* అమరావతి- రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పాశ్రీవాణి కలిసిన ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి. విస్సన్నపేట మండలం కొండపర్వలో ఉన్న గిరిజన సంక్షేమ పాఠశాలను నిర్మించి గత పదేళ్లకు పైగా అయ్యిందని కానీ నేటికీ సరైన రహదారి వసతులు లేని కారణంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని మంత్రికి వివరించారు.అదేవిధంగా పాఠశాల కొండగట్టు ప్రాంతంలో ఉండటంతో విద్యుత్ సదుపాయం లేని కారణంగా విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు..వెంటనే నిధులు మంజూరు చేసి రహదారి నిర్మాణం, విద్యుత్ లైన్ ఏర్పాటుకై తగు చర్యలు తీసుకోవాలని మంత్రికి వినతిపత్రం ద్వారా తెలియజేశారు.. సమస్యలపై సంబంధిత మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే రక్షణనిధి తెలిపారు..
1.స్పందనలో వినతుల వెల్లువ
తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం మండలాల్లో సోమవారం స్థానికా రెవెన్యు కార్యాలయాల్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి స్పందన లభించింది. విస్సన్నపేటలోని పద్మశాలీయుల వీధిలో సిమెంటు ఆధారిత పరికరాల తయారీ పై ఆధారపడి జీవించే పలు కుటుంబాలు ప్రజలు తమకు దారి చూపాలని సోమవారం అధికారులను వేడుకున్నారు. విస్సన్నపేట గిరిజన సంక్షెమ శాఖ గురుకుల పాటశాల కు స్థలం కేటాయించాలని కోరుతూ గిరిజన సంఘాల నేతలు మాజీ సర్పంచి పల్లిపాం లక్ష్మయ్యతో కలిసి సోమవారం రెవెన్యు అధికారులకు వినతి పత్రం అందజేశారు. గంపలగూడెం ఎన్టీఆర్ కాలనీ ప్రాధమిక పాటశాల ఆవరణలో ఆక్రమణలకు గురైందని నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారని పసువులను కట్టేస్తున్నారని బీ. అపప్రవు అధికారులకు ఫిర్యాదు చేశారు.
2.కమిషనర్ పై మాజీ కౌన్సిలర్ పిర్యాదు
తిరువూరు పురపాలక సంఘం కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి [పలు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ తొమ్మిదవ వార్డు మాజీ కౌన్సిలర్ చిట్టిపోతుల లక్ష్మినారాయణ స్థానిక కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో తహసిల్దారు నరసింహారావుకు పిర్యాదు చేశారు.
3.స్వచ్చందంగా పార్టీలో చేరిక
ప్రధాని నరెంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలకు ఆకర్షితులు అవుతున్న ప్రజలు భాజపాలో చేరేందుకు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారని ఆపార్టీ నియోజకవర్గ ఇంచార్జి పోలే శాంతి తెలిపారు. మండలమంలోని ఎరుకోపాడుకు చెందిన ఇతర పార్టీల మహిళా కార్యకర్తలు సోమవారం భాజపాలో చేరారు. స్థానిక నియోజకవర్గ కార్యాలయంలో వారికి కండువాలు కప్పి ఆమె ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కమిటీ అద్యక్షుడు వేమ్పాటి అబ్రహం, నల్లగట్ల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
4.ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలి
ఎరువులు, పురుగు మందులు విక్రయించే అధీకృత డీలర్లు ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అనధికారికంగా ఎవరైనా రైతులకు ఎరువులు విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంపలగూడెం కాపు కళ్యాణ మండపంలో ఆదివారం రాత్రి మండలంలోని ఎరువుల పురుగు మందుల విక్రయించే దుకాణాల యజమానులకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దుకర్నలకు వచ్చే అన్నదాతలకు కచ్చితంగా యంత్రంలో వేలుముద్ర నమోదు చేసుకున్నాకే ఎరువులు విక్రయిన్చాలన్నారు.
5.పేకాట శిబిరం పై దాడి
ఎ.కొండూరు మండలంలోని రామచంద్రాపురంలో పేకాట ఆడుతున్న వారిపై దాడి చేసి పోలీసులు పద్నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎసై డీ. ప్రవీణ్ కుమార్ రెడ్డి సమాచారం ప్రకారం ఈ దాడిలో వారి నుంచి రూ. 9180 నగదును స్వాధీనం సెహ్సుకున్నామని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశామని చెప్పారు.
6.రాయితీపై ముడి జింకు సరఫరా
భూసార పరీక్షల పత్రాల ఆధారమగా నూరు శతం రాయితెపై రైతులుకు ముడి జింకు సరఫరా చేస్తున్నట్లు ఏవో రాజ్యలక్ష్మి తెలిపారు. మంగళవారం కొకిలంపాడు, నడీం తిరువూరు, మల్లెల, లక్ష్మీపురం, రామన్నపాలెం, కాకర్ల, ఆంజనేయపురం, 31న రాజుపేట, అక్కపాలెం, మునుకుల్ల, వామకుంట్ల, ఎర్రమాడు, పెద్దవరం, వావిలాల, పాత తిరువూరు, గానుగపాడు రైతుఅకు ఉదయం పది గంటల నుంచి సరఫరా చేస్తామని చెప్పారు. రైతులు ఆధార కార్డు పట్టాదారు పాసుపుస్తకం భూసార పరీక్షల పత్రాల నాకాళ్ళను తీసుకుని రావాలని సూచించారు.
7.30 నుంచి దూరవిద్య ప్రాక్టికల్స్ పరీక్షలు
డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ దూర విద్య ద్వారా డిగ్రీ ప్రధమ సంవత్సరం చదువుతున్న విద్యార్ధులకు ఈనెల 30 నుంచి ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగుతాయని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఉమారాని తెలిపారు. విజయవాడ ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముప్పై నుంచి ఆగస్టు పది వరకు జరుగుతాయని అదనపు సమాచారారం కోసం కళాశాలలోని దూర విద్య కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.
8.ఇద్దరు గుట్కా విక్రేతల అరెస్టు
తిరువూరు కూరగాయల మార్కెట్ సమీపంలోని దుకాణాల్లో నిషేధిత గుట్కా విక్రయిస్తున్నరనే సమాచారం మేరకు సెక్టారు 1 ఎస్సై మణికుమార్ సోమవారం దాడులు చేశారు. బేకరీ వద్ద గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న పట్టణానికి చెందిన లోకేష్, ఖమ్మం జిల్లా కొండగట్టు కు చెందిన వీరభాద్రాచారి అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 10,750 విలువైన గుత్కాలను స్వాదీనం చేసుకున్నారు.
9.ఫసల్ బీమా యోజన పై ప్రచార యాత్ర
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పై వ్యవసాయ శాఖ, ఆత్మ అధికారులు సోమవారం నుంచి మండలంలో ప్రచార యాత్ర చేపట్టారని ఈపధకం పై రైతులకు అవగాహనా కల్పించనున్నట్లు వ్యవసాయ శాఖ సహాయ సంచచారకురాలు కే.శశికళ తెలిపారు. వరిసాగు చేసే రాతిఉలు ఆగస్టు 21వ తేదీలోగా, పెసర, కంది, మిర్చి, పత్తి, జొన్న , మొక్కజొన్న, చెరుకు సాగు చేసే రైతులు ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పాస్ పుస్తకం, ఆర్వోఆర్ (1బీ)అదార్, బ్యాంకు ఖాతా పుస్తకాలతో సమీపంలోని మీసేవ కేంద్రాలలో అర్జీ చేసుకోవాలని చెప్పారు.
10.దేవుని ప్రేమను ప్రజలకు చాటాలి
గంపలగూడెం మండలం ఊటుకూరులో సోమవరం మండల ఐక్య పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అద్యక్షత వచించిన ఎజాషువా మాట్లాడుతూ పాస్టర్లు, సహనం, ఓర్పుతో దేవుని ప్రేమను అందరికీ చాటాలన్నారు.
11. తాళాలు వేసిన ఇంట్లో చోరీ
తిరువూరు అశోక్ నగర్ లో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వయారాల మేరకు.. బంగారు, వెండి నగలు తాయారు చేసే కూరెళ్ళ సత్యనారాయణ చారి మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా శ్రీశైలం వెళ్లారు. ఆదివారం రాత్రి ఇంటికి వచ్చి చూడగా తలుపునకు వేసి ఉన్న తాళాలు పగులకొట్టు ఉండటాన్ని గమనించారు. లోపలి వెల్ల చూడగా బీరువాలో వస్తువులు చిందరవందరగా పడేసి ఉండటంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకున్నారు. బీరువాలోని భద్రపరిచిన 110 గ్రాముల బంగారం, 1160 గ్రాముల వెండి ఆభరణాలు , రూ. 10వేల నగదు అపహరించుకుపోవడం తో సోమవారం పోలీసులను ఆశ్రయించారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.