*కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గంలోని మండలాల్లో నమోదైన వర్షపాతం.. ఏ- కొండూరు (మం) 24.0 మీ.మీటర్లు, తిరువూరు (మం) 42.0 మీ.మీటర్లు..గంపలగూడెం (మం) 26.2 మీ.మీటర్లు, విస్సన్నపేట (మం) 40.0 మీ.మీటర్లు, గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం..
*పచ్చదనంతోనే మనవ మనుగడ
పచ్చదనం పెంపొందించడం ద్వారానే మనవ మనుగడ సాధ్యపడుతుందని లేనిపక్షంలో ప్రక్రుతి వైపరిత్యాలును ఎదుర్కోవాల్సి వస్తుందని సిఐ ప్రసన్నవీరయ్యగౌడ్ తెలిపారు. స్థానిక ఈద్గాలో జామియా మసీదు కమిటీ ఆద్వార్యంలో వనం మనం లో భాగంగా మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు స్వచ్చంద సస్మ్తలు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
*వీఆర్వోల సంఘం అధ్యక్షునిగా బాలాస్వామి
విస్సన్నపేట అందాల వీఆర్వోల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక స్థానిక రెవెన్యు కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కే.బాలాస్వామి సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఎం.సుదీర్, ఉపద్యక్షురాలిగా ఎన్.సంద్యారాణి కోశాధికారిగా ఎస్కే.షరీఫ్ లు ఎన్నికయ్యారు.
*సచివాలయ అభ్యర్ధులకు ఎనిమిది పరీక్షా కేంద్రాలు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకున్న అభ్యర్ధుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహించేందుకు మండలంలో ఎనిమిది కేంద్రాలను అధికారులు ఎంపిక చేశారు. వీటిని ఎంపీడీవో యరమాల పిచ్చిరెడ్డి , ఈవోపీఅర్డీ దకారపు బాబూరావు మంగళవారం పరిశీలించారు. ఎంపీదీవో తెలిపిన వివరాల మేరకు గంపలగూడెం లో జడ్పీ ఉన్నత పాటశాల, పెదకోమిర ఆదర్శ పాటశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, తోటమూల విశిష్ట జూనియర్ కళాశాల, ఊటుకూరులోని జడ్పీ ఉన్న పాటశాల, సిద్దర్డ విద్యాలయం, శ్రీకృష్ణసాయి జూనియర్ కళాశాలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు.
*క్యాన్సర్ పౌండేషన్ కు ఆర్ధిక సాయం
తిరువూరు నాగార్జున ఉన్నత పాటశాల విద్యార్ధులు హైదరబా కు చెందిన నాన్ కమ్యుని కేబుల్ డిసీజ్ క్యాన్సర్ పౌండేషన్ కు రూ. 15,600విరాళం అందజేశారు. క్యాన్సర్ బాధితుల సహాయార్ధం విద్యార్ధులు సేకరించిన మొత్తాన్ని పాటశాల యాజమాన్యం ఇచ్చిన సాయాన్ని కలిపి మంగళవారం సంస్థ ప్రతినిధికి అందజేశారు. విద్యార్ధులను ప్రిన్సిపాల్ కే. నరసింహారావు అభినందించారు.
*రూ. 3.5 కోట్ల పాలధార వ్యత్యాసం పంపిణి.
*కృష్ణా మిల్క్ యూనియన్ 2018-19 ఆర్ధిక సంవత్సరానికి ప్రకటించిన రూ. 3.5 కోట్ల పాల ధర వ్యత్యాసాన్ని మండలంలోని లక్ష్మిపురం పాలశీతల కేంద్రంలో సంఘం జిల్లా పాలకవర్గ సభ్యురాలు బోయపాటి సుశీల మంగళవారం రైతులకు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాడి రైతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా కృష్ణా మిల్క్ యోఒనియన్ పాల ధర వ్యత్యాసం పంపిణీ చేస్తోందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రూ.22కోట్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
*ఉద్యోగ భద్రతకు రెండో ఏఎంఎంల ఆందోళన
ఆరోగ్య శాఖలో రెండో ఏ ఎన్ ఎంలుగా పనిచేస్తున్న తమను క్రమబద్దీకరణ చేయాలనీ కోరుతూ గంపలగూడెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రెండో ఏఎన్ఎంల ఆందోళన నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. మండలంలోని రెండో ఏఎన్ఎంలు ఆందోళనలో పాల్గొన్నారు.
*గడువును సద్వినియోగం చేసుకోండి
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో వారి పంట సాగు చేసే రైతులు తమ వివరాలు నమోదు చేసుకునేందుకు వీలుగా ఈనెల 21 వరకు ఇచ్చిన గడువును సద్వినియోగం చేసుకోవాలని ఏవో.రాజ్యలక్ష్మి సూచించారు. పొలం పిలుస్తోందిలో భాగంగా మండలంలోని లక్ష్మీపురంలో ప్రారంభించిన వరి నారు చివరికొనలను తుంచి నాట్లు వేయాలని సూచించారు.
*ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండండి
వాలంటీర్లను గ్రామంలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనీ కొండపర్వ పీఏసిఎస్ కమిటీ అద్యక్షుడు గొట్టి వూళ్ళ చంద్రశేఖరావు సూచించారు. గ్రామంలో ఎంపికైన ఇరవై మంది వాలంటీర్లకు మంగళవారం ఆయన నియామక [పత్రాలు అందజేశారు.
*నాలుగు మండలాల్లో తల్లిపాల వారోత్సవాలు
తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు, విస్సన్నపేటలో మంగళవారం అంగన్ వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాల పై గర్భినులకు, బాలింతలకు అవగాహనా సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ తిరువూరు ప్రాజెక్టు అధికారులు, ఆయా కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.
*వాలంటీర్లు జవాబు దారిగా పని చేయాలి
వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా నియమితులైన వాలంటీర్లు ప్రజలకు జవాబుదారిగా పని చేయాలని తిరువూరులో కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో నాలుగు రోజులు జరిగే వార్డు వాలంటీర్లు శిక్షణ తరగతులును మంగళవారం ప్రారంభించారు. గంపలగుడెంలో మండలంలో గ్రామాల్లో ప్రజలకు సేవలు అందించడంలో గ్రామ వాలంటీర్లు కీలకంగా ఉంటారని ఎంపీడీవో వై.పిచ్చిరెడ్డి పేర్కొన్నారు. వాలంటీర్లు నిబద్దతతో విధులు నిర్వర్తించాలని ఎ.కొండూరు మండల ప్రత్యేకాధికారి కిషన్ సింగ్ ఎంపీడీవో గౌసియాబెగం అన్నారు.
*నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే
ప్రెవేటు పాటశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని విస్సన్నపేట ఏమ్మీవో రామకృష్ణ సూచించారు. విస్సన్నపేటలో సిద్దార్ధ పాతశాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నెలకొమారు నో బ్యాగ్ దే అమలు చేయాలనీ ప్రభుత్వ సెలవు దినాల్లో ప్రెవేటు పాటశాలలకు సెలవు ప్రకటించాలని సూచించారు. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
*వాలంటీర్ల నియామకం పై ఫిర్యాదు
నూతనంగా ఏర్పాటైన చదన్ద్రుప్ట్ల తండా గ్రామ వాలంటీర్ల నియామకంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కోర్రతండా గ్రామానికి చెందిన కొందరు యువకులు మంగళవారం ఎంపీడీవో ఎస్. వెంకట రమణ కు ఫిర్యాదు చేశారు. చంద్రుపట్ల పంచాయతీలో భాగంగా ఉన్న పెద్దతండా చిన్న తండా, కొర్ర తండా గ్రామాలను కలిపి అధికారులు చండ్రుపట్ల తండా పంచాయతీగా ఏర్పాటు చేశారన్నారు.
*ఆర్టికల్ 370 రద్దుపై హర్హం
జమ్మూ- కశ్మీర్ కు ప్రత్యెక ప్రతి పత్తి కల్పించే 370అధికరణాన్ని రద్దు చేయడం పై మండలంలోని పలు విద్యాలయాల్లో విద్యార్ధులు హర్షం వ్యక్తం చేశారు. తెల్లదేవరపల్లి ఎంపీ యుపీ పాటశాల విద్యార్ధులు పూలతో భారతదేశాన్ని చిత్రకరించి జాతీయ పతాకను ప్రదర్శిస్తూ దేశభక్తి గీతాలు ఆలపించారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.