గత నాలుగైదు రోజుల నుండి తిరువూరు పరిసర ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షాలు కురుస్తూ ఉండటంతో మెట్ట పంటలకు జీవం పోషినట్లు అయింది. బావులు, బోర్లు కింద వరినాట్లు వేయడానికి రైతులు నడుం బిగించారు. ఇప్పుడిప్పుడే వాగులు, చేరువుల్ల్లోకి నీరు రావడం ప్రారంభం అయింది.
1.ఖాళీ స్థలాల పరిశీలన
పేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి ముందుకు వచ్చిందని తహసిల్దారు బీ.బాలకృష్ణరెడ్డి తెలిపారు. ఎ.కొండూరు మండలంలోని రామచంద్రాపురం, చీమలపాడు, కృష్ణారావుపాలెం పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ, పోరంబోకు స్థలాలను మంగళవారం ఆయన పలువురు అధికారులు, ఆయా గ్రామస్టులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కారు ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లో ప్రభుత్వ ఖాళీ స్థలాలను పరిశీలించి అక్కడి స్థితిగతుల పై పూర్తీ నివేదికను ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. మండలంలోని మిగతా గ్రామలో సైతం ఖాళీ స్థలాలను పరిశీలించి, నివేదికలు పంపుతామన్నారు. కార్యక్రమంలో ఆరై స్రవంతి గ్రామస్తులు జీ.శివారెడ్డి, ఎం.సీతయ్య తదితరలు పాల్గొన్నారు.
2.ఫసల్ బీమా సద్వినియోగం చేసుకోండి.
ప్రధాన మంత్రి ఫసల్ బీమా పధకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏఈవో రామచంద్రరావు సూచించారు. స్థానిక వ్యవసాయ కార్యాలయంలో మంగళవారం ఆత్మ ఆద్వర్యంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా పధకం పై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన ప్రచార ఆటోను ఆయన ప్రారంబించారు. అనంతరం మాట్లాడుతూ పంటల బీమా పధకంలో భాగంగా రైతులు నామమాత్రంగా కేవలం ఒక్క ప్రభుత్వమే చెల్లిస్తుదన్నారు. రైతులు మీసేవా కేంద్రాల ద్వారా తన పేరు, సాగుచేసిన పంట, విస్తీర్ణంతో పాటు భూమి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
3.అపార్టుమెంట్ నిర్మాణ పనులతో అవస్థలు
తిరువూరు శాంతి నగర్లో కనకదుర్గమ్మ ఆలయం ఎదుట చేపట్టిన అపార్టు మెంటు నిర్మాణ పనుల వాళ్ళ పొరుగున ఉంటున్న తాము ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. మాజీ కౌన్సిలర్ ప్రకాష్ రెడ్డితో కలిసి మంగళవారం స్థానిక కార్యాలయంలో ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ భావన నిర్మాణ పనులను చేపట్టే సమయంలో నిబంధనల ప్రకారం చుట్టూ పరదాలు కట్టాల్సి ఉండగా, అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
4.పారిశుధ్య చర్యలు మెరుగుపరచాలని వినతి
తమ కాలనీలో పారిశుధ్య చర్యలు మెరుగు పరచేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక రాజుపేట వాసులు కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు స్థానిక కర్యలయంలో మంగళవారం ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. కాలువలు, డ్రెయిన్ లు పూడిక తీయకపోవడం వల్ల మురుగునీటు నిలిచి దుర్వాసన వస్తోందని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే కాలనీలలో పలువురు సీజనల్ వ్యాదులతో బాధపడుతున్నారని దోమల బెడద పెరిగిన నేపద్యంలో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
5.స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా పోటీ
అధిస్థానం ఆదేశాల మేరకు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్ధులు అన్ని స్థానాల్లో పోటీ చేస్తారని భాజపా నియోజకవర్గ ఇంచార్జి పోలే శాంతి తెలిపారు. తిరువూరు మండలం రోలుపడి శివారు రాజీవ్ నగర్ కు చెందిన ఇతర పార్టీల మహిళా కార్యకర్తలు భాజపాలో చేరారు. స్థానిక నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం ఆమె వారికీ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.
6.గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
విస్సన్నపేటలో గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్ ను మంగళవారం రెవెన్యు అధికారులు పటుకున్నారు. అధికారుల కధనం ప్రకారం విస్సన్నపేట తహసిల్దారు బీ. మురలీకిష్ణ సిబ్బందితో కలిసి నివేశన స్థలాల పంపిణీకి అనువైన స్థలం ఎంపిక చేసేందుకు కృష్ణమ్మా గుట్ట వద్దకు వెళ్లారు. అదే సమయంలో గుట్టపై ఉన్న గ్రావెల్ ను తరలించేందుకు ప్రయత్నిస్తున్న ట్రాక్టర్ ను రెవెన్యు కార్యాలయానికి తరలించారు.
7.ప్రభుత్వం ఆర్ధిక చేయూతను అందించాలి
వెల్డింగ్ డిజైన్ వరకు చేసుకుని జీవిస్తున్న కార్మికులకు ప్రభుత్వం రుణాల రూపంలో ఆర్ధిక తోడ్పాటు అందించి ఆదుకోవాలని చంద్రోదయ వెల్డింగ్ అండ్ డిజైన్ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. స్థానిక శ్రీఅయ్యప్ప స్వామీ సహిత పంచముఖ హనుమత్ క్షెత్రంలో మంగలవరం అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజువారి పని చేస్తేనే జీవనం గడిచే పరిస్థితుల్లో కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్న్రని తెలిపారు. కొన్ని సందర్భాల్ల్లో పనులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
8.కారు డీకొని వ్యక్తికీ తీవ్ర గాయాలు
కారు డీకొన్న సంఘటనలో ద్వీచక్ర వాహన్ చోదకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన తిరువూరు మండలం లక్ష్మీపురంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎ.కొండూరు మండలం మరేపల్లికి చెందిన వేములపల్లి దుర్గారావు వ్యక్తిగత పని నిమిత్త తిరువూరులో ఉంటున్న కుమారుడి వద్దకు వచ్చారు. పని పూర్తైన తరువాత ద్వీచక్ర వాహనం పై స్వగ్రామానికి వెళ్తుండగా తిరువూరు నుండి నూజివీడు వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి డీకొంది. ఈ ప్రమాదంలో దుర్గారావు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు చికిత్స నిమిత్తం స్థానికంగా ఓ ప్రేవేట్ వైద్యశాలకు తరలించారు.
9.భాజపా ఆద్వర్యంలో స్వచ్చ భారత్
తిరువూరు మండలం చింతలపాడులో భాజపా మండల కమిటీ ఆద్వర్యంలో మంగళవారం స్వచ్చ భారత్ చేపట్టారు. పార్టీ మండల అద్యక్షుడు కొంగర రామరావు, పర్యవేక్షణలో నాయకులూ, స్థానికులు శ్రమదానం చేసారు. రహదారికి ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలు, తుప్పలు నరికి శుబ్రం చేశారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో స్వచ్చ భారత్ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
10.రైతులకు ముడిజింక్ పంపిణీ ‘
ప్రభుత్వం పూర్తీ రాయితీపై సరఫరా చేసిన ముడి జింక్ పంపిణీని స్థానిక వ్యవసాయ సఖ కార్యాలయంలో మంగళవారం ఏవో రాజ్యలక్ష్మి ప్రారంభించారు. కొకిలంపాడు, నడీం తిరువూరు, మల్లెల, లక్ష్మీపురం, రామన్నపాలెం, కాకర్ల, ఆంజనేయపురం గ్రామాలకు చెందిన 174మంది రైతులకు 345 సంచుల ముడిజింక్ ను అందజేశారు. భూసార పరీక్షల ఆధారంగా రైతులు ఎరువుల యాజమాన్యం చేపడితే పెట్టుబడి భారం తగ్గుతుందని సూచించారు. రసాయన ఎరువులను బదులు సేంద్రీయ ఎరువుల వాడకం వాళ్ళ ననయమైనా దిగుబడులు సాధించాదానికి వీలుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఈవో మురళీకృష్ణ ఎంపీఈవోలు పాల్గొన్నారు.
11.విద్యార్ధులకు వైద్య పరీక్షలు
తిరువూరు మండలం ఆంజనేయపురం మండల పరిషత్ ప్రాధమిక పాటశాలలో రాష్ట్రీయ బాల సురక్ష కార్యక్రమంలో భాగంగా మంగళవారం సంచార వైద్యశాల ఆద్వర్యంలో ప్రత్యెక వైద్య శిభిరం నిర్వహించారు.డా.ఎ.పుష్పకుమారి విద్యార్ధులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. ప్రధానంగా 0-18 ఏళ్ళలోపు పిల్లల్లో జెనిటిక్ లోపాలను గుర్తించి, డీఈఐసీ ద్వారా నివారించడానికి విజయవాడ ఆసుపత్రికి సిఫార్సు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
12.సమస్యల పరిష్కరం కోరుతూ ధర్నా
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్ఎంయూ ఆద్వర్యంలో కార్మికులు మంగళవారం ఆందోళన చేపట్టారు. స్థానిక బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. డీపోలో ఎన్.ఎం యూ కార్మికుల పట్ల అధికారులు వివక్ష చూపించడం విడనాడాలని డిమాండ్ చేశారు. పదోన్నతి పొందిన వారికి తగిన శిక్షణ ఇప్పించి పారదర్శకతంగా బాద్యతలు కేటాయించాలని కోరారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.