గ్రామీణ వైద్యుల సంఘం సీనియర్ నాయకుడు డా.జియన్న సూరి శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. స్థానిక జంట సినిమా హాల్ సెంటరులో గత నలభై సంవత్సరాల్ నుండి జియన్న సూరి వైద్యసేవలు అందిస్తున్నారు. పేద ప్రజల వైద్యుడిగా ఆయనకు పేరుంది. జియన్న సూరి మృతి వార్త విన్న వెంటనే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కార్మికులు ఆయన గృహానికి వెళ్లి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించారు.