ఇళ్ల పట్టాలు, రైతు భరోసా, అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలపై సమాచార సేకర వలంటీర్ల బాధ్యతలను ప్రకటించిన పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ 15న విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా కొత్త వ్యవస్థ ప్రారంభం సెప్టెంబర్ 1 నుంచి శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే ‘ఇంటికే రేషన్’ శ్రీకారం అదే నెల 11–15 మధ్యలో పింఛన్, రేషన్ లబ్ధిదారుల గుర్తింపుపై శిక్షణ అక్టోబర్ 2 తర్వాత కొత్త పింఛన్లకు అర్హులను గుర్తించేది వలంటీర్లే రాష్ట్రంలో ఎంతమందికి ఇళ్ల పట్టాలు అవసరం అన్నదానిపై గ్రామ, వార్డు వలంటీర్లు ఈ నెల 26 నుంచి రాష్ట్రమంతటా సర్వే చేయనున్నారు. అలాగే, వైఎస్సార్ చేయూత పథకంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సహాయానికి అర్హత ఉన్న 45–60 ఏళ్ల మధ్యనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలను గుర్తించడం.. రైతు భరోసా, అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా ద్వారా లబ్ధిపొందే వారి వివరాలపై ఈ సర్వే నిర్వహిస్తారు. ఒకొక్క వలంటీరు తనకు కేటాయించిన 50 ఇళ్లలో రోజుకు ఏడు నుంచి పది ఇళ్ల చొప్పున ఐదు రోజుల పాటు ఇది ఉంటుంది. కాగా, ఆగస్టు 15న వలంటీర్లు విధులలో చేరిన తర్వాత అక్టోబరు 2న గ్రామ సచివాలయాలు ఏర్పాటయ్యే వరకు 45 రోజుల పాటు వారు ఏఏ కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ సోమవారం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
*15న సీఎం చేతుల మీదుగా శ్రీకారం
ఇదిలా ఉంటే.. వలంటీర్ల వ్యవస్థను ఆగస్టు 15న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ నుంచి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఎంపికైన వలంటీర్లు అదేరోజు వారివారి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సీఎం కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాలలో వీరు వీక్షించేందుకు అన్నిచోట్ల ఎల్సీడీలు ఏర్పాటు చేయాలని జెడ్పీ సీఈవోలను ఆదేశించారు.
*16–25 తేదీల మధ్య డేటా సేకరణ
వలంటీర్లు విధుల్లో చేరిన వెంటనే తమకు కేటాయించిన 50 ఇళ్ల పరిధిలోని వ్యక్తుల సమగ్ర సమాచారంతో పాటు ఆ కుటుంబ ఆర్థిక, సామాజిక పరిస్థితి వంటి అన్ని అంశాలపై డేటా సేకరించాలని గిరిజాశంకర్ ఆదేశించారు. ఆగస్టు 16వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య రోజుకు పది కుటుంబాల చొప్పున ఈ సమాచారం నిర్ణీత ఫార్మాట్లో సేకరించాల్సి ఉంటుంది. మరోవైపు.. సెప్టెంబరు 1వ తేదీ నుంచి వలంటీర్ల ద్వారా ఇంటికే రేషన్ బియ్యం ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని తొలుత శ్రీకాకుళం జిల్లాలో ఆరంభించనున్నారు. పెన్షన్ల పంపిణీపై కూడా వీరు సెప్టెంబరు 1న జరిగే పంపిణీ కార్యక్రమంలో ఆయా సిబ్బంది ద్వారా అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది.
*కొత్త పింఛన్, రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపికపై శిక్షణ
కొత్తగా పింఛన్లు, రేషన్‌కార్డుల లబ్ధిదారుల ఎంపికలో అవసరమయ్యే శిక్షణను వచ్చే నెల 11 నుంచి 15 తేదీల మధ్య అన్ని మండల కేంద్రాల్లో ఇవ్వాలని గిరిజా శంకర్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 2న గ్రామ సచివాలయాల ఏర్పాటు తర్వాత వలంటీర్లు ప్రతీరోజు ‘స్పందన’ కార్యక్రమం నిర్వహించాలన్నారు. అలాగే, ప్రజల నుంచి అందే వినతులను 72 గంటలలో పరిష్కరించేలా చేయడం.. పింఛన్ల పంపిణీ, కొత్తవి మంజూరుకు అర్హులను గుర్తించడం.. అక్టోబరు 15న రైతు భరోసా కార్యక్రమాన్ని వలంటీర్లే నిర్వహించాల్సి ఉందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
1.సమస్యల పరిష్కారానికి సంఘాలు అవసరం
ఉపాద్యాయులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి బలమైన సంఘాలు అవసరమని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.శ్రీనివాస్ తెలిపారు. స్థానిక యూటీ ఎఫ్ కార్యాలయంలో సోమవరం సంఘ ఆవిర్భావం దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాద్యాయ ఉద్యమ పితామహుడైన దాచూరి రామిరెడ్డి చెన్నుపాటి లక్ష్మయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
2.రోడ్డు ప్రమాదంలో వ్యక్తికీ గాయాలు
విస్సన్నపేటలో సోమవరం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికీ తీవ్ర గాయాలకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విస్సన్నపేటకు చెందిన పర్వతం సివనగేస్వరరఫు తన ట్రాక్ ఆటోను స్థానిక రెడిగుడెం రోడ్డులో నిలిపి ఉంచగా మైలవరం వైపు నుండి విస్సన్నపేట వస్తున్నా కారు వెనుక వైపు నుంచి దీకోట్టింది.ఈప్రమాదంలో సివనగేస్వరర్వు రెండు కళ్ళు విరిగి తీవ్ర గాయాలకు గురి కావడంతో విజయవాడలోని ప్రెవేట్ ఆస్పత్రికి తరలించారు.
3.14న గ్రామ సచివాలయ అభ్యర్ధులకు అవగాహనా సదస్సు
తిరువూరు, విస్సన్నపేట మండలలలో సచివాలయ ఉద్యోగాల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని ఎ.కొండూరు మండల ప్రజా సంఘాల నాయకులూ వెంకటేశ్వరరావు సోమవారం తెలిపారు. ఈసదసులో ఎ.కొండూరు మండలానికి చెందిన ఆయా గ్రామాల అభ్యర్ధులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. విస్సన్నపేటలో గ్రామా సచివాలయ అభ్యర్ధులకు అవగాహనా సదసు నిర్వహిస్తున్నామని గిరిజన సంఘం సీపీఎం అనుబంధ ప్రజా సంఘాల నేతలు నాగరాజు, గోపిరాజు, శ్రీనివాసరెడ్డి తెలిపారు.
4.గుట్కా విక్రేత అరెస్టు
గంపలగూడెం మండలం పెనుగొలనులోని బడ్డీకోట్టులో గుట్కాలు విక్రయిస్తున్నా ఇనపనూరి నాగరాజును అరెస్టు చేసినట్లు ఎస్సై ఉమమహేశ్వరారావు తెలిపారు. అతని నుంచి రూ.1545 విలువైన గుట్కా పొట్లాలు స్వాధీనం చేసుకున్నామని న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు.
5.ఫోటో గ్రాఫర్స్ సంఘ వ్యవస్థాపక అద్యక్షుడు వైకుంటరావు మృతి
తిరువూరుకు చెందిన ఫోటో గ్రాఫర్ అసోసియేషన్స్ వ్యవస్థాపక అద్యక్షుడు మల్లెం వైకుంటరావు సోమవారం మృతి చెందారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.
6. తిరువూరులో ఘనంగా బక్రీద్ వేడుకలు
తిరువూరు పట్టణంలో బక్రీద్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా సోమవారం జరుపుకున్నారు. ఉదయం 9 గంటలకంతా ముస్లిం సోదరులందరూ నూతన వస్త్రాలను ధరించి స్థానిక మల్లెమ్మ చెరువు వద్ద ఉన్న ఈద్గా దగ్గరకు చేరుకొని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.ఇస్లాం మతగురువు రిజ్వి (పేష్మామ్) ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి.. అనంతరం పెద్దలు, పిల్లలు ఒకరిని ఒకరు ఆలింగనం పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇళ్ళకు వెళ్ళి ఖుర్బానీ కార్యక్రమాన్ని కొనసాగించారు. హిందూ సోదరులు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలను తెలిపారు. పట్టణంలో పండగ వాతావరణం కోలాహలంగా కనిపించింది.జామియా మస్జీద్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ హుస్సేన్,కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నమాజ్ ల కొరకు తగిన ఏర్పాట్లు చేశారు. గంపలగూడెం, విస్సన్నపేట, ఏ- కొండూరు మండలాల్లో ఆయా ఈద్గాహ్ లలో, మస్జీద్ లలో కూడా ఘనంగా బక్రీద్ వేడుకలు జరిగాయి..
7.రైతుకు పాముకాటు
గంపలగూడెం మండలం చింతలనర్వకు చెందిన వెంకట్రావు అనేరైతు సోమవారం పాముకాటుకు గురయ్యాడు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మాగానిలో వరినారుమడి చూసేందుకు వెళ్ళగా అక్కడ పాము కరిచింది. సదరు రైతును గంపలగ్గుడెం ప్రాధమిక ఆస్పత్రికి తరలించగా తాళాలు వేసి ఉండగా ప్రెవేట్ వైద్యశాలకు తరలించినట్లు వైద్య చికిత్స చేశారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.