విజయవాడ వ్యాపార కూడలిగా ఉంది ఉత్తర, దక్షిణ భారత దేశాలను కలిపే ప్రముఖ రైల్వే కూడలిగా ఉంది.కృష్ణా-గుంటూరు జిల్లాలను అనుసంధానం చేసే ప్రకాశం బ్యారేజికి తోడూ మరో వారధిని అవనిగడ్డ ప్రాంతంలోని పులిగడ్డ-రేపల్లె ప్రాంతంలోని పెనుమూడి మధ్య నిర్మింప చేశారు. దీనికి మండలి వెంకట కృష్ణారావు వారధిగా నామకరణం చేశారు. కృష్ణాజిల్లా చరిత్ర మౌర్య చకవర్తుల కాలం నుంచి తెలుస్తోంది. అశోకుని మరణానంతరం శాతవాహనాoధ్రులు కృష్ణా తీరాన శ్రీకాకుళాన్ని (ప్రస్తుతం ఘంటసాల మండలంలో ఉంది) ప్రధమ రాజధానిగా చేసుకుని పాలించారు. శాతవాహనులు తరువాత రాజధానిని ధ్యానకటకానికి మార్చారు. శాతవాహనరాజులు సుమారు 400 సంవత్సరాలు తమ పరిపాలన కొనసాగించారు. ఘంటసాల, గూడూరు, అవనిగడ్డ, రేవుల నుండి రోము, ఇటలి, వంటి దేశాలతో విదేశీ వ్యాపారం జరిగినట్లు చరిత్రను బట్టి తెలుస్తోంది. 1611 లో బందరు లో ఇంగ్లీష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ స్తాపించి వ్యాపారం ప్రారంభించారు. 1794 లో మచిలీపట్టణం కౌన్సిల్ ను రద్దు చేసి కలెక్టర్ల పాలన ప్రవేశ పెట్టారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో జిల్లా వహించిన పాత్ర చరిత్రలో లిఖించదగినది స్వాతంత్రోద్యమ సమయంలో మహాత్మ గాంధీతో పాటు పలువురు జాతీయ నాయకులు కృష్ణ జిల్లాకు విచ్చేసి తమ ప్రసంగాలతో మన జిల్లాకు ఉద్యమ స్పూర్తిని కలిగించారు. భోగ రాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణా రావు, కోలవెన్ను రామ కోటేశ్వరరావు, గొట్టిపాటి బ్రహ్మయ్య, అయ్యాదేవర కాళేశ్వరరావు, మన జాతీయ పతాక రూప శిల్పి పింగళి వెంకయ్య మొదలైన వీరెందరో స్వాతంత్రోద్యమాలతో జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టారు. ఇంతే కాకుండా సాహిత్య రంగంలో కూడా తమదైన శైలిలో ప్రజలను ప్రాభావితం చేసిన అనేక మంది కవులున్నారు. వారిలో ప్రముఖంగా తిరుపతి వెంకట కవులు, విశ్వనాధ సత్యనారాయణ, ఉన్నావా లక్ష్మి నారాయణ వంటి సాహిత్య వేత్తలు ఎన్నో జాతీయ పురస్కారాలు అందుకుని జిల్లాను ప్రముఖ స్తానంలో నిలిపారు.2014 జూన్ 2న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రెండుగా చిలి తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోవడంతో కృష్ణ జిల్లా సిమాంధ్ర లోని 13 జిల్లాలో ఒకటిగా నూతన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కీలక ప్రదేశంగా మారిపోవడం చరిత్రలో ఒక విశేషాoశంగా చెప్పుకోవచ్చు.

కృష్ణాజిల్లాలో ఏడాది పాటు సాగిన గానుగపాడు రిపబ్లిక్ ఉజ్వల గాధ

పోరాట సమయంలో తీసిన చిత్రం. మధ్య వరుసలో ఎడమ నుండి కుడికి మొదటి వ్యక్తి జలగం వెంగళరావు.

“బయట నుండి వచ్చే కష్ట నష్టాలను మతాల భేదభావం లేకుండా కలిసికట్టుగా ఎదుర్కొందాం” – ఇదే భారతదేశం రిపబ్లిక్‌గా అవతరించకముందు గానుగపాడులో ఏర్పడిన తిరుగుబాటు ప్రభుత్వం తమ పాలనలోని సభ్యులనుండి స్వీకరించిన ప్రమాణ పత్రంలోని ఓ కట్టుబాటు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన అనంతరం ప్రస్తుతం కృష్ణాజిల్లా తిరువూరు మండలంలోని గానుగపాడు దాని శివారు ఆరు గ్రామాలు నిజాం ప్రభుత్వ పాలనలో ఉండేవి. నిజాం నవాబు తన ప్రభుత్వాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడానికి నిరాకరించడంలో ఈ ఆరు గ్రామాల ప్రజల్లో చైతన్యం పెల్లుబికి నిజాం నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పాలని స్వంత విధానాలు, ఆదాయ వనరులతో స్వతంత్ర రిపబ్లిక్‌గా ప్రకటించుకున్నారు. తమ ప్రాంతాన్ని తామే పరిపాలించుకోవటం కోసం ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గానుగపాడు కేంద్రంగా ఆరు గ్రామాలు రిపబ్లిక్‌గా ఏర్పడటానికి దారి తీసిన పరిస్ధితులు, ఆ తర్వాత అది భారత దేశంలో విలీనం అయ్యే వరకు జరిగిన సంఘటనలు ఈ విధంగా ఉన్నాయి. గానుగపాడు, పల్లెర్లమూడి, చౌటపల్లి, టేకులపల్లి, కొత్తూరు, చిక్కుళ్లగూడెం గ్రామాలు నిజాం ప్రభుత్వ పాలనలో ఉండేవి. గానుగపాడు గ్రామంలో ఒక జమేదారు, ఐదుగురు పోలీసులతో ఒక నాకా (పోలీస్ స్టేషన్)ను నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనితో ప్రజలు జాతీయ జెండా ఎగురవేసి “నిజాం గో బ్యాక్”, “ఇండియన్ యూనియన్ జిందాబాద్” అనే నినాదాలతో ఊరేగింపు జరిపారు. ఇదంతా చూసిన నిజాం ప్రభుత్వ ఉద్యోగులకు మింగుడుపడక ఈ ఆరు గ్రామాల ప్రజలను నిర్దాక్షిణ్యంగా అణిచివేయటానికి ప్రయత్నించారు. వీరి దౌర్జన్యాలను సహించలేని ప్రజలు దెబ్బకు దెబ్బ తీయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆయుధ శిక్షణా శిబిరాలు రహస్యంగా పని చేయటం ఆరంభించాయి. ఆయుధాలు తయారు చేయడంలో నిష్ణాతులైన తిరువూరుకి చెందిన గుండిమెడ లక్ష్మీనారాయణ (బుల్లోడు), పసుపులేటి వీరయ్యల ఆధ్వర్యంలో పల్లెర్లమూడి గ్రామంలో పోరాటానికి కావల్సిన ఆయుధ సామాగ్రి తయారు చేయడం ప్రారంభించారు. వీరికి సహకరించటానికి సికింద్రాబాద్ నుండి నరసింహసింగ్ అనే అనుభవం కలిగిన ఆయుధాల తయారీదారుడిని పిలిపించారు. పల్లెర్లమూడి గ్రామంలో బ్రహ్మం అనే వ్యక్తి ఇంట్లో ఆయుధ సామాగ్రి తయారీ కర్మాగారాన్ని నెలకొల్పారు. అనంతరం గానుగపాడు గ్రామంలో ఉన్న నాకాపై తిరుగుబాటు జరపడంతో దానిలోని జమేదారు, ఇతర పోలీసులు పలాయనం చిత్తగించారు. నాకాలో ఉన్న ఆయుధ సామాగ్రి, రైతుల భూములకు సంబంధించిన పత్రాలు, ఇతర రికార్డులు, కొంత నగదు పోరాట కమిటీ సభ్యులు స్వాధీనపరుచుకున్నారు. ఈ ప్రభుత్వం రూపొందటానికి సహకరించిన ప్రముఖుల్లో గానుగపాడుకు చెందిన కర్నాట వెంకటరెడ్డి, పాట్రేడు సుబ్బారెడ్డి, గ్రామాధికారుల్ కుటుంబానికి చెందిన కవుటూరు సత్యనారాయణ, సెట్టిపల్లి వెంకటప్పారెడ్డి, శీలం వెంకటరెడ్డి, చిక్కుళ్లగూడెం గ్రామానికి చెందిన టంటు బాలయ్య, పల్నాటి వీరయ్య, కొత్తూరుకు చెందిన గురాల అనిమిరెడ్డి, తోకచిచ్చు పుల్లంరాజు, పల్లెర్లమూడికి చెందిన చీరెడ్డి పెదబసవరెడ్డి, పొట్లిరెడ్డి, చారుగుళ్ల అప్పయ్య, చౌటపల్లి గ్రామానికి చెందిన ఎరుము నాగిరెడ్డి, గుర్రాల చిన కోటిరెడ్డి, కామిరెడ్డి వెంకటరెడ్డి, గొల్లమందల అప్పయ్య, టేకులపల్లి గ్రామానికి చెందిన కామిరెడ్డి రామిరెడ్డి, శీలం అచ్చిరెడ్డి, మంగినపూడి బిచ్చం, పోలిశెట్టిపాడు గ్రామానికి చెందిన కోటేరు రామచంద్రరెడ్డి తదితరులు ఉన్నారు. ప్రముఖ కాంగ్రెస్ నాయకులు టి.హయగ్రీవాచారి, జలగం వెంగళరావు, బొమ్మకంటి సత్యనారాయణరావులు గానుగపాడు రిపబ్లిక్ ప్రభుత్వానికి ప్రధాన సలహాదారులుగా ఉండేవారు. ఈ ప్రభుత్వం 1947 నవంబరు నెల నుండి ప్రజాస్వామిక రాజ్యంగా పాలించడం మొదలుపెట్టింది. రేడియోలోనూ విశేషంగా ప్రచారం లభించింది. గానుగపాడు తిరుగుబాటును విన్న అప్పటి కేంద్ర హోం శాఖా మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ ఆ ప్రాంత ప్రజల జాతీయ భావాలను ప్రశంసించి నిజాం నవాబు నుండి ఏ ఆపద రాకుండా గానుగపాడు ప్రాంతాన్ని కాపాడతామని హామీ ఇచ్చి భారత దేశంలో విలీనం చేయటానికి చర్యలు తీసుకుంటామని స్ధానిక కాంగ్రెస్ నాయకులకు వాగ్ధానం చేశారు. గానుగపాడు రిపబ్లిక్‌లో ముఖ్యమంత్రి, మంత్రులు దాదాపు సంవత్సరం పాటు చక్కని పరిపాలన అనుభవించినట్లు ప్రజలు చెప్తూ ఉంటారు. వెట్టి చాకిరి నిర్మూలించారు. అప్పట్లో కిరోసిన్ దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతుండగా, కిరోసిన్, ఇతర నిత్యావసర వస్తువులను సక్రమంగా పంపిణీ చేయించారు. శాంతి భద్రతలు చక్కగా కాపాడారు. మధ్యనిషేధాన్ని కఠినంగా అమలుపరిచారు. పాఠశాలలు నడిపి జాతీయ భావాలు పెంపొందించారు. రైతుల సంక్షేమానికి చెరువులు, కాలువలు తవ్వకం పనులను ప్రజల సాయంతో స్వచ్ఛందంగా చేపట్టారు. జాతీయ నాయకులు జయప్రకాష్ నారాయణ్, టంగుటూరి ప్రకాశం, ఆచార్య రంగా తదితరులు ఈ ఉద్యమ కాలంలో వచ్చి వీరిని ప్రోత్సహించారు. కులమత బేధాలు లేకుండా పరిపాలన చక్కగా సాగింది. హైదరాబాద్ సంస్ధానంలో పరిస్ధితులు తారుమారు కావడం, ఆ సంస్ధానంపై 1948 సెప్టెంబరు 13వ తేదీన సైనిక చర్య జరిగి 17వ తేదీన అది ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడం అందరికీ తెలిసిందే. అనంతరం గానుగపాడు రిపబ్లిక్ ప్రత్యేక ప్రభుత్వం రద్దయింది. అందరితో పాటు 1950 జనవరి 26వ తేదీన ఆ ప్రాంత ప్రజలు రిపబ్లిక్ దినోత్సవం జరుపుకున్నారు. ఆనాడు గానుగపాడు రిపబ్లిక్ కమిటీలో పాలుపంచుకున్న యోధులు నేటికీ ఈ ప్రాంతంలో ఉన్నారు.

మనమే నెంబరు1

సౌరశక్తిని సమర్థంగా వినియోగించుకుంటే రైతన్నల జీవితాల్లో చీకట్లను తొలగించొచ్చని కృష్ణా జిల్లా అధికారులు నిరూపించారు. అన్నిశాఖలూ కలిసికట్టుగా ముందుకెళ్లి.. జిల్లాను దేశంలోనే అగ్రగామిగా నిలిచేలా చేశారు. దేశవ్యాప్తంగా 678 జిల్లాల్లో కృష్ణా తొలి స్థానంలో నిలిచి.. కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని అందుకుంది. జిల్లాలో 1110 సోలార్‌ సబ్సిడీ పంపుసెట్లను బిగించి.. సుమారు 5500 ఎకరాలకు పుష్కలంగా నీటిని అందించే ఏర్పాట్లు చేశారు. జిల్లా రైతులు సైతం ముందుకొచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అందించిన ఈ పథకాన్ని వినియోగించుకోవడం వల్లే ఈ ఘనత దక్కింది. ఈ సోలార్‌ పంపుసెట్ల వల్ల అన్నదాతలకు ఏటా రూ.30 వేల నుంచి రూ.40 వేల విద్యుత్తు, డీజిల్‌ బిల్లులకు అయ్యే ఖర్చు మిగులుతోంది. దీనికితోడు రాత్రివేళ పొలానికి వెళ్లే బాధ తప్పింది. ఉదయం వేళ కావాల్సినంత నీటిని పొలానికి పెట్టుకునే వీలు కల్పిస్తున్నారు. సౌర విద్యుత్తు ద్వారా గతంలో ఎదుర్కొన్న అనేక సమస్యలకు జిల్లాలో పరిష్కారం దొరికింది. కాలువల ద్వారా నీళ్లు అందించలేని ప్రాంతాలు, రూ.లక్షలు ఖర్చు చేసి విద్యుత్తు లైన్లను వేయలేని ప్రాంతాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. పమిడిముక్కల, విస్సన్నపేట, ఆగిరిపల్లి, జక్కంపూడి, చిన్నబోయినపల్లి, అడవినెక్కలం వంటి ప్రాంతాల్లో ఒక్కో విద్యుత్తు లైన్‌ వేసేందుకు రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలు ఖర్చవుతుంది. ఇది సాధ్యం కాక.. సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే ఇలాంటి ప్రాంతాలను ప్రధానంగా ఎంపిక చేసి అధికారులు కసరత్తు చేశారు. కృష్ణా డెల్టాలోని చివరి ఆయకట్టు రైతులు కష్టపడినా లాభాలు రాక ఇన్నాళ్లూ కష్టాల కడలిలో చిక్కుకుపోయారు. ఇలాంటి మారుమూల ప్రాంతాల రైతులు నేడు సౌర విద్యుత్తుతో బంగారు పంటలు పండిస్తున్నారు. తమ చేనులోనే సౌరవిద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటూ బీడువారిన భూములను కలకలలాడిస్తున్నారు. వీటి ప్రయోజనాన్ని గుర్తించిన రైతులు 1800 మంది ముందుకొచ్చి సోలార్‌ సబ్సిడీ పంపుసెట్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకూ 678 మందికి బిగించారు. మరో 200 పంపుసెట్లను బిగించే పనులు జిల్లాలో సాగుతున్నాయి. మిగతా పంపుసెట్లనూ బిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.3.69 లక్షల విలువైన ఒక్కో పంపుసెట్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 85 శాతం రాయితీ ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం(ఎంఎన్‌ఆర్‌ఈ), రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థ(ఏపీ డిస్కమ్‌) ఈ రాయితీని ఇస్తున్నాయి. రైతులు కేవలం రూ.55 వేలు చెల్లిస్తే పంపుసెట్లను బిగిస్తున్నారు. ఒక్కో సౌర మోటారుతో నాలుగైదు ఎకరాలకు నీరు పుష్కలంగా అందించే అవకాశం ఉంది.
శాఖలన్నీ కలిసికట్టుగా..రెవెన్యూ, వ్యవసాయ, విద్యుత్తు, ఆంధ్రప్రదేశ్‌ నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(నెడ్‌ క్యాప్‌)లు ముందుకు సాగడం వల్లే 678 జిల్లాల్లో కృష్ణా తొలి స్థానంలో నిలిచి జాతీయస్థాయిలో పురస్కారాన్ని సాధించింది. రైతులకు వీటి ప్రయోజనాలను అందిస్తూ, తొలుత ఎక్కడ అవసరమో గుర్తించి అక్కడ బిగిస్తూ వెళ్తున్నారు. మొదట్లో వీటిపై రైతులకు అంతగా అవగాహన లేకపోవడంతో మారుమూల, వర్షాధారిత ప్రాంతాలకు వెళ్లి అక్కడి వారికి వీటి ప్రయోజనాలను జిల్లా యంత్రాంగం వివరించింది. కొద్దిపాటి పెట్టుబడితో పంటలను లాభసాటిగా చేసుకోవచ్చని తెలియజేశారు. దీంతో రైతులు ఒక్కొక్కరిగా ముందుకొచ్చారు. వచ్చిన వారికి వచ్చినట్టుగా పంపుసెట్లను బిగిస్తూ వాటిని విద్యుత్తు ఉత్పత్తి చేసే సోలార్‌ వ్యవస్థతో అనుసంధానం చేస్తూ ముందుకెళ్లారు. సమయంతో సంబంధం లేకుండా, వర్షం కోసం ఎదురుచూడకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు పుష్కలంగా జలం పొంగిపొర్లడంతో రైతులు బారులుతీరారు. సాధారణ విద్యుత్తు తొమ్మిది గంటలే అందుబాటులో ఉండగా.. సోలార్‌తో నిరంతరం ఉత్పత్తి అవుతోంది. గతంలో కేవలం వర్షాధారిత పంటలను మాత్రమే వేసిన రైతులు ప్రస్తుతం వాణిజ్య పంటలను సాగుచేస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలు, మిరప, ఉల్లి, వరి లాంటి పంటలతో పొలాలు పచ్చగా కలకలలాడుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎంతమందికైనా బిగించేలా..
సౌరశక్తితో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ వాటి ద్వారా పంటలు పండించడం తోటి రైతులను ఎంతో ఆకట్టుకుంటోంది. సౌర విద్యుత్తుతో వస్తున్న ఫలితాలను చూసి మరింత మంది రైతులు ముందుకొస్తున్నారు. వచ్చిన వారందరికీ రాయితీపై పంపుసెట్లు, విద్యుత్తు ఉత్పత్తి పరికరాలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వర్షం పడితే తప్ప పంటలు పండని భూములు నేడు భూగర్భ జల వినియోగంతో పచ్చదనాన్ని సంతరించుకుంటున్నాయి. ప్రభుత్వం చేస్తున్న కృషికి రైతులు కూడా ముందుకు రావడం అభినందనీయం. ఈ అవార్డు వారికే అంకితం. – బాబు.ఎ, కృష్ణా జిల్లా కలెక్టర్‌
అత్యంత నాణ్యమైనవి ఎంపిక..
రాయితీపై అందిస్తున్న ఈ సౌర పంపుసెట్లను అత్యంత నాణ్యమైనవి. సోలార్‌ పంపింగ్‌ సిస్టమ్స్‌లో బిగిస్తున్న మాడ్యూల్స్‌ ఐ.ఇ.సి 61215 ప్రమాణాల ప్రకారం జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో ధ్రువీకరించి ఉంటాయి. గంటకు 150కి.మీ. వాయు వేగాన్ని తట్టుకునేలా వీటిని పొలాల్లో బిగిస్తున్నాం. ఈ పంపుసెట్లను బిగించుకుంటున్న రైతులంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో వారు ఎదుర్కొన్న నీరు, నిధులు, విద్యుత్తు, అనారోగ్య సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతోంది.

నేడు తిరువూరులో TNILIVE-కిలారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సదస్సు

నేడు తిరువూరులో TNILIVE.COM, కిలారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సదస్సు
TNILIVE.COM, కిలారు శ్రీమన్నారాయణ, సరోజినిదేవి చారిటబుల్ ట్రస్ట్ (కిలారు ఫౌండేషన్ – తిరువూరు) ఆధ్వర్యంలో
కృష్ణాజిల్లా, తిరువూరులో అమెరికాలో విద్యా, ఉపాధి, వైద్య అవకాశాలపై ప్రత్యెక సదస్సు నిర్వహిస్తున్నారు. దానికి సంబందించిన వివరాలివి.

కృష్ణ, గోదావరిల్లో కోడిపందేలకు సర్వం సిద్ధం

అత్యున్నత న్యాయస్థానాల తాజా తీర్పుల నేపథ్యంలో రాష్ట్రంలో కోడిపందేల నిర్వహణపై ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయి. అడ్డుకోవడానికి ఓ వైపు పోలీసులు ప్రయత్నిస్తుండగా, మరోవైపు నిర్వాహకులు తమ ఏర్పాట్లలో ఉన్నారు. సాధారణంగా ప్రతీ ఏడాది పండుగకు పది రోజుల ముందునుంచే కోడిపందేలను నిర్వహించేవారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండీ మండలం జువ్వలపాలెం, కలుగుపూడి, ఆకివీడు, మండలం అయిభీమవరం, భీమవరంలోని ఆశ్రఒతోటలు, ద్వారకాతిరుమల, పెదవేగి, పెదపాడు మండలాల్లో అధికంగా పందేలు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం, అమలాపురం, రాజోలు, జగ్గంపేట, సామర్లకోట, కిర్లంపూడి ప్రాంతాల్లో పందేలను నిర్వహించేవారు. కృష్ణాజిల్లా నుజవీడు, హనుమాన్ జంక్షన్, నాగాయలంక, కృత్తివెన్ను, పెడన ప్రాంతాల్లో కోళ్ళను బరిలోకి దింపుతారు. పశ్చిమలోని ఆకివీడు మండలం, అయిభీమవరం, భీమవరంలలో పెద్దఎత్తున నిర్వహించే పందేలను చూడడానికి, పందెం కాయడానికి తెలుగు రాష్ట్రాలు అన్ని ప్రాంతాల నుంచి పందెంరాయుళ్ళు ఇక్కడికి చేరుకునేవారు. గత సీజన్లో ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాల్లో దాదాపు వంద కోట్లకు పైగా కోడిపందేల వ్యాపారం జరిగినట్లు అంచనా. మహాదేవపట్నం, కాళ్లకూరు, ఉండి, జువ్వలపాలెం, అప్పారావుపేట, భీమవరం, ఆశ్రమంతోట, కొరుకొల్లు వంటి ప్రాంతాలు ప్రధాన వేదికలుకాగా ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతాల్లో పందేలు నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. భీమవరం మండలం వెంపతోపాటు పైన పేర్కొన్న కొన్ని బరుల్లో తక్కువ స్తాయిలో పందేలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో పండుగ ముడురోజులే పందేలు నిర్వహించాలని పందెం రాయుళ్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది.ద్యా, ఉపాధి, వైద్య అవకాశాలపై ప్రత్యెక సదస్సు నిర్వహిస్తున్నారు. దానికి సంబందించిన వివరాలివి.

TVRNEWS.COM ప్రారంభం

కృష్ణాజిల్లా, తిరువూరు వార్తల కోసం ఏర్పాటు చేసిన TVRNEWS.COM (తిరువూరు కబుర్లు) వెబ్ పత్రికను ప్రముఖ ప్రవాసాంద్రుడు, కార్డియాలజిస్ట్ డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి గురువారం నాడు ప్రారంభించారు. ఈ పత్రిక ద్వారా మంచి కధనాలు ప్రజలకు ఉపయోగపదేలాగా చూడాలని డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి పేర్కొన్నారు. TNILIVE.COM నిర్వాహకులు TVRNEWS.COMను రూపొందించడం సంతోషకరమని డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి తానా మాజీ అద్యక్షుడు తోటకూర ప్రసాద్, తానా కార్యదర్శి తాతా మధు, అట్లాంటాకు చెందిన ప్రముఖ సాఫ్ట్ వేర్ నిపుణుడు సునీల్ చావ్లి, ప్రముఖ రంగాస్తల నటుడు గుమ్మడి గోపాల కృష్ణ, . TNILIVE.COM డైరెక్టర్ కిలారు ముద్దు కృష్ణ, శ్రీ వాహిని ఇంజనీరింగ్ కళాశాల చైర్మెన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ రంగా నాగేంద్ర బాబు, కరస్పాండెంట్ పోట్రు నాగేశ్వరరావు, కిలారు ఫౌండేషన్ డైరెక్టర్, స్తానిక Z.P.T.C. సభ్యురాలు కిలారు విజయ బిందు తదితరులు పాల్గొన్నారు.