తిరువూరు తంగెళ్లబీడు కాలనీలో ఆగిరిపల్లి విఆర్ఓ అవనిగడ్డ గణేష్ ను హత్య చేసిన ప్రధాన నిందితురాలు కనపర్తి రేణుక ను, సహకరించి న ఆమె తల్లి పులిపాటి కళావతిని, మైలవరంకు చెందిన రేణుక ఫ్రెండ్ చల్లా లక్ష్మిని, దేవరపల్లి కాంతారావును నూజివీడు డీఎస్పి శ్రీనివాసులు శనివారం ఆరెస్టు చే శారు. వివాహేతర సంబంద కారణంగానే గణేష్ ను ఒక ప్రదకం ప్రకారం హత్య చేశారని డీఎస్పీ తెలిపారు. రేణుక, గణేష్ మధ్య ఆర్ధిక లావాదేవీలు ఉన్నాయని భార్య, పిల్లలను వది లి తిరువూరు వచ్చి నాతో ఉండి పోవాలని రేణుక గణే ష్ ను ఒత్తిడి చేసిందన్నారు. ఆయన రానని చెప్పటంతో చంపటానికి తన అనుచరులతో కలిసి పోరంకి లో ఉన్న గణేష్ దగ్గరికి 29వ తేదీన కారులో వెళ్లి అతనికి మాయ మాటలు చెప్పి తిరువూరు తీసుకొచ్చి హత్య చేశారని డీఎస్పి వెల్లడించారు. నిందితులను సకాలంలో పట్టుకున్న సీఐ వీరయ్యను, ఎస్ ఐ లను, సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.