తిరువూరు మున్సిపల్ కార్మికులు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధికి మర్యాద పూర్వకంగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తమను గుర్తించి గౌరవ వేతనం 18వేలకు పెంచడం సంతోషం కలిగించిందని మున్సిపల్ కార్మికులు ఎమ్మెల్యేతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారితో మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులుగా ప్రజలకు అత్యంత విలువైన సేవలు చేస్తున్నందుకు తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందజేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాల్ని పెంచడం జరిగిందని తెలిపారు.. అదేవిధంగా కార్మికులు సైతం ప్రజలకు మరింత సేవాలందించాలని సూచించారు. వర్షాలు పడుతున్నందున ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని వారికి సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో కార్మికులపై ఎలాంటి ఒత్తిడి ఉండదని ప్రశాంతమైన వాతావరణంలో తమ విధులు నిర్వర్తించుకోవాలని కార్మికులకు తెలియజేశారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.