ఈ ప్రాంతంలో తిరువూరు తిరునాళ్ళుగా ప్రసిద్దిగాంచిన స్థానిక శ్రీవేంకటాచలస్వామీ ఆలయ వార్షిక పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 7 నుంచి 13 వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు శ్రీనమ్మాళ్వార్ల ఉత్సవాలు జరుగుతాయి. 8న స్వామివారిని పెండ్లికుమరుడిని చేయడం, 9న కోటాయి మండపంలో ఎదుర్కోలు ఉత్సవం, 10న గరుడ వాహనంపై గ్రామోత్సవం, 11న స్వామివారి రధోత్సవం, 12న ప్రత్యెక పూజలు, 13న అద్దాల మండపంలో పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈమేరకు వివరాలకు ఆలయ మేనేజర్ జన్ను వెంకటేశ్వరరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.