కృష్ణా జిల్లా తిరువూరులో గురువారం సాయంత్రం తెలుగు రాష్టాల్లోనే జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్ట్ హోల్ ను డిజిటల్ పక్రియ ద్వారా ప్రారంభించారు. దేశంలోనే ఇది రెండోవ కోర్ట్ హోల్ గా, తెలుగు రాష్ట్రాల్లో తొలి కోర్ట్ హోల్ గా తిరువూరు కోర్ట్ హోల్ ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో టి.వేణుగోపాలరావు ఆడిషినల్ జిల్లా జడ్జి వెంకటేశ్వరప్రసాద్, నూజివీడు జడ్జి పి.రాజు తిరువూరు జడ్జి, న్యాయవాదులు పాల్గొన్నారు.
Category: జిల్లాలో ముఖ్యమైన ఫోన్ నెంబర్లు
జిల్లాలో ముఖ్యమైన ఫోన్ నెంబర్లు
నూజివీడు ప్రజలకు ముందే వచ్చిన దీపావళి. ఎస్సైను సస్పెండ్ చేసిన ఎస్పీ త్రిపాఠీ.
జిల్లాలో ఓ ఎస్ఐ నిర్వాకం కలకలం రేపుతోంది. ఈ మధ్యనే హనుమాన్ జంక్షన్ ఎస్ఐ విజయ్‌కుమార్.. నూజివీడుకు చెందిన ఓ బ్యూటీపార్లర్ నిర్వాహకురాలితో వివాహేతర సంబంధం కొనసాగించి సస్పెండైన ఘటన మరువకముందే.. తాజాగా మరో ఎస్ఐ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. కృష్ణాజిల్లా నూజివీడు వెంకటకుమార్ అనే ఎస్ఐ ఓ వివాహితను ఫోన్లో లైంగిక వేధింపులకు గురిచేసిన వైనం.. సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ త్రిపాఠి ఆ ఎస్ఐని పిలిచి చీవాట్లు పెట్టారు. తాజాగా అతనిపై వేటు వేశారు. మూడు నెలలపాటు అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ త్రిపాఠీ ఆదేశాలు జారీ చేశారు. ఓ కేసు విషయంలో సాయం కోసం పోలీసు స్టేషన్‌కు వచ్చిన వివాహితను న్యూజివీడు ఎస్సై వెంకటకుమార్ వేధించడం ప్రారంభించారు. ఆమె ఫోన్ నంబర్లు తీసుకొని.. ఫోన్లో తరచూ మాట్లాడుతూ ఆమెను లైంగికంగా వేధించారు. తన కోరిక తీర్చాలని, లేదంటే నీ భర్తను కేసులో ఇరికిస్తానని ఎస్సై నీచంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. తనను వేధించవద్దని, ఏదైనా అల్లరి జరిగితే తనకు ఆత్మహత్యే శరణ్యమని ఆమె వేడుకుంటున్నా ఆ ఎస్ఐ తీరు మారలేదు. ఆమె చెప్పినా వినకుండా గత కొద్ది రోజులుగా అదే పనిగా ఫోన్ చేసి వేధిస్తుండటంతో ఆమె.. ఆ ఫోన్ కాల్స్‌ను రికార్డ్ చేసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ పై స్పందించిన జిల్లా ఎస్పీ.. ఎస్సై గత చరిత్రను ఆరా తీయగా.. వెంకటకుమార్ గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎస్సైపై ఎస్పీ వేటు వేశారు.
బాధితురాలిని లాడ్జికి రమ్మని వేధిస్తున్న నూజివీడు ఎస్సై
తిరువూరులో “వీరప్పన్”లు
తిరువూరులో కొందరు ప్రజాప్రతినిధులు ప్రకృతి ప్రసాదించిన వనరులను పేదలకు అందుబాటులో లేకుండా దోచుకుతింటున్నారు. అధికార పార్టీ పేరు చెప్పి అడ్డగోలుగా కోట్లు కూడబెడుతున్నారు. జిల్లాలో విజయవాడ తరువాత ఇసుక మాఫియా తిరువూరులోనే భారీగా పడగ విప్పింది. తెలంగాణా సరిహద్దులో ఉండటంతో తిరువూరు నుండి ఇసుకు అక్రమ రవాణా చాలా సులభతరమవుతోంది. తిరువూరు, గంపలగూడెం మండలాల నుండి ప్రతినిత్యం వందలాది ట్రాక్టర్లు రాత్రింబవళ్లు సరిహద్దులో ఉన్న తెలంగాణాకు తరలిస్తున్నారు. తెలంగాణా సరిహద్దు గ్రామాల్లో నిల్వ చేసి హైదరాబాద్‌కు లక్షలాది రూపాయాలు అడ్డగోలుగా దోచుకుతింటున్నారు. సామాన్యుడు ఒక బాత్రూం కట్టుకోవాలన్నా, తన భవనానికి మరమ్మత్తు చేసుకోవాలన్నా ఒక ట్రాక్టర్ ఇసుక దొరకడం చాలా కష్టంగా ఉంది. దొరికినా ఒక్కో ట్రాక్టర్‌కు రూ.2000ల వరకు వసూలు చేస్తున్నారు. గానుగపాడు, చింతలపాడు, ముష్టికుంట్ల, వాముకుంట్ల, వినగడప తదితర ప్రాంతాల్లోని కట్టలేరు, పడమటి వాగుల నుండి ఇసుక బహిరంగంగానే రవాణా అవుతున్నప్పటికీ అధికారులు మామూళ్ల మత్తులో మునిగి ఇసుక తరలిస్తున్న ప్రజా ప్రతినిధులకు అండదండలు అందిస్తున్నారు. ఒక్క గానుగపాడు నుండే రోజుకు 50 ట్రాక్టర్లకు పైగా పొరుగునే ఉన్న ఖమ్మం జిల్లాకు తరలివెళ్తోంది. తిరువూరు పట్టణం సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో ఇసుకను నిల్వ చేసి బహిరంగంగానే సరిహద్దుల్లో చెక్‌పోస్టులు దాటించి తరలిస్తున్నారు. పైగా అధికారుల నిఘా సరిగా లేకపోవడంతో ఇసుక అక్రమ రవాణా తిరువూరు, గంపలగూడెం మండలాల్లో అడ్డగోలుగా సాగుతోంది.
*** కలెక్టర్ గారు…పట్టుకోండి చూద్దాం!
జిల్లాకు నూతనంగా వచ్చిన కలెక్టర్ బి.లక్ష్మికాంతం జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను ఉక్కు పాదంతో అణచివేస్తామని, అక్రమ రవాణాదారులపై పీడీ యాక్టులు ప్రయోగిస్తామని ప్రకటించారు. ఇసుక రవాణాపై 24 గంటల పాటు నిఘా ఉంచామని తెలిపారు. కలెక్టర్ ప్రకటన ప్రభావం తిరువూరులో ఏ మాత్రం పనిచేయడం లేదు. తిరువూరు ప్రాంతంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను నిరోధించాలని సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలఒటే ఫోన్ నెంబర్లు: 0866-2474700, 2474701, 2474702.
ఏపీ మంత్రుల ఫోను నెంబర్లు
1. చంద్రబాబు నాయుడు -ముఖ్యమంత్రి, జనరల్ అడ్మినిస్ట్రేషన్, పెట్టుబడులు,మౌలిక వసతులు, మైనార్టీ సంక్షేమం, సాధికారిత, సినిమాటోగ్రఫీ,హ్యాపీనెస్ ఇండెక్స్, మంత్రులకు కేటాయించని మిగిలిన శాఖలు _9963510004 / 9705710004
2. కేఈ కృష్ణమూర్తి – డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ..9440429999
3. నిమ్మకాయల చినరాజప్ప – డిప్యూటీ సీఎం, హోంశాఖ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ ( విపత్తు నిర్వహణ)..9848160743
4. యనమల రామకృష్ణుడు – ఆర్థికశాఖ, ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్స్, శాసనసభ, వ్యవహారాలు, 9849914555
5. నారాలోకేష్ – పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ (ఐటీ)..
6. కిమిడి కళా వెంకట్ రావు -విద్యుత్ శాఖ..9440352699. / 9848022344
7. కింజరపు అచ్చెన్నాయుడు – రవాణా శాఖ, బీసీ సంక్షేమం,చేనేత, జౌళి..9440196777
8. వెంకట సుజయ కృష్ణ రంగారావు – మైనింగ్ & జియాలజీ ..8096666666
9. సీహెచ్ అయ్యన్నపాత్రుడు – రోడ్లు భవనాల శాఖ..9849850869
10. గంటా శ్రీనివాస రావు – ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాశాఖ. .9542222222
11. కొత్తపల్లి శ్యామ్యూల్ జవహార్ – ఎక్సైజ్ శాఖ..9951314101. / 8331036999 / 9440920755
12. పితాని సత్యనారాయణ- కార్మిక శాఖ, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్. .9441333699
13. పైడికొండల మాణిక్యాల రావు – దేవాదాయశాఖ. 9440901460
14. కామినేని శ్రీనివాస్- వైద్య,ఆరోగ్యశాఖ. 9393344014
15. కొల్లు రవీంద్ర -న్యాయశాఖ, క్రీడా, యువజన సర్వీసులు ..9985122254
16. దేవినేని ఉమా మహేశ్వరరావు- జలవనరుల శాఖ – 9848035405 / 9440135405
17. నక్కా ఆనంద్ బాబు – సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ 9866237201
18. ప్రత్తిపాటి పుల్లారావు – పౌర సరఫరాల శాఖ, వినియోగ దారుల వ్యవహారాలు..9701274747. / 9246246666
19. శిద్ధా రాఘవరావు – అటవీశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ 8592238111. / 9848152686
20. పొంగూరి నారాయణ – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్, అర్బన్ హౌసింగ్..9848012699
21. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి – వ్యవసాయశాఖ, హార్టికల్చర్, సెరికల్చర్,అగ్రిప్రాసెసింగ్…9849254699
22. చెండిపిరాల ఆదినారాయణ రెడ్డి – మార్కెటింగ్ & గిడ్డంగుల శాఖ, పశుసంవర్థక శాఖ, డెయిరీ డెవలప్ మెంట్ , మత్స్య, సహకార శాఖ..9440200688. / 9989245678
23. భూమా అఖిల ప్రియా రెడ్డి – టూరిజం , తెలుగు భాషా సాంస్కృతిక శాఖ..9849786222
24. కాల్వ శ్రీనివాసులు – రూరల్ హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ.. 9441588999
25. పరిటాల సునీత – స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, సెర్ప్, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్. 9704479333
కృష్ణాజిల్లాలో గెలుపొందిన లోక్‌సభ, శాసనసభ్యుల వివరాలు
ఎ.కొండూరు మండల ప్రజాప్రతినిధుల వివరాలు
విస్సన్నపేట మండల ప్రజాప్రతినిధుల వివరాలు
గంపలగూడెం మండల ప్రజాప్రతినిధుల సమాచారం