*తిరువూరులో వివిధ శాఖల అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో శ్రద్ద చూపడం లేదు. ముఖ్యంగా ఆర్ అండ్ బీ మున్సిపల్ అధికారుల పనితీరు ఏమాత్రం బాగాలేదు. నాలుగు రోడ్ల కూడలిలో ఆర్ అండ్ బీ ఆఫీసు సమీపంలో, మున్సిపల్ ఆఫీసు ఉన్న ప్రధాన రహదారిలో ఏర్పడిన రెండు గుంతలను పూడ్చడంలో ఈరెండు శాఖ అధికారులు శ్రద్ద చూపక పోవడంతో ప్రాణంతకంగా మారాయి. గత వేసవిలో ప్రధాన రహదారులను అడ్డంగా బద్దలుకొట్టి మంచి నీటి పంపు కనేషన్లు ఇచ్చారు. ఈ రహదారులకు గండ్లు కొట్టిన ప్రాంతంలో సరిగా పూడ్చకపోవడంతో ఈ వర్షాకాలంలో కొన్ని కుంగిపోయి గుంటలు ఏర్పడ్డాయి. చిత్రంలో కనిపిస్తున్నవి తిరువూరు ఆర్ అండ బీ ఆఫీసు పక్కనే ఉన్న నాలుగు రోడ్ల సెంటరులో ఆర్ అండ్ బీ రహదారిపై ఏర్పడిన గోతులు ఇవి. రెండు వారాలు నుండి ఈ గోతులు ఇలాగే దర్శనం ఇస్తున్నప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యారు. వర్షం కురిసిన సమయంలో నీటితో గుంటలు నిండి సైకిళ్ళు, మోటారు సైకిళ్ళపై వెళ్ళేవారు ప్రమాదాలకు గురవ్వుతున్నారు. వాహనాలు వెళ్ళే సమయంలో గోతులలో నిలిచిన నీరు పాదచారులపైకి విరజిమ్ముతోంది. ఈ గోతులను అధికారులు ఇంకా ఎన్నాళ్ళకు పూడ్చివేస్తారో వేచి చూద్దాం.
*దోమలు వృద్ది చెందకుండా జాగ్రత్తలు అవసరం
తరచూ వర్షాలు కురుస్తున్న నేపద్యంలో నివాస గృహాలలో దోమల వృద్ది చెందకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చౌటపల్లి పీహెచ్సి వైద్యాధికారి డా. గంగాధరకుమార్ సూచించారు. పట్టణ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో శుక్రవారం ఆరోగ్య సఖ ఆద్వర్యంలో ఇంటింటా సర్వే నిర్వహించారు. పాత్రలు, తాగి పడేసిన బొండాలు, పచ్చడి రోళ్ళు వంటి వాటిలో రోజుల తరబడి వర్షపు నీరు నిల్వ ఉండటంతో వ్యాదులకు కారణమైన దోమలు వృద్ది చెందడానికి అవకాశం ఉంది.
*మొక్కలు నాటి ట్రీ గార్డుల ఏర్పాటు
పంద్రాగస్టు వేడుకల అందర్భంగా ప్రధాని మోడీ స్పూర్తితో తిరువూరుకి చెందిన విశ్రాంత ఉద్యోగి వడ్లపూడి సింహాచలం శుక్రవారం స్వచ్చ భారత్ నిర్వహించారు. సుగాలీ కాలనీ సమీపంలో జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. వాటి సంరక్షణ నిమిత్తం ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు.
*భూసార పరీక్షలుతో ఎరువుల వాడకం మేలు
రైతులు భూసార పరీక్షలు అనుసరింహి ఎరువులు వాడటంద్వారా తక్కువ పెట్టుబడితో ఆశించిన దిగుబడులు సాధించవచ్చని శాస్త్రవేత్త వసంతభను అన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో శుక్రవారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం ఆద్వర్యంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కేవీకే గరికపాడు, జిల్లా వ్యవసాయ అధికారులు రైతులకు వారి, పత్తి మొక్కజొన్న పంటల పై అవగాహనా కల్పించారు. ఈ సందర్భంగా వసంత భాను మాట్లాడుతూ రైతులు వరిసాగులో పాటించాల్సిన యాజమాన్య పద్దతులు కలుపు మందుల వినియోగంపై అవగాహనా కల్పించారు.
*ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండండి
గ్రామంలో నూతనంగా నియమితులైన గ్రామ వాలత్నీర్ల తమకు కేటాయించిన ప్రతి కుటుంబానికి నిత్యం అందుబాటులో ఉండాలని కొండపర్వ పీఏసిఎస్ అద్యక్షుడు గొట్టిపాళ్ళ చంద్రశేఖరరావు సూచించారు. కొండపర్వలో నియమితులైన వాలంటీర్లను శుక్రవారం ఆయన గుర్తింపు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి మధుసూదనరావు పాల్గొన్నారు.
*చిన్నరులకు ఫిజియోదేరఫి
తిరువూరు భవిత కేంద్రంలో శుక్రవారం విద్యాశాఖ ఆద్వర్యంలో శుక్రవారం ఫిజియోతెరఫి వైద్యశిభిరం నిర్వహించారు. దీనికి పన్నెండు మంది చిన్నారులు హాజరు కాగా వైద్య నిపుణులు ఎం.శ్రీనివాస్ వీరికి సేవలందించారు. కార్యక్రమంలో ఐఈఆర్తీ ఉపాద్యాయులు శామీమున్నీశా, ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.
*పదోతరగతి ప్రారంభానికి అనుమతి
తిరువూరు మండలం గానుగపాడులో వర్గోన్నటి కల్పించిన ఉన్నత పాటశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి ప్రారంభించడానికి ప్రాంతీయ సంయుక్త సంచాలకులు అనుమతి మంజూరు చేసినట్లు ఏమ్మీవో సోమశేఖర్ నాయక్ తెలిపారు. గ్రామానికి సమీపంలో ఉన్న టేకులపల్లి చౌటపల్లి జీ,కొత్తూరు, చింతలపాడు గ్రామాలకు చెందిన విద్యార్ధులు ఈ అవకాశాని వినియోగించుకోవాలని సూచించారు.
*సామాజికం ఆద్యమాలకు దూరంగా ఉండాలి
సామాజిక మాధ్యమాలకు వేదికగా చేసుకుని ఆకతాయిలు బాలికలకు ఎర వేస్తున్న నేపద్యంలో ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని నూజివీడు డివిజన్ శక్తిటీం సభ్యురాలు కనకదుర్గ సూచించారు. స్థానిక అక్షారా జూనియర్ కళాశాలలో శుక్రవారం విద్యర్దినిలకు అవగాహనా సదస్సు నిర్వహించారు. బాలికల పై దాడులు జరుగుతున్న నేపద్యంలో పూర్తీ అప్రమత్తంగా ఉంటూ, ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.
*కుష్టు రోగుల వివరాలు సేకరణ
కుష్టు రోగుల గుర్తింపు నిమిత్తం ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో శుక్రవారంతిరువూరు చింతల కాలనీలో ఇంటిట్టా సర్వే ప్రారంభించారు. ఏఏన్ఎంలు ఆరోగ్య కార్యకర్తలు కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. స్పర్శలేని మచ్చలుంటే కుష్టు వ్యాధిగా పరిగణించాలని ఈ విషయంలో ప్రజలకు అనుమానాలుంటే ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. అనంతరం విద్యార్ధులతో కలిసి కాలనీలో అవగాహనా ప్రదర్శన నిర్వహించారు.
*మృతుని కుటుంబానికి ఆర్ధిక సాయం
తిరువూరు మండలం అక్కపాలెంలో ఇటీవల పాముకాటుకు గురై మృతిచెందిన రైతు అబ్బిశెట్టి వెంకట్రామయ్య కుటుంబానికి కృష్ణా మిల్క్ యునియన్ క్షిరబంధు పధకం కింద ఆర్ధిక సాయం విడుదల చేసింది. లక్ష్మీపురం పాలశీతల కేంద్రం మేనేజర్ వింజమూరి ఉదయ కిరణ్ శుక్రవారం ఈ మొత్తాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అద్యక్షుడు చెన్ను రామారావు పాల్గొన్నారు.
*అటవీ భూముల పై హక్కులకు వినతి
గంపలగూడెం మండలం వినగడప శివారు తండాకు చెందిన గిరిజన కుటుంబాలు కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న అటవీ భూముల పై తమకు హక్కులు కల్పించాలని కోరుతూ సీపీఎం నాయకుల ఆద్వర్యంలో శుక్రవారం తహసిల్దారు పద్మజకు వినతిపత్రం అందజేశాయి. నాయకులూ జీ. సీతారామిరెడ్డి, జే,వెంకటేశ్వరరావు, గోపిరాజు , తండాకు చెందిన గిరిజనులు పాల్గొన్నారు.
*పధకాలను సద్వినియోగం చేసుకోండి
ప్రభుత్వం ప్రజా సంక్షెమనికి ఏర్పాటు చేస్తున్న పధకాలును సద్వినియోగం చేసుకోవాలని వైకాప మండల కార్యదర్శి , పీఎసిఎస్ సభ్యుడు మేకల రవి సూచించారు. స్థానిక వాసవీ ఇండెన్ గ్యాస్ ఏజెన్సీలో శుక్రవారం ప్రధాని మంత్రి గ్రమేనా ఉజ్వల యోజన ద్వారా మంజూరైన గ్యాస్ పొయ్యిలను పలువురు మహిళలకు అందజేసారు. కార్యక్రమంలో ఇందేన్ గ్యాస్ డీలర్ పులపాక శ్రీనివాసరావు, మహిళలు పాల్గొన్నారు.
*వాజ్ పేయికి నివాళి ‘
భారతరత్న దివంగత మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్ పేయీ వర్ధంతిని తిరువూరు భాజపా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ కన్వినర్ పోలే శాంతి నాయకులతో కలిసి వే పెయీ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పట్టణ కమిటీ అద్యక్షుడు వేంపాటి అబ్రహం, ఎం.రాంబాబు, దేవదానడివాకర్ , రామకృష్ణ, సువార్త తదితరులు పాల్గొన్నారు.
*అన్న క్యాంటీన్ల మూసివేత తగదు
రెక్కల కష్టంతో పనిచేసే కార్మికులకు పట్టెడు అన్నం పెట్టాలనే సదుద్దేశంతో తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాన్తెన్ల మూసివేత నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు హితవు పలికారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు స్థానిక మసీదు సెంటర్ లోని అన్న క్యాంటీన్ ఎదుట శుక్రవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. పేదలకు మూడు పూటలా నాణ్యమైన ఆహారం అందించడం కోసం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నన రాష్ట్ర ప్రభుత్వం పేదల నోట్లో కూడు లగేస్తోందని ఆరోపించారు.
*ఉపాద్యాయ స్పందనలో రెండు అర్జీలు ‘
విస్సన్నపేటలో శుక్రవారం ఏమ్మేవో నిర్వహించిన ఉపాద్యాయ స్పందన కార్యక్రమంలో రెండు అర్జీలు వచ్చాయి. వీటిలో కొండపర్వ ఎంపీయూపీ పాటశాలకు పారిశుధ్య కర్మికురాలిని నియమించాలని కోరుతూ ప్రధానోపాద్యయుడు జయరాం దరఖాస్తు చేశారు. 1996 డీఎస్సి ప్రకారం రెండు మాసాలు ఆలస్యంగా చేరిన ఎస్సీ సామాజిక ఉపాధ్యాయులకు పదోన్నతుల్లో న్యాయం చేయాలని కోరుతూ పలువురు ఉపాద్యాయులు ఎమ్మీవో సీహెచ్. రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు.
*పరవశించిన వరలక్షి
నియోజకవర్గంలోని తిరువూరు, ఎ.కొండూరు, విస్సన్నపేట, గంపలగూడెం మండలాల్లోని పలు ఆలయాల్లో శ్రావణ మాసం సందర్భంగా ఆయా ఆలయాల్లో వెలసిన అమ్మవార్లకు సామూహిక కుంకుమ అర్చానాలు చేశారు. పలుచోట్ల అన్నదానం, కరెన్సీ అలంకరణలు చేసారు. వివిధ రూపాల్లో అమ్మవార్లు దర్శనమిచ్చారు.
*భావన నిర్మాణ కార్మికుల ఆందోళన
భావన నిర్మాణ కార్మికులు శుక్రవారం విస్సన్నపేటలో ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా స్థానిక గందిబొమ్మ కూడలి నుంచి రెవెన్యు కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటీయు నాయకుడు నాగరాజు మాట్లాడుతూ కార్మిక సంక్షెమ బోర్డును నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.
*పాటశాలలకు వితరణలు
గంపలగూడెం మండల అమ్మిరెడ్డిగూడెంలోని ఏబీఎం పాటశాలకు పూర్వ విద్యార్ధులు పూర్వ ఉపాద్యాయులు రూ. తొంబై వేలు వితరనగా అందించినట్లు ప్రధానోపాద్యాయులు సముద్రాల మల్లిఖార్జునరావు శుక్రవారం తెలిపారు. తిర్వుఉరు మండలం వామకుంట్ల మండల పరిషత్ ప్రాధమికోన్నత పతశాలకు దివంగత జగడం గోపయ్య జ్ఞాపకార్ధం వేల విలువైన డెస్క్ లతో కూడిన బెంచీలను వితరంగా అందజేసారు. ఎ.కొండూరు మండలం కంభంపాడు ఉన్నత పాటశాలలో విద్యార్ధులకు దాతలు అందిస్తోన్న ప్రోత్సాహం అభినందనీయమని ఏమ్మీవో రాజశేఖర్ అన్నారు. సుక్రవ్రం జరిగిన కార్యక్రమంలో చారుగుండ్ల వెంకటేశ్వరరావు ట్రస్టు ఆద్వర్యంలో గతేడాది తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధులకు ప్రోత్సాహ అవార్డులు అందజేశారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.