* విజయవాడ ఆర్టీసీ రీజియన్ గత 3నెలల్లో 15 కోట్ల రూపాయల నష్టాలు చవిచూసిందని రీజినల్ మేనేజర్ జీ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. తిరువూరు డిపో వార్షిక తనిఖీ నిమిత్తం శనివారం వచ్చిన ఆయన మాట్లాడుతూ ఆటోనగర్, విజయవాడ డిపోలు మాత్రమే లాభాల్లో ఉన్నాయని, పెరిగిన డీజిల్ ధరలు, నిర్వహణ వ్యయం, స్పేర్ పార్ట్శ్ ధరలు పెరగడంతో ఈ నష్టాలు వస్తున్నాయన్నారు. విజయవాడ డిప్యూటీ సి టీ ఏం జాన్ సుకుమార్, తిరువూరు డిపో మేనేజర్ ఫయాజ్ అహ్మద్ పాల్గొన్నారు.
*వివక్ష తగదు
వైకాపా అధికారంలోకి వచ్చాక తెదేపా నాయకులూ, కార్యకర్తలు తీవ్ర వివక్ష ఎదుర్కొంటున్నారని మాజీ సర్పంచి మోరల తిరపతిరావు, తెదేపా గ్రామ అద్యక్షుడు అన్నీ రవికుమార్ ఆరోపించారు. శుక్రవారం వారు స్థానికగా మాట్లాడుతూ స్థానిక పాల ఉత్పత్తిదారుల సహకార సంఘంలో పని చేస్తున్న కృష్ణ తెదేపా కార్యకర్త అని భావించి తొలగించడం సరికాదన్నారు. మండల వ్యాప్తంగా ఆయా గ్రామాలలో పలు శాఖల్లో పని చేస్తున్న చాలా మంది ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కృష్ణను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు బీ.శంకర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
*జూదరుల పట్టివేత ‘
గంపలగూడెం మండలం కనుమూరులో శుక్రవారం సాయంతం నిర్వహించిన దాడుల్లో జూదమాడుతున్న ముగ్గురు బ్యాక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఉమామహేస్వరావు తెలిపారు.
*బస్టాండ్ లో అధికారుల తనిఖీ
తిరువూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో తూనుకలి, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోల్ స్వర్ణ శుక్రవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా మంచినీటి సీసాలు, శీతల పానీయాలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దుకాణం నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బస్టాండు, సినిమా హాళ్ళు ఇతర పదేశాల్లో ఏమ్మర్పీ కంటే అధికంగా విక్రయిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.
*గోవధను కట్టడి చేయాలనీ వినటి
తిరువూరులో యద్చ్చేగా సాగుతున్న గోవధ కట్టడికి చర్యలు తీసుకోవాలని తహసిల్దారు నరసింహారావుకు స్థానిక కార్యాలయంలో భాజపా నేతలు వినతి పత్రం అందజేశారు. రాజుపేట పశువుల సంత సమీపంలో అక్కపాలెం వెళ్ళే రహదారిలో వాగు ఒడ్డున గోవులను వాదిస్తూ మాంసం విక్రయాలు చేస్తున్నారని తహసిల్దారు దృష్టికి తీసుకువచ్చారు.
*సబ్ స్టేషన్ పనులు వేగవంతం చేస్తాం
విస్సన్నపేట మండలం నరసాపురంలో ఐదేళ్ళ క్రితం నిర్మాణం ప్రారంభించిన 133/32కేవీ విద్యుత్తూ సబ్ స్టేషన్ పనులను త్వరతగతిన పూర్తీ చేసి, నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు కృషి చేస్తామని తిరువూరు శాసన సభ్యుడు రక్షణనిధి హామీ ఇచ్చారు. తెల్లదేవరపల్లి పీఎసిఎస్ త్రిసభ్య కమిటీ అద్యక్షుడు అల్లు గజపతి రెడ్డి ఆద్వర్యంలో పలువురు రైతులు ఎమ్మెల్యే రక్షణనిధి కలిసి, సబ్ స్టేషన్ ప్రారభించాలని విజ్ఞప్తి చేశారు.
*పోలీస్, ఎక్సైజు అధికారులకు ఎమ్మెల్యే సూచన
తిరువూరు నియోజకవర్గంలో గొలుసు మద్యం దుకాణాలను సమూలంగా నిర్మూలించడానికి ఎక్సైజు, పోలీసు శాఖ ఆద్వర్యంలో సంయుక్త దాడులు నిర్వహించాలని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి సూచించారు. స్థానిక పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం ఆయన సర్కిల్ పరిదిలోని ఎక్సైజు, పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
*ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు
తిరువూరులో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు సిఐ ప్రసన్నవీరయ్య గౌడ్ తెలిపారు. శుక్రవారం ఆయన పట్టణంలో ఎస్సైలు సుబ్రహ్మణ్యం,అవినాష్ లు కలిసి ట్రాఫిక్ సమస్యను పర్యవేక్షిస్తూ వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్దంగా వాహనాలు నడుపుతున్న చోదకులకు కౌన్సిలింగ్ చేశారు.
*రేషన్ కార్డు పై నాలుగు రకాల సేవలు నిలిపివేత
మీసేవ కేంద్రాల ద్వారా అందిస్తున్న నాలుగు రకాల సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వ్యులు జరీ చేసినట్లు తహసిల్దారు పద్మజ శుక్రవారం తెలిపారు. రేషన్ కార్డులో పేర్లు చేర్చడం, తొలగించడం బదిలీ చేయడం మైగ్రేషన్ వంటి సేవలను ప్రస్తుతం నిలిపివేస్తున్నట్లు చెప్పారు,. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు అందేవరకు రేషన్ కార్డుకు సంబంధించి పైనుదహరించిన నాలుగు రకాల సేవలను నిర్వహించకూడదని మీసేవ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు.
*సదసును సద్వినియోగం చేసుకోండి
గ్రామా సచివాలయ ఉద్యోగులకు సంనద్దులవుతున్న అభ్యర్ధులు స్పరీక్ష సమయంలో పాటించాల్సిన మెలకువలపై స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈనెల 14న మధ్యాహం మూడు గంటలకు నిర్వహిస్తున్న అవగాహనా సదస్సును సద్వినియోగం చేసుకోవాలని జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. హరికృష్ణ సూచించారు. అవగాహనా సదస్సుకు సంబందించిన కరపత్రాలును స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఆవిష్కరించారు.
*వరలక్ష్మికి పూజలు
తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు మండలాల్లో శ్రవణ శుక్రవారం సంధర్హంగా మండలాల పరిధిలోని అమ్మవార్ల ఆలయాలు అన్ని కిటకిటలడాయి. భక్తులు ఆలయాలలోని అమ్మవార్ల విగ్రహాలకు పూజలు నిర్వహించి, కుంకుమ పూజలు చేశారు. పలువురు మహిళలు తమ గృహాలలో వరలక్ష్మి వ్రతాలూ నిర్వహించి లక్ష్మీదేవి అమ్మవారిని భక్తితో కొలిచారు. పిండి వంటలు తాయారు చేసి అమ్మవారికి సమర్పించారు.
*తిరువూరు నాగార్జునలో స్వాగాతోతసవం
తిరువూరు నాగార్జున జూనియర్ కళాశాలలో విద్యార్ధులకు స్వగతం పలుకుతూ సీనియర్లు ఆద్వర్యంలో శుక్రవారం నిర్వహించిన స్వాగాతోత్సవం ఆద్యంతం సందడిగా సాగింది. వక్తల ప్రసంగాల అనంతరం విద్యార్ధుల ఆద్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సినీ ,దేశభక్తి, జానపద గీతాలకు అనుగుణంగా నృత్యాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. విద్యార్ధినులు గీతాలు ఆలపించి అలరించారు.
*రహదారి సమస్య పరిష్కరించాలని వినతి
విస్సన్నపేటలో అద్వానంగా మారిన రహదారి సమస్యను పరిష్కరించాలని పలువురు ఉపాద్యాయులు విశ్రాంత ఉద్యోగులు శుక్రవారం తహసిల్దారు బీ.మురళీకృష్ణ వినతి పత్రం అందజేశారు. స్థానిక ప్రధాన రహదారి నుంచి సిఎస్ఐ టౌన్ చర్చి మీదుగా రెడ్డిగూడెం రోడ్డుకు వెళ్ళే రహదారి అద్వానంగా మారి, రాకపోకలకు సమస్యలు ఎదురవుతున్నయన్నారు.
*పాడి రైతులకు బోనస్ పంపిణి
గంపలగూడెం మండలంలోని పలు గ్రామాల్లో పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకార సంఘాల్లో పాలు విక్రయించిన రైతులకు 2018-19 ఆర్ధిక సంవత్సరంకు సంబందించిన మూడో విడతగా రూ. 6లక్షలు బోనస్ సొమ్ములను శుక్రవారం తిరువూరు పాల శీతల కేంద్రం మేనేజర్ వింజమూరి ఉదయ కిరణ్ పంపిణీ చేశారు. అమ్మిరెడ్డిగూడెంలో 186 మంది రైతులకు రూ. 3,27,334 అనుముల్లనలో 120 మందికి 2,11,981 గొసవీడు శివారు గంగాదేవి పాడు అరవై మంది రైతులకు రూ. 63,500 పంపిణీ చేశారు.
*సాంప్రదాయ వస్త్రధారణలో అలరించిన బాలికలు
గంపలగూడెం మండలం పెదకోమిర శివారు తోటమూలలో విశిష్ట జూనియర్ డిగ్రీ కళాశాలలో శ్రావణ మాసం సందర్భంగా శుక్రవారం ఇంటర్, డిగ్రీ చదివే బాలికలకు సంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహించారు. కళాశాలకు చెందిన బాలికలు సంప్రదాయంగా చీరెలు, ఓణీలు ధరించి సందడి చేశారు. విజేతలకు కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపల్స్ బహుమతులు ప్రధానం చేశారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.