మార్చి 10నుండి నెమలి వేణుగోపాలుని బ్రహ్మోత్సవాలు


కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో అత్యంత ప్రసిద్ధి పొందిన దేవాలయాల్లో వేణుగోపాల స్వామి ఆలయం ఒకటి. ఇక్కడి వేణుగోపాల స్వామి స్వయంభువుగా చెప్తారు. ఒకసారి సీతారామయ్య కొత్తగా కొనుగోలు చేసిన ఇంటిలో మట్టికావాల్సి తమ పనివానికి పెరట్లో కాస్త తవ్వి మట్టి తీసుకొని రమ్మని చెప్పాడు. ఆ నౌఖరు మట్టి తవ్వుతుండగా భూమిలోంచి పిల్లన గ్రోవి ని పట్టుకొన్న స్వామివిగ్రహం పారకు తగిలిందట. ఏమిటో అని పైకి తీయగా పిల్లనగ్రోవి పట్టుకొన్న చేతిలోని చిటికెన వేలు కొద్దిగా తెగిందట. ఆ సంగతి సీతారామయ్యకు చెప్పగా ఆయన ఎంతో పారవశ్యం చెందాడు. ఆ శ్రీకృష్ణుడే మనలను ఉద్ధరించడానికి ఏతెంచాడు అని వానితో చెప్పాడు. వెంటనే స్వామి ని తెలియక చేసిన తప్పును మన్నించమని పదేపదే వేడుకున్నాడు. వెంటనే వెండి పనిచేసే వానిని పిలిచి స్వామి మూర్తికి తగిలిన గాయాన్ని మాన్చమని చెప్పి చేయించారట. స్వామి తమ ఇంట వెలిశారని ఊరందరికి తెలియచేశారట. వెంటనే తాటాకు పందిరి వేసి ఆ పందిరి మహోన్నతమైన దేవాలయంగా భావించమని వేడుకుంటూ అక్కడే వేణుగోపాల స్వామిని ప్రతిష్టించారట. ఇక ఆనాటి నుంచి వారికి కాలం కలసి వచ్చింది. ఆ తరువాత ఊరందరూ స్వామిని చూచి ఆనందంపొంది తమ తమకు కావాల్సిన కోరికలను కోరుకున్నారట. వారందరి కోరికలను స్వామి తీరుస్తూ వచ్చారట. దాంతో స్వామికి ఆనాడు వేసిన తాటాకు పందిరి స్థానంలో చక్కని దేవాలయ నిర్మాణం చేశారు.సంతానార్థులు వచ్చి వేడుకుంటే స్వామి దయవల్ల వారికి సంతానం కలుగుతోందట. ధనార్థులు వచ్చి స్వామిని వేడుకుంటే వారు ధనవంతులు కాగలుగుతున్నారట. విద్యార్థులు వచ్చి తమకు జ్ఞానాన్ని ఇవ్వమని వేడుకుంటే వారి చదువులో అభ్యుదయాన్ని పొందుతున్నారట. ఇలా స్వామిని ఏది కోరుకుంటే దానే్న సునాయాసంగా ఇచ్చే దేవదేవునిగా వేణుగోపాల స్వామిని ఇక్కడి భక్తులు కొనియాడుతుంటారు.ద్వాపరయుగంలో స్వామి దుష్టులను సంహరించి శిష్టులను కాపాడినట్లే ఈ కలియుగంలోకూడా స్వామి దుష్టులను దునుమాడుతూనే శిష్టులను తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. స్వామి కరుణామృతాన్ని గ్రోలాలని చుట్టుపక్కల ఊర్లనుంచే కాక ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి స్వామిని సేవిస్తుంటారిక్కడ.స్వామి మహిమలు ఇన్ని అన్నిఅని చెప్పలేనన్ని ఉన్నాయని స్వామి మహిమ అనుభవైకవేద్యం కావాలి కాని దాన్ని వర్ణించడానికి ఈ మనుజులకు సాధ్యం కాదని ఈ కృష్ణ్భక్తులు అంటున్నారు. కృష్ణాష్టమి నాడు అంగరంగ వైభోగంగా వేణుగోపాలస్వామికి జన్మాష్టమిని భక్తులు ప్రతిఏటా జరిపిస్తారట.అట్లానే దసరా నాడు పాండవులకు చేదోడు వాదోడు ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడి వారిని కురుక్షేత్ర యుద్ధరంగంలో అజేయులుగా నిలబెట్టిన వైనాన్ని పురస్కరించుకుని స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీపావళినాడు లోకకంటకుడైన నరకుని సంహరించిన శ్రీకృష్ణుణ్ణి స్మరించుకుంటూ దీపావళి పండుగనాడు వేణుగోపాల స్వామికి విశేష పూజలు నిర్వహిస్తారు. అట్లానే ప్రతి పండుగ నాడు కూడా వేణుగోపాల స్వామికి ప్రత్యేక అలంకరణలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో అనాదిగా వస్తోంది.భక్తుల ఇచ్చిన విరాళాలతో స్వామికోసం రాజగోపురాలు నిర్మించినట్లుగానే స్వామి సన్నిధిలో భోజనశాలను, వైద్యశాలను, పొంగళ్లశాలను, కల్యాణ మంటపం, కల్యాణకట్ట, అద్దాల మండపం, విశ్రాంతి మందిరం లాంటివాటిని నిర్మించారు. ఇంకా నిత్యాన్నదానం ఏర్పాట్లను కూడా చేయాలని దేవాలయ అధికారులు ఆలోచిస్తూ న్నారు. ఇపుడుమాత్రం విశేషదినాల్లో అన్నదానాన్ని చేస్తున్నారు. స్వామి సన్నిధిలో తమ పిల్లలకు అన్న ప్రాసలు జరిపిస్తే వారు ఆరోగ్యంగా ఎదుగుతారనే నమ్మకం భక్తులకు ఉన్నట్లు చెబుతారు. స్వామి సన్నిధిలో వివాహాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక్కడ వివాహం చేసుకొనేవారు నిత్య సంతోషులుగా ఉంటారనీ అంటారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాటినుంచి స్వామికి బ్రహ్మోత్సవాలనుకూడా జరిపిస్తారు. రుక్మిణీ, సత్యభామా సమేత వేణుగోపాల స్వామికి కల్యాణోత్సవం కనుల పండుగగా జరుగుతుంది. స్నేహితులతో ఆడిపాడిన కృష్ణస్వామిని, గోపికల మానసచోరుడి లీలలను కొనియాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలను జరిపిస్తారు. అటు సాంఘిక, పౌరాణిక నాటకాలను వేస్తూ కృష్ణ్భక్తిని ప్రచారం చేస్తున్నారు ఈ కృష్ణ్భక్తులు. నెమలి వేణుగోపాల స్వామి దర్శించిన వారికి తీరని కోరిక అంటూ ఏమీ ఉండదని ఇక్కడి స్థానికుల కథనం. ఈ నెమలి వేణుగోపాల స్వామి దర్శనానికి వెళ్లాలనుకొన్న భక్తులు ఖమ్మం విజయవాడ మార్గంలో ఉన్న మథిర కు వచ్చి అక్కడినుంచి బస్సులలో నెమలి గ్రామానికి చేరుకోవచ్చు.
**మర్చి 10నుంచి 15 వరకు నెమలి బ్రహ్మోత్సవాలు
10న అంకురార్పణ
11న శేష వాహన ఉత్సవము
12న స్వామివారి తిరుకల్యానం
13న రధోత్సవం
14న వసంతోత్సవం
15న శ్రీ పుష్పయాగము

నెమలి ఆలయం చూసొద్దాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక కృష్ణాలయం, పేరెన్నికగన్న పుణ్యక్షేత్రం, నిత్యం భక్తుల రాకతో పులకించే గ్రామం, సందర్శకులతో సందడిగా ఉండే ప్రదేశం, భక్తుల విరాళాలతో దినదినాభివృద్ది చెందుతున్న దేవస్థానం, లక్షలాది మంది భక్తులు ఇలవేల్పుగా కొలిచే కృష్ణాజిల్లా గంపలగూడెం మండలంలోని ‘నెమలి’ గ్రామంలోని వేంచేసి ఉన్న శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయం.
*నెమలి వేణుగోపాలస్వామిని కొలిచే భక్తులు నవ్యాంద్రప్రదేశ్ ,తెలంగాణా రాష్ట్రాలలో లక్షలాది మంది ఉన్నారు. తాము కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా స్వామివారిని ఆరాదించే భక్తజనం నెమలి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఎప్పటి నుంచో అభిలాషిస్తున్నారు. పాలక ప్రభుత్వాలు నెమలి పుణ్యక్షేత్రం స్వామి వారి దర్శనం ‘సర్వైశ్వర దాయకం సర్వరోగ నివారిణి’ అనే భావంతో వస్తున్నా, భక్తులకు ,ఆలయ అధికారులు వసతి కలిపిస్తున్నా, రాకపోకలకు నానా ఇక్కట్లు పడుతున్నారు. భక్తుల భూరి విరాళాలుతో ఆలయ ప్రాంగణంలో ఎన్నో కట్టడాలు నిర్మించారు. పర్యాటకులను ఆకర్షిస్తున్నారు.
**స్వయంభువుగా స్వామివారు ఇలా వెలిశారు
1953 మార్చి 23 న (శ్రీరామనవమి నాడు) వేణుగోపాలస్వామి నెమలిలో స్వయంభుగా వెలిశారు. స్వామివారి విగ్రహం నెమలి గ్రామానికి చెందిన వనమా సీతారామయ్య అనే షావుకారు తన పొలంలోని సారవంతమైన మట్టి కోసం తవ్వుతుండగా మొదటిసారి గడ్డపలుగు ఉపయోగించగా వెంటనే ఖంగుమని శబ్దం వచ్చింది. ఆ వింత ధ్వని అర్ధం కాక కొంచెం పక్కగానే గడ్డపలుగు వేయగా అదే శబ్దం వచ్చింది. ఆ ధ్వని ఆలోచించుతూనే అతడు ఆ రెండు ఘతాముల మధ్య మరల పలుగు ప్రయోగించగా ఆ చోట బ్రహ్మాండమైన మిరుమిట్లుతో ఒక మెరుపు వెలువడింది. ఆ కాంతి తీవ్రతకు అతను మూర్చ పోయాడు అది చూసిన మిగిలిన వారు ఆందోళనతో అతని ముఖం పై చల్లని నీళ్ళు చల్లి కొద్ది సేపు సపర్యలు చేసారు. ఆతను కొంచెం తేరుకొని తనకు ఏమి కనిపించడంలేదని అన్నాడు. అపుడు మిగిలినవారంతా ఆప్రాంతంలో త్రవ్వి చూడగా ఒక విగ్రహం దానిచెంతనే ప్రాచీన శంఖము, పాచిక లభ్యమయినది. ఆరోజు పరమ పవిత్రమైన శ్రీరామనవమి (23-3-1953) ఆవిషయం తెలిసిన షావుకారు నవమి వేడుకల నిర్వహణలో ఉన్న ఆతను ఆ బాధ్యతలు వేరేవారికి అప్పగించి హుటాహుటీన తన అనుచరులతో కలిసి విగ్రహం లభ్యమైన దివ్యస్తలానికి చేరుకున్నాడు. ఆ విగ్రహమును పరిశీలించి శ్రీ వేణుగోపాల స్వామివారి దివ్య మంగళమూర్తి అని గ్రహించారు. కటారు వెంకటేశ్వర్లు ఉపయోగించిన గునపము వలన శ్రీస్వామివారి వేణువుకు కుడి, ఎడమలవైపుల తగిలి చిటికిన వ్రేలు భిన్నమయింది. గ్రామ పెద్దలు పెనుగొలను చెందిన అర్చకుడు నందలి క్రిష్ణమచార్యులుని వెంటనే రప్పించి స్వామివారి విగ్రహం చూపించగా మూడు అడుగుల ఎత్తు, ఉత్తరాభి ముఖముగా వ్యత్యస్థ పదముల నడుము, శిరస్సులు చక్కని ఓంపులతో మురళిని మ్రోగించుచూ, త్రిభంగిమతో దివ్య సుందరమైన చక్రములతో పాదముల కడ ఇరువైపులా విన్ద్యమారాలు వీచు గోపికా స్త్రీలు గోవులతో కూడి అలరారుచు ఉన్న ఆ ఏక శీల విగ్రహమును చూసి శ్రీ వేణుగోపాలస్వామివారి విగ్రహంగా గ్రహించారు. స్వామివారు భూగర్భమునుండి సాక్షాత్కరించిన తీరుకు గ్రామ ప్రజలు భక్తీ పారవశ్యంతో ఆశ్చర్యపోయారు. ఈసందర్భంగా భక్తులు స్వామివారిని ప్రతిస్థదలచి ఉరేగించ బయలుదేరగా స్వామివారు భక్తునికి ఆవహించి “నేను దర్శనమిచ్చిన చోటనే తనను ప్రతిష్టించాలని ఆదేశించారు” . స్వామి ఆదేశమును వెంటనే అమలుచేయదలచాగా ఉత్తరాభి ముఖమున వెలసిన స్వామివారిని తూర్పు ముఖముగా ఉంచడంతో ఆకస్మికంగా గాలివానతో కూడిన పెను తుఫాను విరుచుకుపడింది. వేసిన పందిళ్ళు చిన్నభిన్నమయ్యాయి. పొరపాటును గ్రహించిన వారు స్వామివారిని యధావిధిగా ఉత్తరాభి ముఖముచేయగా కొద్ది క్షణములలొనే తుఫాను శాంతించింది. వెంటనే గ్రామ పురోహితులతో పూజలు నిర్వహించారు.
** 1957 ఫిబ్రవరి 6న శాస్రోక్తంగా నల్లనయ్య విగ్రహాన్ని వేదపండితుల ఆద్వర్యంలో ప్రతిష్టించారు. అప్పటి నుంచి స్వామివారి ఆలయం దినదిన ప్రవర్ధమానం చెందుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చే ఇష్టదైవంగా వేణుగోపాలస్వామి నిలిసారు. నెమలి వేణుగోపాలస్వామి ఆలయానికి భక్తులు సమర్పించే కానుకలు వేలంపాటలు ద్వారా ఏటా రూ.కోటి వరకు ఆదాయం లభిస్తుంది. ఆ మొత్తం దేవస్థానం నిర్వహణకే సరిపోతుంది. ఉత్సవాలు, వేడుకలు ప్రసాదాలు సిబ్బంది జీతభత్యాలు తదితర వ్యయాలు ఆలయానికి వచ్చే ఆదాయం ద్వారా ఖర్చు చేస్తున్నారు. నెమలి పుణ్యక్షేత్రం పర్యటక కేంద్రంగా రూపాంతరం చేసేందుకు రవాణా వసతి ప్రదాన అడ్డంకిగా మారింది. వేలల్లో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. తెలంగాణా సరిహద్దున ఉన్న నెమలికి ఆ రాష్ట్రంలోనే భక్తులు అధికం. ప్యాకేజి టూర్ కు జిల్లాలో ఇతర దేవాలయల నుంచి నెమలి గ్రామం దూరంగా వుండడం కూడా సమస్యగా ఉంది. పుణ్యక్షేత్రాల సందర్శనకు రెండేళ్ళ క్రితం ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా దూరప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తరించారు. ఇదే తరహాలో జిల్లాలో విజయవాడ కనకదుర్గ, వేదాద్రిలోని నరసింహ స్వామి, పెనుగంచిప్రోలులోని శ్రీతిరుపతమ్మ ఆలయాల మీదుగా నెమలికి వచ్చేందుకు రవాణా సౌకర్యం ఉంటే ఉపయుక్తంగా ఉంటుంది. నెమలి వేణుగోపాలస్వామి ఆలయానికి ప్రముఖుల సందర్శన కొదవలేదు. రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిదులు అధికారులు ప్రముఖులు తరచూ స్వామివారి సేవకు వస్తుంటారు.
**కన్నుల పండువగా స్వామివారి తిరుకళ్యాణం.
ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆరు రోజులపాటు నిర్వహించే స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ప్రతి నెలా పూర్ణిమ నాడు మాస కళ్యాణం, గోశాలలో నిత్యం గోపూజలు జరుగుతూ ఉంటాయి. ఆలయంలో ప్రతి ఆది, సోమ, శుక్రవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వైఖాసన ఆగమనం పద్దతిలో స్వామివారు పూజలందుకునే ఈ ఆలయంలో భక్తుల అన్నప్రాసనలు, వాహన పూజలు, వివాహాలు తదితర శుభకార్యాలు స్వామివారి సన్నిధిలో అధికంగా నిర్వహిస్తారు. శ్రీ కృష్ణాష్టమి, భీష్మ ఏకాదశి, ముక్కోటి, ధనుర్మాసోత్సవం, ఉగాది, శ్రీరామనవమి విశేషంగా నిర్వహిస్తారు.
**నెమలి పుణ్యక్షేత్రానికి ఇలా చేరుకోవాలి..
నెమలి పుణ్యక్షేత్రానికి తెలంగాణా రాష్ట్రంలోని మధిర నుంచి నెమలి గ్రామానికి చేరుకోవాలి. ఇతర ప్రదేశాల నుంచి వచ్చేవారు రైలు లేదా బస్సు మర్గాన మధిర చేరుకొని అక్కడినుంచి నెమలి పోవు బస్సు ఎక్కాలి. సాధారణ రోజుల్లో కుడా తిరువూరు, మధిర డిపోల నుంచి నుంచి నెమలికి బస్సులు తిరుగుతాయి. స్వామివారి తిరుకళ్యాణం రోజున మధిర, తిరువూరు డిపోల నుంచి బస్సులు ఉచితంగా తిరుగుతాయి.

శ్రీసుబ్రమణ్యస్వామి ఆలయం

జగన్మాత పార్వతీదేవి, లయకారకుడు పరమేశ్వరుల రెండో పుత్రరత్నం శ్రీ సుబ్రమణ్యస్వామి. నెమలిని వాహనంగా వేలాయుధాన్ని చేతబూని యావత్‌ దేవతాసైన్యానికి ఆయన సేనానిగా వ్యవహరిస్తారు. తన కంటే పెద్దవాడయిన విఘ్నేశ్వరునితో కలిసి అనేక శిష్టరక్షణ కోసం అనేక యుద్ధాలు చేశారు. షణ్ముఖుడికి దక్షిణ భారతంలో గుడులు ఎక్కువగా వున్నాయి. వీటిలో మహిమాన్వితమైనది కర్ణాటకలోని కుక్కెలో వెలసిన శ్రీసుబ్రమణ్యస్వామి ఆలయం. పశ్చిమ కనుమల్లోని సుందర దక్షిణ కన్నడ జిల్లాలోని సులియా తాలుకాలోని కుక్కె గ్రామంలో స్వామివారు నాగులకు రక్షణగావెలిసినిత్యపూజలందుకుంటున్నారు. చుట్టూ కుమార పర్వతశ్రేణుల మధ్య ప్రకృతి ఒడిలో నెలకొన్న స్వామివారు నాగులకు అభయమివ్వడంతో పాటు అశేష భక్తజనులకు అభయమిస్తున్నారు.

హరిదాసులు ఎక్కడా?

** అరుదైపోయిన ‘హరిదాసు’ కీర్తనలు.
సంక్రాంతి నెలల్లో మనకు కనిపించే గొప్ప సంప్రదాయాల్లో ఒకటి హరిదాసుగానం. పూర్వం పల్లె, పట్టణం తేడ లేకుండా తెల్లవారుజామునే ముగ్గులు వేసే సమయానికే పురవీధుల్లో హరినామ గానం చేస్తూ.. వివిధ కీర్తనలతో హరిదాసులు అలరించేవారు. ఇళ్ళల్లోని వారు ఇచ్చే ధన, ధాన్యాలను స్వయంపాకాలుగా స్వీకరించే సంప్రదాయాలను నేటికి కొనసాగిస్తున్నారు. గత వైభవం లేకున్నా..పట్టణాల్లో ఆదరించకపోయినా కళకు జీవం పోస్తున్నవారు ఎందరో ఉన్నారు.
** ఎలా వచ్చిందీ పద్ధతి…?
శ్రీ రాముడు రాజ్యంలో చింతలులేవు. కరవు కాటకాలురావు. దాన ధర్మాలు చేద్దామన్నా పుచ్చుకునేవారే కరువయ్యారని ప్రజలు ధర్మ దేవతను ఆడిపోసుకునేవారట. అది విన్న వేగులు రాముడితో చెప్పగా వారి దాన, ధర్మాలను పుచ్చుకునేందుకు హరినామాన్ని గానం చేసే గాయకులను రాజ్యంలో తిరుగాడేలా చేశారని, వారే నేడు కనిపించే హరిదాసులని చెపుతుంటారు
** హరిదాసు అనగా..
హరిదాసు అనగా పరమాత్మకు సమానం. మనుషులు ఇచ్చే ధానధర్మాలు అందుకుని వారికీ ఆయురారోగ్యాలు, భోగాభోగ్యలు కలగాలని దీవించేవారే హరిదాసులు. నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసేందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరూ ఇచ్చే ధన, ధాన్య, వస్తు దానాలను స్వీకరిస్తారు. సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రగా వారి శిరస్సుపై ధరించే పంచలోహ పాత్రగా భావిస్తారు.

కృష్ణ, గోదావరిల్లో కోడిపందేలకు సర్వం సిద్ధం

అత్యున్నత న్యాయస్థానాల తాజా తీర్పుల నేపథ్యంలో రాష్ట్రంలో కోడిపందేల నిర్వహణపై ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయి. అడ్డుకోవడానికి ఓ వైపు పోలీసులు ప్రయత్నిస్తుండగా, మరోవైపు నిర్వాహకులు తమ ఏర్పాట్లలో ఉన్నారు. సాధారణంగా ప్రతీ ఏడాది పండుగకు పది రోజుల ముందునుంచే కోడిపందేలను నిర్వహించేవారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండీ మండలం జువ్వలపాలెం, కలుగుపూడి, ఆకివీడు, మండలం అయిభీమవరం, భీమవరంలోని ఆశ్రఒతోటలు, ద్వారకాతిరుమల, పెదవేగి, పెదపాడు మండలాల్లో అధికంగా పందేలు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం, అమలాపురం, రాజోలు, జగ్గంపేట, సామర్లకోట, కిర్లంపూడి ప్రాంతాల్లో పందేలను నిర్వహించేవారు. కృష్ణాజిల్లా నుజవీడు, హనుమాన్ జంక్షన్, నాగాయలంక, కృత్తివెన్ను, పెడన ప్రాంతాల్లో కోళ్ళను బరిలోకి దింపుతారు. పశ్చిమలోని ఆకివీడు మండలం, అయిభీమవరం, భీమవరంలలో పెద్దఎత్తున నిర్వహించే పందేలను చూడడానికి, పందెం కాయడానికి తెలుగు రాష్ట్రాలు అన్ని ప్రాంతాల నుంచి పందెంరాయుళ్ళు ఇక్కడికి చేరుకునేవారు. గత సీజన్లో ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాల్లో దాదాపు వంద కోట్లకు పైగా కోడిపందేల వ్యాపారం జరిగినట్లు అంచనా. మహాదేవపట్నం, కాళ్లకూరు, ఉండి, జువ్వలపాలెం, అప్పారావుపేట, భీమవరం, ఆశ్రమంతోట, కొరుకొల్లు వంటి ప్రాంతాలు ప్రధాన వేదికలుకాగా ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతాల్లో పందేలు నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. భీమవరం మండలం వెంపతోపాటు పైన పేర్కొన్న కొన్ని బరుల్లో తక్కువ స్తాయిలో పందేలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో పండుగ ముడురోజులే పందేలు నిర్వహించాలని పందెం రాయుళ్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది.ద్యా, ఉపాధి, వైద్య అవకాశాలపై ప్రత్యెక సదస్సు నిర్వహిస్తున్నారు. దానికి సంబందించిన వివరాలివి.