తిరువూరు నగర పంచాయతీలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా చచ్చింది. రోజురోజుకూ దోమల బెడద ఎక్కువవుతోంది. దీంతో డెంగీ వంటి విషజ్వరాలకు ప్రజలు గురవుతున్నారు. ప్రధాన రహదారుల వెంట ఉన్న పిచ్చి చెట్లను, మురుగు కాల్వలకు ఇరువైపులా పెరిగిన చెట్లను తొలగించకపోవడం కాల్వల్లో తరచుగా పూడికలు తీయకపోవడం మూలంగా పట్టణంలో దోమల బెడద తీవ్రమైంది. దోమల నివారణకు అవసరమైన మందులను పిచికారి చేయడం లేదు. ఫాగింగ్ మిషన్ల జాడే కనిపించడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రితో పాటు మిగిలిన ఆస్పత్రులన్ని జ్వరపీడితులతో నిండిపోయాయి. బాలికల హైస్కూల్ నుండి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కి వెళ్ళే ప్రధాన రహదారులు సైతం వారానికి ఒక్కసారి కూడా శుభ్రం చేయడం లేదు. ఈ ప్రధాన రహదారిలో ఉన్న కాలవలు కూడా పూడిక తీయక నెలరోజులు దాటింది. పారిశుద్ధ్య సిబ్బందిపై అజమాయిషీ చేసే నాధుడే కరువయ్యాడు. ఎమ్మెల్యే రక్షణనిధి ఈ విషయంలో శ్రద్ధ తీసుకుని తిరువూరు పట్టణంలోని అధ్వాన పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.