*తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి సోమవారం తిరువూరులో పర్యటించారు. వైకాపా పట్టణ అద్యక్షుడు సి హెచ్. సత్యనారాయణ తెలిపారు. స్థానిక నడీం తిరువూరు సహకార సంఘంలో ఉదయం 10.30గంటలకు త్రిమెన్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సహానికి హాజరయ్యారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు పురపాలక సంఘం కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
*నెమలిలో శాకంబరీ అలంకరణ
గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాల స్వామీ ఆలయంలో శ్రావణ మాసం సంధభంగా సోమవారం నిర్వహించనున్న శాకంబరీ అలంకరణకు చురుగ్గా ఏర్పాట్లు చేశారు. స్వామివారి మూలవిరాట్ ను ఎండు, పచ్చి ఫలాలతో రాజ్యలక్ష్మి, గోదాదేవి అమ్మవార్లను కూరగాయలతో అలంకరించారు. ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఇందుకు అవసరమైన పండ్లు, కూరగాయలును భక్తులు విరాళంగా అందించారు. ఆదివారం సాయంత్రం నుంచే భక్తులు ఈ కార్యకమాన్ని ఆలయ కమిటీ అద్యక్షుడు ఎం.రామాంజనేయులు, ప్రధానార్చకులు గోపాలాచార్యులు పర్యవేక్షించారు.
*ప్రజా సహకారంతోనే పారదర్శకంగా ఇసుక రవాణా
అవసరాల నిమిత్తం నియోజకవర్గం పరిధిలోని వాగుల నుంచి ఇసుక తరలింపునకు అనుమతి ఇచ్చిన నేపద్యంలో రవాణా ప్రక్రీయ పారదర్శకంగా జరిగేందుకు ప్రజలు సహాకరించాలని సిఐ ప్రసన్నవీరయ్యగౌడ్ కోరారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఇసుక కొరత వల్ల సామాన్య మధ్య తరగతి ప్రజలు ఇళ్ళ నిర్మాణానికి పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఇసుక తరలింపునకు అనుమతి ఉందని తెలిపారు. ఎవరైనా కూపన్లను దుర్వినియోగం చేస్తూ ఇసుక అక్రమ రవాణా చేస్తే కటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొరుగున ఉన్న తెలంగాణకు ఇసుక తరలిస్తుంటే సమీపంలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని సూచించారు. గుట్కా విక్రయాలు, మద్యం గొలుసు దుకాణాలను పూర్తీ స్థాయిలో కట్టడి చేయడానికి ఆకస్మిక తనిఖీలు నిరంతరాయంగా నిర్వహించాలని ఎస్సైలను ఆదేశించినట్లు తెలిపారు.
*ఇరవై మద్యం సీసాల స్వాధీనం
ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా బెల్టు దుకాణాల్లో, ఇంటివద్ద మద్యం అమ్మడం, నేరమని ఇలా మద్యం సీసాలతో దొరికితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎ.కొండూరు మండలం అడ్డరోడ్డులో ఆదివారం పోలీస్ శాఖ ఆద్వర్యంలో పలు బెల్టు దుకాణాలుపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎం.పాండు నుంచి ఇరవై మద్యం సీసాలు స్వాదీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
*భాజపాతోనే సుస్థిర పాలన
తిరువూరు నాల్గవ వార్డులో భాజపా సభ్యత్వ నమోదును పార్టీ జిల్లా నాయకుడు దారా మాధవరావు ఆదివారం ప్రారంభించారు. పార్టీ పట్టణ నాయకులతో కలిసి ఆయన వార్డులో పర్యటిస్తూ స్వచ్చందంగా ముందుకు వచ్చిన వారికి చరవాణీ ద్వారా ఆన్ లిం పద్దతిలో సభ్యత్వాలు అందజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని భాజపా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షెమ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి అవగాహనా కల్పించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. అదే విధంగా గంపలగూడెం మండలం కనుమూరులో భాజపా సభ్యత్వాల నమోదు ఆదివారం ప్రారంభించినట్లు ఆపార్టీ మండల అద్యక్షుడు అన్నవరపు క్రాంతి కుమార్ తెలిపారు. గ్రామంలో 135 మంది పార్టీ సభ్యత్వం స్వీకరించారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులూ తాటికొండ కృష్ణ, దారా పద్మనాభం, ఎ.సూర్యప్రకాష్ పాల్గొన్నారు.
*ఘనంగా స్నేహితుల దినోత్సవం
వాసవీ క్లబ్, ఆర్యవైశ్య కిట్టీ విభాగం ఆద్వర్యంలో స్నేహితుల దినోత్సవన్ని ఆదివారం వేర్వేరుగా నిర్వహించారు. సంఘాలలో సభ్యులుగా ఉన్న వారి ఇళ్ళకు వెళ్లి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ లు కట్టి, శుభాకాంక్షలు తెలిపారు. మరికొందరు సామాజిక మాధ్యమాల ద్వారా తమ స్నేహితులకు శుభాకంకాలు తెలియజేస్తూ ఆనందోత్సాహాలను పంచుకున్నారు. అదే విధంగా గంపలగూడెం మండలం గోసవీడులో ఆదివారం వాసవీ క్లబ్ ప్రతినిధుల ఆద్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించారు. క్లబ్ గ్రమశాఖ అద్యక్షులు వీ. వెంకటేశ్వరావు ఆద్వర్యంలో సభ్యులకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్లు కట్టి, మిటాయిలు పంచారు. క్లబ్ మాజీ అద్యక్షులు కే.రామకృష్ణ, ఎన్.సూరిబాబును సభ్యులంతా సాలువాలతో సత్కరించారు.
*నేటి నుంచి వాలంటీర్లకు శిక్షణా తరగతులు
ఎ.కొండూరు మండలంలోని ఆయా పంచాయతీల్లో వాలంటీర్లుగా పని చేయడానికి 315మందిని ఎంపిక చేసినట్లు ఎంపీడీవో గౌసియా బేగం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారికి ఈ నెల ఐదువ తేదీ నుంచి ఎనిమిది వరకు శిక్షణ ఉంటుందని చెప్పారు. 5,6 తేదీల్లో కోడూరు, మారేపల్లి, కంభంపాడు, గోపాలపురం, వల్లంపట్ల, జీల్లకుంట, పోలిశెట్టిపాడు, గొల్లమందల, తండా, రేపూడి గ్రామాలకు చెందిన వాలంటీర్లకు, 7,8 తెదేల్లో మాధవరం, కుమ్మరికుంట్ల, రేపూడి తండా, ఎ.కొండూరు, ఎ.కొండూరు తండా, చీమలపాడు, కృష్ణారావుపాలెం, చీమలపాడు, పెద్దతండా, కేశ్యా తండా, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన వారికి శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.
*సంక్షెమాన్ని గడప వద్దకు చేర్చండి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షెమ పధకాలను ప్రతి గడపకూ చేర్చాల్సిన బాద్యత గ్రామ వాలంటీర్ల దేనని విస్సన్నపేట మాజీ ఎంపీపీ భూక్యా రాణి అన్నారు. చండ్రుపట్లలో నూతనంగా ఎంపికైన గ్రామ వాలంటీర్లకు ఆదివారం ఆమె నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా వాలంటీర్లకు కేటాయించిన ప్రాంతంలోని ప్రతి కుటుంబానికి సేవలందించడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు. ఎ.కొండూరు మండలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షెమ పధకాలను ప్రజలకు అందించడమే వాలంటీర్ల లక్ష్యమని మాజీ సర్పంచి కోట పుల్లారావు అన్నారు. మండలంలోని కంభంపాడు పంచాయతీ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లగా ఎంపికైన పలువురికి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
*త్రిసభ్య కమిటీ సభ్యుల బాద్యతల స్వీకరణ
తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం మండలాల్లోని సహకార సంఘాలకు ఆదివారం బాద్యతలను స్వీకరించారు.
* పెదకొమిర ఆదర్శ పాఠశాల సందర్శన
గంపలగూడెంమండలంలోని పెదకొమిర ఆదర్శ పాఠశాలను ఆదర్శ పాఠశాలల జిల్లా సహాయ సంచాలకులు వెంకట అవధాని, పర్యవేక్షణాధికారి లక్ష్మీనారాయణ, ఐటీ విభాగం ప్రతినిధులు సుభాని, రామకృష్ణ సందర్శించారు. ఏడీ వెంకట అవధాని పాఠశాల నిర్వహణను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. ఏటీఎల్, ఇంగ్లీషు ప్రయోగశాలలు సందర్శించి అక్కడ విద్యార్థులకు అందుతున్న విజ్ఞానదాయకమైన అంశాలపై ఆరా తీశారు. పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకమైన బాల్ డ్యాన్స్‌ను తిలకించి అభినందించారు. ప్రిన్సిపల్ కె.రత్నమేరీప్రతిష్ఠ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
* సైన్సు ఫలాలు ప్రజలకు అందినప్పుడే సమాజంలో మార్పు
సైన్సు ఫలాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినప్పుడే సమాజంలో మార్పు రావడానికి అవకాశం ఉందని జనవిజ్ఞాన వేదిక ప్రజారోగ్య విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ సురేశ్ తెలిపారు. స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన పట్టణ మహాసభ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైన మన దేశంలోనే చంద్రగ్రహణం సందర్భంగా నరబలులు ఇచ్చే మూఢనమ్మకాలు కొనసాగడం దురదృష్టకరం అన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రశ్నించే తత్వం అలవర్చాలని, విద్య, ఆరోగ్యం, పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలని తెలిపారు.
*తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు, ఎ.కొండూరు, విస్సన్నపేట, గంపలగూడెం మండలాల్లోని రెవెన్యు కార్యాలయాల్లో స్పందనలో భాగంగా ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరిస్తారు.
*తిరువూరులో భవిత కార్యాలయంలో అంగవైకల్యం కలిగిన చిన్నారులకు ఫిజియోథెరపి ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు.
*గంపలగూడెం మండలం నెమలిఆలయంలో స్వామివారికి చెందిన భోములను పంటల సాగుకు ఇచ్చేందుకు, కొబ్బరి చెక్కల సేకరణ, వాహనాల పార్కింగ్, పొంగాలికి గ్యాస్ సరఫరా, దుకాణ సముదాయంలో భోజనశాలను కాల పరిమితితో ఇచ్చేందుకు వేలం నిర్వహించారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.