తిరువూరు ఏఎంసీ ఛైర్మన్గా సూర్యనారాయణరెడ్ఢి.! – ప్రకటించిన ఎమ్మెల్యే రక్షణనిధి
తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడిగా చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు, సభ్యులతో కూడిన పాలకవర్గాన్ని ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి తెలిపారు. స్థానిక నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం ఆయన నూతన పాలకవర్గం వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం నుంచి నాలుగైదు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో రెండుసార్లు తాను విజయం సాధించడంలో సీనియర్ నాయకుడైన సూర్యనారాయణరెడ్డి కీలకంగా వ్యవహరించారని తెలిపారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఏఎంసీ ఛైర్మన్గా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. కలకొండ రవికుమార్, శీలం నాగనర్సిరెడ్డి, సీహెచ్ సత్యనారాయణ, వై.రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.