తిరువూరు వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాలను వదిలివేసిన అధికారులు. దాదాపు 15 గంటల పాటు బుధవారం సాయంత్రం నుండి తెలంగాణా నుండి వచ్చిన వందలాది వాహనాలను వాటిలో ప్రయాణిస్తున్న వారిని గురువారం సాయంత్రం విముక్తి లభించింది. తిరువూరు అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద గత రాత్రి నుండి వేచి ఉన్న వీటిని ప్రభుత్వ సూచనల మేరకు వదిలిపెట్టారు. గత రాత్రి నుండి నిద్ర, మంచినీరు, ఆహారం లభించక హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గురువారం నాడు పట్టణ ప్రముఖులు కొందరు మంచినీరు, ఆహారాన్ని అందించి ఆదుకున్నారు. తీవ్ర తర్జనభర్జనల అనంతరం ఉత్కంఠ పరిస్థితుల నడుమ అధికారులు ట్రాఫిక్‌ను వదిలేశారు.