తిరువూరు జూనియర్ కళాశాల ఏర్పడి 50సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా వచ్చే 29వ తేదీన గోల్దేన్ జూబ్లీ వేడుకలు కళాశాల ఆవరణలో నిర్వహించాలని పూర్వ్ విద్యార్థులు నిర్ణయించారు. కళాశాల పూర్వ విద్యార్థి కంచి కిషోర్ నివాసంలో మంగళవారం రాత్రి పూర్వ విద్యార్థులు సమావేశమై 29వ తేదీన స్వర్ణోత్సవ వేడుకలు భారీస్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా గత 50ఏళ్ల నుండి ఈ కళాశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులను సమీకరించాలని నిర్ణయించారు. ఉదయం 9గంటల నుండి రాత్రి 9గంటల వరకు కళాశాల ఆవరణలో ఈ వేడుకలు నిర్వహిస్తారు. వేడుకల నిర్వహణకు ఆరుగురితో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కంచి కిషోర్, కలకొండ రవికుమార్, తాళ్లూరి రామారావు, కంచర్ల ముత్యప్రసాద్, గజ్జల సీతారామయ్య, ఉయ్యూరు అనసూయలతో ప్రాథమికంగా ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. వచ్చే ఆదివారం 8వ తేదీన ఉదయం 10గంటలకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తిరిగి సమావేశం కావాలని ఈ సమావేశంలో ఉత్సవాలను నిర్వహించడానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పలువురు పురప్రముఖులు, పూర్వ విద్యార్థులు ఈ సమావేశానికి హాజరయి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.