మన పొరుగునే ఉన్న సత్తుపల్లి ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ పడగ విప్పింది. సత్తుపల్లి మదర్ తెరిసా ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో జూనియర్లను చిత్రహింసలు పెడుతున్న విద్యార్థుల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
1. శ్రీనిధిలో డీఎడ్ వీడ్కోలు వేడుక
తిరువూరు శ్రీనిధి డీ ఎడ్ కళాశాలలో సీనియర్లకు వీడ్కోలు పలుకుతూ జూనియర్లు ఆద్వర్యంలో బుదవారం నిర్వహించిన వీడ్కోలు వేడుక సందడిగా జరిగింది. వక్తల ప్రసంగాల అనంతరం చాత్రోపాద్యాయుల ఆద్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాశాల చైర్మన్ పోట్రు నాగేశ్వరరావు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
2. MRPS నాయకుల రీలే నిరాహార దీక్ష
ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగం విరుద్దమంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలుకు నిరసనగా ఎమ్మర్పీఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. స్థానిక తహసిల్దారు కార్యాలయం ఆవరణలో నియోజకవర్గ కమిటీ ఆద్వర్యంలో బుధవారం రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. నియోజాకవర్గ ఇంచార్జి వీరయ్య, నాయకులూ గోపాల్, మల్లేష్ సుధాకర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
3. వేతనాల పెంపునాకు వినతి
ఒప్పంద విధానంలో పనిచేస్తున్న తమకు వేతనాలు పెంచాలని కోరుతూ గిరిజన సంక్షేమ శాఖ గురుకుల ఉపాద్యాయులు బుధవారం విస్సన్నపేట వచ్చిన ఎమ్మెల్సీ సభ్యుడు లక్ష్మణరావుకు వినతి పత్రం అందజేశారు,. ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పని చేస్తున్న తమకు చాలీచాలని వేతనాలు చెల్లించడం దారుణమన్నారు. తమకు ఎనిమిది గంటల పని విధానం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన లక్ష్మణరావు మాట్లాడుతూ కనీస వేతన చట్టం కోసం తాము శాసన మండలిలో పోరాడుతున్నామని దీన్ని అమలు చేయడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని వారికి హామీ ఇచ్చారు.
4. 108 ఉద్యోగుల ఆందోళన
విస్సన్నపేటలో 108 వాహనాల ఉద్యోగులు ఆందోళన చేశారు. విస్సన్నపేట, రెడ్డిగూడెం, చాట్రాయి, తిరువూరు తదితర మండలాలకు చెందిన పలువురు 108 ఉద్యోగులు విస్సన్నపేట చేరుకొని, ఇక్కడి తమ కార్యాలయం నుంచి ప్రదర్శన నిర్వహించారు. సీపీఐ, సీపీఎం జనసేన పార్టీల నేతలు వీరికి మద్దతు తెలిపి ప్రదర్శనలో పాల్గొన్నారు. స్థానిక వైఎస్సార్ కూడలిలో వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, వినతిపత్రాన్ని అందజేశారు. 108 ఉద్యోగుల సంఘం నాయకుడు సమర్పణరావు అద్యక్షతన జరిగిన సభలో సిఐటీయూ జిల్లా నాయకుడు సి హెచ్. శ్రీనివాసరావు మాట్లాడారు.
5.వెదజల్లే పద్దతిలో వరిసాగు ఉత్తమం
నరుమడులు సిద్దం చేయని రైతులు విత్తనాలను నేరుగా వెదజల్లే వరిసాగు చేయడం వల్ల నెల రోజుల సమయం కలిసి వస్తుందని ఏవో రాజ్యలక్ష్మి తెలిపారు. పొలం పిలుస్తోంది కార్యక్రమమలో భాగంగా తిరువూరు మండలం రోలుపడిలో మంగలావరం క్షెత్ర స్థాయిలో పర్యటించి వరినారు మడులను పరిశీలించారు. వర్షాలు సమృద్దిగా పడకపోవడం వల్ల వరి నరులో ఎదుగుదల లోపించిందని తద్వారా వరినాట్ల ప్రక్రీయ మరింత ఆలస్యం కానుందని తెలిపారు.
6. నూతన కార్యవర్గం ఎన్నిక
పాస్టార్ల సమస్య పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ సంఘ మండల అద్యక్ష కార్యదర్శులు తెలిపారు. ఎ.కొండూరు మండలం కోడూరులో బుధవారం ఎ.కొండురూ మండల యునైటెడ్ ఫాస్తార్స్ ఫెలోషిప్ సంఘ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. అద్యక్ష ఉపాధ్యక్షులుగా ఎం. యోహాన్, వీ. బర్నబాస్ కార్యదర్శిగా లూకా, కోశాధికారిగా శ్యాం ప్రసాద్‌తో పాటు మరికొందరు కమితే సభ్యులుగా ఎన్నుకున్నారు.
7.జాషువా నేటి తరానికి ఆదర్శం
మహాకవి గుర్రం జాషువా గొప్పదనం నేటి తరాలకు ఆదర్శామనివిశ్రంత తెలుగు అద్యాపకులు ముంగా జయరాజు అన్నారు. విస్సన్నపేట శ్రీశ్రీ పాటశాలలో గురువారం జాషువా వర్ధంతి సంధరభంగా నివాళులు అర్పించారు. తిరువూరు మండలం మునుకుళ్ళలోని జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలలో జాషువా వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
8. 27న ఉచిత వైద్య శిభిరం
తిరువూరులోని అమరావతి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఈనెల 27న ఉచిత వైద్య శిభిరం నిర్వహిస్తున్నట్లు చైర్మన్ కోనేరు వెంకటకృష్ణన్ తెలిపారు. ఉదయం తొమ్మిది నుంచి మద్యాహ్నం రెండు గంటల వరకు కిడ్నీ, మూత్రకోశం, క్యాన్సర్, గుండెకు సంబందించిన వైద్య పరీక్షలు ఉదయం ఏడూ నుంచి మద్యాహ్నం పన్న్నేడు గంటల వరకు మధుమేహం పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు.
9.అయ్యంకికి నివాళులు
తిరువూరు గ్రేడ్ 1శాఖ గ్రంధాలయంలో అయ్యంకి వెంకట రమణయ్య జయంతి వేడుకలు బుధవరం నిర్వహించారు. గ్రంధాలయదికారి బీరం వెంకట రమణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాటకులతో కలిసి అయ్యంకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
10.ట్రిపుల్ ఐటీకి విద్యార్ధుల ఎంపిక
గంపలగూడెం మండలం ఆదర్శ, జడ్పీ ఉన్నత పాటశాలలో పదో తరగతి అభ్యసించిన నలుగురు బాలికలు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ఎంపికయ్యారు. పదో తరగతి పరీక్షల్లో బాలికలు పది జీపీఏ సాదించారు. ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు విడుదలైన జబోతాలో వారంతా ఎంపికైనట్లు పాటశాల ప్రిన్సిపల్స్ తెలిపారు. తిరువూరు, ఎ.కొండూరు, విస్సన్నపేట మండలాల పరిధిలోని ఉన్నత పాటశాలలకు చెందిన విద్యార్ధులు కూడా ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్లు ఆయా పాటశాలల ప్రిన్సిపల్స్ తెలిపారు.
11.విద్యార్ధుల శ్రమదానం
తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్. విభాగం ఆద్వర్యంలో బుధవారం విద్యార్ధులు శ్రమదానం చేశారు. కళాశాల ఆవరణలో పిచ్చి మొక్కలు తుప్పలు తొలగించి శుభ్రం చేశారు. చెత్తాచెదారం ఎరివేసి దూరంగా తరలించారు. అనంతరం వనం-మనం కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపాల్ డా. ఉమారాణి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
12.రాత పుస్తకాలూ అందజేత
తిరువూరు పరిధిలోని వంద మంది విద్యార్ధులకు పద్మశాలి కమిటీ నిర్వాహకులు రూ. ఇరవై వేల విలువైన రాత పుస్తకాలును వితరనగా అందజేశారు. స్థానిక రాజుపేట ఇడీయాస్ సేవా సంస్థ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో తహసిల్దారు స్వర్గం నరసింహారావు వీటిని విద్యార్ధులకు పంపిణీ చేశారు.
13.తుది దశకు ఇంటర్వ్యులు
తిరువూరు పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహిస్తున్న వార్డు వాలంటీర్ అభ్యర్ధుల ఇంటర్వ్యులు తుదిదశకు చేరుకున్నాయి. ఈనెల పదకొండు నుంచి ప్రారంభించగా గురువారంతో ముగియనున్నాయి. ఇప్పటి వరకు ఇంటర్వ్యుకు హాజరుకాని వారికి ఈనెల 26 చివరి అవకాశంగా కల్పించారు. స్థానిక కార్యాలయంలో బుధవారం జరిగిన ఇంతర్వ్యులకు ఉన్నత విద్యావంతులుతో పాటు ప్రేవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం హాజరయ్యారు.
14పేదలకు ఇల్లు స్థలాల మజూరుకు వినతి
గంపలగూడెం మండలంలోని అర్హత ఉన్న నిరుపేదలకు ఇల్లు, స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ సీపీఐ నాయకుల ఆద్వర్యంలో బుధవారం తహసిల్దారు డీ. పద్మజాకు వినతిపత్రం అందజేశారు. నివేశన స్థాలాలు మంజూరు చేసి ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కోరారు. అర్హత ఉన్న పేదలు అద్దె గృహాలలో మగ్గుతున్నారని తెలిపారు. .
15.మండల పరిషత్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వెల్లడి
గంపలగూడెం మండల,జిల్లా పరిషత్ సాధారణ ఎన్నికలకు సంబందించిన పోలింగ్ కేంద్రాలను బుదవారం వెల్లడించినట్లు ఎంపీ డీవో పిచ్చిరెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద నోటీస్ బోర్డులో కూడా కేంద్రాల వివరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీల పరిధిలో ఎంపీటీసి, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలకు సంబందించి 62పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినత్ల్ తెలిపారు.
16.బీసీ కమిషన్ ఏర్పాటు పై కృతగ్ణతలు
రాష్ట్రంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు నామినేటెడ్ పదవులు పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనర్తెలకు రిజర్వేషన్లు కల్పిస్తూ వాటిలో మహిళలకు యాభై శాతం ప్రాధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రి జగన్ ని అభినందిస్తూ కృతగ్ణతలు తెలుపుతున్నట్లు వైకాపాకు చెందిన మండల విశ్వబ్రహణ సంఘం నాయకులూ ఆడెపు కోటేశ్వరరావు, బుధవారం తెలిపారు.
17. భూ పోరాట యోధుడిగా గుర్తింపు
పేదలకు 300 ఎకరాల ప్రభుత్వ బంజరు భూముల పంపిణీ చేయండంలో కీలక పాత్ర పోషించిన దివంగత నృసింహాద్రీ శ్రీనివాసరావు భూపోరాట యోధుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు తూము క్రిష్నయ్య కొనియాడారు. మండలంలోని పెద్దవారంలో సీపీఐ మండల కమిటీ ఆద్వర్యంలో బుధవరం సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచి శ్రీనివాసరావు వర్ధంతి సభ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులూ సి హెచ్. వెంకటేశ్వరావు, నృసింహాద్రి, వనమాలి, పగిడిమిల్లి రవి, చిలుకూరి పెరుమాళ్ళు తదితరులు పాల్గొన్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.