*తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిది నియోజకవర్గంలో పర్యటించారు. అయన మున్సిపల్ కార్యాలయంలో జరిగిన పట్టణ ప్రణాళిక ముసాయిదా సమావేశానికి హాజరయ్యారు. మద్యాహ్నం పన్నెండు గంటలకు విస్సన్నపేటలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.
*గ్రేడ్-3మున్సిపాల్టీగా వర్గోన్నతి కల్పించాలని వినతి
ప్త్రస్తుతం నగర పంచాయతీగా ఉన్న తిరువురును గ్రేడ్ -3మున్సిపాల్తీగా వర్గోన్నటి కల్పించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కు ఎమ్మెల్యే రక్షణనిధి విజ్ఞప్తి చేశారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. వార్డులు సైతం జనాబా ప్రాతిపదికన జర్గానందున పునర్విభజన చేయాలని కోరారు. గతంలో రెండు సమితులుగా ఉన్న నియోజకవర్గంలో తిరువూరు, విస్సన్నపేట గ్రేడ్-1 పంచాయతీలుగా వేర్వేరుగా ఉండేవని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు.
*దుందిరాలపాడు ప్రాధమికోనన్నత పాటశాలకు వర్గోన్నతి
గంపలగూడెం మండలం దుందిరాలపాడు ప్రాధమీకోన్నత పాటశాలలో ఈ ఏడాది నుంచి ఎనిమిదవ తరగతి ప్రారంబించేందుకు జిలా విద్యాశాఖ నుంచి అనుమతి లభించినట్లు ప్రదానోపాద్యయుడు వెంకట శ్రీనివాస శాస్తి మంగళవారం తెలిపారు. పాటశాలలో 2000 సంవత్సరం నుండి 6,7తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏడో తరగతి ఉత్తీర్ణులు అయిన విద్యార్ధులు ఎనిమిదవ తరగతి అభ్యసించాలంటే తునికిపాడు లేదా ఊటుకూరు ఉన్నత పాటశాలలకు, ప్రయివేటు విద్యాలయాలకు వెళ్ళాల్సి వస్తోంది.
*వెయిట్లిప్టింగ్లో విద్యార్ధిని ప్రతిభ
నాగార్జున ఉన్నత పాటశాలకు చెందిన ఐదవ తరగతి విద్యార్ధిని వి.సువర్ణ జిల్లా స్థాయి వెయిట్ లిప్టింగ్ పోటీలలో ప్రతిభను కనబరిచింది. విజయవాడలో సోమవారం జరిగిన కృష్ణాజిల్లా వెయిట్ లిప్టింగ్ చాంపియన్ షిప్ 2019 పోటీలలో బాలిక సబ్ జూనియర్ ఇరవై కిలోల విభాగంలో ద్వీతీయ స్థానం కైవసం చేసుకుంది. సువర్నాను ప్రిన్సిపాల్ కే. నరసింహారావు, కరస్పందేంట్ వీ. నాగేశ్వరరావు , చైర్మన్ హనుమంతరావు డైరెక్టర్లు శేషగిరిరావు, సూరిబాబు మంగళవారం అభినందించారు.
*చోరీలు నిరోధించాలని వ్యాపారుల ప్రదర్శన
కొద్దిరోజులుగా విస్సన్నపేటలో జరుగుతున్నా చిల్లర చోరీలను నిరోధించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వ్యాపార వర్గాలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. దీనిలో భాగంగా స్థానిక వెంకటేశ్వర దీయేటర్ నుంచి పెద్ద ఎత్తున ప్రదర్శనగా పోలీస్ స్టేషన్ చేరుకొని అధికారులకు లిఖిత పూర్వకంగా వినతి పత్రం అందజేశారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మద్దతుగా విస్సన్నపేట మాజీ సర్పంచి కుక్కడపు ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్దిరోజులుగా విస్సన్నపేటలో చిల్లర చోరీలు జరుతున్నాయని ఆరోపించారు. రాత్రి సమయాల్లో దుకాణాల తాళాలు పగులకొట్టి విలువైన సిగరెట్లు, చిల్లర నగదు చోరీ చేస్తున్నరని చెప్పారు.
*తిరువూరు ఎంపీడీవోగా నాగేశ్వరరావు
తిర్వుఉరు మండల పరిషత్ అభివృద్ధి, అధికారిగా పీవీఎస్ నాగేశ్వరరావు మంగళవారం సాయంత్రం బాద్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న జానకీదేవిని ఎన్నికల కమిషన్ తాడేపల్లి సెక్షన్ అధికారిగా బదిలీ చేశారు. ఆమె స్థానంలో చాట్రాయి ఎంపీ డీవోగా పనిచేస్తున్న నాగేశ్వరరావు కు ఇంచార్జి బాద్యతలు అప్పగించారు.
*గంపలగూడెం మండలంలో కనుమూరు ప్రధాన ప్రాధమిక పాటశాలకు ఎన్నేస్పీ నీటి సంఘం అద్యక్షుడు జంగా చెంచురెడ్డి మంగళవారం రూ. 25వేలు విలువైన రెండు సీలింగ్ పంకాలు వితరనగా అందించారు..
*గంపలగూడెం మండలం వనరుల కేంద్రంలో నిర్వహించిన ఫిజియోతెరఫీ చికిత్స శిభిరంలో వివిధ గ్రామాలకు చెందిన ఎనిమిది మంది ప్రత్యెక అవసరాల కలిగిన చిన్నారులకు చికిత్స నిర్వహించినట్లు ఐఈఆర్టీ కృష్ణ తెలిపారు.
*తోటి విద్యార్ధులతో సోదరభావంతో మెలగాలి
వసతిగృహంలో ఉంటూ చదువుకునే పిల్లలు తోటి విద్యర్దులతో సోదర భావంతో మెలగాలని సిఐ ప్రసన్నవీరయ్య గౌడ్ సూచించారు. స్థానిక బీసీ బాలుర బాలికల పాటశాల కళాశాల వసతి గృహాలలో మంగళవారం సాయంత్రం అవగాహనా సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లతుడూ కష్టపడి చదివి ప్రయోజకులు కావడం ద్వారా తల్లిదండ్రులు నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు.
*ఈ-పంట నమోడుతో బహుళ ప్రయోజనాలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో ఈ-పంట నమోదును ప్రారంభించారు. తిరువూరు మండలంలోని ఇరవై పంచాయతీలకు పరిధిలో జరిగే నమోదు కార్యక్రమాన్ని మునుకుళ్ళలో మంగళవారం ప్రారంభించగా ఏవో రాజ్యలక్ష్మి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు గ్రామాల్లో వరినాట్ల ప్రక్రీయ పూర్తీ అయిన నేపద్యంలో రైతులు ఈ-పంటలో వివరాలును నమోదు చేయించుకోవాలని సూచించారు. ఎ.కొండూరు మండలంలో ఎ ఈవో రామచంద్రరావు ఏవో టిప్పు సుల్తాన్ ఆద్వర్యంలో ఈ-పంట నమోదు చేశారు.
*పైడి మర్రి ప్రతిజ్ఞ అజరామరం
పైడిమర్రి వెంకట సుబ్బారావు రచించిన భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞను కచ్చితంగా పాటిస్తే అంతకుమించిన దేశభక్తి మరొకటి ఉండదని ప్రదానోపాద్యాయుడు బీవీ వీరభద్రం అన్నారు. తిరువూరు మండలం మునుకుల్ల జిల్లా పరిషత్ పాటశాలలో ప్రతిజ్ఞ రచయితా పైడిమర్రి వర్ధంతిని హిందీ సంఘ ఆద్వర్యంలో మంగళవారం నిర్వహించారు.
*ఇసుక అనుమతులకు వినతి
ఇసుక నుమతులు త్వరితగతిన జారీ చేయాలని విస్సంనపెతకు చెందిన వైకాపా నేతలు రెవెన్యు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని గానుగపాడు క్వారీ నుంచి విస్సన్నపేట మండలానికి వారానికి ఒకరోజు టోకెన్లు జారీ చేస్తున్నారన్నారు. విస్సన్నపేటలో ఉన్న డిమాండ్ దృశ్య వారానికి రెండురోజులు టోకెన్ల జారీకి అనుమతించాలని అన్నారు. ఈమేరకు తహసిల్దారు బీ.మురళీకృష్ణను కలిసి విజ్ఞప్తి చేశారు. మండల పరిషత్తు మాజీ ఉపాధ్యక్షుడు ఓలేటి దుర్గారావు, వైకాపా నేతలు సిరసాని ప్రకాష్ అనుమోలు శివబాజి, అబ్బినేని హరి అధికారులను కోరినవారిలో ఉన్నారు.
* నెమలి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో నాలుగు రోజులపాటు నిర్వహించిన పవిత్రోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. చివరి రోజున యాగశాలలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పవిత్రాలలో అలంకరించి, త్రేతాగ్ని ఆరాధన ప్రధాన హోమం నిర్వహించి, పూర్ణాహుతి సమర్పించారు. ప్రధానార్చకులు తిరునఘరి గోపాలాచార్యులు ఆధ్వర్యంలో రుక్మిణీ, సత్యభామా సమేత వేణుగోపాలస్వామికి శాంతికల్యాణం, పవిత్ర విసర్జన, యజమానులకు పవిత్రాల బహూకరణ, ఆశీర్వచన వేడుక నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మైలవరపు రామాంజనేయులు, సహాయ కమిషనర్ ఎన్.సంధ్య ఉత్సవాల్లో పాల్గొన్నారు.
* త్వరలో నూతన మద్యం పాలసీ-ఎక్సైజు సూపరింటెండెంట్ రమణమూర్తి
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లాలో త్వరలో నూతన మద్యం పాలసీ అమల్లోకి వస్తుందని ఎక్సైజు సూపరింటెండెంట్ డా.పి.వి.రమణమూర్తి తెలిపారు. విస్సన్నపేటలో ఎక్సైజు స్టేషన్ మార్పు కోసం ఎంపిక చేసిన భవన పరిశీలనకు మంగళవారం వచ్చిన ఆయన మాట్లాడారు. నూతన విధానంలో భాగంగా ఈనెల 20వ తేదీన దుకాణాల నిర్వహణకు భవనాలను అద్దెకు ఇచ్చే యజమానుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుందన్నారు. వీటిని కలెక్టర్ ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల బృందం 21వ తేదీన పరిశీలించి, అనుమతులిస్తుందని చెప్పారు. భవన విస్తీర్ణం కనీసం 150 నుంచి 300 చదరపు అడుగులు ఉండాలని, దుకాణాల నిర్వహణకు ఇంటర్మీడియట్ అర్హత ఉన్న యువతను ఎంపిక చేస్తారన్నారు. వీరిపై పర్యవేక్షణకు ఉన్నత విద్యనభ్యసించిన యువతను ప్రభుత్వం ఎంపిక చేస్తుందన్నారు. రానున్న కాలంలో దుకాణాల్లో మద్యం విక్రయాల బాధ్యత ఏపీ బేవరేజస్ లిమిటెడ్ సంస్థ చూసుకుంటున్నందున, తమ శాఖకు ఈ బాధ్యత ఉండదన్నారు. ఎక్సైజు అధికారులు, సిబ్బంది మొత్తం మద్యం బెల్టు దుకాణాలు, నాటుసారా తయారీ, విక్రయాలను నిలువరించే విషయమై దృష్టి కేంద్రీకరిస్తామని వివరించారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.