మల్లెల మహిళపై పిచ్చిరాతలు రాసేవారిపై చర్యలు తీసుకోవాలి
తిరువురు మండలం మల్లెల తెలుగుదేశం పార్టీ ఎంపిటిసి అభ్యర్థినిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్ లు పెట్టిన అదే గ్రామానికి చెందిన దాకారపు నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామి దాస్, సీనియర్ నాయకులు సుంకర కృష్ణమోహన్ రావు, మాజీ ఎంపిపి గద్దె వెంకటేశ్వర రావు, మండల పార్టీ అధ్యక్షులు దొడ్డా లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో నాయకులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.