1. కృష్ణాజిల్లా తిరువూరులో దారుణ హత్యకు గురైన VRO కేసులో పోలిసులు దర్యాప్తు వేగవంతం. పాత నేరస్తురాలే హత్యకు కారణమని నిర్దారించిన పోలీసులు. హత్యకు పాల్పడిన నిందితురాలి కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు. తిరువూరు పట్టణంలో తంగేళ్లబీడులో కనపర్తి రేణుక అనే పాత నేరస్తురాలు నివాసంలో విజయవాడ నగర శివారు పోరంకికి చెందిన విఆర్వో అవనిగడ్డ గణేష్(46) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హత్య జరిగిన ప్రాథమిక సాక్ష్యాలు సేకరించే పనిలోపడ్డారు. మృతుడు గతంలో ఆగిరిపల్లి మండలంలో విఆర్వోగా చేస్తూ ఈ ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల నుండి ఉద్యోగానికి సెలవులో ఉన్నాడు.ఈ రోజు తిరువూరు హత్యకు గురికావడంతో స్థానికంగా సంచలనం కలిగించింది. ఈ సందర్భంగా నూజివీడు డిఎస్పీ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ హత్యకు పాల్పడిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నిందుతురాలిపై గతంలో పలు నేరాలు నమోదు అయినట్లు డిఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
2. తిరువూరు నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న ఇసుక విధానంలో నిజమైన లబ్ధిదారులకు కుపన్ల పంపిణీ డైరెక్టుగా ఇవ్వాలని 32 రకాల కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ నిరసన తెలియజేస్తూ తాహశీల్ధార్ గారికి మెమోరాండం అందజేశారు. మాజీ మంత్రి జవహార్, మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్, తాళ్ళూరి రామారావు, షేక్ రసూల్, షేక్ హుస్సేన్ తదితర పార్టీ నాయకులూ పాల్గొన్నారు.
3. మట్టి వినాయక ప్రతిమలను పూజించాలి -తిరువూరు మున్సిపల్ కమీషనర్. – గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మట్టి గణపతి ప్రతిమలను పూజించాలని తిరువూరు మున్సిపల్ కమీషనర్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక నగర పంచాయితీ కార్యాలయంలో ఆం. ప్ర. కాలుష్య నియంత్రణ మండలి, విజయవాడ రీజనల్ కార్యాలయం రూపొందించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిష్ తో తయారు చేసి, విష రసాయనాలు పూసిన భారీ విగ్రహాలు వాగులు, చెరువుల్లో నిమజ్జనం చేస్తే గాలి, నీరు కలుషితమై పర్యావరణ, ప్రజారోగ్యానికి హాని కలుగుతుందని తెలిపారు. స్వల్ప పరిమాణంలో ఉన్న బంక మట్టి ప్రతిమలను పూజించి ప్రకృతి సమతుల్యతను కాపాడాలని కమీషనర్ కోరారు. మేనేజర్ మనోజ, శ్రీ వసుధ వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్ డి.ఆనందరావు పాల్గొన్నారు. పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో కరపత్రాలు పంపిణీ చేసారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.