తిరువూరు హసన్ సాహెబ్‌కు పద్మశ్రీ పురస్కారం

కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన ప్రముఖ నాదస్వర విద్వాంసులు షేక్ హసన్ సాహెబుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. గంపలగూడెం మండలం గోసవీడులో జన్మించిన హసన్ సాహెబ్ యాదగిరిగుట్ట, భద్రాచలం దేవస్థానాలలో నిలయ విద్వాంసులు. చాలా ఏళ్ల పాటు ఆయా దేవస్థానాల్లో సేవలు అందించారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలోనూ నిలయ విద్వాంసులుగా పనిచేశారు. గత 20 సంవత్సరాల నుండి ఆయన విశ్రాంతి తీసుకుంటూ తిరువూరులోనే స్థిరపడ్డారు. కొద్ది నెలల క్రితమే ఆయన మృతి చెందారు. స్థానిక అశోక్‌నగర్‌లో ఆయన నివాసం ఉండేవారు. మరణానంతరం హసన్ సాహెబ్ సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.

Full List of Padma Awardees… by Sumana Nandy

Sheik Hasan Sahab of Tiruvuru/Gampalagudem/Gosaveedu awarded Padmasri Award In 2022 Posthumously.

తిరువూరు హసన్ సాహెబ్‌కు పద్మశ్రీ పురస్కారం - Sheik Hasan Sahab of Tiruvuru/Gampalagudem/Gosaveedu awarded Padmasri Award In 2022 Posthumously.

ఇది బస్‌స్టేషన్ కాదు…చెత్తస్టేషన్!

ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితి ఏ తల్లి బిడ్డరా? వెక్కివెక్కి ఏడుస్తోంది చందంగా తయారైంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల మధ్యలో ఉన్న ఈ రద్దీ బస్‌స్టాండ్ పారిశుద్ధ్య లోపంతో ప్రయాణీకులకు నరకాన్ని చూపెడుతోంది. అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ బస్టాండ్ ప్రాంగణమంతా కనీస నిర్వహణ లేక చెత్తా చెదారం పేరుకొని మురికి కూపంగా మారింది. కనీసం డస్టు బిన్లు కూడా ఏర్పాటు చేయలేని అలసత్వంతో అధికారులు నిద్రపోతున్నారు. చినుకు పడితే చాలు మోకాళ్ళలోతు నీళ్ళు చేరి, బస్ స్టేషన్ కట్టలేరుగా మారుతోంది. ఫ్యాన్లు తిరగవు. దోమల దాడి. మరుగుదొడ్లు మురికికంపు. ఇది తిరువూరు బస్టాండు అధోగతికి తార్కాణం. తమ నరకయాతన అర్థం చేసుకుని ఇప్పటికైన ప్రజాప్రతినిధులు, అధికారులు తిరువూరు బస్టాండ్ దుస్థితిని చెదరగొట్టేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇది బస్‌స్టేషన్ కాదు...చెత్తస్టేషన్! - horrible-situation-in-tiruvuru-bus-station-2021-tiruvuru-telugu-news

తిరువూరులో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు

తిరువూరు లో కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని ) చెప్పారు. తిరువూరు లో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఏ .ఎండి .ఇంతియాజ్, స్థానిక శాసనసభ్యులు కొక్కిలగడ్డ రక్షణనిధి తో కలిసి అధికారులతో శుక్రవారం మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కోవిడ్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ప్రతీ నియోజకవర్గంలోనూ కోవిడ్ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరువూరు లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటుకు సంబంధించి వారం క్రితమే వైద్యాధికారులతో సమీక్చించామన్నారు . ఆసుపత్రి ఏర్పాటులో అవసరమైన వైద్య పరికరాలు, ఔషదాలు, సిబ్బంది నియామకం , ఇతర మౌలిక సదుపాయాల కల్పన, తదితర అంశాలపై అధికారులతో చర్చించామన్నారు. వైద్యులు, సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిపై నియామకానికి సంబందించి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నియమిస్తామన్నారు. అర్హత గల వారు జిల్లా కలెక్టర్ లేదా జిల్లా వైద్య శాఖాధికారిని వారిని కలిసి తమ దరఖాస్తును సమర్పించాలన్నారు. త్వరలో ఏర్పాటు చేయనున్న కోవిడ్ ఆసుపత్రిలో అత్యవసర సేవలకు అవసరమైన ఆక్సిజన్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ను ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో 5 కాన్సన్ట్రేటర్స్ జిల్లా కలెక్టర్ అందిస్తారని , మిగిలిన 5 కాన్సన్ట్రేటర్స్ ను తాను అందిస్తానని మంత్రి చెప్పారు. వీటితో పాటు ఆక్సిజన్ సిలెండర్లుకు ఎటువంటి కొరత రాకుండా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లా కలెక్టర్ ఏ .ఎండి .ఇంతియాజ్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ప్రదేశాలలో కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ వైరస్ ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంది , ప్రత్యేక చికిత్స అవసరమవుతున్నదన్నారు. చికిత్స విధానం, కోవిడ్ ఆసుపత్రిలో సౌకర్యాలు, వైద్యులు, సిబ్బంది నియామకంపై తదితర అంశాలపై అధికారులతో వైద్యాధికారులతో విస్తృతంగా చర్చిండం జరిగిందన్నారు. రెండు, మూడు రోజులలో తిరువూరులో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని కలెక్టర్ చెప్పారు.

శాసనసభ్యులు కొక్కిలగడ్డ రక్షణనిధి మాట్లాడుతూ తిరువూరు జిల్లాకు చివరన ఉండడంతో కోవిడ్ వ్యాధిగ్రస్తులు చికిత్స కోసం విజయవాడ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లడం, అక్కడ బెడ్స్ లేకపోవడం తదితర సమస్యల కారణంగా తిరువూరు పరిసర ప్రాంతాలలోని ప్రజల సౌకర్యార్థం తిరువూరు లో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేయవలసిందిగా ముఖ్యమంత్రి ని కోరడం జరిగిందని, వెంటనే ఈ ప్రాంతానికి కోవిడ్ ఆసుపత్రిని మంజూరు చేసారని కృతఙ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. సుహాసిని, జిల్లా ఆస్పత్రి సేవల సమన్వయాధికారి డా. జ్యోతిర్మయి, డిప్యూటీ డి.ఎం.హెచ్. ఓ. డా. డి ఆశ , మునిసిపల్ చైర్ పర్సన్ కస్తూరిబాయి , మునిసిపల్ కమీషనర్ కె.వి.ఎస్.ఎన్ . శర్మ, తహసీల్దార్ స్వర్గం నరసింహారావు, ఎంపిడిఓ బి. వెంకటేశ్వరరావు, ప్రభృతులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆసుపత్రి ని మంత్రిని అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం వ్యక్తిగత పరిశుభ్రత కిట్లను మంత్రి పేర్ని నాని , కలెక్టర్ ఇంతియాజ్ ప్రజలకు పంపిణి చేసారు.

———————————————————————————————————–
( డివిజినల్ పౌర సంబందిధికారి, నూజివీడు వారిచే జారీ చేయబడినది )

Perni Nani Promises COVID Hospital In Tiruvuru Krishna District - తిరువూరులో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు

మద్రాస్ మెరీనా బీచ్‌లో గంపలగూడెం యువకుడు గల్లంతు

తమిళనాడులోని చెన్నై మెరీనా సముద్ర తీరంలో నీట మునిగి ఓ యువకుడు చనిపోగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. చనిపోయిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా విద్యార్థి. మిగిలిన ఇద్దరు కృష్ణాజిల్లాకు చెందిన వారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా నందిగామ మండలం అడవిరావులపాడు గ్రామానికి చెందిన సూరా గోపిచంద్‌(18) ఇటీవల ఇంటర్‌ పూర్తి చేశాడు. చెన్నైలో ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశం పొందడానికి గంపలగూడెం మండలం దుందిరాలపాడు శివారు మల్లెంపాడుకు చెందిన వాకదాని ఆకాశ్‌(18) పాటు గుంటూరు గ్రామీణ మండలం పొత్తూరుకు చెందిన శివబాలాజీ(19)తో కలిసి రెండు రోజుల కిందట చెన్నై వెళ్లారు. అక్కడ ఉన్న మరో ఇద్దరు మిత్రులు రాజశేఖర్‌, శివ ప్రశాంత్‌తో కలిసి గురువారం మెరీనా తీరానికి వెళ్లారు. రాజశేఖర్‌, శివప్రశాంత్‌ ఒడ్డున ఉన్నారు. మిగిలిన వారు సముద్రంలోకి దిగి గల్లంతయ్యారు. చెన్నై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి శివబాలాజీ మృతదేహాన్ని వెలికితీశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Vakadani Akash Gampalagudem Dead In Merina Beach Madras

తిరువూరులో 3కిలోల గంజాయి పట్టివేత

తిరువూరు పట్టణంలోని వాహిణి ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో గంజాయి కల్గి ఉన్న 8 మంది వ్యక్తులను ఎస్సై సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలోని బృందం అదుపులోకి తీసుకున్నట్లు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. నిందితులు 20-22 వయస్సు కలిగినవారని ఆయన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం నుండి గంజాయి తెప్పించి ఇక్కడ అక్రమంగా అమ్ముతున్నారని ఆయన వెల్లడించారు. వీరి నుండి 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
తిరువూరులో 3కిలోల గంజాయి పట్టివేత

తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే కరోనా పరీక్షలు నిర్వహించాలి

తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక నుండి ప్రతినిత్యం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మంగళవారం నాడు 110మంది రక్తనమూనాలు సేకరించి నిర్ధారణ నిమిత్తం బెజవాడ తరలించారు. ఇవి రావడానికి 3-4 రోజుల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. కానీ గత అనుభవాల దృష్ట్యా ఇవి రావడానికి మరింత సమయం పడుతుందని అవగతమవుతుంది. స్థానిక ఎమ్మెల్యే రక్షణనిధి చొరవ తీసుకుని తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే వచ్చిన వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెంటనే వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

బుధవారం నాడు తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో 43మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 16మందికి పాజిటివ్‌గా వచ్చింది. స్థానిక ఆసుపత్రి సిబ్బంది ఇరువురికి కూడా పాజిటివ్‌గా వచ్చినట్లు సమాచారం.
Tiruvuru Krishna District Andhra Pradesh - COVID19 Testing - TVRNEWS - తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే కరోనా పరీక్షలు నిర్వహించాలి

తిరువూరులో కఠిన ఆంక్షలు-నూజివీడు RDO

కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరుగున్నందున నూజివీడు డివిజన్‌లో వారం రోజులపాటు ఆంక్షలు కఠినతరం చేస్తున్నట్లు రెవిన్యూ డివిజినల్ అధికారి బి.హెచ్.భవానిశంకర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ నియంత్రణ టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూజివీడు డివిజన్లో ఇప్పటివరక్కు 887 కరోన పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, సోమవారం ఒక్కరోజే 100కు పైగా కేసులు నమోదు కావడం, నూజివీడు పట్టణంలో ఒక్కరోజే 72 కేసులు ఆందోళన కలిగించే విషయమన్నారు. నూజివీడు డివిజన్లోని నూజివీడు టౌన్, తిరువూరు టౌన్, అగిరిపల్లి, గంపలగూడెం, గన్నవరం, బాపులపాడు, వేలేరు గ్రామాలలో ఈనెల 6వ తేది నుండి 13వ తేది వరకు కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. దుకాణాలను ఉదయం 6గంటల నుండి 10గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని, అనంతరం అత్యవసర సేవలు, హెల్త్ ఎమర్జెన్సీ, పాలు, నిత్యవసరాలుకు అనుమతి ఉంటుందన్నారు. బ్యాంకులు ఉదయం 8గంటల నుండి 10గంటల వరకు ప్రజలకు సేవలు అందిస్తారని ఆయన తెలిపారు. 10గంటల నుండి 12గంటల వరకు వాణిజ్య లావాదేవీలకు అనుమతించడం జరుగుతుందన్నారు. అత్యవసరం పరిస్థితుల్లో మాత్రమే ప్రజారవాణాను అనుమతించడం జరుగుతుందన్నారు. దుకాణాలు, బ్యాంకుల వద్ద ప్రజలు సామజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అనవసరంగా రోడ్లపైకి గుంపులుగా వచ్చేవారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు.
తిరువూరులో కఠిన ఆంక్షలు-నూజివీడు RDO-Tiruvuru Krishna District New COVID19 Measures And Rules - Tiruvuru Krishna District COVID19 Stats

తిరువూరు అధ్యాపకుడికి తానా అవార్డు

స్థానిక తిరువూరు శ్రీ వాహిని ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న తేజస్వికి కీబోర్డ్ ప్రదర్శనలో ద్వితీయ స్థానం సంపాదించుకున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, ఇతర 100 తెలుగు సంస్థలు కలిసి నిర్వహించిన ఆన్లైన్ అంతర్జాతీయ తెలుగు కల్చరల్ ఫెస్ట్ 2020 పోటీలలో భాగంగా నాదామృతం – కీబోర్డ్ విభాగంలో ప్రదర్శించగా గత రాత్రి విజేతలను ఆన్లైన్లో ప్రకటించారు. తేజస్వి కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ, సాయంత్రం సమయంలో విద్యార్థులకు కీబోర్డ్ పై ఆన్లైన్ లో శిక్షణ కూడా ఇస్తుంటారు.
తిరువూరు అధ్యాపకుడికి తానా అవార్డు

కోనేరు పేరు మీద స్మృతివనం ఏర్పాటు చేయాలి

గంపలగూడెం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మాజీ ఉప-ముఖ్యమంత్రి కోనేరు రంగారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ రాజమండ్రిలో మైనర్ బాలికపై అత్యాచారం, చీరాలలో దళిత యువకుడి హత్య, సీతానగరంలో దళిత యువకుడికి శిరోముండనం తదితర అంశాలపై నిరసన వ్యక్తపరిచారు. అనంతరం ఈ దిగువ తీర్మానాలకు ఆమోదం తెలిపారు.
* రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ కమీషన్‌ను వెంటనే నియమించాలి.
* దళితులపై జరుగుతున్న దాడుల కేసులను CBCIDకి అప్పగించాలి.
* ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
* రాష్ట్రంలో ఎన్నో సేవలందించిన కోనేరు రంగారావు పేరు మీద స్మృతివనం, రాష్ట్రస్థాయిలో ఒక పథకానికి పేరు పెట్టాలి.

కోనేరు పేరు మీద స్మృతివనం ఏర్పాటు చేయాలి-Koneru Rangarao Tiruvuru YS Jagan Gampalagudem Congress

తిరువూరు గంపలగూడెం మండలాల్లో 4 కొత్త కరోనా కేసులు

తిరువూరు సాయిబాబా గుడి ప్రాంతంలో ఒకరు. వావిలాలలో ఒకరికి కరోనా పాజిటివ్. గంపలగూడెం మండలంలో నిర్వహించిన కరోనా నిర్దారణ పరీక్షలో తునికిపాడు-1,దుందిరాలపాడు-1. మొత్తం 2 కేసులు నమోదు అయినట్లు పేర్కొన్న అధికారులు.
తిరువూరు గంపలగూడెం మండలాల్లో 4 కొత్త కరోనా కేసులు