హరిదాసులు ఎక్కడా?

** అరుదైపోయిన ‘హరిదాసు’ కీర్తనలు.
సంక్రాంతి నెలల్లో మనకు కనిపించే గొప్ప సంప్రదాయాల్లో ఒకటి హరిదాసుగానం. పూర్వం పల్లె, పట్టణం తేడ లేకుండా తెల్లవారుజామునే ముగ్గులు వేసే సమయానికే పురవీధుల్లో హరినామ గానం చేస్తూ.. వివిధ కీర్తనలతో హరిదాసులు అలరించేవారు. ఇళ్ళల్లోని వారు ఇచ్చే ధన, ధాన్యాలను స్వయంపాకాలుగా స్వీకరించే సంప్రదాయాలను నేటికి కొనసాగిస్తున్నారు. గత వైభవం లేకున్నా..పట్టణాల్లో ఆదరించకపోయినా కళకు జీవం పోస్తున్నవారు ఎందరో ఉన్నారు.
** ఎలా వచ్చిందీ పద్ధతి…?
శ్రీ రాముడు రాజ్యంలో చింతలులేవు. కరవు కాటకాలురావు. దాన ధర్మాలు చేద్దామన్నా పుచ్చుకునేవారే కరువయ్యారని ప్రజలు ధర్మ దేవతను ఆడిపోసుకునేవారట. అది విన్న వేగులు రాముడితో చెప్పగా వారి దాన, ధర్మాలను పుచ్చుకునేందుకు హరినామాన్ని గానం చేసే గాయకులను రాజ్యంలో తిరుగాడేలా చేశారని, వారే నేడు కనిపించే హరిదాసులని చెపుతుంటారు
** హరిదాసు అనగా..
హరిదాసు అనగా పరమాత్మకు సమానం. మనుషులు ఇచ్చే ధానధర్మాలు అందుకుని వారికీ ఆయురారోగ్యాలు, భోగాభోగ్యలు కలగాలని దీవించేవారే హరిదాసులు. నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసేందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరూ ఇచ్చే ధన, ధాన్య, వస్తు దానాలను స్వీకరిస్తారు. సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రగా వారి శిరస్సుపై ధరించే పంచలోహ పాత్రగా భావిస్తారు.

కృష్ణ, గోదావరిల్లో కోడిపందేలకు సర్వం సిద్ధం

అత్యున్నత న్యాయస్థానాల తాజా తీర్పుల నేపథ్యంలో రాష్ట్రంలో కోడిపందేల నిర్వహణపై ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయి. అడ్డుకోవడానికి ఓ వైపు పోలీసులు ప్రయత్నిస్తుండగా, మరోవైపు నిర్వాహకులు తమ ఏర్పాట్లలో ఉన్నారు. సాధారణంగా ప్రతీ ఏడాది పండుగకు పది రోజుల ముందునుంచే కోడిపందేలను నిర్వహించేవారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండీ మండలం జువ్వలపాలెం, కలుగుపూడి, ఆకివీడు, మండలం అయిభీమవరం, భీమవరంలోని ఆశ్రఒతోటలు, ద్వారకాతిరుమల, పెదవేగి, పెదపాడు మండలాల్లో అధికంగా పందేలు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం, అమలాపురం, రాజోలు, జగ్గంపేట, సామర్లకోట, కిర్లంపూడి ప్రాంతాల్లో పందేలను నిర్వహించేవారు. కృష్ణాజిల్లా నుజవీడు, హనుమాన్ జంక్షన్, నాగాయలంక, కృత్తివెన్ను, పెడన ప్రాంతాల్లో కోళ్ళను బరిలోకి దింపుతారు. పశ్చిమలోని ఆకివీడు మండలం, అయిభీమవరం, భీమవరంలలో పెద్దఎత్తున నిర్వహించే పందేలను చూడడానికి, పందెం కాయడానికి తెలుగు రాష్ట్రాలు అన్ని ప్రాంతాల నుంచి పందెంరాయుళ్ళు ఇక్కడికి చేరుకునేవారు. గత సీజన్లో ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాల్లో దాదాపు వంద కోట్లకు పైగా కోడిపందేల వ్యాపారం జరిగినట్లు అంచనా. మహాదేవపట్నం, కాళ్లకూరు, ఉండి, జువ్వలపాలెం, అప్పారావుపేట, భీమవరం, ఆశ్రమంతోట, కొరుకొల్లు వంటి ప్రాంతాలు ప్రధాన వేదికలుకాగా ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతాల్లో పందేలు నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. భీమవరం మండలం వెంపతోపాటు పైన పేర్కొన్న కొన్ని బరుల్లో తక్కువ స్తాయిలో పందేలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో పండుగ ముడురోజులే పందేలు నిర్వహించాలని పందెం రాయుళ్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది.ద్యా, ఉపాధి, వైద్య అవకాశాలపై ప్రత్యెక సదస్సు నిర్వహిస్తున్నారు. దానికి సంబందించిన వివరాలివి.

TVRNEWS.COM ప్రారంభం

కృష్ణాజిల్లా, తిరువూరు వార్తల కోసం ఏర్పాటు చేసిన TVRNEWS.COM (తిరువూరు కబుర్లు) వెబ్ పత్రికను ప్రముఖ ప్రవాసాంద్రుడు, కార్డియాలజిస్ట్ డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి గురువారం నాడు ప్రారంభించారు. ఈ పత్రిక ద్వారా మంచి కధనాలు ప్రజలకు ఉపయోగపదేలాగా చూడాలని డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి పేర్కొన్నారు. TNILIVE.COM నిర్వాహకులు TVRNEWS.COMను రూపొందించడం సంతోషకరమని డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి తానా మాజీ అద్యక్షుడు తోటకూర ప్రసాద్, తానా కార్యదర్శి తాతా మధు, అట్లాంటాకు చెందిన ప్రముఖ సాఫ్ట్ వేర్ నిపుణుడు సునీల్ చావ్లి, ప్రముఖ రంగాస్తల నటుడు గుమ్మడి గోపాల కృష్ణ, . TNILIVE.COM డైరెక్టర్ కిలారు ముద్దు కృష్ణ, శ్రీ వాహిని ఇంజనీరింగ్ కళాశాల చైర్మెన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ రంగా నాగేంద్ర బాబు, కరస్పాండెంట్ పోట్రు నాగేశ్వరరావు, కిలారు ఫౌండేషన్ డైరెక్టర్, స్తానిక Z.P.T.C. సభ్యురాలు కిలారు విజయ బిందు తదితరులు పాల్గొన్నారు.