తిరువూరులో అరుదైన కదంబం పుష్పాలు

tvrnews.com-kadambam
తిరువూరులో అరుదైన కదంబం పుష్పాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ప్రతి ఏడాది శ్రావణ మాసంలోనే ఈ పుష్పాలు దర్శనమిస్తాయి. కదంబం చెట్లు అరుదుగానే కనిపిస్తాయి. వీటికి పూసే పుష్పాలు కనకదుర్గకు, లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనవిగా పురాణాలు చెప్తున్నాయి. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ దారిలో కిలారు ముద్దుకృష్ణ నివాసం ఎదురుగా ఉన్న ఈ కదంబం చెట్టు ఈ ఏడాది విరబూసి చూపరులను అలరిస్తోంది.
tvrnews.com
tvrnews.com

తిరువూరులో పూర్వ విద్యార్థినుల సమ్మేళనం-చిత్రాలు

tvrnews.com
తిరువూరులోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 1983-84 మధ్యకాలంలో విద్యనభ్యసించిన విద్యార్థినుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నాడు స్థానిక వాహినీ కళాశాలలో నిర్వహించారు. 35సంవత్సరాల అనంతరం కలిసి చదువుకున్న స్నేహితురాళ్లను చూసుకుని, ఆత్మీయంగా పలకరించుకుని వీరంతా మురిసిపోయారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. అనంతరం తాము చదువుకున్న పాఠశాలకు వెళ్లి గత స్మృతులను నెమరవెసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పొట్లూరి శాంతి తదితరులు సమన్వయపరిచారు.వైభవంగా నెమలి నల్లనయ్య ఉత్సవాలు

నెమలి వేణుగోపాలస్వామి ఆలయ 60వ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆరు రోజులపాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన శుక్రవారం వేణుగోపాలస్వామిని పెండ్లి కుమారునిగా అలంకరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ అర్చకులు టి.గోపాలాచార్యులు ఆధ్వర్యంలో రుత్విక బృందం ఉదయం 5:30 గంటలకు స్వామివారి మూలవిరాట్‌కు సుప్రభాతసేవ, ప్రాతఃకాలార్చనలు నిర్వహించారు. సువర్ణాభరణాలు, పుష్పాలతో మూలవిరాట్‌ను శోభాయమానంగా అలంకరించారు. తదుపరి వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాన్ని పెండ్లికుమారునిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఉభయ దేవేరులైన రుక్మిణీసత్యభామ ఉత్సవ విగ్రహాలను నూతన వస్త్రాలతో అలంకరించారు. సాయంత్రం విజయవాడకు చెందిన ప్రముఖ వేదపండితులు పరాశరం పట్టాభిరామాచార్యులు ఆధ్వర్యంలో అంకురార్పణ, వాస్తుపూజ, అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం, గరుడపట ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు వడ్లమూడి రాజశేఖర్‌, కార్యనిర్వాహణాధికారి వై.శివరామయ్య ఆద్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. నెమలి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పాలకవర్గ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనురాధ వాగు వద్ద జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరువూరు, మధిర, సత్తుపల్లి, విజయవాడ, వైరా ఆర్టీసీ డిపోల నుంచి బస్సు సర్వీసులు నడుపుతున్నారు.

తిరువూరు పరిసర ప్రాంతాల్లో శివరాత్రి వేడుకలు

మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా తిరువూరులో ఉన్న రెండు శివాలయాల్లో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించారు. శుక్రవారఒ రాత్రి చంద్రమౌళిశ్వర స్వామి దేవాలయంలోనూ, రామలింగేశ్వర స్వామి దేవాలయంలోనూ శివపార్వతుల కళ్యాణాలు వైభవంగా నిర్వహించారు. సమీపంలో ఉన్న నీలాద్రి గుళ్ళు, గుట్టపాడు అప్పయ్య స్వామి తిరునాళ్ళకు తిరువూరు నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్ళారు. ఈ పుణ్యక్షేత్రాలకు ఆర్టిసీ ప్రత్యేక బస్సులను నడిపింది.