నియోజకవర్గ ప్రజలకు స్థానికంగా వాగుల్లో అందుబాటులో ఉన్న ఇసుకను తొలుకునేందుకు అవకాశం కల్పిస్తూ వాటి విధివిధానాలపై రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులకు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి పలు సూచనలు చేశారు.స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం అధికారులతో సమీక్ష జరిపారు.ఏ-కొండూరు,గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తెస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.. ఇటీవల ఎమ్మెల్యే రక్షణనిధి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ను పలుమార్లు కలిసి ఇసుక కొరత వలన కార్మికులు, భవన నిర్మాణ యజమానులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. వెంటనే ఇసుక కొరతను తీర్చేలా సంబంధిత అధికారులకు ఆదేశించాలని నిన్న (బుధవారం) సైతం పేర్కొనడం జరిగింది..ఈ విషయమై నిజమైన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీని ప్రకటించేవరకు తాత్కాలికంగా ఇసుక రవాణాకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని తగు ఆదేశాలను చేశారు.కూపన్ల ద్వారా అవసరమైన వారికి ఇసుక అనుమతులు ఇస్తామని తహశీల్దార్ తెలిపారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.