తిరువూరు మండలం జడ్పీటీసీ అభ్యర్థులు నేడు బందరులో నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా తరఫున మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు గద్దె వెంకటేశ్వరరావు, వైకాపా తరఫున చౌటపల్లి గ్రామ మాజీ సర్పంచ్ యరమల రామచంద్రారెడ్డిలు తమ నామినేషన్లు దాఖలు చేశారు. వీరి ఇరువురి మధ్యనే పోటీ జోరుగా సాగే అవకాశాలు కనపడుతున్నాయి.