సాధారణ తనిఖీలలో భాగముగా తిరువూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన డిఐజి ఎ ఎస్ ఖాన్. పలు రికార్డులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చెక్పొస్టుల వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టామని శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని,పోలీసులు ప్రజలతో మమేకమయునందుకు వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఫిర్యాదులు చేసిన బాధితులకు సత్వర న్యాయం చేకూర్చుతున్నామని,రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులకు ఆవగహన కార్యక్రమాలు చేపడుతున్నామని, అక్రమంగా ఇసుక సరఫరా చేస్తే రెండు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులు సామాజిక శ్రేయస్సు కోసం పాటుపడేవారేనని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీక్లి ఆఫ్ పోలీసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనివల్ల వారు మానసిక వత్తిడిని జయించి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని, శాంతి భద్రతలు అదుపులో ఉన్నపుడే సమాజం అత్యున్నత స్థాయిలో అభివృధ్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ-బి.శ్రీనివాసులు,సిఐ-ప్రసన్న వీరయ్యగౌడ్,ఎస్సైలు సుబ్రహ్మణ్యం, అవినాష్, లక్ష్మణ్,ఉమామహేశ్వరరావు మరియు స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.