గంపలగూడెం మండలం నెమలిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి నూతన వస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో అలంకరించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన తొమ్మిది రకాల ప్రసాదాలతో నివేదన చేశారు. భక్తులకు 9 రకాల ప్రసాదాలను పంపిణీ చేశారు. సాయంత్రం 5గంటలకు ఆలయ ప్రాంగణంలో నవనీతకృష్ణ అలంకృతులైన స్వామివారికి ఉట్టి కొట్టే ఉత్సవం నిర్వహించారు. రాత్రికి రుక్మిణి, సత్యభామా సమేతుడైన స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథంపై ఆశీనులను చేసి మేళతాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీకృష్ణ మాలధారణ చేసిన భక్తులు ఇరుముడి సమర్పించి దీక్షను విరమించారు. కృష్ణా, ఖమ్మం జిల్లాల నుంచి భక్తులు వేడుకల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు. ఆలయంలో నిర్వహించే వేడుకల ఏర్పాట్లను ఆలయ సహాయ కమిషనర్ ఎన్.సంధ్య, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎం.రామాంజనేయులు పర్యవేక్షించారు.
*** కొకిలంపాడు ఆలయానికి రూ.11లక్షల నిధులు మంజూరి
తిరువూరు మండలంలోని కోకిలంపాడు గ్రామంలో నూతనంగా నిర్మించననున్న శ్రీ సీతారమస్వామి దేవస్థాన నిర్మాణానికి రాష్ట్ర దేవాలయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి విజ్ఞప్తి మేరకు 11 లక్షల 70 వేలు నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల తిరువూరులో పర్యటించిన మంత్రికి ఎమ్మెల్యే రక్షణనిధి గ్రామస్తుల చేపట్టిన ఆలయ నిర్మాణానికి నిధుల కొరత ఏర్పడటంతో ఈ విషయమై వినతిపత్రం అందజేశారు.ఆలయ నిర్మాణానికి నిధుల మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసిన మంత్రి వెల్లంపల్లి కి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.