తిరువూరులో 5వ రోజు గురువారం లాక్డౌన్ యథావిథిగా జరిగింది. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు దుకాణాలు తెరిచి ఉండటంతో ప్రజలకు కాస్త ఊరట లభించింది. కూరగాయలు, సరుకుల పంపిణీకి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. వీటి సరఫరా, అమ్మకాలకు సంబంధించిన ఏర్పాట్లను నేటి సాయంత్రం స్థానిక బాలికోన్నత పాఠశాలను సందర్శించి పరిశీలించారు. అంతర్రాష్ట్ర సరిహద్దులో ట్రాఫిక్‌ను వదిలేయడంతో పరిస్థితి ప్రశాంతంగా ఉంది.