గత వారం రోజుల నుండి అంగరంగ వైభవంగా జరిగిన కృష్ణాజిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి గురువారంతో బ్రహ్మోత్సవాలు ముగిసాయి. చివరిరోజు స్వామివారికి పుష్పయాగము నిర్వహించగా రాత్రికి స్వామివారికి పవళింపు సేవతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసాయి. ఆరురోజుల పాటు ఆలయ ప్రాంగణంలో భక్తులను అలరించేందుకు రాత్రివేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
Category: ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం
ఫిబ్రవరి 7 నుంచి తిరువూరు తిరునాళ్ళు
ఈ ప్రాంతంలో తిరువూరు తిరునాళ్ళుగా ప్రసిద్దిగాంచిన స్థానిక శ్రీవేంకటాచలస్వామీ ఆలయ వార్షిక పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 7 నుంచి 13 వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు శ్రీనమ్మాళ్వార్ల ఉత్సవాలు జరుగుతాయి. 8న స్వామివారిని పెండ్లికుమరుడిని చేయడం, 9న కోటాయి మండపంలో ఎదుర్కోలు ఉత్సవం, 10న గరుడ వాహనంపై గ్రామోత్సవం, 11న స్వామివారి రధోత్సవం, 12న ప్రత్యెక పూజలు, 13న అద్దాల మండపంలో పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈమేరకు వివరాలకు ఆలయ మేనేజర్ జన్ను వెంకటేశ్వరరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
నేడు(ఆదివారం) తిరువూరులో నెమలి వేణుగోపాలుని కళ్యాణం
ధర్మప్రచారంలో భాగంగా నెమలి వేణుగోపాలస్వామి దేవాలయంవారు వేణుగోపాల స్వామి కళ్యాణాలను వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ది: 20-10-2019 న తిరువూరులోని శ్రీవేంకటాచలస్వామి ఆలయంలో ఉ:10.00 గంటలకు శ్రీవేణుగోపాలస్వామి వారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని తీర్దప్రసాదాలను స్వీకరించాలని ఆలయ ఇ.ఓ కోరారు.
స్థల పురాణం . :—- ద్వాపరం లో అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ , తన అవతారాన్ని చాలిస్తూ, తన నెమలి పింఛాన్ని ఇచ్చట వదిలి వెళ్లాడని , ఆ ప్రదేశం లోనే స్వామి భూగర్భం లో ఉండేవాడని, ఎందరో మహర్షులు ఈయనను సేవించి ,తరించారని ప్రతీతి. అందుకే ఈ ప్రాంతాన్ని “ నెమలి “గ్రామం గా పిలుస్తున్నారు.
మరొక కధనాన్ని—— అనుసరించి, “ అదృశ్యో వ్యక్త రూపశ్చ” అని కదా విష్ణుసహస్రనామము. ఈ స్వామి వ్యక్త రూపుడైన విధము ఈ విషయాన్నే నిరూపిస్తోంది. ఇంతకు పూర్వము ఈ ప్రాంతం లో తపస్సు చేసుకున్న మహర్షులు , మునులు కారణాంతరాల వల్ల ఈ ప్రాంతాన్ని వదిలి వెడుతూ, ఈ సుందర సుకుమారమూర్తి ని భూగృహం లో భద్రపరచి వెళ్లి వుంటారని, స్వామి లభించిన తీరును బట్టి భక్తులు భావిస్తున్నారు.
ఆ రోజు 23.3.1953 వ తేది శ్రీ రామనవమి . ఊరంతా సీతారామ కళ్యాణ వేడుకల్లో మునిగి వుంది. అదే సమయం లో ఒకరైతు పొలం లోకి మేరువు తోలించు కుంటున్నాడు. పలుగు వేసిన మొదటి దెబ్బ కే ఖంగుమన్న శబ్దం వచ్చింది. చోటు మార్చి మళ్లీ పలుగు వేశాడు. మళ్లీ అదే ధ్వని. ఈ సారి రెండు ఘాతాల మధ్య పలుగు వేయబోవు నంతలో మిఱుమిట్లు గొలిపే ఒక మెరుపు వెలువడింది. దానితో ఆ మనిషి స్పృహ తప్పి పడిపోయాడు. తోటి పనివారు అతని ముఖం మీద నీళ్లు చల్లి సపర్యలు చేయగా, కోలుకున్నాడు కాని అతని చూపు పోయింది. మిగిలిన వారందరు అక్కడ త్రవ్వి చూడగా స్వామి వారి విగ్రహము, ప్రక్కనే హోమగుండము,ప్రమిదలు.ఒక శంఖము,మొదలైనవి లభించినవి. అదృశ్య రూపం లో ఉన్నస్వామి ఈ విధం గా వ్యక్త రూపుడైనాడు. ఏనాడో మహర్షుల చేత పూజలందుకున్న యోగీశ్వరేశ్వరుడు మరలా ఇలా దర్శన మిచ్చాడని భక్తులు భావించారు. స్వామి ఆదేశానుసారం స్వామి లభించిన ప్రదేశం లోనే ఆలయ నిర్మాణం గావించారు.
చుట్టుప్రక్కల అరవై గ్రామాల ప్రజల్లో ఎంతోమంది స్వామి తమకు కలలో కన్పించాడని దేవాలయ నిర్మాణానికి ముందుకొచ్చారు. ఆలయాన్ని నిర్మించి, ఉత్తరాభిముఖం గా వెలసిన స్వామిని తూర్పు ముఖంగా ప్రతిష్టించ ప్రయత్నించారు. ఒక్కసారిగా భయంకరమైన గాలివాన వచ్చి, వేసిన పందిళ్లు, చేసిన ఏర్పాట్లు ఛిన్నాభిన్నమైనాయి. చేసిన తప్పును తెలిసి కొని, స్వామిని ఉత్తరాభిముఖుని చేయడం తో సామాన్య పరిస్ధితి ఏర్పడిందిట. అందువలన స్వామి ఆలయ ముఖద్వారం ఈనాటికీ ఉత్తర ముఖం గానే ఉంటుంది. 6.2.1957 లో స్వామి ని ఇప్పుడున్న ఆలయం లో ప్రతిష్టించారు.
నెమలిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
గంపలగూడెం మండలం నెమలిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి నూతన వస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో అలంకరించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన తొమ్మిది రకాల ప్రసాదాలతో నివేదన చేశారు. భక్తులకు 9 రకాల ప్రసాదాలను పంపిణీ చేశారు. సాయంత్రం 5గంటలకు ఆలయ ప్రాంగణంలో నవనీతకృష్ణ అలంకృతులైన స్వామివారికి ఉట్టి కొట్టే ఉత్సవం నిర్వహించారు. రాత్రికి రుక్మిణి, సత్యభామా సమేతుడైన స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథంపై ఆశీనులను చేసి మేళతాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీకృష్ణ మాలధారణ చేసిన భక్తులు ఇరుముడి సమర్పించి దీక్షను విరమించారు. కృష్ణా, ఖమ్మం జిల్లాల నుంచి భక్తులు వేడుకల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు. ఆలయంలో నిర్వహించే వేడుకల ఏర్పాట్లను ఆలయ సహాయ కమిషనర్ ఎన్.సంధ్య, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎం.రామాంజనేయులు పర్యవేక్షించారు.
*** కొకిలంపాడు ఆలయానికి రూ.11లక్షల నిధులు మంజూరి
తిరువూరు మండలంలోని కోకిలంపాడు గ్రామంలో నూతనంగా నిర్మించననున్న శ్రీ సీతారమస్వామి దేవస్థాన నిర్మాణానికి రాష్ట్ర దేవాలయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి విజ్ఞప్తి మేరకు 11 లక్షల 70 వేలు నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల తిరువూరులో పర్యటించిన మంత్రికి ఎమ్మెల్యే రక్షణనిధి గ్రామస్తుల చేపట్టిన ఆలయ నిర్మాణానికి నిధుల కొరత ఏర్పడటంతో ఈ విషయమై వినతిపత్రం అందజేశారు.ఆలయ నిర్మాణానికి నిధుల మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసిన మంత్రి వెల్లంపల్లి కి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
తిరువూరులో ఘనంగా బక్రీద్ వేడుకలు–తిరువూరు కబుర్లు–08/12
*తిరువూరు పట్టణంలో బక్రీద్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా సోమవారం జరుపుకున్నారు. ఉదయం 9 గంటలకంతా ముస్లిం సోదరులందరూ నూతన వస్త్రాలను ధరించి స్థానిక మల్లెమ్మ చెరువు వద్ద ఉన్న ఈద్గా దగ్గరకు చేరుకొని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.ఇస్లాం మతగురువు రిజ్వి (పేష్మామ్) ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి.. అనంతరం పెద్దలు, పిల్లలు ఒకరిని ఒకరు ఆలింగనం పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇళ్ళకు వెళ్ళి ఖుర్బానీ కార్యక్రమాన్ని కొనసాగించారు. హిందూ సోదరులు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలను తెలిపారు. పట్టణంలో పండగ వాతావరణం కోలాహలంగా కనిపించింది.జామియా మస్జీద్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ హుస్సేన్,కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నమాజ్ ల కొరకు తగిన ఏర్పాట్లు చేశారు. గంపలగూడెం, విస్సన్నపేట, ఏ- కొండూరు మండలాల్లో ఆయా ఈద్గాహ్ లలో, మస్జీద్ లలో కూడా ఘనంగా బక్రీద్ వేడుకలు జరిగాయి..
*రెండుప్రమాదాలు ఇరువురికి తీవ్ర గాయాలు
ఏ-కొండూరు మండలం రామచంద్రపురం ద్ద బైక్ ను ఢీ కొన్న కార్..బైక్ పై ప్రయాణిస్తున్న గంపలగూడెం మండలం గొల్లపూడి కి చెందిన అరుణ్ అనే వ్యక్తికి తీవ్రగాయాలు..బైక్ ను ఢీ కొట్టిన కారు అదుపుతప్పి ప్రక్కన కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో తప్పిన పెను ప్రమాదం..కారులో మొత్తం నలుగురు ప్రయాణం..గాయలపాలైన వారిని మైలవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు..
*వ్యక్తిని డీ కొట్టిన ‘వజ్ర’ బస్సు.
తిరువూరు మండలం లక్ష్మీపురం లో జాతీయ రహదారిపై తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్ (వజ్ర)-TVS XL సూపర్ ఢీ-బండిపై ప్రయాణిస్తున్న కంటిపూడి నారాయణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు..108 సహాయంతో తిరువూరు ప్రభుత్వాసుపత్రికికి తరలింపు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
*ఉచిత వైద్య శిభిరంలో పరీక్షలు
విస్సన్నపేట మండలం పుట్రెల పంచాయతీ కార్యాలయంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో ఉచిత గుండె వ్యాధుల వైద్య శిభిరాన్ని నిర్వహించారు. దీనిలో విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణులు కోటేశ్వరరావు సేవలందించారు. సుమారు అరవై మందికి టూడీ , ఎకో పరీక్షలు చేసి మందులు అందజేశారు.
*నెమలిలో శాయనాదివాసం
శ్రావణమాసం సందర్భంగా గంపలగూడెం మండలంలోని నెమలి వేణుగోపాలస్వామీ ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల్లో రెండో ఆదివారం ఉదయం పవిత్ర శుద్ధి అగ్ని ప్రతిస్థాపన, త్రేతాగ్నీ హోమం, అధివాసం నిర్వహించారు. సాయంత్రం పవిత్రమాలలకు శయనధివాసం సర్వదేవత ఆహ్వానం తదితర పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు తీ. గోపాలాచార్యులు ఆద్వర్యంలో రుత్విక బృందం ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంది. వివిద గ్రామాలకు చెందిన దంపతులు యాగశాలలో నిర్వహించిన హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు.
*గ్రామదేవతకు బోనాలు
గంపగూడెం మండలంలోని పలు గ్రామాల్లో శ్రావణమాసం సందర్భంగా గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. వినగడప, ఊటుకూరుకు చెందిన ప్రజలు తమ గ్రామాల్లోని ముత్యలమ్మను భక్తిశ్రద్దలతో కొలిచారు. అమ్మవారికి చీరలు పసుపు, కుంకుమ గాజులు పూలు పిండి వంటలు సమర్పించారు.
*గోవుల మృతిపై విచారణ నిర్వహించారు
విజయవాడ సమీపంలోకి కొత్తూరు తాడేపల్లి లో గోసంరక్షణ సంఘం ఆద్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలల్లోని గోవుల మృతి పై భాజపా మండల శాఖ అద్యక్షుడు అన్నవరపు క్రాంతికుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగాగోపాలకృష్ణ, గ్రామశాఖ అద్యక్షుడు కోడుమూరు సూర్యప్రకాష తదితరులు ఆదివారం ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేహరు. దీనిపై న్యాయ విచారణ చేసి, దోషులను గుర్తించి వారిపై కటినంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
*పదిహేను మంది జూదరుల అరెస్టు
అందిన సమాచారం ప్రకారం మేరకు స్థానిక నూజివీడు రోడ్డులో శ్రీశ్రీ కళాశాల కూడలిలో కొందరు యువకులు నెంబర్ల జూదం నిర్వహిస్తుండగా దాడి చేసి ఆరుగురిని పట్టుకున్నట్లు విస్సన్నపేట ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. వారి నుండి రూ. 2,040 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వారిని సొంత పూచికత్తుపై వదిలామని సోమవారం తిరువూరు కోర్టుకు తరలించనున్నామని వెల్లడించారు. గంపలగూడెం మండలం వినగడప శివారు నరికంపడులో ఆదివారం సాయంత్రం జూదమాడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు.
*ఇద్దరు గుట్కా విక్రేతల అరెస్టు
విస్సన్నపేటలో నిషేధిత గుట్కాలు విక్రయిస్తున్నా ఇద్దర్ని ఆదివారం విస్సన్నపేట పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం విస్సన్నపేట ఎస్టీ కాలనీలోని ఓ గృహంలో అనుమోలు పాండురంగారావు స్థానిక ఎస్సీ వాడలో మేకల పద్దయ్య దుకాణంలో గుట్కాలు విక్రయిస్తుండగా స్వాదీనం చేసుకున్నామనారు.
*నాణ్యమైన సదుపాయాలు, ఉత్తమ బోధనే లక్ష్యం
నాణ్యమైన మౌలిక సదుపాయాలు ఆహారం ఉత్తమ బోధనా తమ పాటశాల లక్ష్యమని కొండపర్వలోని గిరిజన సం క్షెమ శాఖ గురుకుల పాటశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత తెలిపారు. పాటశాల ప్రాంగణంలో ఆదివారం ఆమె విద్యార్ధుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. నెలకోసారి తల్లిదండ్రులు ఇక్కడికి చేరుకొని పిల్లలకు ఎదురయ్యే సమస్యలు తెలుసుకుని తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
*చేతివృత్తి కార్మికులుగా గుర్తిచాలీ
టీవీ టేక్నిశియన్లు చేతి వ్రుత్తి కార్మికులుగా గుర్తిస్తూ స్వయం ఉపాధి అవకాశాలు మెరుగు పరచేందుకు ఆర్ధిక తోడ్పాటు అందించాలని టీవీ మెకానిక్ ఎలక్ట్రానిక్స్ యూనియన్ అద్యక్షుడు ఎస్.శేఖర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్దిఅకంగా ఇబ్బందులు పడుతున్నందున ఆడుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రత్యేకంగా బ్యాంకుల నుంచి రుణాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
*15 నుంచి కృష్ణజయంతి, రాధాస్తామి ఉత్సవాలు
తిరువూరు శ్యామవేదీ మందిరంలో ఈ నెల 15నుంచి సెప్టెంబరు 6 వరకు కృష్ణ జయంతి రాధాస్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు మందిర కమిటీ నిర్వాహకులు తెలిఅప్రు. ఈనెల 15 వరకు జరిగే రాధాకృష్ణుల ఊయల ఉత్సవాన్ని ఆదివారం వైభవంగా ప్రారంభించినట్లు వివరిమ్కాహ్రు. ఐదు రోజుల పాటు ఈ ఉత్సవం సాయంత్రం 6నుంచి 7 గంటల వరకు జరుగుతుందన్నారు. 15న బలరామ ఆవిర్భావ పూర్ణిమ, 23న శ్రీకృష్ణ జయంతి వేడుకలు, 24న మహాప్రసాద వితరణ, సెప్టెంబరు 6న రాధాస్టమి వేడుకలు జరుగుతాయని చెప్పారు.
*భాజపాకు ప్రజల్లో ఆదరణ
ప్రధాని మోడీ నాయకత్వంలో భాజపా ప్రబుత్వాన్ని ప్రజల్లో ఆదరణ పెరుగుతతుందని ఆపార్టీ జిల్లా నాయకుడు దారా మాధవరావు తెలిపారు. పట్టణ పరిధిలోని శాంతినగర్, సుగాలీ కాలనీలో ఆదివారం భాజపా సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయమ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో భాజపా నుంచి బలమైన అభ్యర్ధులను బరిలో నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
*పేదలకు వస్త్రాలు దుప్పట్లు పంపిణి
బక్రీద్ సందర్భంగా స్థానిక కార్యాలయంలో జామా అతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు ఆదివారం పేదలకు దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జామా అతే ఇస్లామీ హింద్ అద్యక్షుడు ఎ.హమీద్ మాట్లడారు. కార్యక్రమంలో ప్రతినిధులు వలీ అహ్మద్ అజీజ్ ముజీబ్ యాకూబ్ రెహమాన్ ఉద్దండు, కరీముల్లా మహాబుసా, ఇస్మాయిల్ పాల్గొన్నారు.
*ప్రజా సంఘాల ఆద్వర్యంలో 14న అవగాహనా సదస్సు
ఎ.కొండూరు మండలంలోని కంభంపాడు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈనెల 14న ప్రజా సంఘాల ఆద్వర్యంలో గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు అవగాహనా సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం నాయకుడు వెంకటేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దీనిలో అభ్యదులకు పలు అంశాల్లో అవగాహనా సందేశాలను నివృత్తి చేయడంతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన అద్యయన సమగ్రీని ఉచితంగా అందజేష్టామని చెప్పారు.
*తిరువూరు భవిత కార్యాలయంలోఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఫిజియోదేరపి ఉచిత వైద్య శిభిరం నిర్వహిస్తారు.
*ఇద్దరికి పాముకాటు
తిరువూరు మండలం చౌతపల్లికి చెందిన చటారి మహాలక్ష్మి తమ వ్యవసాయ పొలంలో పని చేస్తుండగా ఆదివారం పాముకాటు ఎసింది. గాయపడిన ఆమెను చికిత్స నిమితం కుటుంబ సభ్యులు తిరువూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అదే విధంగా కోకిలంపాడుకు చెందిన షేక్ హసన్ ఆదివారం సాయంత్రం పాముకాటుకు గురయ్యాడు.
*కుక్కలా దాడిలో బాలుడికి గాయాలు
కుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన సతిరువురులోని రాజుపెతలో ఆదివారం జరిగింది. కాలనీకి చెందిన సంపత్ స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా విదీలో కుక్కలు దడి చేసాయి. గాయపడిన సంపత్ ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రాంతీయ వైద్య శాలకు తరలించారు.
నెమలి కృష్ణుడికి ప్రత్యేక అలంకరణ-నేటి తిరువూరు కబుర్లు–07/29
*స్పందనలో వినతులు స్వీకరణ
తిరువూరు, ఎ.కొండూరు., గంపలగూడెం, విస్సన్నపేట మండలాల్లోని రెవెన్యు కార్యాలయాల్లో స్పందన కార్యక్రమమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎంపీడీవోలు.
*గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామివారికి సువర్ణాభరణాలతో అలంకరించారు.
*అవినీతి రహిత సేవలు అందించాలి – ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో వైకాపా ప్రభుత్వ ఆశయాలను అనుగుణంగా అవినీతి రహిత సేవలను ప్రజలకు అందించాలని ఎమ్మెల్యే రక్షణనిధి పోలీసు అధికారులకు సూచించారు. స్థానిక నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం ఆయన నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు, సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్ ఎస్సై మనికుమార్ లతో సమావేశమయ్యారు. నియోజకవర్గలో శాంతి బద్రతలు పరిరక్షణపై సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికల సనంతరం ఇప్పటి వరకు రాజకీయపమైన దాడులు తిరువూరు నియోజకవర్గంలో జరగలేదని ఎవరైనా ప్రోత్సహిస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు.
*వరినార్లు తుంచి నాటాలి
ప్రతీకూల వాతావరణ పరిస్థితుల నేపద్యంలో వరినాట్ల ప్రక్రీయ ఆలస్యమైనందున నారు చివర్లు తుంచిన తరువాతే నటలని ఏవో రాజ్యలక్ష్మి రైతులకు సూచించారు. మండలంలోని చింతలపాడులో ప్రారంభమైన వరినాట్ల ప్రక్రీయను ఆదివారం ఆమె పరిశీలించారు. వరినాట్ల పూర్తి చేసిన తరువాత్ ప్రతి రెండు మీటర్లకు ఇరవై సెంటి మీటర్లు వెడల్పుతో తూర్పు, పడమర దిశగా కాలిబాటలు తీయాలని సూచించారు.
*భాజపా బలోపేతానికి కృషి అవసరం
నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తూ గ్రామ స్థాయి నుంచి భాజపాకు బలోపేతం చేసేనుకు కృషి చేయాలనీ ఆపార్టీ రాష్ట్ర నాయకుడు కోనేరు వెంకటకృష్ణ సూచించారు. స్థానిక కస్తూరి పూర్ణచంద్ర కళ్యాణ మండపంలో ఆదివారం నియోజకవర్గ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. అనంతరం సభ్యత్వ నమోదు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గలో కనీసం పదివేల మందికి సభ్యత్వం కల్పించటం లక్ష్యంగా నమోదు కార్యక్రమాన్ని వినియోగించు కోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులూ పాల్గొన్నారు.
*వర్షపునీటిలో పుస్తక పటనం
విస్సన్నపేట గ్రంధాలయంలో పుస్తక ప్రీయులకు చేదు అనుభవం ఎదురవుతోంది. గ్రంధాలయ భవనం శిధిలావస్థకు చేరి, పైకప్పు పూర్తిగా దెబ్బతినతంతో ఈ పరిస్థితి తలెత్తింది. అధికారులు పుస్తకాలను నీటిలో తడవకుండా జాగ్రత్త చేసేందుకు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. భవర్డువనం పూర్తిగా దెబ్బతిని ప్రమాదకరంగా ఉన్న మూడు గదుల్లో రెండింటిని మూసి వేశారు.
*వర్డు సచివాలయ హద్దుల ముసాయిదా విడుదల
ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరువూరు పురపాలక సంఘం పరిదిలోకి ఇరవై వార్డుల పరిధిలో వార్డు సచివాలయ హద్దుల ముసాయిదాను కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఆదివారం విడుదల చేశారు. వర్డు సచివాలయ హద్దులను గుర్తించేందుకు ముసాయిదా మ్యాపాలను ప్రకటించారు. ప్రజలు పరిశీలించుకునేందుకు వీలుగా స్థానిక కార్యాలయం నోటీసు బోర్డులో వీటిని అందుబాటులో ఉంచారు. దీనిపై ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను ఆగస్టు మూడవ తేదీ వరకు స్వీకరిస్తారు.
*గ్రామాల్లో సామాజిక తనిఖీ సభలు పూర్తీ
గంపలగూడెం మండలలోని పన్నెండు గ్రామాల్లో ఆదివారం సామాజిక తనిఖీ గ్రామ సభలు నిర్వహించారు. వీటిలో సామాజిక తనిఖీ బృందం గుర్తించిన అంశాలను డీఆర్పీలు వెల్లడించారు. వెలుగు పధకం ద్వారా అనుముల్లంకలో పలువురు రైతుల భూముల్లో గుంటలు తీసి చింత మామిడి మొక్కలు నటినట్లు రూ. 27 వేలు వరకు తీసుకున్నారని గుర్తించారు. సదరు రైతుల భూముల్లో గుంత తీయలేదని మొక్కలు నతలేదని వెల్లడించారు. చింతలనర్వలోనూ రైతుల భూముల్లో గుంటలు తీయకుండా నిమ్మ మొక్కలు నాటకుండా నిధులు వుపసంహరించారని గుర్తించినట్లు వెల్లడించారు.
*భక్తీ శ్రద్దలతో సామూహిక సాయి వ్రతాలు
తిరువూరు షిర్డీ సాయి కళ్యాణ మండపంలో ఏకాదశి సందర్భంగా సామూహిక సాయి వ్రతాలు ఆదివారం భక్తీ సద్దాలతో నిర్వహించారు. పట్టణ నలుమూలల నుంచి తరలివచ్చిన మహిళలు విఘ్నేశ్వర పూజ అనంతరం సాయినామాన్ని స్మరిస్తూ వ్రతాలు చేశారు. ప్రధానార్చకుడు రంగాచార్యులు ఆద్వర్యంలో షిర్డీ సాయికి విశేష పూజల్లో భాగంగా అభిషేకాలు, అర్చనలు చేశారు.
*ముత్యాలమ్మకు పుష్పాలంకరన
ఆషాడ మాసం సందర్భంగా గంపలగూడెంలోని గ్రామ దేవత ముత్యాలమ్మ అమ్మవారికి ఆదివారం పుష్పాలంకరణ చేశారు. ఉదయం అమ్మవారి మూలవిరాట్ కు అభిషేకాలు నిర్వహించి, వివిధ రంగుల బంతి పూలతో శోభాయమానంగా అలంకరించి పూజలు చేశారు. భక్తబృందం ఆద్వర్యంలో బోనాలు సమర్పించారు.
*అమ్మవార్లకు సకంబరి అలంకరణ
గంపలగూడెం మండలం ఆర్లపడులో దాసాంజనేయ స్వామీ భక్తబృందం ఆద్వర్యంలో గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం సకంబరి ఉత్సవాలు నిర్వహించారు. గుడిలోని ముత్యాలమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవార్ల విగ్రహాలకు ఉదయం 108 బిందెలతో భక్తుల జలభిషేకం నిర్వహించారు. తదుపరి వంగ, బీర, దోస, బెండ, టమాట, మిరప, నిమ్మ, ఆలుగడ్డలతో అమ్మవార్ల విగ్రహాలను అలంకరించారు. భక్తులు పిండివంటలు ఫలాలు పసుపు, కుంకుమ గాజులు సమర్పించి మొక్కులు చెల్లించారు.
*ఊటుకూరు రామాలయంలో ఘనంగా ఉత్సవాలు
గంపలగూడెం మండలం ఊటుకూరు రామాలయంలో ఆషాడం సందర్భంగా ఆదివారం శాకంబరీ ఉత్సవాలు నిర్వహించారు. అర్చకులు లక్ష్మీనారాయణచార్యులు ఆద్వర్యంలో దేవతామూర్తులకు ఉదయం పంచంరుతాభిశేకాలు నిర్వహించారు. గ్రామానికి చెందిన భక్తులు అందించిన చేయూతతో గుడిలోని సీతారామ చంద్ర లక్ష్మణ ఆంజనేయస్వామి మూలవిరాట్ లను గులాబీలతో శోభాయమానంగా అలంకరించారు.
*పేకాట శిబిరం పై పోలీసుల దాడి
తిరువూరు పట్టణ శివారు పీటీ కొత్తూరు సమీపంలోని మామిడి తోటలో పేకాట ఆడుతున్నరనే సమాచారం మేరకు సెక్టార్- 1 ఎస్సై మణికుమార్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 5260నగదును స్వాధీనం చేసుకున్నారు. దొరికిన వారిని పోలీస్ స్టేషన్‌కే కు తరలించి వ్యక్తిగత పూచీకత్తు పై విడుదల చేశారు.
*జల్లులు పడుతున్నా
విస్సన్నపేట మండలంలో మూడురోజులుగా ఎడతెరపిలేని వర్షం కురుస్తున్నా.. వ్యవసాయ పనులు మాత్రం ముందుకు సాగే అవకాశాలు కనిపించటం లేదు. కురుస్తున్న వర్షపు నీటి నిల్వలు సాగు చెరువులకు చేరకపోవటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
*చారుమజుందార్ కు నివాళి
సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ వ్యవస్థాపక నాయకుడు చారుమంజూర్ కు విస్సన్నపేటలోని ఆపార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి హరినాద్ నివాళులు అర్పించారు. చారుమజుందార్ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమమలో సాయుధ పోరాటం ద్వారా దేశ విమోచన సాధ్యమని స్పస్తంగా ప్రకటించిన తోలి వామపక్ష నేత చారుమజుందార్ అని పేర్కొన్నారు. కమ్యునిస్టుల ఐక్యత ద్వారా వామపక్ష పోరాటలను ముందుకు నడిపించే దిశగా ఈనెల 30న కోల్ కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో ప్రజా సదస్సు జరగనునట్లు వెల్లడించారు.
*ఉత్తమ సేవల్లో సహకార బ్యాంకు ప్రథమం-ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని
రైతులకు ఉత్తమ సేవలు అందించడంలో కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(కేడీసీసీబీ) ప్రథమ స్థానంలో ఉందని కేడీసీసీ బ్యాంకు, ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు తెలిపారు. ఎ.కొండూరు మండలం గొల్లమందల గ్రామంలో నూతనంగా నిర్మించిన పీఏసీఎస్ భవనాన్ని ఆదివారం ఆయన మార్క్‌ఫెడ్ ఛైర్మన్ కంచి రామారావు, తిరువూరు ఏఎంసీ ఛైర్మన్ అలవాల రమేశ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా గ్రామాల్లోని సహకార బ్యాంకుల ద్వారా రైతులు, కౌలురైతుల రుణాల మంజూరు చేయడంలో జాప్యం లేకుండా చేస్తున్నట్లు చెప్పారు. రైతులు, ఖాతాదారులు కేడీసీసీ బ్యాంకు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఈవో ఎన్.రంగబాబు, కేడీసీసీ బ్యాంకు ఉపాధ్యక్షుడు రాంబాబు, ఏజీఎం అలెగ్జాండర్, మేనేజర్ బి.వెంకటేశ్వరరాజు, సూపర్వైజర్ ఎం. ఏసుదాసు, కేడీసీసీ డైరెక్టరు మంగణ, పీఏసీఎస్ అధ్యక్షులు బి. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
*పాఠశాలకు రూ.2 లక్షల వితరణ
గంపలగూడెంమండలంలోని ఆర్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అన్నదమ్ములైన ఊటుకూరు రంగారావు, నాగేశ్వరరావు రూ.2 లక్షలు వితరణగా అందించారు. దాతలిద్దరు తమ తల్లిదండ్రులైన ఊటుకూరు నారాయణరావు, సత్యవతి జ్ఞాపకార్థం, రంగారావు, రుక్మిణి దంపతులు తమ కుమారుడు గణేష్‌కుమార్ జ్ఞాపకార్థం విరాళం అందజేశారు. దాతలు అందించిన ఆర్థిక సాయంతో బడిలో విద్యార్థులు కూర్చునేందుకు అవసరమైన 60 బల్లలు తయారు చేయించారు. ప్రధానోపాధ్యాయిని కె.శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో దాతల్లో ఒకరైన రంగారావు బల్లలను ఆవిష్కరించారు. ఆర్లపాడు తమ పూర్వీకుల స్వస్థలమని, ఆ అభిమానంతోనే ఉన్నత పాఠశాలకు సోదరులిద్దరం విరాళం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దాత రంగారావును ఉపాధ్యాయులు, గ్రామస్థులు శాలువాతో సత్కరించారు. పాఠశాల పూర్వ హెచ్ఎం వి.శేషిరెడ్డి, పూర్వ ఆంగ్ల ఉపాధ్యాయుడు ఎం.రామ్‌ప్రదీప్ పాల్గొన్నారు.
పుట్రేల మారెమ్మ తల్లి తిరునాళ్ళు-కార్యక్రమాల వివరాలు
పుట్రేల మారెమ్మ తల్లి తిరునాళ్ళు 5 రోజుల ఉత్సవాల కార్యక్రమాల వివరాలు
April 19 , శుక్రవారం ఉదయం 6 గంటలకు శ్రీ అమ్మవారికి మైల తీర్చుట గుడారు వేయుట బియ్యం కొలబట్టుట అఖండ నిత్య దీపారాధన, సాయంత్రం పంబల సేవ
20 April, శనివారం ఉదయం పూజలతో పాటు సాయంత్రం కోలాటం లతోపాటు కనక తప్పెట్ల తో చిత్ర అ విచిత్ర వ్యాసాలతో పాటు వీధి నాట్యాలతో పాటు డబ్బులు డో లు విన్యాసములతో విద్యుత్ దీపాల అలంకరణతో దేదీప్యమానంగా గా ప్రభ బండి పై శ్రీ మారెమ్మ తల్లి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం
April 21, ఆదివారం ఉదయం పూజా క్రాయక్రమాలు, మొక్కుబడులు జల బిందెలు జమ్మి ఆన కట్టుట పంబల సేవ అనంతరం పూలకప్పెర
April 22, సోమవారం ఉదయం పంబల సేవ శ్రీ మారెమ్మ తల్లి అమ్మవారి కథాగానం పొట్ట ఆన కట్టుట సాయంత్రం నాలుగు గంటలకు పుట్ట బంగారం తెచ్చుట చంద్ర పట్నం దీవెన బండారు తదితర కార్యక్రమాలతో పాటు
April 23 మంగళవారం ఉదయం ఘనంగా పూజా కార్యక్రమాలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు తో ఘనంగా ఉత్సవాల ముగింపు కార్యక్రమం
మన ఊరు మన పుట్రేల మారెమ్మ తల్లి
పంచలింగాల క్షేత్రాలు ఇవే
ప్రాణికోటికి ఆధారమైనవి పంచభూతాలు. అవి భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. ఈ ఐదు మూలకాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవే పంచభూత స్థల దేవాలయాలు. విశ్వమంతా నిండి ఉన్న విరూపాక్షుడిదేవాలయాలలో పంచభూత స్థలాలు అత్యంత విశిష్టమైనవిగా వెలుగొందుతున్నాయి. దక్షిణ భారతదేశంలో గల ఈ పంచభూత స్థలాలను శివరాత్రి పర్వదినాన సందర్శించడం జన్మధన్యంగా భావిస్తారు భక్తజనం. లయకారుడైన శివుడిని ఎక్కడ వెదకాలని పరితపించే భక్తులకు ఈ పంచభూత స్థలదేవాలయాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇందులో నాలుగు దేవాలయాలు తమిళనాడులో ఉండగా, ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో ఉంది.
1.ఆకాశ లింగం-నటరాజస్వామి ఆలయం: చిదంబరం
తమిళనాడులోని కడలూరు జిల్లాలో గల ముఖ్య పట్టణం చిదంబరం. చెన్నై నుంచి 231 కిలోమీటర్ల దూరంలో ఉంది. పరమ శివుడు ఆనందతాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి. అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు. ఈ ఆలయానికి 9 ద్వారాలు ఉంటాయి. ఇవి మనిషిలోని నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు. గర్భగుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉంటుంది. దానికి తెర వేసి ఉంటుంది. ఆ గోడపై ‘యంత్ర’ అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటివైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్నీ, ముక్తినీ సూచించే ఎరుపు రంగూ ఉంటుంది. పంచభూతాల్లో ఒకటైన ‘ఆకాశానికి ప్రతీకగా గర్భగుడిలో మూలవిరాట్ ఉండాల్సిన స్థానంలో ఖాళీస్థలం ఉంటుంది. నిరాకారుడుగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు. తమిళనాడు శివాలయాలకు పుట్టిల్లు అని చెప్పవచ్చు. చోళ, పాండ్య చక్రవర్తులు శివుని పట్ల తమకు గల అత్యంత భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా ఎన్నో శివాలయాలు ఇక్కడ వెలుగొందుతుంటాయి. తిల్లయ్ కాళీ ఆలయం, పాశుపతేశ్వర ఆలయం, అన్నామలై యూనివర్శిటీ, పిచ్చవరం పిక్నక్ స్పాట్.. లను ఇక్కడ సందర్శించవచ్చు. చెన్నై నుంచి చిదంబరానికి నేరుగా రైలులో చేరుకోవచ్చు. తమిళనాడులోని వివిధ ప్రదేశాల నుంచి చిదంబరానికి బస్సు సౌకర్యం ఉంది.
2. పృథ్వీ లింగం-ఏకాంబరేశ్వరాలయం : కంచి
కంచి ఉత్తరభాగాన్ని శివకంచి అంటారు. పంచభూత క్షేత్రాలలో ఒకటైన ఏకాంబరేశ్వరాలయం పృథ్వీ(భూమి)కి సూచికగా ఉంది. భారతదేశంలో అతి పెద్ద గోపురాలలో ఈ ఆలయం ఒకటి. తమిళనాడు రాష్ట్రంలో కంచిలో గల మామిడి చెట్టు కింద స్వామి వెలసాడు కాబట్టి ఏకాంబరుడు అనే పేరు వచ్చిందని, ఈ స్వామి భూమిని సూచిస్తాడు అని చెబుతారు. దేవాలయం లోపల మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి. అలాగే ఆలయంలో 1,008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. దాదాపు 3,500 సంవత్సరాలు వయస్సు గల మామిడి వృక్షం ఇక్కడ ఉంది. ప్రస్తుతం ఆ మామిడి చెట్టు కాండాన్ని మాత్రమే మనం చూడగలం.చెన్నై నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉంది ఏకాంబరేశ్వర దేవాలయం. కంచికి బస్సు, రైలు సదుపాయాలు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి పొందిన కామాక్షి దేవాలయం ఉన్నది కంచిలోనే!
3.వాయు లింగం-శ్రీకాళహస్తీశ్వరాలయం : శ్రీకాళహస్తి
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గల ఈ దేవాలయం శ్రీ (సాలీడు), కాళ (పాము), హస్తి (ఏనుగు) ఈ మూడు పేర్లతో ప్రసిద్ధి చెందింది. స్వయంభువుగా వెలసిన ఇక్కడ శివలింగం నుంచి వచ్చే గాలికి ఎదురుగా ఉన్న దీపం రెపరెపలాడుతుంటుంది. ఆ విధంగా ఈ లింగం వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. శ్రీకాళహస్తిని దక్షిణకాశీ అనీ అంటారు. మహాశివరాత్రినాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. దేవాలయాన్ని పల్లవులు, తర్వాత చోళులు నిర్మించినట్టుగా శిలాఫలకాల ద్వారా తెలుస్తోంది. తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో గల శ్రీకాళహస్తికి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది. అలాగే ఇతర జిల్లాల నుంచి నేరుగా శ్రీకాళహస్తికి బస్సు సౌకర్యం ఉంది. శ్రీకాళహస్తికి మూడు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉంది. అలాగే నెల్లూరు జిల్లా గూడూరు జంక్షన్ నుంచి తిరుపతికి వెళ్లే రైలు మార్గం కాళహస్తి గుండా వెళుతుంది.*
4.జల లింగం- జంబుకేశ్వరాలయం: తిరుచిరాపల్లి
తమిళనాడులోని తిరుచిరాపల్లిగా పిలిచే త్రిచికి 11 కి.మీ దూరంలో పంచభూత క్షేత్రాలలో ఒకటైన జంబుకేశ్వరాలయం ఉంది. పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయం ‘జలం’ ను సూచిస్తుంది. ఈ ఆలయానికి తిమేవకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఏనుగుల చేత పూజలందుకుంటున్న క్షేత్రం అనీ, జంబు వృక్షాలు (తెల్లనేరేడు) అధికంగా ఉండటం వల్ల కూడా ఈ దేవాలయానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. జంబుకేశ్వరుడిగా పూజలందుకుంటున్న శివలింగం పానపట్టం ఎల్లప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం చూపించేందుకు లింగం పానపట్టుపై ఒక వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి తీసి, ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది. గర్భగుడిలోని గవాక్షానికి నవద్వార గవాక్షం అని పేరు ఉంది. చెన్నై నుంచి శ్రీరంగం, అక్కడ నుంచి తిరుచిరాపల్లి చేరుకోవడం సులువు.
సందడిగా తిరువూరు తిరునాళ్ళు-వీడియోలు
పాత తిరువూరు తిరునాళ్ళుగా పేరుపొందిన శ్రీ వేంకటాచలస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణ, మండల పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శాస్త్రోక్తంగా జరిగిన కల్యాణోత్సవ క్రతువును తిలకించారు. ఉదయం వేదపండితులు దేవయజనం వేణుగోపాల కృష్ణమాచార్యులు, దీవి ఉదయకుమారచార్యులు స్వామివారికి సహస్ర నామార్చన, నిత్య హోమం విశేష అర్చన, బలిహరణ వంటి పూజలు చేశారు. రాత్రి ఏడు గంటలకు స్వామివారి రధోత్సవం, పల్లకి ఉత్సవాన్ని మంగళవాయిద్యాల నడుమ ప్రారంభించారు. ఆలయం నుంచి జైభావీ సెంటరులోని మండపం వరకు రధోత్సవం జరిగింది. కళ్యాణ మహోత్సవానికి ముందు కోటాయి మండపం వద్ద ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. తిరునాళ్ళకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ఆవరణ ప్రధాన రహదారులు భక్తులతో కిక్కిరిశాయి. ఏర్పాట్లను ఈవో వన్నెంరెడ్డి దుర్గాధన ప్రసాద్ పర్యవేక్షిచారు. సిఐ ప్రసన్నవీరయ్యగౌడ్, ఎస్సై మణికుమార్, ఆద్వర్యంలో సిబ్బంది బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తిరువూరు తిరునాళ్ళు ప్రారంభం
తిరువూరు తిరునాళ్ళుగా పిలవబడే స్థానిక శ్రీవేంకటాచల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది మాఘ మాసంలో పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. వచ్చె 19వ తేదీన కల్యాణోత్సవం నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు నిర్వాహకులు చేశారు. నాలుగు వందల సంవత్సరాల క్రితం తిరువూరు జమీందారు నిర్మించిన శ్రీవేంకటాచల దేవాలయంలో ప్రతి ఏటా మాఘ మాసంలో బ్రహ్మోత్సవాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. 20వ తేదీన స్వామివారి గరుడోత్సవం,21వ తేదీన రధోత్సవం, 22వ తేదీన ద్వాజావరోహనం, 23వ తేదీన స్వామివారి పవళింపు సేవతో ఈ తిరునాళ్ళు ముగుస్తాయి. తదితర ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.