*గంపలగూడెం మండలంలోని అంగన్ వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాల పై గర్భినులకు, బాలింతలకు అవగాహనా సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ తిరువూరు ప్రాజెక్టు అధికారులు, ఆయా కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.
* నెమలిలో శాకంబరీ అలంకరణ
గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాల స్వామీ ఆలయంలో శ్రావణ మాసం సంధభంగా సోమవారం దేవతామూర్తులకు ఫలాలు, కూరగాయలుతో శోభాయమానంగా అలంకరించారు. వేణుగోపాల స్వామీ మూలవిరాట్ ను ద్రాక్ష, దానిమ్మ, నిమ్మ, అరటి నారింజ, కమల యాపిల్, ఎండు ఫలాలతో అలంకరించారు. ఆలయంలో రాజ్యలక్ష్మి , గోదాదేవి అమ్మవార్లకు వంగ, బెండ, బీర, కాకర, క్యాప్సికం, పొట్ల, సొర, దోస, పచ్చిమిర్చి, చిక్కుడు, దొండ, బంగాళాదుంప, క్యారెట్, బీట్ రూట్ క్యాబేజీ, కరివేపాకు సహా పలు ఆకు కూరగాయలతో అలంకరించారు.
*గంపలగూడెం వ్యవసాయాదికరిగా సాయిశ్రీ
గంపలగూడెం మండల వ్యవసాయదికరిగా బండ్రేడ్డి సాయిశ్రీ సోమవరం బాద్యతలు స్వీకరించారు. 2012-17 మధ్య ఆయన గంపలగూడెం ఏవోగా పనిచేసారు. ఇటీవల నిర్వహించిన బదిలీల్లో తిరిగి ఇక్కడ నియమితులయ్యారు. రెండేళ్లుగా డిప్యుటేషన్ పై ఇక్కడ ఎవోగా పని చేసిన హరీష్ కుమార్ విజయవాడ రూరల్ మండలానికి బదిలీ అయ్యారు. మండలంలోని రైతులకు మంచి సేవలు అందించేందుకు కృషి చేస్తానని సాయిశ్రీ తెలిపారు.
*నాలుగు గ్రామాల్లో భాజపా సభ్యత్వాలు ప్రారంభం
తిరువూరు మండలం చింతలపాడు రోలుపడి సూరవరం ముష్టికుంట్ల లో భాజపా సభ్యత్వ నమోదును ఆ పార్టీ మండల కమితే అద్యక్షుడు కే.రామారావు ప్రారంభించారు. సభ్యత్వం తీసుకునేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చిన మహిళలకు సభ్యత్వ నమోదు రసీదులను అందజేశారు.
*సర్వే, ఈకేవైసీలో నమోదు తప్పనిసరి
నూజివీడు డివిజన్ లో రేషన్ కార్డుల్లోని సభ్యులంతా తప్పనిసరిగా ప్రజాసాదికర సర్వేలో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని నూజివీడు ఉప కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సోమవారం జరీ చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ఇంకా నమోదు చేసుకోకపోతే సంబందిత గ్రామ రెవెన్యు అధికారి, మున్సిపల్ సర్వేయర్ల వద్దకు ఆధార కార్డు తీసుకెళ్ళి సర్వేలో నమోదు చేయిన్చోవచ్చు అన్నారు.
*నెమలి ఆలయంలో కానుకల లెక్కింపు
గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాల స్వామీ ఆలయంలో సోమవారం నిర్వహించిన వేలం ద్వారా స్వామివారికి రూ.3.72 లక్షల ఆదాయం లభించినట్లు సహాయ కమీషనర్ ఎన్.సంధ్య తెలిపారు. కొబ్బరి చెక్కల సేకరణకు రూ. 1.85 లక్షలు, వాహనాల పార్కింగ్ కు 99 వేలు, 6.85ఎకరాల భూమి సాగుకు రూ. 88వేల ఆదాయం లభించినట్లు చెప్పారు. మరో మూడు అంశాలకు సంబంధించి వేలం వేసినట్లు తెలిపారు.
*ఆరోగ్యం పరంగా అప్రమత్తంగా ఉండాలి
వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల నేపద్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలడానికి అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని చౌటపల్లి పీ హెచ్ సి వైద్యాధికారి గంగాధరకుమార్ సూచించారు. తిరువూరు మండలంలోని మల్లెలలో సోమవారం ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో ఉచిత వైద్యసిభిరం నిర్వహించారు. అనంతరం జరిగిన అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడుతూ దోమల బారిన పడకుండా తెరలు వినియోగించాలని అన్నారు.
*తిరువూరు, గంపలగూడెం లో తల్లిపాలవారోత్సవాలు
శిశువు పుట్టిన అరగంటలో తల్లి నుంచి ముర్రుపాలు తప్పనిసరిగా పట్టించాలని సీడీపీవో సత్యవతి సూచించారు. పాత తిరువూరు అంగన్వాడీ కేంద్రంలో సోమవారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాలి పట్టించడం వల్ల శిశువుకు వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉంటుందని తెలిపారు. గంపలగూడెం మండలంలో ఐసీడీఎస్ ఎస్కే. గౌసియాబేగం పర్యవేక్షణలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.
*మంచి సేవలతోనే ప్రజాభిమానం
ఉద్యోగులు ప్రజలకు మంచి సేవలందించడం ద్వారా వారి అభిమానాన్ని పొందవచ్చని వ్యవసాయశాఖ విస్సన్నపేట సహాయ సంచాలకులు కే.శశికళ అన్నారు. విస్సన్నపేట సబ్ డివిజన్ పరిధిలో బదిలీలు జరిగిన విస్సన్నపేట, చాట్రాయి, రెడ్డిగూడెం మండలాల వ్యవసాయాధికారులు సోమవరం ఆమె సన్మానించారు. అనంతరం బదిలేఎ అయిన ఏవోలు చాముండేశ్వరి, సంద్యారాణి, చంటిబాబు,ఎఈవో సురేష్ లను సిబ్బందితో కలిసి సత్కరించారు.
*వేతనాలు విడుదల కోరుతూ దర్న
సర్కారు బడులలో పని చేస్తున పారిశుధ్య కార్మికులకు రెండేళ్లుగా ఉన్న వేతన బకాయీలు వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ భద్రతా కల్పించాలని కోరుతూ సోమవారం సీపీఐ నాయకుల ఆద్వర్యంలో స్థానిక రెవెన్యు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నాలుగేళ్ళుగా పని చేస్తున్న తమను తొలగించి కొత్తవారిని నియమించుకోవాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
*సమస్యలు పరిష్కరించాలని స్పందనలో వినతులు
తిరువూరు, గంపలగూడెం మండలాల్లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు వినతులు అందజేశారు. తిర్వురులో పట్టాదారుపాసు పుస్తకాలకు 19, అడంగల్ లో సవరణకు 24, రేషన్ కార్డులకు 31, ఇళ్ళ స్థలాల 14, ఆక్రమనలు తొలగించాలని 2చొప్పున తహసిల్దారు నరసింహారావుకు ఆర్జీలను అందజేశారు. గంపలగూడెంలో 29 అర్జీలు అందాయి,. వర్షం కురుస్తుండటంతో గమల్లో ప్రజలకు సీజనల్ వ్యాధులు[పై అప్రమత్తంగా ఉండేందుకు వైద్యులతో అవగాహనా సదస్సులు నిర్వహించాలని ప్రజాసంఘాలకు చెందిన కే. మోజెస్, జీ,ఆడం, ఎం,దానియేలు కే,బాబూరావు వినతిపత్రం అందజేశారు.
*వాలంటీర్లకు శిక్షణా తరగతులు
తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు, గంపలగూడెం, విస్సన్నపేట, ఎ.కొండూరు మండలాల్లో వాలంటీర్ల ఎంపికైన యువత గ్రామీణ ప్రాంత ప్రజలకు సమర్ధమైన సేవలు అందించాలని విస్సపేట ఎంపీడీవో వెంకటరమణ సూచించారు. గ్రామ సచివాలయ వ్యవస్థలో భాగంగా నియమితులైన గ్రామ వాలంటీర్లకు పారదర్శకంగా పని చేస్తూ ప్రభుత్వ సమున్నత ఆశయాన్ని నెరవేర్చాలని నూజివీడు డివిజన్ పంచాయతీ అధికారి బాలయోగి సూచించారు. తిరువూరు మండల పరిషత్ , వెలుగు కార్యాలయాల్లో రెండు రోజులు జరిగే గ్రామ వాలంటీర్ల శిక్షణ తరగతులను సోమవరం ఆయన ప్రారంభించారు. గంపలగుడెంలో గ్రామ వాలంటీర్లు ప్రజలకు అధికారులకు మధ్య వారదులుగా సేవలు అందించాలని మండల పరిషత్ ప్రత్యేకాధికారి డాక్టర్. ఎస్. ప్రసదలింగం సూచించారు. ఎ.కొండురులో ప్రభుత్వ పధకాలను ప్రజల చెంతకు చేర్చడానికి వాలంటీర్లు శక్తి వంచన లేకుండా పని చేయాలని ఎంపీడీవో గౌసియా బేగం అన్నారు.
*సమస్యలు పరిష్కరించాలని ఏమ్మీవోకు వినతి
గంపలగూడెం మండలంలోని ఉపాద్యాయులు సమస్యలు పరిశాకరించాలని కోరుతూ యుటీఎఫ్ నాయకులూ సోమవారం ఏమ్మీవో సోమశేఖర్ నాయక్ కు వినతిపత్ర అందజేశారు. 2014 డీఎస్సిలో నియమితులైన ఉపాద్యాయుల క్రమబద్దీకరణ ఇంక్రిమెంట్లు సేవాపుస్తకం అప్ డేట్ చేయాలన్నారు. పాటశాలలు ప్రారంభించి రెండు నెలలు కావస్తున్నా ఇంకా ప్రాధమిక ఉన్నత పాటశాలల్లో విద్యార్ధులకు కొన్ని పుస్తకాలూ అందుబాటులో లేవని చెప్పారు.
*కేడీ సీసీలో మెరుగైన సేవలు అందించాలి
సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడానికి త్రిసభ్య కమిటీ సభ్యులు కృషి చేయాలనీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి అన్నారు. నడీం తిరువూరు సహకార సంఘం చైర్ పర్సన్ గా నియమితులైన తంగిరాల వెంకట రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం సోమవరం నిర్వహించారు. రైతులకు సమర్ధమైన సేవలు అందించడం ద్వారా వారికి చేరువ అవుతామని విసన్నపేట సహకార సంఘం కమిటీ అద్యకశునిగా బాద్యతలు స్వీకరించిన నెక్కలపు శ్రీనివాసరావు అన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను రైతులు సకాలంలో చెల్లించి రుణ పరపతి పెంచుకోవాలని కేడీసీసీ బ్యాంక్ గంపలగూడెం శాఖ మేనేజర్ చంద్రశేఖర్ ఆజాద్ సూచించారు.
*భాజపా ఆద్వర్యంలో సంబరాలు
జమ్మూ కష్మీర్ కు సంబందించిన 370 ఆర్టికల్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని స్వాగతిస్తూ భాజపా ఆద్వర్యంలో సోమవారం తిరువూరులో సంబరాలు జరుపుకున్నారు. స్థానిక చీరాల సెంటరులో బాణ సంచా కాల్చి, మిటాయిలు పంచారు. కార్యక్రమంలో నాయకులూ దారా మాధవరావు డీ. వెంకటేశ్వరరావు, కోనేరు వెంకట కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.
*మన్సూర్ అలీకి ఘన నివాళులు
ప్రముఖ రంగస్థల నటుడు మన్సూర్ అలీ వర్ధంతిని స్థానిక ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మన్సూర్ అలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రంగస్థల కళాకారుడిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు.
*పోలీసుల అడుపులో ఆరోగ్య కార్యకర్తలు
ఆరోగ్య కార్యకర్తల డిమాండ్ల పరిష్కారం కోసం విజయవాడ తరలివేల్తున్న పలువురు ఆరోగ్య కార్యకర్తలు సీపీఎం నేతలను సోమవారం విస్సన్నపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి వీ.నాగరాజు మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తల జీవనోపాధి దెబ్బతినేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.