తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 97వ జయంతి వేడుకలు తిరువూరులో ఘనంగా నిర్వహించారు. గురువారం నాడు స్థానిక ఫ్యాక్టరీ సెంటరులో ఎన్.టీ.ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తెదేపా నాయకులు పట్టణవ్యాప్తంగా ఉన్న రామారావు విగ్రహాలకు నివాళులు అర్పించారు.