తిరువూరులో ఆర్ అండ్ బీ శాఖ పనితీరు ఆద్వానంగా ఉంది. ఆంధ్రాబ్యాంక్ నుండి బైపాస్ రోడ్డు వరకు ఆర్ అండ్ బీ రహదారి గోతులు పడి అద్వానంగా తయ్యారయింది. ఆ రహదారిలో నడుస్తున్న ప్రజలు గగ్గోలు పెట్టడంతో ఇటీవల హడావుడిగా గోతులను పూడ్పించారు. ఈ గోతులలో కంకర పోసి వదిలి వేశారు. ఆర్ అండ్ బీ ఆఫీసు పక్కనే గ్యాస్ గోడౌన్ వద్ద రోడ్డుపై కంకర చెల్లాచెదురుగా పడి వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. అదే విధంగా ఈ రహదారిలో చాల చోట్ల గోతుల్లో కంకర పోసి వదిలివేశారు. ఆర్ అండ్ బీ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.