అమరావతి-తిరువూరు నియోజవర్గంలోని కృష్ణారావుపాలెం, నరసాపురం గ్రామాల్లో ఉన్న సాంఘిక సంక్షేమ కళాశాలలో ఉన్న డార్మెటరీలు మరమ్మతులకు మరియు విద్యార్థుల వసతిగృహాల్లో సదుపాయాలు కల్పించేందుకు కృషిచేయాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక,సంక్షేమ గురుకులాల సెక్రెటరీ వి.రాములను ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి కోరారు. బుధవారం తాడేపల్లిలోని సాంఘీక, సంక్షేమ కార్యాలయంలో సెక్రెటరీని కలిసిన ఎమ్మెల్యే పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. వసతిగృహల్లో దోమలు రాకుండా విద్యార్థులకు చదువుకునేందుకు విద్యుత్ లైట్స్, ఫ్యాన్లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని తెలిపారు. కళాశాల మైదానాల్లో పరిసరాల పరిశుభ్రత(జంగిల్ క్లియరెన్స్) పాటించాలన్నారు. వసతి గృహాలకు మధ్య సీసీ రహదారులు ఏర్పాటు చేయాలని ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో జంగిల్ కారణంగా క్రిమి కీటకాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల ఉన్న మైదానంలో కాంతివంతమైన ఎల్ఈడి లైట్లు ఏర్పాటుకు కృషి చేయాలని పిల్లలకు చదువుకునేందుకు అసౌకర్యాలు లేకుండా కావలసిన నిధులు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.