*స్పందనలో వినతులు స్వీకరణ
తిరువూరు, ఎ.కొండూరు., గంపలగూడెం, విస్సన్నపేట మండలాల్లోని రెవెన్యు కార్యాలయాల్లో స్పందన కార్యక్రమమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎంపీడీవోలు.
*గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామివారికి సువర్ణాభరణాలతో అలంకరించారు.
*అవినీతి రహిత సేవలు అందించాలి – ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో వైకాపా ప్రభుత్వ ఆశయాలను అనుగుణంగా అవినీతి రహిత సేవలను ప్రజలకు అందించాలని ఎమ్మెల్యే రక్షణనిధి పోలీసు అధికారులకు సూచించారు. స్థానిక నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం ఆయన నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు, సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్ ఎస్సై మనికుమార్ లతో సమావేశమయ్యారు. నియోజకవర్గలో శాంతి బద్రతలు పరిరక్షణపై సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికల సనంతరం ఇప్పటి వరకు రాజకీయపమైన దాడులు తిరువూరు నియోజకవర్గంలో జరగలేదని ఎవరైనా ప్రోత్సహిస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు.
*వరినార్లు తుంచి నాటాలి
ప్రతీకూల వాతావరణ పరిస్థితుల నేపద్యంలో వరినాట్ల ప్రక్రీయ ఆలస్యమైనందున నారు చివర్లు తుంచిన తరువాతే నటలని ఏవో రాజ్యలక్ష్మి రైతులకు సూచించారు. మండలంలోని చింతలపాడులో ప్రారంభమైన వరినాట్ల ప్రక్రీయను ఆదివారం ఆమె పరిశీలించారు. వరినాట్ల పూర్తి చేసిన తరువాత్ ప్రతి రెండు మీటర్లకు ఇరవై సెంటి మీటర్లు వెడల్పుతో తూర్పు, పడమర దిశగా కాలిబాటలు తీయాలని సూచించారు.
*భాజపా బలోపేతానికి కృషి అవసరం
నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తూ గ్రామ స్థాయి నుంచి భాజపాకు బలోపేతం చేసేనుకు కృషి చేయాలనీ ఆపార్టీ రాష్ట్ర నాయకుడు కోనేరు వెంకటకృష్ణ సూచించారు. స్థానిక కస్తూరి పూర్ణచంద్ర కళ్యాణ మండపంలో ఆదివారం నియోజకవర్గ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. అనంతరం సభ్యత్వ నమోదు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గలో కనీసం పదివేల మందికి సభ్యత్వం కల్పించటం లక్ష్యంగా నమోదు కార్యక్రమాన్ని వినియోగించు కోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులూ పాల్గొన్నారు.
*వర్షపునీటిలో పుస్తక పటనం
విస్సన్నపేట గ్రంధాలయంలో పుస్తక ప్రీయులకు చేదు అనుభవం ఎదురవుతోంది. గ్రంధాలయ భవనం శిధిలావస్థకు చేరి, పైకప్పు పూర్తిగా దెబ్బతినతంతో ఈ పరిస్థితి తలెత్తింది. అధికారులు పుస్తకాలను నీటిలో తడవకుండా జాగ్రత్త చేసేందుకు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. భవర్డువనం పూర్తిగా దెబ్బతిని ప్రమాదకరంగా ఉన్న మూడు గదుల్లో రెండింటిని మూసి వేశారు.
*వర్డు సచివాలయ హద్దుల ముసాయిదా విడుదల
ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరువూరు పురపాలక సంఘం పరిదిలోకి ఇరవై వార్డుల పరిధిలో వార్డు సచివాలయ హద్దుల ముసాయిదాను కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఆదివారం విడుదల చేశారు. వర్డు సచివాలయ హద్దులను గుర్తించేందుకు ముసాయిదా మ్యాపాలను ప్రకటించారు. ప్రజలు పరిశీలించుకునేందుకు వీలుగా స్థానిక కార్యాలయం నోటీసు బోర్డులో వీటిని అందుబాటులో ఉంచారు. దీనిపై ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను ఆగస్టు మూడవ తేదీ వరకు స్వీకరిస్తారు.
*గ్రామాల్లో సామాజిక తనిఖీ సభలు పూర్తీ
గంపలగూడెం మండలలోని పన్నెండు గ్రామాల్లో ఆదివారం సామాజిక తనిఖీ గ్రామ సభలు నిర్వహించారు. వీటిలో సామాజిక తనిఖీ బృందం గుర్తించిన అంశాలను డీఆర్పీలు వెల్లడించారు. వెలుగు పధకం ద్వారా అనుముల్లంకలో పలువురు రైతుల భూముల్లో గుంటలు తీసి చింత మామిడి మొక్కలు నటినట్లు రూ. 27 వేలు వరకు తీసుకున్నారని గుర్తించారు. సదరు రైతుల భూముల్లో గుంత తీయలేదని మొక్కలు నతలేదని వెల్లడించారు. చింతలనర్వలోనూ రైతుల భూముల్లో గుంటలు తీయకుండా నిమ్మ మొక్కలు నాటకుండా నిధులు వుపసంహరించారని గుర్తించినట్లు వెల్లడించారు.
*భక్తీ శ్రద్దలతో సామూహిక సాయి వ్రతాలు
తిరువూరు షిర్డీ సాయి కళ్యాణ మండపంలో ఏకాదశి సందర్భంగా సామూహిక సాయి వ్రతాలు ఆదివారం భక్తీ సద్దాలతో నిర్వహించారు. పట్టణ నలుమూలల నుంచి తరలివచ్చిన మహిళలు విఘ్నేశ్వర పూజ అనంతరం సాయినామాన్ని స్మరిస్తూ వ్రతాలు చేశారు. ప్రధానార్చకుడు రంగాచార్యులు ఆద్వర్యంలో షిర్డీ సాయికి విశేష పూజల్లో భాగంగా అభిషేకాలు, అర్చనలు చేశారు.
*ముత్యాలమ్మకు పుష్పాలంకరన
ఆషాడ మాసం సందర్భంగా గంపలగూడెంలోని గ్రామ దేవత ముత్యాలమ్మ అమ్మవారికి ఆదివారం పుష్పాలంకరణ చేశారు. ఉదయం అమ్మవారి మూలవిరాట్ కు అభిషేకాలు నిర్వహించి, వివిధ రంగుల బంతి పూలతో శోభాయమానంగా అలంకరించి పూజలు చేశారు. భక్తబృందం ఆద్వర్యంలో బోనాలు సమర్పించారు.
*అమ్మవార్లకు సకంబరి అలంకరణ
గంపలగూడెం మండలం ఆర్లపడులో దాసాంజనేయ స్వామీ భక్తబృందం ఆద్వర్యంలో గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం సకంబరి ఉత్సవాలు నిర్వహించారు. గుడిలోని ముత్యాలమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవార్ల విగ్రహాలకు ఉదయం 108 బిందెలతో భక్తుల జలభిషేకం నిర్వహించారు. తదుపరి వంగ, బీర, దోస, బెండ, టమాట, మిరప, నిమ్మ, ఆలుగడ్డలతో అమ్మవార్ల విగ్రహాలను అలంకరించారు. భక్తులు పిండివంటలు ఫలాలు పసుపు, కుంకుమ గాజులు సమర్పించి మొక్కులు చెల్లించారు.
*ఊటుకూరు రామాలయంలో ఘనంగా ఉత్సవాలు
గంపలగూడెం మండలం ఊటుకూరు రామాలయంలో ఆషాడం సందర్భంగా ఆదివారం శాకంబరీ ఉత్సవాలు నిర్వహించారు. అర్చకులు లక్ష్మీనారాయణచార్యులు ఆద్వర్యంలో దేవతామూర్తులకు ఉదయం పంచంరుతాభిశేకాలు నిర్వహించారు. గ్రామానికి చెందిన భక్తులు అందించిన చేయూతతో గుడిలోని సీతారామ చంద్ర లక్ష్మణ ఆంజనేయస్వామి మూలవిరాట్ లను గులాబీలతో శోభాయమానంగా అలంకరించారు.
*పేకాట శిబిరం పై పోలీసుల దాడి
తిరువూరు పట్టణ శివారు పీటీ కొత్తూరు సమీపంలోని మామిడి తోటలో పేకాట ఆడుతున్నరనే సమాచారం మేరకు సెక్టార్- 1 ఎస్సై మణికుమార్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 5260నగదును స్వాధీనం చేసుకున్నారు. దొరికిన వారిని పోలీస్ స్టేషన్‌కే కు తరలించి వ్యక్తిగత పూచీకత్తు పై విడుదల చేశారు.
*జల్లులు పడుతున్నా
విస్సన్నపేట మండలంలో మూడురోజులుగా ఎడతెరపిలేని వర్షం కురుస్తున్నా.. వ్యవసాయ పనులు మాత్రం ముందుకు సాగే అవకాశాలు కనిపించటం లేదు. కురుస్తున్న వర్షపు నీటి నిల్వలు సాగు చెరువులకు చేరకపోవటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
*చారుమజుందార్ కు నివాళి
సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ వ్యవస్థాపక నాయకుడు చారుమంజూర్ కు విస్సన్నపేటలోని ఆపార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి హరినాద్ నివాళులు అర్పించారు. చారుమజుందార్ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమమలో సాయుధ పోరాటం ద్వారా దేశ విమోచన సాధ్యమని స్పస్తంగా ప్రకటించిన తోలి వామపక్ష నేత చారుమజుందార్ అని పేర్కొన్నారు. కమ్యునిస్టుల ఐక్యత ద్వారా వామపక్ష పోరాటలను ముందుకు నడిపించే దిశగా ఈనెల 30న కోల్ కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో ప్రజా సదస్సు జరగనునట్లు వెల్లడించారు.
*ఉత్తమ సేవల్లో సహకార బ్యాంకు ప్రథమం-ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని
రైతులకు ఉత్తమ సేవలు అందించడంలో కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(కేడీసీసీబీ) ప్రథమ స్థానంలో ఉందని కేడీసీసీ బ్యాంకు, ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు తెలిపారు. ఎ.కొండూరు మండలం గొల్లమందల గ్రామంలో నూతనంగా నిర్మించిన పీఏసీఎస్ భవనాన్ని ఆదివారం ఆయన మార్క్‌ఫెడ్ ఛైర్మన్ కంచి రామారావు, తిరువూరు ఏఎంసీ ఛైర్మన్ అలవాల రమేశ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా గ్రామాల్లోని సహకార బ్యాంకుల ద్వారా రైతులు, కౌలురైతుల రుణాల మంజూరు చేయడంలో జాప్యం లేకుండా చేస్తున్నట్లు చెప్పారు. రైతులు, ఖాతాదారులు కేడీసీసీ బ్యాంకు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఈవో ఎన్.రంగబాబు, కేడీసీసీ బ్యాంకు ఉపాధ్యక్షుడు రాంబాబు, ఏజీఎం అలెగ్జాండర్, మేనేజర్ బి.వెంకటేశ్వరరాజు, సూపర్వైజర్ ఎం. ఏసుదాసు, కేడీసీసీ డైరెక్టరు మంగణ, పీఏసీఎస్ అధ్యక్షులు బి. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
*పాఠశాలకు రూ.2 లక్షల వితరణ
గంపలగూడెంమండలంలోని ఆర్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అన్నదమ్ములైన ఊటుకూరు రంగారావు, నాగేశ్వరరావు రూ.2 లక్షలు వితరణగా అందించారు. దాతలిద్దరు తమ తల్లిదండ్రులైన ఊటుకూరు నారాయణరావు, సత్యవతి జ్ఞాపకార్థం, రంగారావు, రుక్మిణి దంపతులు తమ కుమారుడు గణేష్‌కుమార్ జ్ఞాపకార్థం విరాళం అందజేశారు. దాతలు అందించిన ఆర్థిక సాయంతో బడిలో విద్యార్థులు కూర్చునేందుకు అవసరమైన 60 బల్లలు తయారు చేయించారు. ప్రధానోపాధ్యాయిని కె.శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో దాతల్లో ఒకరైన రంగారావు బల్లలను ఆవిష్కరించారు. ఆర్లపాడు తమ పూర్వీకుల స్వస్థలమని, ఆ అభిమానంతోనే ఉన్నత పాఠశాలకు సోదరులిద్దరం విరాళం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దాత రంగారావును ఉపాధ్యాయులు, గ్రామస్థులు శాలువాతో సత్కరించారు. పాఠశాల పూర్వ హెచ్ఎం వి.శేషిరెడ్డి, పూర్వ ఆంగ్ల ఉపాధ్యాయుడు ఎం.రామ్‌ప్రదీప్ పాల్గొన్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.