*తిరువూరు ఎస్సీ బాలికల హాస్టల్ -2లో ఉన్న ముగ్గురు విద్యార్ధినులు మంగళవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్ఫాహారం తిన్న వెంటనే వారు కళ్ళు తిరిగి పడిపోవడంతో తిరువూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలికల ఆరోగ్య పరిస్థితి సాయంత్రానికి మెరుగు పడింది.
* తిరువూరులో వినగడప వ్యక్తీ మృతి
తిరువూరు రాజుపేట సమీపంలో రోడ్డుపక్కన తుప్పల్లో మంగళవారం నాడు ఓ వ్యక్తీ మృతదేహాన్ని కనుగొన్నారు. మృతి చెందిన వ్యక్తి గంపలగూడెం మండలం వినగడప కు చెందిన జీవరత్నం (అనే) వ్యక్తిగా గుర్తింపు..తిరువూరు పట్టణంలో ఒక ప్రవేట్ ఆసుపత్రి చికిత్స కోసం వచ్చి చెప్పకుండా ఈ నెల 16 బయటకు వెళ్లిన జీవరత్నం..మంగళవారం తిరువూరు పట్టణంలో రాజుపేటలో ఒక వెంచర్‌లోని తుప్పల్లో అనుమానాస్పదస్థితిలో మృతి.. సోమవారం తిరువూరు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు.
*తిరువూరులో రాజీవ్ జయంతి
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతిని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేడి నివాళులు అర్పించారు. ప్రధానిగా రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవల గురించి కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. తిరువూరు మండల మరియు పట్టణ కాంగ్రెస్ అద్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు, తాడిశెట్టి పూర్ణచంద్రరావు, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు బొడ్డు ప్రకాశరావు, డీసీసీ ఉపాద్యక్షులు ఉప్పలపాటి లక్ష్మీదాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులూ జీవనబాబు, కోతగుండ్ల గోపాలకృష్ణ, బుడుపుల రాము, సోమవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరువూరు రాజీవ్ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయము నందు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 75వ జయంతి కార్యక్రమమును ఘనంగా కేక్ కట్ చేచి నిర్వహించటం జరిగినది.ప్రధానిగా ఆయన సేసిన సేవలు గూర్చి పలువురు కొనియాదినారు.ఈ కార్యక్రమములో తిరువూరు మండల మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు, తాడి శెట్టి పూర్ణచంద్రరావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బొడ్డు ప్రకాశరావు,డి సి సి ఉపాధ్యక్షులు ఉప్పలపాటి లక్ష్మీదాస్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్‌బాబు, కొత్తగుండ్ల గోపాలకృష్ణ,బుడుపుల రాము,బంక మోహనరావు,రామిశెట్టి జగన్నాదరావు,షోమవరపు సత్యనారాయణ,పసుపులేటి శోభనాద్రి, చావల రంగ,తాళ్లూరి నాగేశ్వరరావు, బి సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంజా కృష్ణమోహన్ దారా మాధవి, టి.విజయలక్ష్మి తదితరులు పాల్గొనినారు.
*22న సిఐటీయూ మండల మహాసభ
తిరువూరు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 22న సిఐటీయూ మండల మహాసభల నిర్వహిస్తున్నట్లు మండల కమిటీ అద్యక్ష, కార్యదర్శులు తెలిపారు. సిఐటీయూ అనుబంధ కార్మిక సంఘాల నాయకులూ, కార్మికులు హాజరై విజయవంతం చేయాలనీ కోరారు.
*ఉపాద్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు
గంపలగూడెం మండలంలోని ఉపాద్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీఆర్టీయు మండల సఖ నాయకులూ సోమావారం సాయంత్రం ఎమ్మీవో సోమశేఖర్ నాయక్ కు వినతిపత్రం అందజేశారు. ఉపాద్యాయుల ఎస్సార్‌లో డీఎస్సి హాల్ టికెట్ నంబర్లు, ర్యాంకు, కేటగిరి వివరాలు నమోదు చేయాలనీ, సమైక్యంద్రా ఉద్యమంలో పాల్గొని సెలవు దినాల్లో పని చేసిన ఉపాద్యాయులు 17 ఈ ఎల్స్ ఎస్సార్‌లో నమోదు చేయాలని కోరుతూ మరిన్ని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పీఆర్టీయూ మండల శాఖ అద్యక్షుడు బీ.జమలయ్య ఆద్వర్యంలో అందించారు.
*విద్యార్ధులకు గుర్తింపు కార్డుల అందజేత
తిరువూరు ప్రభుత్వ ఉన్నత పాటశాల విద్యార్ధులకు 1989-90 సమకూర్చారు. బడిలో సోమవరం జరిగిన కార్యక్రమంలో వీటిని ప్రధానోపద్యాయిని నాంచారమ్మా విద్యార్ధులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పరసా నెహ్రూ, చిత్తలూరి సోమశేఖర్, నాగమల్లేశ్వరరావు మురళి రవిశంకర్ పాల్గొన్నారు.
*ఎన్నేస్పీ అధికారులపై వైకాపా నేతల ఆగ్రహం
తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి ఎన్నేస్పీ అధికారులు అవమానాలకు గురి చేస్తున్నారని మండల పరిషత్తు కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మూడో జోన్ కు విడుదలైన సాగర్ జలాలు తొలిసారిగా విస్సన్నపేట మండలం నూతిపాడు వద్ద రాష్ట్రంలోకి ప్రవేసిస్తాయని, ఇదే మండలం రామచంద్రాపురం నుంచి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో పంపిణీ జరుగుతున్నాయన్నారు.
*గ్రంధాలయ నిర్మాణ పనుల్లో కదలిక
గత దశాబ్దకాలంగా కలగానే ఉంటున్న గంపలగూడెం గ్రంధాలయ భవనం నిర్మాణ పనుల్లో మరోసారి కదలిక వచ్చింది. ఏపీఈడబ్ల్యూ ఐడీసీ డీఈఈ ఎన్ రాయన్న, జేఈ ఆర్యూ.ఎం.శ్రీనివాస్ సోమవరం స్థానికంగా ఉన్న గ్రంధాలయ స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ భవన నిర్మాణానికి ఇటీవల జిల్లా గ్రంధాలయ నిధి నుంచి రూ. ముప్పై లక్షలు మంజూరయ్యాయి
*బస్సు సర్వీసు పొడిగించాలని వినతి
తిరువూరు నుంచి మియాపూర్ వరకు వెళ్తున్న బస్సు సర్వీసు గచ్చిబౌలి వరకు పొడిగించాలని స్థానిక డీపో మేనేజరు కు సీపీఎం నాయకులూ విజ్ఞప్తి చేశారు. ఏమేరకు స్థానిక కార్యాలయంలో ఆయనకు సోమవారం వినతిపత్రం అందజేశారు. తిరువూరు ప్రాంతానికి చెందిన ఎక్కువమంది ఉద్యోగులు గచ్చిబౌలి ప్రాంతంలో పని చేస్తునందున రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారని డీఎం దృష్టికి తీసుకెళ్ళారు.
*విద్యార్ధులకు జాగృతి పోటీలు
విజయవాడ రామకృష్ణ మిషన్ ఆద్వర్యంలో స్థానిక నాగార్జున ఉన్నత పాటశాలలో సోమవరం జాగృతి పరీక్ష నిర్వహించారు. వివేకానంద బోధనలు పై చేపట్టిన పరీక్షకు విద్యార్ధుల నుంచి చక్కటి స్పందన లభించ్డింది. ప్రిన్సిపాల నరసింహారావు, సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.
*విద్యార్ధుల ఆందోళన
విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజు రియంబర్సు ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్.ఎఫ్.ఐ ఆద్వర్యంలో సోమవారం విద్యార్ధులు ఆందోళన చేశారు. నిరసన ప్రదర్శన చేస్తూ రెవెన్యు కార్యాలయానికి చేరుకొని కొద్దిసేపు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు వెంకటేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమంలో సూర్య, ప్రతాప్ పాల్గొన్నారు.
*పెట్టుబడి సాయం అందించేందుకే రైతు భరోసా
ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్ల పాటు రూ. యాభై వేలు సాయం అందించడానికే రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు భాగంగా వైఎస్సార్ రైతు భరోసా పధకం అమలు చేయాల చేపట్టిందని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి తెలిపారు. నదీం తిరువుతూ, మండలంలోని మల్లెల సహకార సంఘాలు మజూరు చేసిన పంట, దీర్ఘకాలిక రుణాలను సోమవారం ఆయన రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పంట బీమా గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుందని తెలిపారు.
*కట్లేరు కాజ్ వె నిర్మించాలని వినతి
గంపలగూడెం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు సోమవరం స్థానిక రెవెన్యు కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో తమ సమస్యలు పరిష్కరించాలని పాతిక అర్జీలు అందజేశారు. పెదకోమిర శివారు తోటమూల నుంచి వినగడప వెళ్ళే రహదారి వెంట చెత్తను దహనం చేస్తుండటంతో వైద్యులు దుర్గాప్రసాద్ నాటిన మొక్కలు కలిపోతున్నాయని జమలయ్య ఫిర్యాదు చేశారు.
*మట్టి విగ్రహాలు వినియోగించాలని వినతి
గణపతి నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తహసిల్దారు నరసింహారావుకు శ్రీవసుధ సం క్షెమ సంఘం డైరెక్టర్ డీ. ఆనందరావు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు స్థానిక కార్యాలయంలో సోమవరం జరిగిన స్పందనలో వినతిపత్రం అందజేశారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ముందు నుంచే అవగాహనా సదస్సులు నిర్వహించాలని కోరారు.
*సంఘటితంగా సమస్యలు పరిష్కరించుకుందాం
ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవాన్నీ తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం మండలాల్లో ఛాయా గ్రహకులు ఐక్యత ప్రదర్శన నిర్వహించారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.