గ్రామ వాలంటీర్లకు కీలక బాధ్యతలు–నేటి తిరువూరు కబుర్లు-08/14

*తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిది నియోజకవర్గంలో పర్యటించారు. అయన మున్సిపల్ కార్యాలయంలో జరిగిన పట్టణ ప్రణాళిక ముసాయిదా సమావేశానికి హాజరయ్యారు. మద్యాహ్నం పన్నెండు గంటలకు విస్సన్నపేటలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.
*గ్రేడ్-3మున్సిపాల్టీగా వర్గోన్నతి కల్పించాలని వినతి
ప్త్రస్తుతం నగర పంచాయతీగా ఉన్న తిరువురును గ్రేడ్ -3మున్సిపాల్తీగా వర్గోన్నటి కల్పించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కు ఎమ్మెల్యే రక్షణనిధి విజ్ఞప్తి చేశారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. వార్డులు సైతం జనాబా ప్రాతిపదికన జర్గానందున పునర్విభజన చేయాలని కోరారు. గతంలో రెండు సమితులుగా ఉన్న నియోజకవర్గంలో తిరువూరు, విస్సన్నపేట గ్రేడ్-1 పంచాయతీలుగా వేర్వేరుగా ఉండేవని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు.
*దుందిరాలపాడు ప్రాధమికోనన్నత పాటశాలకు వర్గోన్నతి
గంపలగూడెం మండలం దుందిరాలపాడు ప్రాధమీకోన్నత పాటశాలలో ఈ ఏడాది నుంచి ఎనిమిదవ తరగతి ప్రారంబించేందుకు జిలా విద్యాశాఖ నుంచి అనుమతి లభించినట్లు ప్రదానోపాద్యయుడు వెంకట శ్రీనివాస శాస్తి మంగళవారం తెలిపారు. పాటశాలలో 2000 సంవత్సరం నుండి 6,7తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏడో తరగతి ఉత్తీర్ణులు అయిన విద్యార్ధులు ఎనిమిదవ తరగతి అభ్యసించాలంటే తునికిపాడు లేదా ఊటుకూరు ఉన్నత పాటశాలలకు, ప్రయివేటు విద్యాలయాలకు వెళ్ళాల్సి వస్తోంది.
*వెయిట్లిప్టింగ్లో విద్యార్ధిని ప్రతిభ
నాగార్జున ఉన్నత పాటశాలకు చెందిన ఐదవ తరగతి విద్యార్ధిని వి.సువర్ణ జిల్లా స్థాయి వెయిట్ లిప్టింగ్ పోటీలలో ప్రతిభను కనబరిచింది. విజయవాడలో సోమవారం జరిగిన కృష్ణాజిల్లా వెయిట్ లిప్టింగ్ చాంపియన్ షిప్ 2019 పోటీలలో బాలిక సబ్ జూనియర్ ఇరవై కిలోల విభాగంలో ద్వీతీయ స్థానం కైవసం చేసుకుంది. సువర్నాను ప్రిన్సిపాల్ కే. నరసింహారావు, కరస్పందేంట్ వీ. నాగేశ్వరరావు , చైర్మన్ హనుమంతరావు డైరెక్టర్లు శేషగిరిరావు, సూరిబాబు మంగళవారం అభినందించారు.
*చోరీలు నిరోధించాలని వ్యాపారుల ప్రదర్శన
కొద్దిరోజులుగా విస్సన్నపేటలో జరుగుతున్నా చిల్లర చోరీలను నిరోధించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వ్యాపార వర్గాలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. దీనిలో భాగంగా స్థానిక వెంకటేశ్వర దీయేటర్ నుంచి పెద్ద ఎత్తున ప్రదర్శనగా పోలీస్ స్టేషన్ చేరుకొని అధికారులకు లిఖిత పూర్వకంగా వినతి పత్రం అందజేశారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మద్దతుగా విస్సన్నపేట మాజీ సర్పంచి కుక్కడపు ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్దిరోజులుగా విస్సన్నపేటలో చిల్లర చోరీలు జరుతున్నాయని ఆరోపించారు. రాత్రి సమయాల్లో దుకాణాల తాళాలు పగులకొట్టి విలువైన సిగరెట్లు, చిల్లర నగదు చోరీ చేస్తున్నరని చెప్పారు.
*తిరువూరు ఎంపీడీవోగా నాగేశ్వరరావు
తిర్వుఉరు మండల పరిషత్ అభివృద్ధి, అధికారిగా పీవీఎస్ నాగేశ్వరరావు మంగళవారం సాయంత్రం బాద్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న జానకీదేవిని ఎన్నికల కమిషన్ తాడేపల్లి సెక్షన్ అధికారిగా బదిలీ చేశారు. ఆమె స్థానంలో చాట్రాయి ఎంపీ డీవోగా పనిచేస్తున్న నాగేశ్వరరావు కు ఇంచార్జి బాద్యతలు అప్పగించారు.
*గంపలగూడెం మండలంలో కనుమూరు ప్రధాన ప్రాధమిక పాటశాలకు ఎన్నేస్పీ నీటి సంఘం అద్యక్షుడు జంగా చెంచురెడ్డి మంగళవారం రూ. 25వేలు విలువైన రెండు సీలింగ్ పంకాలు వితరనగా అందించారు..
*గంపలగూడెం మండలం వనరుల కేంద్రంలో నిర్వహించిన ఫిజియోతెరఫీ చికిత్స శిభిరంలో వివిధ గ్రామాలకు చెందిన ఎనిమిది మంది ప్రత్యెక అవసరాల కలిగిన చిన్నారులకు చికిత్స నిర్వహించినట్లు ఐఈఆర్టీ కృష్ణ తెలిపారు.
*తోటి విద్యార్ధులతో సోదరభావంతో మెలగాలి
వసతిగృహంలో ఉంటూ చదువుకునే పిల్లలు తోటి విద్యర్దులతో సోదర భావంతో మెలగాలని సిఐ ప్రసన్నవీరయ్య గౌడ్ సూచించారు. స్థానిక బీసీ బాలుర బాలికల పాటశాల కళాశాల వసతి గృహాలలో మంగళవారం సాయంత్రం అవగాహనా సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లతుడూ కష్టపడి చదివి ప్రయోజకులు కావడం ద్వారా తల్లిదండ్రులు నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు.
*ఈ-పంట నమోడుతో బహుళ ప్రయోజనాలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో ఈ-పంట నమోదును ప్రారంభించారు. తిరువూరు మండలంలోని ఇరవై పంచాయతీలకు పరిధిలో జరిగే నమోదు కార్యక్రమాన్ని మునుకుళ్ళలో మంగళవారం ప్రారంభించగా ఏవో రాజ్యలక్ష్మి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు గ్రామాల్లో వరినాట్ల ప్రక్రీయ పూర్తీ అయిన నేపద్యంలో రైతులు ఈ-పంటలో వివరాలును నమోదు చేయించుకోవాలని సూచించారు. ఎ.కొండూరు మండలంలో ఎ ఈవో రామచంద్రరావు ఏవో టిప్పు సుల్తాన్ ఆద్వర్యంలో ఈ-పంట నమోదు చేశారు.
*పైడి మర్రి ప్రతిజ్ఞ అజరామరం
పైడిమర్రి వెంకట సుబ్బారావు రచించిన భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞను కచ్చితంగా పాటిస్తే అంతకుమించిన దేశభక్తి మరొకటి ఉండదని ప్రదానోపాద్యాయుడు బీవీ వీరభద్రం అన్నారు. తిరువూరు మండలం మునుకుల్ల జిల్లా పరిషత్ పాటశాలలో ప్రతిజ్ఞ రచయితా పైడిమర్రి వర్ధంతిని హిందీ సంఘ ఆద్వర్యంలో మంగళవారం నిర్వహించారు.
*ఇసుక అనుమతులకు వినతి
ఇసుక నుమతులు త్వరితగతిన జారీ చేయాలని విస్సంనపెతకు చెందిన వైకాపా నేతలు రెవెన్యు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని గానుగపాడు క్వారీ నుంచి విస్సన్నపేట మండలానికి వారానికి ఒకరోజు టోకెన్లు జారీ చేస్తున్నారన్నారు. విస్సన్నపేటలో ఉన్న డిమాండ్ దృశ్య వారానికి రెండురోజులు టోకెన్ల జారీకి అనుమతించాలని అన్నారు. ఈమేరకు తహసిల్దారు బీ.మురళీకృష్ణను కలిసి విజ్ఞప్తి చేశారు. మండల పరిషత్తు మాజీ ఉపాధ్యక్షుడు ఓలేటి దుర్గారావు, వైకాపా నేతలు సిరసాని ప్రకాష్ అనుమోలు శివబాజి, అబ్బినేని హరి అధికారులను కోరినవారిలో ఉన్నారు.
* నెమలి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో నాలుగు రోజులపాటు నిర్వహించిన పవిత్రోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. చివరి రోజున యాగశాలలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పవిత్రాలలో అలంకరించి, త్రేతాగ్ని ఆరాధన ప్రధాన హోమం నిర్వహించి, పూర్ణాహుతి సమర్పించారు. ప్రధానార్చకులు తిరునఘరి గోపాలాచార్యులు ఆధ్వర్యంలో రుక్మిణీ, సత్యభామా సమేత వేణుగోపాలస్వామికి శాంతికల్యాణం, పవిత్ర విసర్జన, యజమానులకు పవిత్రాల బహూకరణ, ఆశీర్వచన వేడుక నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మైలవరపు రామాంజనేయులు, సహాయ కమిషనర్‌ ఎన్‌.సంధ్య ఉత్సవాల్లో పాల్గొన్నారు.
* త్వరలో నూతన మద్యం పాలసీ-ఎక్సైజు సూపరింటెండెంట్‌ రమణమూర్తి
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లాలో త్వరలో నూతన మద్యం పాలసీ అమల్లోకి వస్తుందని ఎక్సైజు సూపరింటెండెంట్‌ డా.పి.వి.రమణమూర్తి తెలిపారు. విస్సన్నపేటలో ఎక్సైజు స్టేషన్‌ మార్పు కోసం ఎంపిక చేసిన భవన పరిశీలనకు మంగళవారం వచ్చిన ఆయన మాట్లాడారు. నూతన విధానంలో భాగంగా ఈనెల 20వ తేదీన దుకాణాల నిర్వహణకు భవనాలను అద్దెకు ఇచ్చే యజమానుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుందన్నారు. వీటిని కలెక్టర్‌ ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల బృందం 21వ తేదీన పరిశీలించి, అనుమతులిస్తుందని చెప్పారు. భవన విస్తీర్ణం కనీసం 150 నుంచి 300 చదరపు అడుగులు ఉండాలని, దుకాణాల నిర్వహణకు ఇంటర్మీడియట్‌ అర్హత ఉన్న యువతను ఎంపిక చేస్తారన్నారు. వీరిపై పర్యవేక్షణకు ఉన్నత విద్యనభ్యసించిన యువతను ప్రభుత్వం ఎంపిక చేస్తుందన్నారు. రానున్న కాలంలో దుకాణాల్లో మద్యం విక్రయాల బాధ్యత ఏపీ బేవరేజస్‌ లిమిటెడ్‌ సంస్థ చూసుకుంటున్నందున, తమ శాఖకు ఈ బాధ్యత ఉండదన్నారు. ఎక్సైజు అధికారులు, సిబ్బంది మొత్తం మద్యం బెల్టు దుకాణాలు, నాటుసారా తయారీ, విక్రయాలను నిలువరించే విషయమై దృష్టి కేంద్రీకరిస్తామని వివరించారు.
tiruvuru news - tiruvuru kaburlu - tvrnews - krishna district news tiruvuru news tiruvuru kaburlu tvr news - tvrnews.com - గ్రామ వాలంటీర్లకు కీలక బాధ్యతలు–నేటి తిరువూరు కబుర్లు-08/14- tvrnews.com tiruvuru news tiruvuru kaburlu

26 నుండి పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు సర్వే – నేటి తిరువూరు కబుర్లు – 08/13

ఇళ్ల పట్టాలు, రైతు భరోసా, అమ్మ ఒడి, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకాలపై సమాచార సేకర వలంటీర్ల బాధ్యతలను ప్రకటించిన పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ 15న విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా కొత్త వ్యవస్థ ప్రారంభం సెప్టెంబర్‌ 1 నుంచి శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే ‘ఇంటికే రేషన్‌’ శ్రీకారం అదే నెల 11–15 మధ్యలో పింఛన్, రేషన్‌ లబ్ధిదారుల గుర్తింపుపై శిక్షణ అక్టోబర్‌ 2 తర్వాత కొత్త పింఛన్లకు అర్హులను గుర్తించేది వలంటీర్లే రాష్ట్రంలో ఎంతమందికి ఇళ్ల పట్టాలు అవసరం అన్నదానిపై గ్రామ, వార్డు వలంటీర్లు ఈ నెల 26 నుంచి రాష్ట్రమంతటా సర్వే చేయనున్నారు. అలాగే, వైఎస్సార్‌ చేయూత పథకంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సహాయానికి అర్హత ఉన్న 45–60 ఏళ్ల మధ్యనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలను గుర్తించడం.. రైతు భరోసా, అమ్మఒడి, వైఎస్సార్‌ ఆసరా ద్వారా లబ్ధిపొందే వారి వివరాలపై ఈ సర్వే నిర్వహిస్తారు. ఒకొక్క వలంటీరు తనకు కేటాయించిన 50 ఇళ్లలో రోజుకు ఏడు నుంచి పది ఇళ్ల చొప్పున ఐదు రోజుల పాటు ఇది ఉంటుంది. కాగా, ఆగస్టు 15న వలంటీర్లు విధులలో చేరిన తర్వాత అక్టోబరు 2న గ్రామ సచివాలయాలు ఏర్పాటయ్యే వరకు 45 రోజుల పాటు వారు ఏఏ కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ సోమవారం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
*15న సీఎం చేతుల మీదుగా శ్రీకారం
ఇదిలా ఉంటే.. వలంటీర్ల వ్యవస్థను ఆగస్టు 15న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ నుంచి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఎంపికైన వలంటీర్లు అదేరోజు వారివారి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సీఎం కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాలలో వీరు వీక్షించేందుకు అన్నిచోట్ల ఎల్‌సీడీలు ఏర్పాటు చేయాలని జెడ్పీ సీఈవోలను ఆదేశించారు.
*16–25 తేదీల మధ్య డేటా సేకరణ
వలంటీర్లు విధుల్లో చేరిన వెంటనే తమకు కేటాయించిన 50 ఇళ్ల పరిధిలోని వ్యక్తుల సమగ్ర సమాచారంతో పాటు ఆ కుటుంబ ఆర్థిక, సామాజిక పరిస్థితి వంటి అన్ని అంశాలపై డేటా సేకరించాలని గిరిజాశంకర్‌ ఆదేశించారు. ఆగస్టు 16వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య రోజుకు పది కుటుంబాల చొప్పున ఈ సమాచారం నిర్ణీత ఫార్మాట్‌లో సేకరించాల్సి ఉంటుంది. మరోవైపు.. సెప్టెంబరు 1వ తేదీ నుంచి వలంటీర్ల ద్వారా ఇంటికే రేషన్‌ బియ్యం ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని తొలుత శ్రీకాకుళం జిల్లాలో ఆరంభించనున్నారు. పెన్షన్ల పంపిణీపై కూడా వీరు సెప్టెంబరు 1న జరిగే పంపిణీ కార్యక్రమంలో ఆయా సిబ్బంది ద్వారా అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది.
*కొత్త పింఛన్, రేషన్‌ కార్డు లబ్ధిదారుల ఎంపికపై శిక్షణ
కొత్తగా పింఛన్లు, రేషన్‌కార్డుల లబ్ధిదారుల ఎంపికలో అవసరమయ్యే శిక్షణను వచ్చే నెల 11 నుంచి 15 తేదీల మధ్య అన్ని మండల కేంద్రాల్లో ఇవ్వాలని గిరిజా శంకర్‌ అధికారులను ఆదేశించారు. అక్టోబర్‌ 2న గ్రామ సచివాలయాల ఏర్పాటు తర్వాత వలంటీర్లు ప్రతీరోజు ‘స్పందన’ కార్యక్రమం నిర్వహించాలన్నారు. అలాగే, ప్రజల నుంచి అందే వినతులను 72 గంటలలో పరిష్కరించేలా చేయడం.. పింఛన్ల పంపిణీ, కొత్తవి మంజూరుకు అర్హులను గుర్తించడం.. అక్టోబరు 15న రైతు భరోసా కార్యక్రమాన్ని వలంటీర్లే నిర్వహించాల్సి ఉందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
1.సమస్యల పరిష్కారానికి సంఘాలు అవసరం
ఉపాద్యాయులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి బలమైన సంఘాలు అవసరమని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.శ్రీనివాస్ తెలిపారు. స్థానిక యూటీ ఎఫ్ కార్యాలయంలో సోమవరం సంఘ ఆవిర్భావం దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాద్యాయ ఉద్యమ పితామహుడైన దాచూరి రామిరెడ్డి చెన్నుపాటి లక్ష్మయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
2.రోడ్డు ప్రమాదంలో వ్యక్తికీ గాయాలు
విస్సన్నపేటలో సోమవరం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికీ తీవ్ర గాయాలకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విస్సన్నపేటకు చెందిన పర్వతం సివనగేస్వరరఫు తన ట్రాక్ ఆటోను స్థానిక రెడిగుడెం రోడ్డులో నిలిపి ఉంచగా మైలవరం వైపు నుండి విస్సన్నపేట వస్తున్నా కారు వెనుక వైపు నుంచి దీకోట్టింది.ఈప్రమాదంలో సివనగేస్వరర్వు రెండు కళ్ళు విరిగి తీవ్ర గాయాలకు గురి కావడంతో విజయవాడలోని ప్రెవేట్ ఆస్పత్రికి తరలించారు.
3.14న గ్రామ సచివాలయ అభ్యర్ధులకు అవగాహనా సదస్సు
తిరువూరు, విస్సన్నపేట మండలలలో సచివాలయ ఉద్యోగాల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని ఎ.కొండూరు మండల ప్రజా సంఘాల నాయకులూ వెంకటేశ్వరరావు సోమవారం తెలిపారు. ఈసదసులో ఎ.కొండూరు మండలానికి చెందిన ఆయా గ్రామాల అభ్యర్ధులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. విస్సన్నపేటలో గ్రామా సచివాలయ అభ్యర్ధులకు అవగాహనా సదసు నిర్వహిస్తున్నామని గిరిజన సంఘం సీపీఎం అనుబంధ ప్రజా సంఘాల నేతలు నాగరాజు, గోపిరాజు, శ్రీనివాసరెడ్డి తెలిపారు.
4.గుట్కా విక్రేత అరెస్టు
గంపలగూడెం మండలం పెనుగొలనులోని బడ్డీకోట్టులో గుట్కాలు విక్రయిస్తున్నా ఇనపనూరి నాగరాజును అరెస్టు చేసినట్లు ఎస్సై ఉమమహేశ్వరారావు తెలిపారు. అతని నుంచి రూ.1545 విలువైన గుట్కా పొట్లాలు స్వాధీనం చేసుకున్నామని న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు.
5.ఫోటో గ్రాఫర్స్ సంఘ వ్యవస్థాపక అద్యక్షుడు వైకుంటరావు మృతి
తిరువూరుకు చెందిన ఫోటో గ్రాఫర్ అసోసియేషన్స్ వ్యవస్థాపక అద్యక్షుడు మల్లెం వైకుంటరావు సోమవారం మృతి చెందారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.
6. తిరువూరులో ఘనంగా బక్రీద్ వేడుకలు
తిరువూరు పట్టణంలో బక్రీద్‌ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా సోమవారం జరుపుకున్నారు. ఉదయం 9 గంటలకంతా ముస్లిం సోదరులందరూ నూతన వస్త్రాలను ధరించి స్థానిక మల్లెమ్మ చెరువు వద్ద ఉన్న ఈద్గా దగ్గరకు చేరుకొని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.ఇస్లాం మతగురువు రిజ్వి (పేష్మామ్) ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి.. అనంతరం పెద్దలు, పిల్లలు ఒకరిని ఒకరు ఆలింగనం పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇళ్ళకు వెళ్ళి ఖుర్బానీ కార్యక్రమాన్ని కొనసాగించారు. హిందూ సోదరులు ముస్లిం సోదరులకు బక్రీద్‌ శుభాకాంక్షలను తెలిపారు. పట్టణంలో పండగ వాతావరణం కోలాహలంగా కనిపించింది.జామియా మస్జీద్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ హుస్సేన్,కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నమాజ్ ల కొరకు తగిన ఏర్పాట్లు చేశారు. గంపలగూడెం, విస్సన్నపేట, ఏ- కొండూరు మండలాల్లో ఆయా ఈద్గాహ్ లలో, మస్జీద్ లలో కూడా ఘనంగా బక్రీద్ వేడుకలు జరిగాయి..
7.రైతుకు పాముకాటు
గంపలగూడెం మండలం చింతలనర్వకు చెందిన వెంకట్రావు అనేరైతు సోమవారం పాముకాటుకు గురయ్యాడు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మాగానిలో వరినారుమడి చూసేందుకు వెళ్ళగా అక్కడ పాము కరిచింది. సదరు రైతును గంపలగ్గుడెం ప్రాధమిక ఆస్పత్రికి తరలించగా తాళాలు వేసి ఉండగా ప్రెవేట్ వైద్యశాలకు తరలించినట్లు వైద్య చికిత్స చేశారు.

ఏపీలో నాలుగు లక్షల గ్రామ వాలంటీర్లకు నోటిఫికేషన్

4 లక్షల గ్రామ వాలంటీర్స్:
AP గ్రామ వాలంటీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2019 త్వరలో విడుదల అవుతుంది. కొత్తగా ఎన్నికైన ఎపి స్టేట్ గవర్నమెంట్ ప్రజలకు మంచిగా సేవ చేయడానికి 4,00,000 గ్రామ వాలంటీర్లను నియమించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని పంచాయతీలలో ప్రతి 50 కుటుంబాలకు గ్రామ వాలంటీర్లను ఒక వాలంటీర్గా నియమిస్తారు. గ్రామీణ వాలంటీర్లు అన్ని AP రాష్ట్ర ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందజేయవలసి ఉంటుంది.ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆగష్టు 2 వ తేదీ చివరి నాటికి పూర్తి అవుతుంది. ఆగష్టు 15, స్వాతంత్ర్య దినోత్సవం నాటికి అర్హత పొందిన మరియు ఆసక్తి గల అభ్యర్థులను AP గ్రామ వాలంటీర్స్ గా నియమించవచ్చు.
**ముఖ్యమైన తేదీలు:
పోస్ట్ పేరుAP గ్రామ వాలంటీర్ దరఖాస్తు విడుదల తేదీ June 2019 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభము June 2019 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదిJuly 2019 రిక్రూట్మెంట్ తేదీAugust 2019దరఖాస్తు విధానం ఆన్లైన్/ఆఫ్ లైన్
**పోస్టులు మరియు ఖాళీలు:
AP గ్రామ వాలంటీర్ – 4,33,126
అర్హత: అభ్యర్థులు పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
గ్రామ వాలంటీర్లకు దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు :
*ఆధార్ కార్డు
విద్యా అర్హత ప్రమాణాలు
ssc సర్టిఫికేట్ ప్రకారం పుట్టిన తేదీ
స్టడీ సర్టిఫికెట్
కమ్యూనిటీ సర్టిఫికెట్
నేటివిటీ / రెసిడెన్సీ సర్టిఫికెట్
మెడికల్ సర్టిఫికెట్ (PHC అభ్యర్థులకు )
**వయోపరిమితి
అభ్యర్థులు ఈ పోస్టును దరఖాస్తు చేయాలనుకుంటే, వయస్సు 18 నుండి 39 సంవత్సరాలు ఉండాలి.
**అప్లికేషన్ ఫీజు
దరఖాస్తు కోసం OBC అభ్యర్థులు Rs.150/- మరియు SC /ST / PWD అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
**వేతనం
అభ్యర్థులు నెలకు Rs.5,000/- వరకు పొందవచ్చు
**దరఖాస్తు విధానం
AP ప్రభుత్వం నోటిఫికేషన్ను జూన్ 2 వ వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఈ పోస్ట్ను తనిఖీ చేయండి.తరువాత నోటిఫికేషన్ యొక్క లింక్ ఓపెన్ చేసి పోస్ట్ యొక్క వివరాలు పూర్తిగా చదవండి.
నోట్ : అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన సందేహాలను కామెంట్ లో తెలియజేగలరు. ప్రతి ఒక్క సందేహానికి జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తాము.
**జిల్లా వారీగా గ్రామాల జాబితా:
అనంతపురం1066, చిత్తూరు1627,తూర్పు గోదావరి1117,గుంటూరు 927,కృష్ణ1206, కర్నూలు1421, ప్రకాశం1100, ఎస్ పి ఎస్ నెల్లూరు 1414, శ్రీకాకుళం2300, విశాఖపట్నం 4198,విజయనగరం 2160, పశ్చిమ గోదావరి 751, Y.S.R. కడప1021.
andhra pradesh village volunteer recruitment notification released for 4lakh jobs tiruvuru kaburlu tiruvuru news tiruvuru krishna district news

మున్సిపల్ కమీషనర్లకు బిగుస్తున్న ఉచ్చు.


తిరువూరు నగర పంచాయతిలో జరిగిన ఫించన్ల కుంభకోణంలో ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో వెల్లదిఅనత్లు సమాచారం. ఇప్పటికే ఈ కుంభకోణంలో సంబంధం ఉన్న నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసారు. దీనిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసారు. పరమేష్, సురేష్, డీ.వెంకటేశ్వరరావు, ఎం.మురళి లు సస్పెండ్ చేయటంతో పాటు వారిపై సోమవారం నాడు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసారు.గతంలో మున్సిపల్ కమీషనర్ లుగా పని చేసిన మల్లేశ్వరరావు, శ్రీనివాసరావు, మల్లిఖార్జునరావులకు కూడా ఈ కుంభకోణానికి సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. వీరిలో ఇరువురు కమీషన్లకు పాత్ర ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. నూజివీడు ఆర్డీవో రంగయ్యతో పాటు విజిలెన్స్ విచారణ కూడా వేగవంతం చేసినట్లు సంచారం. కాగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం మున్సిపల్ కమీషనర్ రఘుకుమార్ మంగళవారం నాడు ఈ కుంభకోణానికి సంబందించిన పత్రాలు తీసుకుని మచిలీపట్నం వెళ్ళినట్లు సమాచారం.