గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆరు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో మంగళవారం వేణుగోపాలస్వామిని పెండ్లి కుమారుడిగా అలంకరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ అర్చకులు టి.గోపాలాచార్యులు ఆధ్వర్యంలో రుత్విక బృందం ఉదయం 5.30 గంటలకు స్వామివారి మూలవిరాట్‌కు సుప్రభాతసేవ, ప్రాతఃకాలార్చనలు నిర్వహించింది. సువర్ణాభరణాలు, ముత్యాలు, పుష్పాలతో మూలవిరాట్‌ను శోభాయమానంగా అలంకరించారు. తదుపరి వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఉభయ దేవేరులైన రుక్మిణీసత్యభామ ఉత్సవ విగ్రహాలను నూతన వస్త్రాలతో అలంకరించారు. సాయంత్రం విజయవాడకు చెందిన వేదపండితులు పరాశరం పట్టాభిరామాచార్యులు ఆధ్వర్యంలో అంకురార్పణ, వాస్తుపూజ, అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం, గరుడపట ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు వడ్లమూడి రాజశేఖర్, కార్యనిర్వాహణాధికారి వై.శివరామయ్య, పాలకవర్గ సభ్యులు ఎస్.పద్మావతి, కె.శ్రీను ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పాలకవర్గ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. నెమలి వేణుగోపాల స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 7 గంటలకు స్వామివారికి శేషవాహన సేవ మహోత్సవం చేశారు. ప్రత్యేక రథంపై ఏర్పాటు చేసే శేషవాహనంపై రుక్మిణీసత్యభామా సమేతులైన వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాలను ఆశీనులను చేసి మేళతాళాలలతో తిరువీధుల్లో ఊరేగించారు.
tags: nemali krishna temple nemali brahmotsavam 2018 nemali krishna district gampalagudem tvrnews tiruvuru news tiruvuru krishna district temples
Category: ‘చిత్ర’ విశేషాలు
‘చిత్ర’ విశేషాలు
తిరువూరు నియోజకవర్గంలో వైకాపా హడావుడి
వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాద యాత్ర వెయ్యి కిలో మీటర్లు పూర్తీ అయిన సందర్భంగా తిరువూరు నియోజకవర్గంలో వైకాపా కార్యకర్తలు సందడి చేసారు. తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు, విస్సన్నపేటలో ఆపార్టి నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర చేసారు. ఎమ్మెల్యే కే. రక్షణ నిధి సారద్యంలో ఈ పాదయాత్రలు జరిగాయి.వైకాపా నాయకులు ఎన్.సూరి రెడ్డి, రాఘవరపు బుజ్జి, శీలం నాగనర్సి రెడ్డి, కలకొండ రవికుమార్, కావూరి విని కుమార్, కొత్తగుందల వంశీ తదితరుల ఆద్వర్యంలో ఈ పాదయాత్రలు నిర్వహించారు. పార్టికి చెందిన సర్పంచిలు, ఎంపీటీసీ సభ్యులు, మండల పార్టీ అద్యక్ష కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పెద్ద సంఖలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విస్సన్నపేటలో ప్రజాసంకల్ప యాత్ర-చిత్రాలు
కృష్ణాజిల్లా తిరువూరు నియోజక వర్గంలోని విసన్నపేట లో వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల చేరుకున్న సందర్భంగా విసన్నపేటలొ వైఎస్సార్ పార్టీ నాయకులు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని వైయస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. సిద్ధార్ధ స్కూల్ దగ్గర నుండి ప్రారంభమైన పాదయాత్రకు అభిమానులు కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు ఈ పాదయాత్ర సెంట్ తెరెసా స్కూల్ వరకూ కొనసాగించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు లోకేష్ రెడ్డి మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర ప్రజా సమస్యలను తెలుసుకొని tdp చేస్తున్నా అరాచకాలను అరికట్టుటకు మరి ఎంతో సమయం లేదని రాబోయే ఎలక్షన్లలో వైయస్సార్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి భూక్య రాణి వైస్ ఎంపీపీ దుర్గారావు కుటుంబరావు ప్రకాష్ ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైభవంగా తిరువూరు తిరునాళ్ళు ప్రారంభం
గత 400సంవత్సరాల నుండి మాఘమాసంలో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న తిరువూరు శ్రీ వేంకటాచల స్వామి కల్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తిరువూరు తిరునాళ్ళుగా ఈ ఉత్సవాలు పూర్వం జమిందార్ల హయాం నుండి జరుగుతున్నాయి. పాత తిరువూరులో శ్రీ వేంకటాచల స్వామీ దేవాలయాన్ని 416 ఏళ్ల క్రితం అప్పటి జమిందార్లు నిర్మించారు. దీనికోసం తిరువూరు రోలుపడి గ్రామాల్లో దాదాపు 50ఎకరాల భూమిని ఉత్సవాల కోసం ధూపదీప నైవేద్యాల కోసం జమిందార్లు కేటాయించారు. సోమవారం నుండి ఈ ఉత్సవాలు వైభవంగా జరిగేటట్లుగా ఏర్పాట్లు చేశారు. 30వ తేదీ మంగళవారం రాత్రి స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసారు. ఫిబ్రవరి 1వ తేదీన రధోత్సవం, 2వ తేదీన చూర్ణోత్సవం, 3వ తేదీన స్వామివార్ల పవళింపు సేవతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. మరి కొన్ని వివరాలు దిగువన పరిశీలించవచ్చు.
తిరువూరుపై దండెత్తిన దోమలు. మొద్దు నిద్రలో మున్సిపాలిటి
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత చలికాలంలో తిరువూరుపై దోమలు దండెత్తాయి. సహజంగా తిరువూరు పట్టణం పైకి దోమలు daMDettina డిసెంబరు, జనవరి నెలలో వీచే చలిగాలులకు maatram avi కనిపించవు. ఈ ఏడాది మాత్రం పట్టణంలోని ప్రతి ఇంటిలో పగలు, రాత్రి తేడాలేకుండా దోమలు మనుషులను, పశువులను, ఇతర పెంపుడు జంతువులను పట్టి పీడిస్తున్నాయి. ఊరంతా వ్యాపించి ఉన్న మురికి కాల్వలను తరచుగా శుబ్రం చేయకపోవడం, సరైన డ్రైనేజి వ్యవస్థ లేకపోవడం, ఎక్కడికక్కడ మురికి గుంటలు, దుర్గంధం వెదజల్లుతూ ఉండటంతో ప్రతి నిత్యం దోమలు విజ్రుంభిస్తున్నాyi. గ్రామపంచాయతి నుండి తిరువూరు నగర పంచాయతీగా అభివృద్ధి చెందినప్పటికి పారిశుధ్య పరిస్థితులు మాత్రం రోజురోజుkU అధ్వానంగా దిగజారుతున్నాయి. మున్సిపాలిటిలో దోమలు నివారించే ఫాగింగ్ యంత్రాలు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించే naathuDE కరువయ్యాడు. దోమల సంహరణకు మున్సిపాలిటి ఏ విధమైన చర్యలు చేపట్టడం లేదని ప్రజలు వాపోతున్నారు. మున్సిపాలిటి పాలకవర్గం, అధికారులు అసమrthata మూలంగానే తిరువూరులో పారిశుdhyaM అద్వానంగా మారిందని, దోమల బెడద గతంలో ఎన్నడూ లేని విధంగా దోమలు కుట్టడం మూలంగా జ్వరాల బారిన పడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు నిద్ర మేల్కొని పట్టణంలో విజ్రుంభిస్తున్న దోమల బెడద నుండి ప్రజలను కాపాడాలని పారిశుధ్య పరిస్థితులు ఆధునీకరించాలని, డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరచాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తిరువూరు మండలంలో ఘనంగా ఎన్టీఆర్ వర్థంతి-చిత్రాలు
తిరువూరు పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో తెదేపా శ్రేణుల ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 22వ వర్థంతిని నిర్వహించారు. పలుచోట్ల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, తెదేపా జెండాను ఎగురవేశారు. రోగులకు పండ్లు దానమిచ్చారు. రక్తదాన శిబిరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్, స్థానిక తెదేపా నాయకులు తాళ్లూరి రామారావు, సుంకర కృష్ణమోహన్, గద్దె వెంకన్న, కిలారు బిందు, యండ్రాతి కిరణ్, యండ్రాతి మాధవి, కొత్తపల్లి ఆనందస్వరూప్ తదితరులు పాల్గొన్నారు.
తిరువూరు ప్రాంతంలో రెండోరోజు జోరుగా జూదం
సాంప్రదాయ కోడిపందేల ముసుగులో సంక్రాంతి పండుగ రోజున జూదం విచ్చలవిడిగా సాగింది. అధిక ధరలకు మద్య విక్రయాలు ఏరులై పారాయి. కోడిపందేలతో పాటు జూదంలోనూ ఒక తిరువూరు నియోజకవర్గంలోనే కోట్లాది రూపాయిలకు పైగా సామాన్య ప్రజలు తమ జేబులను ఖాళీ చేసుకున్నారు. తిరువూరు, కాకర్ల, ముష్టికుంట్ల, ఊటుకూరు, గుళ్లపూడి, వేమిరెడ్డిపల్లి, జనార్థనవరం, పుట్రేల తదితర ప్రాంతాల్లో యథేచ్ఛగా కోడిపందేల పేరుతో జూదాలను నిర్వహించారు. పొరుగునే ఉన్న ఖమ్మం జిల్లా నుండి సైతం పెద్దసంఖ్యలో పందెంరాయుళ్లు, జూదగాళ్లు ఈ ప్రాంతానికి తరలివచ్చారు.
సందడిగా సెయింట్ ఆన్స్‌లో పూర్వ విద్యార్థుల సమావేశం-చిత్రాలు
తిరువూరు సెయింట్ ఆన్స్ పాఠశాలలో 2004 ఆ తర్వాత బ్యాచ్‌ల విద్యార్థుల సమావేశం శనివారం నాడు పాఠశాల ఆధ్వర్యంలో సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో 200మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. కసుకుర్తి నళిని తదితర ఉపాధ్యాయులను ఈ సందర్భంగా విద్యార్థులు సన్మానించారు. వేల్పుల భరత్ సమన్వయంలో సాగిన ఈ కార్యక్రమంలో పాథశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ కుసుమ, మాజీ ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జోస్లిన్, ఉపాధ్యాయులు జైన్, అల్తాఫ్ హుస్సెన్, విద్యార్థులు కోట సంకీర్తి తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
తిరువూరులో నూతన సంవత్సర హడావుడి-చిత్రాలు
కృష్ణా జిల్లా తిరువూరు పరిసర ప్రాంతాల్లో 2018 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యుడు కొక్కిలిగడ్డ రక్షణనిధి విస్సన్నపేట, తిరువూరుల్లో వేడుకల్లో పాల్గొన్నారు. ఆయనను స్థానిక ప్రజలు గజమాలతో సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ నివాసానికి స్థానికులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తిరువూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తాళ్లూరి రామారావు తదితరులు విజయవాడ వెళ్లి ఎంపీ నానికి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఆలయాలు, చర్చిల్లో అర్ధరాత్రి వరకు వేడుకలు నిర్వహించారు.
తిరువురులో సీపీఐ 92వ వార్షికోత్సవాలు-చిత్రాలు
తిరువూరు పట్టణ సీపీఐ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఆ పార్టీ ఆవిర్భవించి 92 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. తిరువూరులోని పలు చోట్ల సీపీఐ జెండాలు ఎగురవేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జెండా వందనం నిర్వహించారు. తమ పార్టీ అధికారం కోసం కాకుండా బడుగు, బలహీన వర్గాల వారి అభ్యున్నతికి పాటుపడుతుందని వక్తలు పేర్కొన్నారు.