*ప్రతిభ ఉన్న విద్యార్థులు ఆర్థిక పరిస్థితులు సహకరించక మధ్యలోనే చదువు మానేస్తున్నారు. ఇలాంటి విద్యార్థులకు ఓ శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులకు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్షిప్ ద్వారా ప్రతిభ గల విద్యార్థులకు చేయూతనందిస్తోంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నత విద్యా విభాగం ఈ స్కాలర్షిప్స్ పథకాన్ని అమలు చేస్తోంది. 2019-20 విద్యాసంవత్సరానికి జాతీయ స్కాలర్షిప్ పోర్టల్ అయిన scholarships.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్‌లో ఉంటాయి. స్కాలర్షిప్కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే రాష్ట్ర విద్యామండలిలోని నోడల్ ఆఫీసర్ నుంచి సమాచారం తెలుసుకోవచ్చు. నోడల్ ఆఫీసర్ల వివరాలు కూడా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్‌లో ‘Services’ సెక్షన్లో ఉంటాయి. మొదటిసారి స్కాలర్షిప్కు దరఖాస్తు చేసేవాళ్లు కొత్తగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సరైన వివరాలతో రిజిస్ట్రేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది. 18 ఏళ్ల లోపు విద్యార్థులైతే వారి తల్లిదండ్రులు ఈ ఫామ్ నింపాలి. స్కాలర్షిప్కు దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థులు ఎడ్యుకేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సీ కొడ్, ఆధార్ నెంబర్ లేదా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ లేదా బోనఫైడ్ లేదా బ్యాంక్ పాస్‌బుక్ లాంటి కాపీలు అన్నీ సిద్దంగా ఉంచుకుని దరఖాస్తుకు అప్లై చేయాలి. దరఖాస్తు చేయడానికి 2019 అక్టోబర్ 31 చివరి తేదీ.
*ఆదర్శ పాటశాలలో స్వాగతోత్సవం
గంపలగూడెం మండలంలోని పెదకోమిర ఆదర్శ పాటశాలలో పదోతరగతి విద్యార్ధుల ఆద్వర్యంలో మంగళవారం ఆరో తరగతి విద్యార్ధులకు స్వాగతోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపాల్ రత్నమేరీ ప్రతిష్ట పర్యవేక్షణలో నిర్వహించిన వేడుకలో విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు,. పది విద్యార్ధులు ఆదర్శంగా ఉంటూ మంచి ఫలితాలు సాధించాలని ఉపాద్యాయులు సూచించారు.
*తాగునీటి సమస్య పరిష్కారానికి వినతి
తిరువూరు పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కమిషనర్ శ్రీకాంత్ రెడ్డికి వైకాపా నాయకులు విజ్ఞప్తి చేశారు. స్థానిక కార్యాలయంలో మంగళవారం కమిషనర్ ను కలిసి తాగునీటి సమస్యతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయాన్ దృష్టికి తీసుకెళ్ళారు. పదిరోజులుగా తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని బిందెడు నీటి కోసం ప్రజలు కిమీ వెళ్ళాల్సి వస్తోందని తెలిపారు. కొన్ని కాలనీలకు నాలుగైదు రోజులకోసారి సరఫరా చేయడం వల్ల ప్రజల అవసరాలు తీరడం లేదని వివరించారు.
*పదోన్నతు పొందిన రమేష్ కు సత్కారం
కేడీసీసీ గంపలగూడెం శాఖలో సూపర్వైజర్ గా పని చేస్తున్న దేవరపల్లి రమేష్ కు మేనేజర్ గా పదోన్నతి లభించింది. ఆయన్ను విస్సన్నపేట సహకార బ్యాంకు మేనేజర్ గా నియమిస్తూ జిల్లా అధిఅక్రులు ఉత్తర్వ్యులు జారీ చేశారు. రమేష్ ను సోమవారం రాత్రి ఊటుకూరు శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో మండలంలోని పీఎసిఎస్ ల అద్యక్షులు సిఈవోలు ఆద్వర్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గంపగూడెం బ్యాంకు మేనేజరు చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ పదోన్నతి లభించిన రమేష్ గత 33 ఏళ్లుగా సహకార వ్యవస్థలో ఉద్యోగిగా రైతులకు ఖాతాదారులకు మంచి సేవలు అందించారని కొనియాడారు.
*చలో విజయవాడను జయప్రదం చేయండి
ఇసుక విధానంలో స్పస్థత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భావన నిర్మాణ కార్మికులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు పిలుపునిచ్చారు. ఈనెల 25న తలపెట్టిన ఈ కార్యక్రమానికి కార్మిక సమీకరణలో భాగంగా ఆయన మంగళవారం విస్సన్నపేట వచ్చారు.
*వాల్మికీ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వినతి
రాష్ట్రంలోని వాల్మికీ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని భాజపా రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు నియోజకవర్గ వాల్మికీ బోయ సంఘం నాయకులూ విజ్ఞప్తి చేశారు. మంగళవారం తిరువూరు వచ్చిన ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం అసెంబ్లీలో తేఎర్మనమ్ చేసి కేంద్రానికి పంపిన విషయాన్నీ గుర్తి చేశారు. వాల్మికీ బోయలను ఎస్టీ జాబితాలో పునరుద్దరించే అంశం కేంద్రం పరిశీలనలో ఉన్నద్నున తమ విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
*కొనసాగుతున్న ఇంతర్వ్యులు
ఎ.కొండూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రామా వాలంటీర్లకు ఇంటర్వ్యులు మంగళవారం సైతం కొనసాగాయి. మండలంలోని మాధవరానికి చెందిన అభ్యర్ధులకు ఎంపీడీవో గౌసియా బేగం ఏపీవో మాధవరెడ్డి ఇంటర్వ్యులు నిర్వహించారు. మొత్తం 29 మంది దరఖాస్తు చేసుకోగా 22 మంది హాజరయ్యారని సిబ్బంది తెలిపారు.
*108 ఉద్యోగుల నిరసన
విస్సన్నపేటలో 108 ఉద్యోగులు మంగళవారం నిరసన ప్రదర్శన చేశారు. దీనిలో భాగంగా కళ్ళు, చెవులుకు నల్లరిబ్బంలు కట్టుకుని నినాదాలు చేశారు. సోమవరం అర్ధరాత్రి 12 గంటల నుంచి తమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మేరపు సమ్మెకు పిలుపు నిచ్చినట్లు ఈ సందర్భంగా తెలిపారు. రోజుకు 12 గంటల [పాటు పనిచేస్తున్న తమకు 8గంటల విధులు అప్పగింకాహలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వాహనాలకు పూర్తీ మరమ్మతులు నిర్వహించాలని కోరారు.
*బాధ్యతతోనే స్వచ్ఛత సాధన –కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి
చెత్త నిర్వహణ విశ్హయంలో ప్రతి ఒక్కరూ బాద్యతగా వ్యవహరిస్తే స్వచ్ఛత సాధ్యపడుతుందని కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. స్థానిక నెహ్రూ యువ కేంద్రం ఆద్వర్యంలో స్వచ్చ భారత్ సమ్మర్ ఇంటర్న్ షిప్ 2.0 కార్యక్రమంలో భాగంగా అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికీ వచ్చే కార్మికులకు తడిపొడి చెత్తను వేరు చేసి మాత్రమే అందజేయాలని సూచించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ బహిరంగ ప్రదేశాల్లో పారబోయడం వల్ల కలిగే అనర్ధాలను వివరించారు.
*రూపాయితో పంటల బీమా’
ప్రధాన మంత్రి [ఫసల్ బెమా యోజన కింద రుణాలు తీసుకొని రైతులు పంట ఏదైనా ఒక్క రూపాయి రుసుం చెల్లిస్తే పంటల బీమా పొందాదానికి వీలుందని ఏవో రాజ్యలక్ష్మి తెలిపారు. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. వారి పంటకు ఆగస్టు 21వరకు మిగిలిన పంటలకు ఈనెల 31 వరకు గడువు ఉందని తెలిపారు. పట్టాదారు పసుపుస్తకం సాగు దృవీకరణ పత్రం, అదార్ రేషన్ కార్డు బ్యాంకు ఖాతా పుస్తకంతో మీసేవా కేంద్రం, వ్యవసాయ సఖ కార్యాలయంలో పంటల బీమా నమోదు చేయించుకోవాలని సూచించారు.
*విద్యార్ధులకు ఏకరూప దుస్తులు అందజేత
ఎ.కొండూరు మండలం రామచార్దాపురం పోలిశెట్టిపాడు జడ్పీ పాటశాలలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పలువురు నేతలు ఉపాద్యాయులు విద్యార్ధులకు ఏకరూప దుస్తులు అందజేశారు.
*ఊటుకూరు పశువైద్యాధికారి సాయికృష్ణ
గంపలగూడెం మండలం ఊటుకూరు పశువైద్య శాఖ వైద్యునిగా జీ.సాయికృష్ణ నియమితులయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి బదిలీపై ఆయన ఇక్కడకు వచ్చారు. ఊటుకూరు పశువైద్యునిగా ఇటీవల బాద్యతలు స్వీకరించారు. ఇక్కడి పశువైద్యురలిగా ఉన్న సౌమ్య తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం బదిలీ అయ్యరు. ప్రస్తుం మండలంలోని నెమలి, గంపలగూడెం, ఊటుకూరు వైద్యశాలల్లో పశువైద్యులు అందుబాటులో ఉన్నారని ఆశాఖ నూజివీడు డివిజన్ ఉపసంచాలకులు ఎస్. ప్రసదలిమ్గం తెలిపారు.
*పంచముఖ హనుమత్ స్వామికి తమలపాకు అర్చన
గంపలగూడెం మండలం వినగడప సుందర హనుమత్ పీటంలోని పంచముఖ సుందర హనుమాన్ విగ్రహానికి మంగళవారం 1116 తమలపాకులతో అర్చన నిర్వహించారు. అర్చకులు అప్పయ్యసస్త్రి, కోటేశ్వరశర్మ ఆద్వర్యంలో ఉదయం స్వామివారి విగ్రహానికి పంచామృతభిశేకాలు చేసి, నూతన వస్త్రాలు పుష్పాలతో అలంకరించారు.
*కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు తూము క్రిష్నయ్య డిమాండ్ చేశారు. స్థానిక సుంకర వీరభద్రరావు భవన్ లో ఎఐటీయూసీ అనుబంధ ఆటో వర్కర్స్ యూనియన్ మహాసభ మంగలవరం నిర్వహించారు. ఆటో డ్రైవర్ల పై వేధింపులను అధికారులు విడనాడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం నాయకుడు కే.సుందరరావు, ఆటో వర్కర్స్ యూనియన్ నేతలు పాల్గొన్నారు.
*జిల్లా స్థాయి పోటీల్లో బాలికల ప్రతిభ
వికాస తరంగిణి ప్రజ్ఞ డివిజన్ ఆద్వర్యంలో మంగళవారం విజయవాడ సత్యనారాయణపురంలో నిర్వహించిన జిల్లా స్థాయి భగవద్గీత శ్లోకాలు, చిత్రలేఖనం పోటీల్లో గంపలగూడెంకు చెందిన పలువురు వలికలు ప్రధమ స్థానం సాధించారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.