కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన ప్రముఖ నాదస్వర విద్వాంసులు షేక్ హసన్ సాహెబుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. గంపలగూడెం మండలం గోసవీడులో జన్మించిన హసన్ సాహెబ్ యాదగిరిగుట్ట, భద్రాచలం దేవస్థానాలలో నిలయ విద్వాంసులు. చాలా ఏళ్ల పాటు ఆయా దేవస్థానాల్లో సేవలు అందించారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలోనూ నిలయ విద్వాంసులుగా పనిచేశారు. గత 20 సంవత్సరాల నుండి ఆయన విశ్రాంతి తీసుకుంటూ తిరువూరులోనే స్థిరపడ్డారు. కొద్ది నెలల క్రితమే ఆయన మృతి చెందారు. స్థానిక అశోక్‌నగర్‌లో ఆయన నివాసం ఉండేవారు. మరణానంతరం హసన్ సాహెబ్ సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.