ఏలూరు చింతలపూడి ఎత్తిపోతల పథకం 2వ దశ పథకంపై కలక్టరేట్ లో ఉభయగోదావరి జిల్లాల శాసన సభ్యుల సమావేశం ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అధ్యక్షతన జరిగింది..ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి మాట్లాడుతూ అక్టోబర్ 31 2008 న గోదావరి నది జలాలను పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం మెట్ట ప్రాంతం నుండి కృష్ణాజిల్లా నూజివీడు,తిరువూరు, మైలవరం ప్రాంతాలకు నాగార్జున సాగర్ ఆయకట్టు కింద 2,లక్షల పైన ఎకరాలకు త్రాగు,సాగునీరు అందించేందుకు శంఖుస్థాపన చేసారని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి పేర్కొన్నారు.. సారవంతమైన భూమి ఉంది.నీరు లేదు అటుచూస్తే గోదావరి నది ఇటు చూస్తే కృష్ణానది అయిన త్రాగునీరు, సాగునీరు లేక ఇక్కడ ప్రజానీకం అల్లాడుతుందని అన్నారు. మెట్ట ప్రాంతాలకు కూడా బోర్లు,వర్షాలే ఆధారం కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలోని 33 మండలాల ఉందన్నారు.వారి చింతలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చింతలపూడి మండలంలోని కామవరపుకోట వద్ద శంఖుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా చట్రాయి మండలం వేంపాడు మేజర్ ద్వారా నాగార్జున సాగర్ మెయిన్ కాల్వలోకి రామచంద్రపురం 117.4 కిమీ రెగ్యులేటర్ వద్దకు చేరుకుని నూజివీడు, మైలవరం బ్రాంచి కాలువలు ద్వారా తిరువూరు, విస్సన్నపేట,ఏ-కొండూరు, గంపలగూడెం మండలంలోని బ్రాంచి తిరువూరు నియోజకవర్గంలో ని కాలువల ద్వారా ఈ ప్రాంత పంటలకు నీరు అందించే అవకాశం ఉన్నది. అట్లాగే వేంపాడు మేజర్ మీద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి నూతిపాడు ఎత్తిపోతల పథకానికి అనుసంధానం చేయడం ద్వారా విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి పైలెట్ ప్రాజెక్టు కింద 15 గ్రామాలకు త్రాగునీరు అందించడం జరుగుతుందని అన్నారు.అదేవిధంగా మరియు పుట్రేల, తెల్లదేవరపల్లి ములగలపాటివారిగూడెం,కలగర గ్రామాలకు నీరు అందించే సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుందని అధికారులను కోరడం జరిగింది.ఈ సమీక్ష సమావేశంలో నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు,మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
**వాలంటీర్ లకు శిక్షణ
తిరువూరు పట్టణంలో వాలంటీర్లుగా ఇటీవల నియమితులైన అభ్యర్ధులకు గురువారం నాడు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. కమీషనర్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనారు.
**విద్యాలయాల్లో జన్మాష్టమి సందడి
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్థానికంగా ఉన్న శ్రీనిధి, గీతమ్స్ పాటశాలల్లో విద్యార్ధులు వేడుకలు నిర్వహించారు. శ్రీకృష్ణుడు, గోపికలు వేషధారణలో ప్రదర్శన ఇచ్చారు. ఉట్టికొట్టె సందడి చేశారు.
**నేడు నేమలిలో కృష్ణాష్టమి వేడుకలు
ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కృష్ణాజిల్లా నెమలిలో శుక్రవారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.