తానా అధ్యక్షుడు వేమన సతీష్‌తో స్వామిదాస్ సమావేశం. తెలుగు సంఘం గోడపత్రిక ఆవిష్కరణ.


కృష్ణా జిల్లా తిరువూరు మాజీ శాసనసభ్యుడు, తెదేపా తిరువూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ గురువారం నాడు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అధ్యక్షుడు వేమన సతీష్‌తో వర్జీనియాలోని సితార సమావేశ మందిరంలో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు మన్నే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రవాసులు మాతృభూమి కోసం సేవ చేయాలని స్వామిదాస్ కోరారు. తానా ఆధ్వర్యంలో తిరువూరు మండలం రోలుపడి గ్రామంలో కిలారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తానా సేవలను ఆయన అభినందించారు. తానా అధ్యక్షుడు వేమన సతీష్ మాట్లాడుతూ ఎన్‌టీఆర్ తొలితరం శిష్యుల్లో స్వామిదాస్ అగ్రగణ్యులని, పార్టీకీ నియోజకవర్గానికి ఆయన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. తానా ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం స్వామిదాస్ చేతులమీదుగా జీడబ్ల్యూటీసీఎస్ సంక్రాంతి వేడుకల గోడపత్రికను ఆవిష్కరించారు.

అమెరికాలో గద్దె-నల్లగట్ల దంపతులకు అభినందన

tnilive.com tnilive tni nallagatla gadde anuradha
నూతన రాజధాని అమరావతిలో విద్యా-వైద్యం-ఆరోగ్య రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు అత్యయిక అవసరం అధికంగా ఉందని, దీనికి తోడ్పడేందుకు ప్రవాసులు పెద్దసంఖ్యలో బాధ్యాతాసహితంగా తరలి రావాలని కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ విజ్ఞప్తి చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, అనురాధ, తిరువూరు మాజీ శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాస్, కృష్ణా జడ్పీ మాజీ చైర్‌పర్సన్ నల్లగట్ల సుధారాణిలు ఆదివారం సాయంత్రం ఇర్వింగ్‌లోని హిల్‌టాప్ సమావేశ మందిరంలో డల్లాస్ పరిసర ప్రాంతంలో నివసిస్తున్న కృష్ణా జిల్లా ప్రవాసులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏపీ ప్రభుత్వం రహదారులు, తల్లిబిడ్డల ఎక్స్‌ప్రెస్, తాగునీరు, సాగునీరు, పరిశ్రమల ఏర్పాటు వంటి వాటి విస్తృత పరికల్పనకు విశేష కృషి జరుపుతోందని, విద్యా-ఆరోగ్య రంగాలు గ్రామీణ ప్రాంతాల్లో మరింత ప్రభావితంగా చొచ్చుకుపోవాలంటే ప్రవాసుల చొరవ వలనే అది సాధ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. తను అమెరికా పర్యటనకు బయల్దేరే ముందు రూ.192కోట్లను కృష్ణా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు మంజూరు చేశానని ఆమె తెలిపారు. బాబు వస్తే జాబు వస్తుందనే నినాదానికి అశేష ప్రాచుర్యం కల్పించిన ప్రవాసులు ఆ నినాదాన్ని నిజం చేసేందుకు పెట్టుబడులతో కదిలిరావాలని కోరారు. అనంతరం ప్రసంగించిన కృష్ణా జడ్పీ మాజీ చైర్‌పర్సన్ నల్లగట్ల సుధారాణి…ఏపీలో సామాజిక జీవన నాణ్యత మెరుగ్గా ఉందని, సామాజిక బాధ్యతను విస్మరించకుండా ప్రజలు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. తాను సభ్యురాలిగా ఉన్న కమీషన్ ద్వారా ఎటువంటి ప్రజాపయోగ పనులైనా సరే తన పరిధి అవతల ఉన్నా సరే కచ్చితంగా చేయవల్సిందిగా ముఖ్యమంత్రి సూచిస్తున్నారని, మెరుగైన రాష్ట్రం కోసం ఆయన తపన దీని ద్వారా వెల్లడి అవుతోందని ఆమె పేర్కొన్నారు. ఏపీలో అభివృద్ధిపరంగా పెనుమార్పులు అతి వేగంగా సంభవిస్తున్నాయని, దీన్ని అందరూ హర్షించాలని ఆమె కోరారు. తిరువూరు మాజీ శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా అనగానే స్వాతంత్ర్య సమరోద్యమ నాయకులు, బెజవాడ కనకదుర్గ, సినీ, కళా, సాహితీ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు జ్ఞప్తికి వస్తున్నారని, ఇటువంటి మహోన్నత జిల్లాకు సమీపంలో నూతన రాజధాని నిర్మాణం కావడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ప్రవాసులు జిల్లా అభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ ప్రసంగిస్తూ ఎకరానికి కోటి రూపాయిల ఆదాయం వచ్చే విధంగా ఏపీలో వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. కోర్ కమిటీ సభ్యుడిగా నిరంతరం అతి సమీపంగా రాష్ట్రంలో అమలయ్యే పలు పథకాలు, నిర్మాణాలను తాను సభ్యుడిగా ఉన్న కోర్ కమిటీ అధ్యయనం చేస్తుందని, వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఇటీవల విశాఖలో ఏర్పాటు చేసిన అగ్రిటెక్ సదస్సు ద్వారా ఎకరానికి కోటి రూపాయిల ఆదాయం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా ఆక్వా రంగం కొత్తపుంతలు తొక్కుతోందని, గోదావరి నీరు కలవడం చేత పంటలు సారవంతమైన వనరులను అద్భుతంగా వినియోగించుకుంటున్నాయని తెలిపారు. సభ ప్రారంభానికి పూర్వం గద్దె దంపతులను మొక్కపాటి దినేష్, నల్లగట్ల దంపతులను త్రిపురనేని దినేష్‌లు సభకు పరిచయం చేశారు. స్థానిక ప్రవాసుడు చలసాని కిషోర్ నివాసంలో ఏర్పాటు చేసిన ఎన్‌టీఆర్ విగ్రహానికి గద్దె-నల్లగట్ల దంపతులు ఘననివాళులు అర్పించారు. ఈ ఆత్మీయ సమావేశంలో తాతినేని రాం, కోనేరు శ్రీధర్, చలసాని కిషోర్, కొరడా కృష్ణ, చాగర్లమూడి సుగన్, అడుసుమిల్లి రాజేష్, డా.సూద్నగుంట రాఘవేంద్ర ప్రసాద్, వీరపనేని అనీల్, పోలవరపు శ్రీకాంత్, జెట్టి శ్రీరాం, సీ.ఆర్.రావు, మండువ సురేష్, అనీల్ తన్నీరు, నల్లగట్ల క్రాంతి, వీర్నపు చినసత్యం, ఉప్పలపాటి కృష్ణారెడ్డి, యార్లగడ్డ అప్పారావు, కోగంటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
డల్లాస్‌లో తెదేపా నేత స్వామిదాస్ దంపతులకు సత్కారం

tvrnews.com nallagatla swamydas
కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి, తెదేపా సీనియర్ నేత నల్లగట్ల స్వామిదాస్, ఆయన సతీమణి కృష్ణాజిల్లా జడ్పీ మాజీ చైర్‌పర్సన్ సుధారాణి దంపతులను డల్లాస్‌లోని ప్రవాసులు గురువారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. తొలిసారి అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లో పర్యటిస్తున్న వీరిరువురు స్థానిక కృష్ణా జిల్లా ప్రవాసులతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీతో తనకున్న పలు అనుభవాలను స్వామిదాస్ నెమరవేసుకున్నారు. 1994లో మొట్టమొదటి సారి ఎన్.టి.రామారావు తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గుర్తింపును ఇచ్చారని, అప్పటి నుండి గత 23ఏళ్లుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు తనకు డబ్బులతో ప్రభోలాకు గురిచేసి మభ్యపెట్టాలని చూశారని, కానీ చంద్రబాబు తమపై చూపిన ఆదరణ, అభిమానాలను మరిచిపోకుండా అన్నివేళలా పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు తమ కుటుంబం విశేషమైన కృషి చేసిందని పేర్కొన్నారు. ప్రవాసులకు ఓటు హక్కు బిల్లు ఆమోదముద్ర పడితే తద్వారా కృష్ణా జిల్లాలో తెదేపా మరిన్ని సీట్లను కైవసం చేసుకునే అవకాశం కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు. కార్యక్రమంలో ప్రవాసులు చలసాని కిషోర్, తాతినేని రాం, నవీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆర్కాన్సాలో జరిగే తమ కుమారుడు క్రాంతి స్నాతకోత్సవానికి హాజరయి అటు నుండి ఫిలడెల్ఫియా, న్యూజెర్సీ, బోస్టన్, వాషింగ్టన్ డీసీ, శాన్‌ఫ్రాన్సిస్కో తదితర నగరాల్లో స్వామిదాస్-సుధారాణిలు పర్యటించనున్నారు. ప్రవాసులతో భేటీకి పూర్వం స్వామిదాస్ దంపతులు ఇర్వింగ్‌లోని మహాత్మాగాంధీ స్మారకస్థలిని సందర్శించారు. స్మారకస్థలి కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ వీరికి విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన విశేషాలను వివరించారు.
శ్రీవాహినిలో “ఆటా” విద్యార్ధి చైతన్య సదస్సు


అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా సోమవారం నాడు కృష్ణాజిల్లా తిరువూరు శ్రీవాహిని ఇంజనీరింగ్ కళాశాలలో ‘విద్యార్ధుల చైతన్య సదస్సు’ నిర్వహించారు. న్యూయార్క్ ఫ్యాషన్ ఇనిస్టిట్యుట్ ఆఫ్ టెక్నాలజీ రిజిస్టార్ డా.వంగపాటి రాజశేఖర్ రెడ్డి విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికాలోను, భారత్ లోను ఉన్న ఇంజనీరింగ్ బోధనా విధానాల మధ్య ఉన్న తేడాల గురించి, అమెరికాలో ఉన్నత విద్యావకాశాల గురించి ప్రొఫెసర్ రాజశేఖర్ వివరించారు. ప్రతి విద్యార్ధి తనకంటూ తప్పనిసరిగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని కష్టపడి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగితే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు గతంలో ధనవంతులు పిల్లలే వచ్చేవారని ప్రస్తుతం బాగా చదువుకుంటున్న గ్రామీణ విద్యార్ధులు సైతం ఈ దేశాలకు ఉన్నత చదువులు కోసం ఎక్కువగా వెళ్తున్నారని తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ TNILIVE.COM నిర్వాహకుడు కిలారు ముద్దుకృష్ణ సభకు అధ్యక్షత వహించారు. కళాశాల చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, కార్యదర్శి ఊటుకూరు సుబ్రహ్మణ్యం, కరస్పాండెంట్ పోట్రు నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ డా.రంగా నాగేంద్రబాబు, అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రొఫెసర్ రాజశేఖర్‌ను పాలకవర్గ సభ్యులు సత్కరించారు.శ్రీవాహినీ అధ్యాపకుల వనభోజనాలు-చిత్రాలు

tvrnews.com tiruvuru sreevahini picnic 2017 tiruvuru news tiruvuru kaburlu tiruvuru krishna district
తిరువూరు శ్రీవాహిని కళాశాల అధ్యాపకులు ఎ.కొండూరులోని నాగసింధు స్పిన్నింగ్ మిల్స్ వారి మామిడితోటలో వనభోజన కార్యక్రమాన్ని జరుపుకున్నారు. కార్యక్రమంలో శ్రీవాహిని ప్రతినిధులు, అధ్యాపకులు సకుటుంబంగా పాల్గొని సందడి చేశారు. ఆ చిత్రాలు మీకోసం…
జాతీయ రహదారుల సంస్థ నిర్వాకం- తిరువూరు బైపాస్‌రోడ్డులో అంధకారం

విజయవాడ–జగదల్‌పూర్ జాతీయ రహదారి(హైవే-30) తిరువూరు బైపాస్‌రోడ్డు గుండా వెళుతుంది. జాతీయ రహదారి కాక మునుపు మున్సిపాలిటీ ఆద్వర్యంలో బైపాస్‌రోడ్డులో వీధి దీపాలు వెలిగేవి. రోడ్డు విస్తరణలో భాగంగా జాతీయ రహదారుల సంస్థ అధికారులు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి వాటికి అమర్చిన దీపాలను తొలగించారు. దీంతో బైపాస్‌రోడ్డులో దాదాపు రెండు కిలోమీటర్ల మేర గత నాలుగు నెలల నుండి అంధకారం ఏర్పడింది. జాతీయ రహదారుల సంస్థకు చెందిన కాంట్రాక్టరు బైపాస్‌రోడ్డు చర్చి సెంటరులో (నాలుగు రోడ్ల కూడలి ) ఇరవై అడుగుల ఎత్తులో ఒక భారీ విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ సెంటరులో వెలుగులు చిందే విధంగా ఆరు భారీలైట్లను అమర్చారు. ఈ లైట్లు ఏర్పాటు చేసి నాలుగు నెలలు అయింది. ముచ్చటగా మూడు వారాల పాటే ఈ స్తంభానికి అమర్చిన లైట్లు వెలిగాయి. గత మూడు నెలల నుండి ఈ స్తంభానికి అమర్చిన లైట్లు వెలగడం లేదు. దీంతో ఈ ప్రాంతంలో అంధకారం ఏర్పడింది. ఈ సెంటరుకు సమీపంలోనే ఒక మద్యం దుకాణాన్ని కుడా ఏర్పాటు చేశారు. చీకటి పడితే బైపాస్‌రోడ్డులోకి వెళ్లడానికి, మరీ ముఖ్యంగా పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మున్సిపాలిటి వారు అక్కడక్కడా ఏర్పాటు చేసిన వీధి దీపాలను ఈ రోడ్డు కాంట్రాక్టర్ తీసుకెళ్లాడని, రోడ్డు విస్తరణ అనంతరం వీటిని తిరిగి అమర్చలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు కూడా తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా జాతీయ రహదారుల సంస్థ అధికారులు, మున్సిపల్ అధికారులు స్పందించి తిరువూరు బైపాస్‌రోడ్డులో లైటింగ్ వ్యవస్థ పనిచేసే విధంగా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
tvrnews.com tiruvuru kaburlu tiruvuru news krishna district vijayawada jagadalpur nh 30

పశ్చిమ కృష్ణాలో అడవిమాంసం పేరుతో భారీ మోసం

పశ్చిమ కృష్ణాలోని మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు సరిహద్దుల్లో వేలాది ఎకరాల్లో అడవులు ఉన్నాయి. కొండలు, గుట్టలు, సెలయేరులతో నిండి ఉన్న ఈ అటవీ ప్రాంతంలో వన్యమృగాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ అడవుల్లో అరుదైన చిరుతపులులు కూడా చాలాసార్లు వేటగాళ్ల ఉచ్చులకు బలైన సంఘటనలు ఉన్నాయి. దుప్పులు, అడవిపందులు, కుందేళ్లు, కొండగొర్రెలు, నెమళ్లు వంటివి అధికంగానే ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న కొంతమంది వేటగాళ్లు అడవుల్లో సంచరిస్తూ వన్యమృగాలను వేటాడటం తరచుగా జరుగుతూ ఉంది. సమీపంలో ఉన్న పంటపొలాల్లోకి వన్యమృగాలు ప్రవేశించి పంటలను నాశనం చేస్తూ ఉండటంతో రైతులు కూడా వీటిని మట్టుబెట్టడానికి నాటుబాంబులను, ఉచ్చులను పంటపొలాల్లో అమర్చి వీటిని హతమార్చి వాటి మాంసాన్ని విక్రయించడం గతంలో భారీగా జరిగేది. ఈ ప్రాంతంలో అటవీ జంతువుల మాంసానికి ఉన్న గిరాకీని ఆసరాగా చేసుకుని ఇటీవలి కాలంలో కొంతమంది వేటగాళ్లు నకిలీ మాంసాలను విక్రయిస్తున్నారు. దుప్పి మాంసం పేరుతో దున్నపోతులను, గేదెలను సంహరించి అమ్ముతున్నారు. అడవిపందుల పేరుతో మామూలు పంది మాంసాన్ని విక్రయిస్తున్నారు. తాజాగా వీరి జాబితాలో కుక్కలు కూడా చేరాయి. జీ.కొండూరులో అటవీ మాంసం పేరుతో కుక్కను సంహరించి మాంసాన్ని విక్రయిస్తూ ఉండగా శనివారం నాడు గ్రామస్థులు నకిలీ విక్రయదారులను వలపన్ని పట్టుకున్నారు. కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం కోడూరు గ్రామంలో వీథి కుక్కల్ని చంపి అడవి మాంసం ముసుగులో విక్రయిస్తున్నారని కోడూరు గ్రామస్థులు నూజివీడు సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీనివాసరావుకి సమాచారం ఇవ్వగా ఆయన ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం జి.కొండూరు ఎస్ఐ రాజేష్ తన సిబ్బందితో అదుపులోకి తీసుకున్నారు. జంతు కళేబరాలను పోస్ట్ మార్టం కొరకు సంబంధిత అధికారులు స్వాధీనపరుచుకున్నారు. జీ.కొండూరు ఎస్ఐ రాజేష్ వివరాలు తెలియజేశారు. కట్టా ఆదినారాయణ,శేగు లక్ష్మణరావు అనే ఇద్దరు వ్యక్తులు వీథి కుక్కలను చంపి వాటి తలను చర్మాన్ని వేరు చేసి అడవి దుప్పి మాంసం క్రింద ప్రజలను మోసం చేసి విక్రయాలు జరుపుతున్నారని వీరిరువురిపై మోసం మరియు జంతుహింస నిరోథం క్రింద కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తామని తెలిపారు. గత కొంత కాలంగా వీరు కుక్కలనే కాకుండా పలు జంతువుల మాంసాన్ని కూడా ఇలాగే మోసపూరితంగా అమ్ముతున్నారని తమ దృష్టికి వచ్చిందని అన్నారు.అలాగే అడవి మాంసం మాత్రమే కాకుండా మేక మాంసం ముసుగులో కూడా వీరు పలు హోటళ్ళలో విక్రయాలు జరిపారనే సమాచారం మేరకు ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఇటువంటి సంఘటనలను ఉపేక్షించేది లేదని గతంలో జి.కొండూరు మండలంలో మేక మాంసాన్ని ఐస్ లో నిల్వ ఉంచి ఆ నిల్వ ఉన్న మాంసాన్ని అమ్మకాలు జరుపుతున్న మాంసం వ్యాపారులపై కూడా కేసులు పెట్టి కోర్టుకు హాజరు పరిచిన విషయాన్ని స్పష్టం చేశారు.ఈ విషయమై ప్రజల్లో కూడా అవగాహన రావాలని ఆయన కోరారు.మరోవైపు గ్రామీణ ప్రాంత ప్రజలను ఒక్క సారిగా దిగ్బ్రాంతి కి గురి చేసిన ఈ సంఘటన పై డీఎస్పీ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్యప్రాణుల జోలికి వెళితే తీవ్ర నేరమని, ఇటువంటి మోసపూరిత చర్యలకు పూనుకుని అమాయక ప్రాణులను వధించి వ్యాపారాలు నిర్వహించే వారెవరైనా వదిలేది లేదని,కఠిన చర్యలకు బాధ్యులు అవుతారని తెలిపారు. ఈ ప్రాంత అభయారణ్యంలోని జంతువులను సంరక్షించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

నరకాన్ని చూపిస్తోన్న తిరువురు ప్రధాన రహదారులు. లీడర్లు ఉండే గల్లీల్లో మాత్రం సిమెంటు రోడ్డులు.


తిరువూరు నగర పంచాయతీలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉంటుందనడానికి పట్టణంలో అధ్వాన్నంగా ఉన్న ప్రధాన రహదారులే నిదర్శనం. మున్సిపాలిటీ అయిన అనంతరం కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టి చిన్నచిన్న లీడర్లు ఉండే గల్లీల్లో సిమెంటు రోడ్లు వేసిన పాలకవర్గం ప్రధాన రహదారులను మరమ్మత్తులు చేయడం కూడా మరిచిపోయింది. పట్టణంలోని చాలా ప్రధాన రహదారులు మోకాలు లోతు గుంటలు పడి మురికి కూపాలను తలపిస్తున్నాయి. ఈ రహదారులపై నడవలాంటే నరకం కనిపిస్తోందని ప్రజలు వాపోతున్నారు. పన్నులు రూపేణా కోట్లాది రూపాయిలు ముక్కులు పిండి మరీ వసూలు చేస్తున్న మున్సిపాలిటీ రోడ్ల నిర్వహణలో మాత్రం ఘోరంగా విఫలం చెందింది. ప్రతినిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే రహదారుల పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు తమ ఇంటి ముందు, తమ బంధువుల ఇంటి ముందు చిన్న చిన్న గల్లీల్లో సిమెంటు రోడ్లు వేయమని పైరవీలు చేసి కోట్లాది రూపాయిలను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. ఆర్టీసీ బస్టాండు నుండి కడియాల నాగేశ్వరరావు ఆసుపత్రి మీదుగా వెళ్లే రహదారి, బస్టాండు వెనుక నుండి మార్కెట్ మీదుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రాదారి, జంట సినిమాహాళ్ల రోడ్డు, ఎమ్మార్వో ఆఫీసు నుండి ట్రావెలర్స్ బంగ్లాకు వచ్చే రోడ్డు, మండల పరిషత్ కార్యాలయం ముందు ఉన్న రోడ్డు వంటి ప్రధాన రహదారులు అధ్వాన్నంగా ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. తిరువూరులో ప్రధానమైన పోలీసు స్టేషన్, రెవెన్యూ, ట్రెజరీ వంటి కార్యాలయాల ముందు ఉన్న రోడ్డును గత 50సంవత్సరాల నుండి అలాగే వదిలేశారు. మరొక పక్క నియోజకవర్గ తెదేపా నాయకులు ఎన్.స్వామిదాస్, తాళ్లూరి రామారావు తదితరులతో పాటు ఇతర ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు సిమెంటు రోడ్లు వేసుకుని తమను విస్మరించారని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు కళ్లు తెరిచి పట్టణంలో ఉన్న ప్రధాన రహదారులను మరమ్మత్తులు చేయించాలని, వాటిని సిమెంటు రోడ్లుగా మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

తిరువూరు శ్రీవాహినిలో దుమ్మురేపిన ఎంబీఏ ఫ్రెషర్స్ పార్టీ

tiruvuru sreevahini freshers party tiruvuru news tvrnews.com tiruvuru krishna district egineering colleges andhra pradesh engineering college freshers party
తిరువూరు శ్రీవాహిని ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం నాడు ఎంబీఏ ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకల్లో జూనియర్, సీనియర్ విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థినులు సాంప్రదాయ దుస్తుల్లో హాజరయి వేడుకలకు ఆకర్షణ తీసుకొచ్చారు. విద్యార్థుల డ్యాన్సులు అలరించాయి.